బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 32
(దృశ్యము 110 )
( రాజ వీధిలో కూర్మావధాని భుజం మీద కాశీ కావడితో, నడుస్తూ ఉంటాడు )
( కావడిలో రెండు బిందెలు గంగా జలంతో నిండి ఉంటాయి )
( అతనలా నడుస్తూ, రాజభవనం వైపు వస్తూ ఉంటాడు)
(తొండమాను రాజు రాజభవనం కిటికీ గుండా అతనిని చూస్తాడు )
తొండమాన--- ( తనలో ) ఆయన కూర్మావధాని గారిలాగ ఉన్నారే ! తీర్థ యాత్రలు పూర్తి అయిపోయి ఉండవచ్చు. ఇతను కాశీకి వెళ్లి చాలా కాలం అయినట్లుంది ! మహాలక్ష్మమ్మగారు ఎలా ఉన్నారో ? ఆవిడ గర్భవతి కూడాను ! ఈ పాటికి సంతానం కలిగే ఉండాలే !? నాతో ఎవరూ ఏమీ చెప్పలేదే !!
( తొండమానుడు, తన ప్రక్కనే ఉన్న గంట వాయిస్తాడు )
( రణ సింహుడు వస్తాడు )
తొండమాన----- రణసింహా ! అంతఃపుర ఉద్యానవనం చివరి విశ్రాంతి గృహంలో , మహాలక్ష్మమ్మగారు,ఆమె కొడుకు ఉండేవారు కదా ! ఇప్పుడెలా ఉన్నారు ? ఆమెకి సంతానం కలిగే ఉండాలే ! ఎవరు పుట్టారు ?
రణ సింహ----- ( గతుక్కుమని ) మహాప్రభూ ! ఆమెను ఆ గృహంలో ఉంచి దాదాపు రెండు ఏళ్లు కావస్తోంది.
తొండమాన---- రెండేళ్లా ? అప్పుడే అంత సమయం గడచి పోయిందా ? సరి ! ఇప్పుడామె ఎలాగుంది, సంతానం ఏమయ్యారు ? ఒక కొడుకు, ఇంకెకొకరు ఎవరు ? అదే ఎవరు పుట్టారు ?
రణసింహ--- మహాప్రభూ ! క్షమించండి, నాకు ఏ వివరాలు తెలియవు . ఇప్పుడే వెళ్లి చూసి వస్తాను.
తొండమాన--- వెంటనే వెళ్లి వివరాలు తెలుసుకొని రా !
రణసింహ---- ఆఙ్ఞ మహాప్రభూ ! ( అంటూ వెళ్లిపోతాడు )
********************
( దృశ్యము 111 )
( తొండమానుని భవనం )
( తొండమానుడు, కూర్మావధాని ఉంటారు )
( కూర్మావధాని ఆసనం ప్రక్కనే రెండు గంగా జలం నిండిన బిందెలు ఉంటాయి )
తొండమాన---- కూర్మావధానిగారూ ! నమస్కారం ! మా భవనానికి సుస్వాగతం ! మీ తీర్థయాత్ర బాగా జరిగిందా ?
కూర్మ--- మహారాజా ! మీకు జయమగు గాక ! మీ అవ్యాజ కరుణా కటాక్షం వల్ల నా యాత్ర సఫలమయింది. ముందుగా కాశీ, తరువాత గయ, ప్రయాగలలో మా తండ్రిగారి అస్థి నిమజ్జనం, పిండప్రదానం చేసి, ధన్యత పొందాను. ఆ పైన మరికొంత మంది యాత్రీకులతో కలిసి, హరిద్వారము, ఋషీకేశము, తిరిగి, పరిపూర్ణ యాత్ర ముగించుకొని, మీ కోసం రెండు కలశాలతో గంగాజలం, ఋషీకేశము నుండి తీసుకొని వచ్చాను.
తొండమాన--- చాలా సంతోషం కూర్మావధానిగారూ ! మీరు తచ్చిన ఈ గంగా జల పూర్ణ ద్వయము, ఎంతో అమూల్యం ! నేను మీకు సర్వదా కృతఙ్ఞుడను !
