Skip to main content

నీల గ్రహ నిదానము 2

నీల గ్రహ నిదానము 2

( స్టేజి క్రమంగా చీకటయి పోతుంది. తెర వెనుక లైట్లు వెలుగుతాయి. శివ లింగానికి వెనుక నున్న వైట్ కర్టెన్ మీద ఒక నీడ పడుతుంది. అలాగే 16 నీడలు ఒక దాని వెనుక ఒకటి కనబడి వెళ్లి పోతూ ఉంటాయి.)

1వ నీడ ---- చంద్రా ! నేను ప్రథమ కళను అమృతను ! నిను వీడి వెళ్లి పోతున్నాను.

2 వ నీడ ----- శశాంకా ! నేను ద్వితీయను !! మానదను సెలవా మరి !

3వ నీడ ----- మృగాంకా ! నేను తృతీయను, పూషను పోవుచున్నాను.

4 వ నీడ --- సుధాంశా! నేను చతుర్థిని, తుష్టిని, దక్ష శాప వశమున నిన్ను వీడుతున్నాను.

5 వ నీడ ----- అమృతాంశా !! నేను పంచమిని, సృష్టిని. పోవుచున్నాను.

6 వ నీడ ---- రాజా ! నేను షష్టిని, రతిని నిన్ను పరిత్యజిస్తున్నాను.

7 వ నీడ ---- రేరాజా ! నేను సప్తమిని, ధృతిని, సెలవియ్యి.

8 వ నీడ ---- చలువల రేడా ! నేను అష్టమిని, శశిని, వెళ్లనా మరి !

9 వ నీడ ----- కలువల రేడా ! నేను నవమిని, చంద్రికను వివశనై పోతున్నాను.

10 వ నీడ --- తమ్ముల పగవాడా ! నేను దశమిని, కాంతిని. నిను వీడిపోతున్నాను.

11 వనీడ ---- తపసి కనుపాపా !! నేను ఏకాదశిని, జ్యోత్స్నను, దశమితో పాటు పోతున్నాను.

12 వ నీడ ---- జాబిల్లీ ! నేను ద్వాదశిని, ‘శ్రీని’ నీలో నిలువ లేక పోతున్నాను.

13 వ నీడ ---- చుక్కల దొరా !! నేను త్రయోదశిని, ప్రీతిని, నీకు అప్రియనై పోతున్నాను.

14 వనీడ ---- చందమామా ! నేను చతుర్దశిని అంగదను నీకు తిలోదకము లిచ్చు చున్నాను.

15 వనీడ ------ సోమా ! నేను పంచదశినైన పూర్ణను నీలో ఇమడలేక శూన్యను కానున్నాను.

16 వ నీడ ---- శశీ !! నేను షోడశిని, పూర్ణామృతను నాకు సెలవియ్యి.

( షోడశి నిష్క్రమణతో , తెర వెనుక లైట్లు ఆరి, రంగ స్థలం పైన వెలుగుతాయి. )

చంద్రుడు --- ( సగం లేచి ) ఓ నా షోడశ కళలారా !! నన్ను విదిలి వెళ్లకండి, మీ నిష్క్రమణతో నా బ్రతుకు సమాప్త మవుతుంది. ( అంటూ మళ్లీ క్రింద పడి పోతాడు. )

రోహిణి ---- నాథా ! అమంగళము ప్రతిహతమగు గాక !! మీరు అలా మాట్లాడితే నేను భరించ లేను

చంద్రుడు --- రోహిణీ !! కళా విహీనుడ నైన నేను, నీ కెందులకూ కొరగాను ! నన్ను విడిచి వెళ్లి పో ! పొండి, ఈ చంద్రున్ని చీకటికి కబళం చేసి పారిపోండి. ( మళ్లీ లేవ బోయి పడి పోతాడు )

( రోహిణి దుఃఖంతో శివున్ని ఆశ్రయిస్తుంది. )

రోహిణి --- భావా ! సతీ వల్లభా !! శివా !!! ఇక నీవే చూపించాలి త్రోవ !!!!
చంద్ర శేఖర చంద్ర శేఖర, చంద్ర శేఖర పాహిమాం ! చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్రశేఖర, రక్షమాం !!

