Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 30

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 30

( దృశ్యము 106 )

( తొండమానుని రాజ్య సరిహద్దులలో ఒక చిట్టడవి )

( అడవి లోని దారిగుండా ఒక రెండెడ్ల బండి, వెళ్తోంది. బండీ నాయుడు బండి నడుపుతున్నాడు )

( బండిలో కూర్ముడనే బ్రాహ్మణుడు , అతని భార్య మహాలక్ష్మి ,అయిదేళ్ల కొడుకు రాఘవుడు ఉంటారు .మహాలక్ష్మి ఆరునెలల గర్భవతి )

( బండి క్రింద ఒక ఉట్టి వ్రేలాడుతోంది. ఆ ఉట్టిలో ఒక కుండ , ఆ కుండలో అస్థికలు, కుండమీద మూత ఒక గావంచాతో బిగించి కట్టబడి ఉంది )

( బండి నెమ్మదిగా వెళ్తోంది )

మహాలక్ష్మి--- కరివేపాకు, వంటకాలు , రుచులు , వీటాన్నిటికీ మీ వ్యాఖ్యానాలు బాగున్నా, ఇంకా ఎక్కడి పశ్న అక్కడే ఉండిపోయింది !

కూర్మ --- ఏమిటి మహాలక్ష్మీ ! నీకు అర్థం కానిది ?

మహాలక్ష్మి--- మీ కొండ మీద దేవుడికి కావలసిన కరివేపాకు, వరాలు కోరుకొనే భక్తులు తెచ్చి ఇవ్వాలి ! కాని , పద్మావతి దేవి ఎందుకు తెచ్చి ఇవ్వాలి ? ఆవిడ కోరిన వరం, అతనిని పెళ్లాడడమే ! అది తీరిపోయాక , ఇంక కరివేపాకు తీసి పారెయ్యాలి కదా ?

కూర్మ --- మహాలక్ష్మి ! నువ్వీ రోజు మంచి ప్రశ్నలే వేస్తున్నావు ! దానికీ , అంతరార్థం ఉంది ! మా కొండంత దేవుడు , కొన్ని వందల సంవత్సరాలు , పుట్టలో కూర్చొని తపస్సు చేసాడు , ఎందుకొని ? వరాలు ఇవ్వడం చేతకాక కాదు ! -- అలాగే శ్రీ మహాలక్ష్మి అంటావా , ఐశ్వర్యాన్నివ్వడం ఆవిడ అరచేతిలో పని ! అయినా స్వామివారి లాగే, అన్ని వందల సంవత్సరాలూ తపస్సు చేసింది ! ఇదంతా దేని కోసం అంటావ్ ?

మహాలక్ష్మి--- చెప్పేదేదో పూర్తిగా చెప్పండి అందరికీ అర్థమయ్యే లాగ !

కూర్మ --- ఆ విషయానికే వస్తున్నాను. ఈ కలియుగంలో భక్తులకి తపస్సు చేసే తీరిక , ఓపిక లేవు ! అలాంటి వారి కోసం, వెలిసిన దేవుడు శ్రీ వేంకటేశ్వరుడు ! తన భక్తుల వంతు తపస్సంతా తానే చేసాడు ! ఇక ఏ దేవునికీ మొక్క నవసరం లేకుండా , అంతా తానుగానే మూర్తీభవించాడు !

మహాలక్ష్మి--- శ్రీమహాలక్ష్మి కూడా అందుకే తపస్సు చేసిదంటారా ?

కూర్మ -- అవును ! ఇప్పుడు వారిద్దరూ కొండ మీద కొలువై ఉన్నారు . కాని పద్మావతి అలా కాదు కదా ? ఆమె దగ్గరకు వచ్చే భక్తులకు , ఆమె వరాలెలా ఇవ్వ గలుగుతుంది ! తన తపస్సు ధారపోసి ఇవ్వాలంటే , సాధన అవసరం కదా ! ఆ విషయం అర్థం చేసుకుంది కాబట్టే, శుకాశ్రమంలోని, పద్మ సరోవరంలో పద్మాల మధ్య దాగొని, తపస్సు మొదలు పెట్టింది . సాధన పూర్తి చేసేందుకు, ఎంత కరివేపాకు తోట వెయ్యాలో ఆలోచించు !

మహాలక్ష్మి---సాధన పూర్తి అయ్యాక తిరిగి కొండ మీదకి చేరుతుందంటారా ?

కూర్మ --- ఆలు మగల మధ్య మనసులు కలిసాక ఎవరు ఎవరి దగ్గర ఉండాలనేది సమస్య కాదు మహాలక్ష్మీ!

మహాలక్ష్మి --- ఇంకొక ప్రశ్న ఉండిపోయింది.

కూర్మ --- ఏమిటది ?

మహాలక్ష్మి -- కరివేపాకు తీపి వంటలకి వాడరు కదా , ఆ తీపి వంటకం అర్థమేమిటి ?

కూర్మ --- తీపి వంటకం అంటే మోక్షం ! మోక్షమంటేనే కోరిక లేక పోవడం కదా ! కోరికలు లేనివారికి తపస్సు. సాధన . రుచి ఏదీ అవసరం ఉండదు.

నాయుడు -- చాలా బాగా చెప్పారయ్యా ! మా తొండమాను చక్రవర్తికి కూడా యీ విషయం తెలియదంటే నమ్మండయ్యా ! ( అని నాలుక కరచుకొంటాడు )

కూర్మ --- ఏమన్నావు నాయుడూ ! మీ చక్రవర్తికి తెలియదని నీ కెలా తెలుసు ?

( ఆ మాటలంటూనే కూర్ముడు నాయుడు వంక తేరిపార చూస్తాడు ఆ తరువాత నాయుడుకి నమస్కారం చేస్తాడు )

కూర్మ ---మహారాజా ! మన్నించండి, మీ ముఖంలోని సాముద్రిక లక్షణాలు మీరే తొండమాను చక్రవర్తి అని చెప్పక చెప్తున్నాయి !

నాయుడు (తొండమానుడు )--- విప్రోత్తమా ! మీరు సరిగానే అర్థం చేసుకొన్నారు ! నేనే తొండమానున్ని!! శ్రీనివాసుని చర్య అర్థం కాక , జానపదులు చేసే విమర్శలు భరించ లేక , ఇలా మారు వేషంలో, అంతరార్థం తెలుసుకోవాలనే బయలు దేరాను. ఆ స్వామి అనుగ్రహము వల్ల , మీ దర్శన భాగ్యం కలిగింది. ఆ పైన సందేహ నివృత్తి రెండూ జరిగాయి.

( మహాలక్ష్మి , రాఘవుడు ఇద్దరూ బండి దిగుతారు . మహాలక్ష్మి , తొండమానునికి నమస్కరిస్తుంది )

మహాలక్ష్మి-- మహారాజా ! నన్ను మన్నించండి. తెలియక మిమ్మల్ని అగౌరవ పరచాను.

తొండమాన -- అమ్మా ! ఇందులో మీ తప్పేముంది ? నా మాట మన్నించి , మీరు మీ అబ్బాయితో పాటు మా రాచ నగరులో ఉండండి. భూసురులైన ఈ కూర్మావధాని గారు , కాశీ గంగలో అస్థి నిమజ్జనం చేసి, నిశ్చింతగా తిరిగి వచ్చెవరకు నా ఆథిత్యాన్ని అంగీకరించండి.

మహాలక్ష్మి ---మహారాజా ! మీరు మన్నిస్తానంటే నేనొక మాట చెప్పదలచు కొన్నాను.

తొండమాన -- చెప్పండమ్మా !

మహాలక్ష్మి –నేను నిరుపేద శ్రోత్రియ కుటుంబంలో పుట్టిన దానిని. నాకు మీ రాచ నగరులోని , రాణి వాసపు స్త్రీలతో ఎలా మెలగాలో తెలియదు. దాసీ జనాలని సైతం ఆజ్ఞాపించే అలవాటు లేదు. నేను ఒంటరిగా ఏకాంతంగా ఉండాలనే అభిలాష కల దానిని.

తొండమాన --- అమ్మా ! మీరు ఏకాంత వాసం చెయ్యాలనుకొంటే , చెయ్యవచ్చు. కాని మీరు ఇప్పుడు గర్భం దాల్చి ఉన్నారు ! మీ బాగోగులు చూసే నిమిత్తం పరిచారికలు అవసరం, కాదంటారా ?

మహాలక్ష్మి – ప్రతీ రోజూ , ప్రతీ నిముషమూ వారి అవసరం ఉండదు . నా పనులు నేను చేసుకోగలను, ఎప్పుడైనా అవసరం వస్తే ---

తొండమాన----అలాగేనమ్మా ! మీకు అవసరం కలిగినప్పుడు , మీరొక గంట వాయిస్తే చాలు, పరిచారికలు వచ్చి, వాలే ఏర్పాట్లు చేస్తాను.

మహాలక్ష్మి –- అయినా మహారాజా ! మీరు క్షత్రియులు , మీ ఆహారపు అలవాట్లు ---

తొండమాన -- అమ్మా ! మీకు స్వయం పాకానికి ఏర్పాట్లు చేస్తాను, ఇక కాదనకండి--- కూర్మావధాని గారూ ! ఇదుగో యీ ధనాన్ని స్వీకరించి ,నిశ్చింతగా యాత్ర ముగించి రండి.

( అని తన దుస్తుల్లో నుండి ఒక జోలె తీస్తాడు, దానిని కూర్మావధానికి ఇస్తాడు )

******************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