Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 31

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 31

( దృశ్యము 107 )

( తొండమాను రాజు రాణీవాసం )

( బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి , ఆమె అయిదేళ్ల కొడకు రాఘవ , కొంతమంది పరిచారికలు ఉంటారు )

( మహాలక్ష్మి , ఆ భవనాన్ని, అక్కడున్న వైభవాన్ని, పెద్దపెద్ద కళ్లతో మిర్రి మిర్రి చూస్తుంది. ఆమెకి అంతా కొత్తగా ఉంది. సిగ్గు సంకోచంతో ద్వారం దగ్గరే నిలబడుతుంది. రాఘవ సంగతి సరే సరి ! తల్లి వెనకాల బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటాడు )

౧ పరిచారిక-- రండమ్మా, రండి , లోపలికి రండి.

(మహాలక్ష్మి ద్వారం దాటి అడుగు వేయబోతుంది. అక్కడ పరిచి ఉన్న రత్న కంబళం చూసి వెనకడుగు వేస్తుంది. దాని పైన అడుగు పెట్టాలంటే భయం )

౧ పరిచారిక --- ( నవ్వు ఆపుకొంటూ )-- ఆ రత్న కంబళానికేమీ కాదమ్మా , మీరు లోపలికి రండి.

(తక్కిన పరిచారికలు కిసుక్కున నవ్వుతారు. మహాలక్ష్మి ముఖం చిన్నబోతుంది. లోపలికి వస్తుంది, వెనకాలే పిల్లవాడు వస్తాడు )

౧ పరిచారిక ---కూర్చోండమ్మా !

( మహాలక్ష్మి ధైర్యం చేసి ఆసనంపైన కూర్చొంటుంది. అది మెత్తగా క్రిందకి దిగుతుంది. గాభరా పడి లేచి, క్రింద కూర్చొంటుంది. పరిచారిక లందరూ గొల్లున నవ్వుతారు )

౨ పరిచారిక-- ఉత్త పల్లెటూరి బైతులాగ ఉందే ! మన మహారాజు గారికి ఎక్కడ తగిలిందో !

( తక్కిన పరిచారికలు మళ్లీ నవ్వుతారు )

౧ పరిచారిక-- అమ్మా ! ఇది మెత్తటి ఆసనం ! గభాలున కూర్చోకూడదు, నెమ్మదిగా ఇలా కూర్చోవాలి

( అని తను కూర్చొని చూపిస్తుంది ౨ పరిచారిక మహాలక్ష్మిని క్రింద నుండి లేవ దీస్తుంది. అలా లేవ తియడంలో పరచారిక చెయ్యి, మహాలక్ష్మి చక్కిలిగింత పెట్టినట్లయి దూరం జరుగుతుంది. పరిచారిక అది చూసి నవ్వుకొంటుంది.)

౨ పరిచారిక--- ( తనలో ) ఈవిడకి చక్కిలిగింతలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి. ఒక ఆట పట్టించాలి.

( అలా అనుకొని , తక్కిన వాళ్ల దగ్గరికి వెళ్లి ఆ విషయం చెవిలో చెప్తుంది )

౧ పరిచారిక--- అమ్మా ! మీరు మా మహారాజుల వారి అతిథులు ! క్రింద కూర్చోకూడదు. ఆసనం మీదనే కూర్చోవాలి. అలా కాకపోతే , మాకు మహారాజు గారి దగ్గర మాట వస్తుంది.

౨ పరిచారిక—అవునమ్మా ! మా ఉద్యోగాలు పోతాయి.