( రోహిణి ప్రార్థన విని, చంద్రుడు ఉత్సాహం తెచ్చుకొని లేచి శివ సన్నిధికి వస్తాఢు )

చంద్రుడు --- రత్నశాను శరాసనం. రజతాద్రి శృంగ నికేతనం
శింజినీ కృత పన్నగేశ్వర మంబుజానన సాయకం
క్షిప్ర దగ్ధ పురత్రయం, త్రిధ శాలయై రభివందితం
చన్ద్రశేఖర మాశ్రయేమమ, కింకరిష్యతివై యమః

రోహిణి --- చంద్ర శేఖర, చంద్ర శేఖర, చంద్ర శేఖర, పాహిమాం,
చంద్ర శేఖర చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం.

చంద్రుడు --- కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
నారదాది మునీశ్వర స్తుత వైభవం, వృష వాహనం
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్ర శేఖర మాశ్రయేమమ కింకరిష్యతివై యమః

రోహిణి-- చంద్ర శేఖర, చంద్రశేఖర, చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం

చంద్రుడు-- విశ్వసృష్టి విధాయకం, పునరేవ పాలన తత్పరం
సంహరం తమసి ప్రపంచ, మశేష లోక నివాసినమ్
క్రీడయంత మహర్నిశం, గణనాధ యూధ సమన్వితం
చంద్ర శేఖర మాశ్రయేమమ కింకరిష్యతివై యమః

రోహిణి + చంద్రుడు-- చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం
చంద్ర శేఖర, చంద్ర శేఖర చంద్ర శేఖర రక్షమాం

(శివ లింగం దేదీప్యమాన మవుతుంది )

( తెర లోంచి శివుని కంఠ స్వరం వినిపిస్తుంది. )

శివుడు --- రోహిణీ చంద్రులారా !! విచారించకండి. దక్షుని శాపం అప్రతిహతమే అయినా , దాని నుంచి తప్పించుకొనే మార్గం ఉంది.

ఇద్దరూ--- సెలవియ్యండి ప్రభూ !!

శివుడు --- చంద్రా ! శాపోక్తి ప్రకారము, నీ వెన్నటికీ షోడశ కళా ప్రపూర్ణుడవు కాలేవు. నీ షోడశీ కళయైన పూర్ణామృతను నా తల యందున్న నీ బింబ మందు నిలుపుకొని, నిన్ను పంచాదశ కళా సమేతున్ని చేస్తాను

చంద్రుడు-- ధన్యోస్మి శివా ! నన్ను పదిహేను కళలతో, తిరిగి వెలుగందేలా చేసి, నాకు పునర్జీవితాన్ని ప్రసాదించు. ( నమస్కరిస్తాడు )

శివుడు --- మూర్ఖుడా ! నీకు స్వయముగా వెలుగందే భాగ్యమెక్కడిది ? ( పద్యం )

గీ--- స్వయముగా వెల్గ గల్గెడి భాగ్యమేడ
పద్మ మిత్రుని తేజంబు ప్రతిఫలింప
వెల్గుచుందువు నీవు రేవెల్గు వగుచు
కాని వృద్ధి క్షయమ్ములు కల్గుచుండు

దక్షుని శాపం వల్ల నీవు నిస్తేజుడవు కూడ అయినావు. విచారింప వలదు సుమా ! సూర్యుని తేజాన్ని నీలో నిలుపుకొని, ప్రతిఫలింప చేసే వరాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. మరియును వినుము. పంచాదశ కళలు కూడ నీలో నిండి ఉండుటకు వీలు లేదు ! అందుకని రోజుకొక కళా లాభముతో వృద్ధి పొందుతూ, పదిహేను కళలతో పున్నమి రేడువై, మరల రోజుకొక కళా విహీనుడవై వృద్ధి క్షయాలు పొందుతూ ఉండు

రోహిణి ---- బావా ! నా నాథుని నేను మరల షోడశ కళలతో చూసుకోలేనా ?

శివుడు ---- రోహిణీ ! నీ నాథుడు నీతో కూడినప్పుడే ఉచ్ఛ గతిని పొందగలడు. నీకు మాత్రము పరిపూర్ణుడై కన్పింప గలడు.

ఇరువురూ ---- ధన్యోస్మి మహాదేవా ! ( అని ప్రణమిల్లుతారు )

( మొదటి దృశ్యం సమాప్తం )

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద