Skip to main content

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 33

బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 33

( దృశ్యము 112 )

( తొండమాను రాజు తోటలోని విశ్రాంతి గృహము, ముఖ్య ద్వారము . గొలుసులతో కట్టబడి, తాళాలతో బిగింప బడి ఉంటుంది )

( లోపల బ్రాహ్మణ పత్ని మహాలక్ష్మి, నిండు చూలాలు, ఆమె కొడుకు రాఘవ ఉంటారు )

( మహాలక్ష్మికి ప్రసవ వేదన మొదలవుతుంది )

మహాలక్ష్మి---- ( బాధతో ) రాఘవా ! నాయనా రాఘవా !

రాఘవ --- ఏంటమ్మా ! ఏమయింది నీకు ? నొప్పిగా ఉందా ?

మహాలక్ష్మి--- అవును నాయనా ! నా కడుపు లోపల నీ చెల్లెలు బయటికి రావాలని తొందర పడుతోందిరా !
రాఘవ –అమ్మా, అమ్మా !

మహాలక్ష్మి---- ఏమిటి నాయనా ?

రాఘవ --- చెల్లి వస్తుందా అమ్మా ?

మహాలక్ష్మి---- అవును నాయనా !

రాఘవ---- ఎలా వస్తుందే ?

మహాలక్ష్మి--- ( బాధతో ) నీ చెల్లి కడుపు చీల్చుకొని బయటికి వచ్చేలాగుందిరా !

రాఘవ---- కడుపు ~~ నీ కడుపు ~~చీల్చుకొని వస్తుందా ? అమ్మా, మరి ~ మరి ~ నీకేమీ కాదా ?

మహాలక్ష్మి ---రాఘవా ! ఓ పని చెయ్యరా !

రాఘవ --- ఏమిటమ్మా ?

మహాలక్ష్మి---ఆ తాడు పట్టుకొని గంట వాయించరా !

రాఘవ --- గంట వాయిస్తే ఏమవుతుందమ్మా ?

మహాలక్ష్మి--- అబ్బ ! ప్రశ్నలతో విసిగించకు ! ముందు ~~~ ముందా గంట వాయించు.

రాఘవ--- తాడు పట్టుకొని లాగితే గంట వాగుతుందా అమ్మా !

మహాలక్ష్మి----అవును.

రాఘవ --- మరి, ఇన్నాళ్లూ చెప్పలేదేం ?

మహాలక్ష్మి---- చెప్తే, అనవసరంగా వాయిస్తావని ~~~ నాయనా ! ఈ బాధ భరించ లేకుండా ఉన్నానురా ! వేగరం ఆ గంట వాయించు.

రాఘవ---- అలాగేనమ్మా !

( రాఘవుడు గంట దగ్గరకు వెళ్తి చూస్తాడు. గంట ఆ మహల్ లో ఎత్తుగా బురుజుల మధ్య ఉంటుంది. దానికి పొడవైన తాడు వేలాడుతోంది. ఆ తాడు కొస ఒక స్తంభానికి చుట్టి ఉంటుంది )

( రాఘవ స్తంభానికి చుట్టిన తాడును విప్పుతాడు. తరువాత ఆ తాడు పట్టుకొని బలంగా లాగుతాడు )

( తాడు ఎలుకలు కొరకడం వల్ల స్తంభం ఎత్తులో తెగిపోయి ముక్కలవుతుంది ! రాఘవ ఆ తాడు పట్టుకొని తల్లి దగ్గరకు వెళ్తాడు)

( మహాలక్ష్మి బాధతో మూలుగుతూ ఉంటుంది )

రాఘవ--- అమ్మా, అమ్మా ! తాడు తెగిపోయిందే !

మహాలక్ష్మి--- ( గాభరాతో ) ఏమన్నావ్ రాఘవా ? తాడు తెగిపోయిందా ? అమ్మబాబోయ్ ! ఇప్పుడెలా ~~ ఉండు, నేను వచ్చి చూస్తాను.

(మహాలక్ష్మి కష్టం మీద లేచి నిల్చొని, అక్కడకు వస్తుంది. తెగిన తాడు కొసను అందుకోవాలని, విఫల ప్రయత్నం చేస్తుంది )

మహాలక్ష్మి---రాఘవా ఈ తాడు అందడం లేదురా, ఇప్పుడెలాగురా ?

(మహాలక్ష్మి చుట్టూ చూస్తుంది. కొంచెం దూరంలో ఒక కర్ర బల్ల కనిపిస్తుంది )

మహాలక్ష్మి--- రాఘవా ! పద, మన మిద్దరం ఆ బల్ల నిలా ఈడుద్దాం ! బల్ల మీద నిలబడి తాడు లాగవచ్చు !

( మహాలక్ష్మి రాఘవ ఎ<తో ప్రయాసతో ఆ బల్లని ఈడ్చి, గంట దగ్గరకు తెస్తారు.తరువాత మహాలక్ష్మి ఎంతో కష్టపడి బల్ల మీదకి ఎక్కుతుంది. తాడు అందుకొని గంట వాయించ బోతుంది, పట్టు జారుతుంది.తిరిగి తాడు కొసని అందుకొంటుంది, బలంగా లాగుతుంది. ఆ తాడు పై భాగం కూడ ఎలుకలు కొట్టి వేయడం వల్ల, తాడు తెగిపోయి , మహాలక్ష్మి బల్ల మీద నుండి తూలి క్రింద పడుతుంది. ఆమె తల స్తంభాఆనికి తగులుతుంది. రక్త పాతం ! ఒకటే రక్తపాతం ! మహాలక్ష్మి గట్టిగా అరచి, ఆ రక్తపు మడుగులో చివరి శ్వాస విడుస్తుంది )

( రాఘవ క్రింద పడ్డ తల్లిని చూస్తాడు . ఆమె దగ్గరకు వెళ్తాడు )

రాఘవ ---అమ్మా ! దెబ్బ తగిలిందా అమ్మా ? అయ్యబాబోయ్ ! రక్తం కూడ కారుతోందే ! ~~ కట్టు కట్టి మందు వెయ్యాలి, ఎలా ? ముందీ గంట వాయించాలి ! గంట వాయిస్తే మనుషులు వస్తారని అమ్మ చెప్పింది. ( గంట కేసి చూస్తాడు ) ఇఅక ఈ గంట ఎలాగూ వాగదు ! ఆ ! పూజ గదిలో గంట తెచ్చి వాయిస్తాను. అదయితే చక్కగా వాయించ వచ్చు !!

( రాఘవ పూజ గదికి వెళ్లి, ఒక గంట తెస్తాడు. దాన్ని గట్టిగా వాయిస్తాడు. తలుపులు తెరచుకోవు ! ఎవరూ రారు ! రాఘవ తలుపులు బాదుతాడు. వాని చేతుల లోంచి కూడా రక్తం కారుతుంది )

రాఘవ --- అమ్మా ! అమ్మా ! నాకు కూడా దెబ్బ తగిలిందమ్మా ! ఇక చెల్లి వద్దమ్మా ! నువ్వు లేవమ్మా !!

( అంటూనే మూర్ఛపోతాడు )

********************

( దృశ్యము ౧౧౩ )

( తొండమాను రాజు భవనంలో గది )

( తొండమానుడు, రణసింహుడు ఉంటారు )

తొండమాన---- చూసావా రణసింహా ! ఆ మాతా శిశువులు పడ్డ మరణ యాతన !

రణసింహ---- మహాప్రభూ ! మీరు వర్ణించి చెప్తూంటే ఆ దృశ్యం నా కళ్ల ముందు మెదలింది.

తొండమాన --- చూసావా, నేను పాపిని ! ఘోరాతిఘోరమైన పాపం చేసాను !! అంతే కాదు, వాళ్లు క్షేమంగానే ఉన్నారని, ఆమెకు స్త్రీ శిశువు జన్మించిందని ఆ విప్రోత్తమునితో అబధ్ధం కూడ చెప్పాను !! ఇప్పుడు నా కేమి గతి ?! ఏది నిష్కృతి ?! ఎవరిని ఆశ్రయించవలెను ??

( తొండమానుడు ఆలోచిస్తాడు )

తొండమాన---- అవును, ఆపద మొక్కుల వాడయిన ఆ ఏడుకొండల వాడే గతి ! అతడే నిష్కృతి !! అతనినే ఆశ్రయించెదను . ఈ సమస్యకు ఒక దారి చూపించు వరకు శ్రీనివాసుని చరణాలు వదలను !! శ్రీనివాసుడే శరణాగతి నియ్యనిచో నా కిక మరణమే గతి !!!

రణసింహ--- మహాప్రభూ ! మీరు ఒంటరిగా వెళ్ళ వద్దు , మీతో నేను కూడ వచ్చెదను. జరిగిన మహా పాతకములో నాకు కూడ భాగమున్నది కదా ! ప్రభూ ! నేనును ఆ శ్రీనివాసుని శరణాగతి పొందుతాను !

తొండమాన --- సరి ! తక్షణం రెండు గుర్రాలని సిధ్ధం చెయ్యి ! వీలయినంత త్వరగా వేంకటాచలము చేరవలె !

రణసింహ --- మహాప్రభూ ! అటులనే చేసెదను.

***************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