(అంటూ ౨వ పరిచారిక. , తక్కిన వారు మహాలక్ష్మిని బలవంతంగా కూర్చోబెడతారు. ఆ కూర్చోబెట్టడంలో ఆమెకి కిత కితలు పెడతారు. మహాలక్ష్మి శరీరాన్ని కుంచించి ముడుచుకు పోతుంది. ఆమెకి పరిచారికలంటే అసహ్యం పుడుతుంది. )

( తల్లి భంగపాటు చూసి , రాఘవకు కోపం వస్తుంది. పరిచారికలని తన చిట్టి చేతుల్తో కొడతాడు. పరిచారికలు కుర్రాడికి అంతకుండా పరిగెడతూ, చుట్టు చుట్టూ తిరుగుతూ , మహాలక్ష్మికి కితకితలు పెడుతూ ఉంటారు)

(మహాలక్ష్మికి కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది. అది చూసిన ౧వ పరిచారిక ముందుగా తేరుకొంటుంది.)

౧వ పరిచారిక—మీరు ఉండండే ! ఆవిడని ఇబ్బంది పెట్టకండి. ( అని తక్కిన పరిచారకలని వారించి, మహాలక్ష్మి దగ్గరకి వెళ్తుంది. ) అమ్మా ! మీరు స్నానం చేసి, మంఛి బట్టలు కట్టుకోండి. అలాగే మీ అబ్బాయి చేత కూడా కట్టించండి. మహారాజుల వారు వచ్చేసరికి, మీరు బాగా ముస్తాబయి కళ కళ లాడుతూ కనిపించాలి, రండమ్మా !

( మహాలక్ష్మి లేని ధైర్యం తెచ్చుకొని, కుర్చీలో నిటారుగా కూర్చొంటుంది. రాఘవ వచ్చి, ఆమె ఒళ్లో కూర్చోబోతాడు. వానిని ప్రక్కనున్న మరో ఆసనం మీద కూర్చోబెడుతుంది )

మహాలక్ష్మి—నాకూ , మా అబ్బాయికీ స్నానాల గది చూపించండి. మీరెవ్వరూ లోపలికి రానక్కర లేదు ! నా పనులు నేను చేసుకోగలను !

౨వ పరిచారిక--- మీ పనులు మీరే చెసుకొంటే ఇక మేమెందుకమ్మా ? మీకు ఒళ్లు రుద్ది, నీళ్లు పొసి, తల ఆరబెట్టి ధూపం వేసి , కొత్త కోక, రైక తొడగాలాయె ! అవన్నీ మీరు చేసుకొలేరమ్మా !

( మహాలక్ష్మి ధైర్యాన్ని కూడగట్టుకొంటుంది ),

మహాలక్ష్మి-- ఇలా ఎకసెక్కాలు చేసి చేసే సపర్యలు నాకు అక్కర లేదు ! నా పనులు నేను ఛెసుకొ గలను ! నేనే చేసుకొంటాను కూడ ! మీకు మహారాజుల దగ్గర మాట రాకుండా ఉండాలంటే , నాకు స్నానాల గది చూపించండి. అంతే కాదు ఒంటరిగా వదిలెయ్యండి

౨వ పరిచారిక--- అమ్మో ! పిట్ట కూత పట్టిందే ! రండే, మన అవసరం లేనప్పుడు మన మెందుకే ఇక్కడ ?

( అని పరిచారికలని వారించి , బయటికి వెళ్తుంది. తక్కిన పరిచారికలు ఆమెను అనుసరిస్తారు ౧వ పరిచారిక మాత్రం ఉండి పోతుంది )

౧వ పరిచారిక—అమ్మా ! మీరు మీ అబ్బాయి నాతో రండి. మీకు స్నానాల గది చూపిస్తాను. అలాగే దుస్తులు, ఆభరణాలు. ఇస్తాను. మీరు కోరినట్లే , మీ పనులు మీరే చేసుకొండి. నేను మీరు పిలుస్తేనే వస్తాను.

( పరిచారిక మహాలక్ష్మిని, రాఘవనీ, చెయ్యి పట్టుకొని లేవ దీస్తుంది. )

******************

( దృశ్యము ౧౦౮ )

( తొండమానుని రాణీవాసం )

(మహాలక్ష్మి , రాఘవ మంచి దుస్తులతో బాగా ముస్తాబయి వస్తారు. పరిచారికలు అందరూ మహాలక్ష్మి వైపే చూస్తూ ఉండిపోతారు )

౨వ పరిచారిక--- ( మెల్లగా ) స్నానం చేసుకొని అలంకరించుకొని వస్తే, ఈవిడ రాణీ వాసపు స్త్రీలాగే ఉందే !!

( ఆ మాటలు మహాలక్ష్మి వింటుంది. ఆమెలో ధైర్యం పెరుగుతుంది. హుందాగా నడిచి వచ్చి ఠీవిగా ఆసనంపై కుర్చొంటుంది.

( అదే సమయానికి మహారాజు వస్తున్నట్లు గంట మ్రోగుతుంది )

(పరిచారిక లందరూ ద్వారానికి రెండు వైపులా బారులు కట్టి నిల్చొంటారు. ప్రవేశం తొండమానుడు )

౧వ పరిచారిక --- స్వాగతం మహారాజా, స్వాగతం !

(మహాలక్ష్మి కూడ లేచి నిలబడుతుంది.)

మహాలక్ష్మి--- మహారాజా వారికి నమస్కారం !

తొండమాన---- నమస్కారమమ్మా ! మీరు కాల కృత్యాలు నెరవేర్చుకొన్నట్లే కదా ?

మహాలక్ష్మి—చిత్తం మహారాజా !

తొండమాన---- ఇక్కడ మీకే ఇబ్బంది లేదు కదా ?

(పరిచారికలు మహారాజు ప్రశ్న విని, మహాలక్ష్మి ఏం చెప్తుందేమోనని , భయంతో ఆమె వంక చూస్తారు. మహాలక్ష్మి వాళ్ల వంక అలవోకగా చూసి నవ్వుతుంది )

మహాలక్ష్మి---లేదు, మహారాజా ! అయినా నేను మీకు ముందే విన్నవించుకొన్నాను. నాకీ రాణి వాసం అలవాట్లు, పరిచారికా వర్గాల సేవలు అవసరం లేదని !

తొండమాన-- అమ్మా ! అయితే మీరు ఏకాంత వాసాన్నే అభిలషిస్తున్నారా ?

మహాలక్ష్మి—అవును మహారాజా !

తొండమాన--- అలాగేనమ్మా ! మీరు కోరినట్లే ఏర్పాట్లు చెస్తాను. ( పరిచారికతో ) నీవు బయటికి వెళ్లి, అంతఃపుర రక్షక సేన దండనాధున్ని పిలు.

( ౧వ పరిచారిక పరుగు పరుగున వెళ్తుది. ఆమె వెనుక దండనాధుడు వస్తాడు )

( దండ నాదుడు రణ సింహుడు వస్తూనే మహారాజకి నమస్కరిస్తాడు )

.రణ సింహ --- మహారాజులకు జయమగు గాక !

తొండమాన--- దండనాదా ! నీ పేరేమటి ?

రణ సంహ--- రణ సింహుడు మహారజా !

తొండమాన--- రణ సింహా ! మన అంతః పురంలో దూరంగా, ప్రశాంతంగా ఉండే విశ్రాంతి గృహం ఏదైనా ఉందా ?

రణ సింహ ---- ఉంది రణ సింహా ! అంతః పుర ఉద్యానవనం వెనుక ఏకాంతంగా ఉంద.

తొండమాన—ఆ విశ్రాంతి భవనం శుభ్రం చేయించు. ఈ బ్రాహ్మణ స్తీ మహాలక్ష్మీ దేవి , ఆమె కుమారునితో పాటు అక్కడ కొంత కాలం నివసిస్తారు. ఆమె నివాసానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ స్వయంగా పర్యవేక్షించు, అర్థమయిందా ?