కూర్మ--- మహారాజా ! ఎంత సౌహార్ద్ర హృదయులు మీరు !! గంగా జలం తెచ్చినందుకే ఇంతలా సంతోషించారు !
తొండమాన--- విప్రోత్తమా ! గంగాజలం పరమ పావనమైనది. ఆ పరమ పావని అయిన గంగను మీ పవిత్ర హస్తాలతో, ఎంతో శ్రమ కోర్చి తెచ్చినందు వల్ల అది అమూల్యమైనది అయింది! దీని కోసం అర్థ రాజ్యం ఇచ్చినా తక్కువే అవుతుంది !
కూర్మ --- మహారాజా ! నా కానుక మీకు గ్రాహ్య మయినందుకు, చాల సంతోషం ! రాజేంద్రా ! గర్భిణిగా నుండిన నా భార్యను మీ వద్ద విడిచి ఉంటిని ! ఆమె కుశల వార్త కొరకు నా మనసు వేగర డుతున్నది ! నా కొడుకు రాఘవుడు తటాకాదుల యందు, క్రీడించుటకు ఆసక్తి కలవాడు. వాడు కుశలమే కదా ? నాకు తెలిసిన జ్యోతిష పరిఙ్ఞానముతో నా భార్యకు సుపుత్రికా జనన మగునని తలచితిని ! నా తలంపు నెరవేరినదా ? మాతా శిశువులు క్షేమమే కదా ?
తొండమాన --- (తనలో ) ఈ రణసింహుడు , ఇంకా ఏ వివరాలు తెలియజేయ లేదు.! ఇతనితో ఇప్పుడేం చెప్పడం ? ( ఆలోచించి ) అవధాని గారూ ! మీ భార్యా బిడ్డలు క్షేమముగానే ఉన్నారు. మీ జ్యోతిష శాస్త్ర పరిఙ్ఞానము అసత్యమెందుకు అవుతుంది ? శ్రీమతి మహాలక్ష్మమ్మ గారు సుపుత్రికకే జన్మ నిచ్చినారు. అయితే ఆ మాతా శిశువులు ఇప్పుడీ రాచ నగరులో లేరు.
కూర్మ ---- మహారాజా ! చాల సంతోషం ! నా మనసు శాంతించేలాగ చక్కని సమాచారం ఇచ్చారు. నా కుటుంబం రాచ నగరులో కాక ఎక్కడ కలరు ?
తొండమాన--- (తనలో ) అసలు కలరో , లేరో ?! అయినా ఒక అబద్ధము చెప్పాక మరొకటి చెప్పక తప్పదు ! ( ప్రకాశముగా ) భూసురోత్తమా ! మీ భార్యా బిడ్డలు వేంకటాద్రికి వెడలినారు. నా కన్యలతో పాటు శ్రీ వేంకటేశ్వరునికి అభిషేకము చేయు నిమిత్తము వెడలినారు ! నేడే కదా శుక్రవారము ! కనుక వారు వేంకటాచలమందే యుందురు. రెండు రోజులలో తిరిగి రాగలరు ! అంత వరకు మీరు నా అతిథులు . ఈ రాజ భవనమందే విశ్రాంతి తీసుకొనుడు !
కూర్మ --- మహారాజా ! మీ ఔదార్యమునకు , అతిథి అభ్యాగతుల సేవనమునకు చాల సంతోషము. నేనీ రాజ భవనమున కాక, మీ ఆస్థాన పురోహితుల వారింట విడిది చేయుటకు నిశ్చయించితిని ! రెండు రోజుల తదుపరి, తిరిగి వచ్చెదను. సెలవిప్పించండి.
తొండమాన--- విప్రోత్తమా ! అటులనే కానిండు.
( కూర్మావధాని వెళ్లిపోతాడు )
( రణసింహుడు ప్రవేశిస్తాడు)
రణసింహ --- ( నమస్కరించి ) మహారాజులకు జయమగు గాక !
తొండమాన --- రణసింహా ! ఇంత ఆలస్యం చేసావెందుకు ? ఆ తల్లీ పిల్లలు క్షేమమే కదా ?
రణసింహ-- మహాప్రభూ ! రెండేళ్ల క్రిందట బిగించిన తాళములు ఎండ వానలకు, మార్పులు చెంది, తెరచుటకు చాల జాప్యమయినది.
తొండమాన-- ( కోపంతో ) రణసింహా ! తాళములు గొలుసుల సంగతి కాదు, తల్లీ బిడ్డల విషయాలు చెప్పు !
రణసింహ--- ( దుఃఖంతో ) మహాప్రభూ ! ఆ మాతా శిశువులు~~
తొండమాన --- ఏమయినది రణసింహా, ఆ మాతా శిశువులకు ఏమయినది ?
రణసింహ --- మహాప్రభూ ! వారు ~~ వారు ~~
తొండమాన --- ఆ ! వారికేమయినది ?
రణసింహ--- ( ఏడుస్తూ ) మహాప్రభూ ! వారు జీవములతో లేరు !! మరణించి ఎన్ని రోజులైనదో తెలియదో ఏమో, వారి అస్థి పంజరములు మాత్రము మిగిలినవి !!
తొండమాన--- ( నివ్వెర పోతాడు ) ఏమి ! వారు ~ వారు~ శల్యావశిష్టులయినారా ? హా ! హత విధీ ! ఎంత అస్త్య వార్తను నా నోట పలికించితివి !! ( కోపంతో ) రణసింహా ! మీరందరూ ఏం చెస్తున్నారు ? ఆమెను ఖైదీని బంధించినట్లు బంధించి, నిశ్చింతగా నిదుర పోయినారా ? కుశలము యోగ క్షేమము కనుగొను వారే లేక పోతిరా ?
రణసింహ--- మహాప్రభూ! ఇందు నా అపరాధమేమున్నది? అంతయు తమ ఆఙ్ఞా ప్రకారమే జరిపించితిని ఆ తల్లికి ఒక గంట చూపించి, ఏమి అవసరమున్నను మ్రోగించమని చెప్పితిని. ఆ ఘంటా నాదము గతములో ఒక్క సారైనను వినిపించ లేదు !!
తొండమాన--- ఘంటానాదము తప్ప ఆమె కుశల వార్త కనుగొనుటకు మరేమియు చేయలేదా ? రణసింహా ! క్షంతవ్యము కాని. అపరాధము జరిగి పోయినది ! నేను హంతకుడనైనాను !! గర్భిణియైన బ్రాహ్మణ స్త్రీ, మరియును ఒక అభోద బాలకుడు నా వలన ~ నా బుధ్ధిలోపము వలన ~~ హతులైనారు ! రణసింహా ! ఆ గంట ఎందుకు మ్రోగలేదు ?
రణసింహ---- మహాప్రభూ ! ఆ గంటకు కట్టిన త్రాడు మూషికములచే కొరుకుడు పడి ముక్కలు ముక్కలు అయినది !
తొండమాన--- కొరుకుడు పడినవి త్రాడు కాదు రణసింహా ! మూడు నిరీహ, నిష్పాప ప్రాణములు !! సజీవ సమాధి అయినవి ! రణసింహా ! నాకా దృశ్యము కళ్లకు కట్టినట్లు కన్పించుచున్నది ! ముక్కలయిన తాటిని తిరిగి గంటకు కట్ట లేక , ఆ తల్లి పడిన యాతన, ~~ నా ~ నా కళ్లకు కట్టినట్లు కన్పించుచున్నది ! ~ రణాసింహా ! అదుగో ~~ అటు చూడుము ! ~ ఆ తల్లి, ~~ ఆ మహాలక్ష్మీ దేవి ఎన్ని అవస్థలు పడుచున్నదో !! ~~ చూడుము ~~
*************

Comments
Post a Comment