రణసింహ --- అర్థమయింది మహాప్రభూ ! ఏడాదికి సరిపడేలా ఆహార దాన్యాలు, తైల , ఘృత , మధు భాండాలు, దుస్తులు . ఆభరణాలు , ఇక్కిన రాజోపచారాలు అన్నీ భవనం లోనే అమరుస్తాను. మరి పరిచారకలు—

తొండమాన--- ఆగు ! ఈమెకు పరిచారికలు,వారి సపర్యలు, నచ్చవు ! వారి పనులు వారే చేసుకొంటారు ! అయినా పరిచారిక అవసరం తప్పక ఉంటుంది ! కాబట్టి, ఎవరో ఒకరిని పిలుస్తే పలికేలా ఏర్పాట్లు చెయ్యి.

రణసింహ --- అలాగే ప్రభూ ! ముఖ్య ద్వారాలన్నీ మూయించి , తాళాలు వేయిస్తాను. కాపలా భటులను పెట్టి, ఎవరినీ లోపలికి వెళ్లకుండా చేస్తాను. ఆమెకి ఎప్పుడు ఎవరి అవసరం వచ్చినా పిలస్తే పలికేలా ఏర్పాట్లు చేస్తాను.

తొండమాన--- అలాగే చెయ్యి ! ఇంకేవైనా సందేహాలుంటే మంత్రి గారితో సంప్రదించు.—ఇక నువ్వు వెళ్లవచ్చు !

రణసింహ-- ఆఙ్ఞ , మహారాజా ! ( అంటూ వెళ్లి పోతాడు )

తొండమాన-- అమ్మా ! మీరు నిశ్చింతగా ఉండండి. ఏర్పాట్లన్నీ జరిగే లోగా ఇక్కడ కూడ ఏకాంతంగా ఉండ వచ్చు ! ఒల ఒక పరిచారికను ఇక్కడ ఉంచుతాను.

మహాలక్ష్మి--- అలాగే మహారాజా ! మీకు చాల కష్టం ,కలిగించాను !

తొండమాన -- ఇక్కడ కష్ట నష్టాల ప్రసక్తి వద్దు. మీరు మాకు అతిథులు ! మీరు కోరిన విధంగా నాకు ఆతిథ్య మివ్వడం నా కర్తవ్యం ! మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సంకోచించకుండా దండనాధులతో చెప్పండి.

మహాలక్ష్మి---అలాగే మహారాజా !

తొండమాన --- ఇక మీరు విశ్రాంతి తీసుకోండి.నేను వెళ్లి వస్తాను.

**************** .

( దృశ్యము ౧౦౯ )

( తొండమాను మహారాజు అంతః పుర ఉద్యాన వనం చివర, విశ్రాంతి గృహము )

( బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి, ఆమె కొడుకు రాఘవుడు దండనాధుడు రణ సింహుడు ఉంటారు )

రణ సింహ-- అమ్మా ! వంట గది, సామాన్ల గది చూసారా ?

మహాలక్ష్మి---చూసాను.

రణసింహ --- ఏడాది వరకు సరిపోయే వంట చెరుకు, ఆహార పదార్ధాలు, తక్కిన సామాగ్రి సిధ్ధం చేసాను. ఇంకా ఏవైనా కావాలంటే చెప్పండీ.

మహాలక్ష్మి---కొన్ని ఆయుర్వేద మూలికలు, పసర్లు, మందులు కావాలి.

రణసింహ--- అలాగేనమ్మా ! మరి కాసేపటిలో మా ఆస్ఠాన వైద్యుల వారిని పంపిస్తాను ! అతను మీకు కావలసిన మందులు వగైరా ఏర్పాటు చేస్తారు.. వైద్యుల వారు వచ్చి వెళ్లిన తరువాత , ముఖ్య ద్వారాలన్నీ, మూయించి, గొలుసులతో బంధించి,తాళాలు వేయిస్తాను. మీకు ఏ అవసరం వచ్చినా ఈ గంట వాయిస్తే చాలు నేను గాని, కాపలా భటులు గాని, మీ అవసరాలు కనుక్కొంటారు.

మహాలక్ష్మి--- మంచిది దండనాధా ! అలాగే కానివ్వండి.

****************








.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద