బాలాజీ అర్చావతార విశేష దృశ్యార్చన 34
( దృశ్యము 115)
( వేంకటాచలము పైన శిలా మందిరము )
( శ్రీనివాసుని ముందు తొండ మానుడు ,ఆ వెనకగా రణసింహుడు సాష్టాంగ పడతారు )
తొండమాన--- ప్రభూ ! దేవదేవా ! శ్రీనివాసా ! పాహిమాం,! రక్షమాం !
పంకజాసన ! పాకశాసన ! పద్మ బాంధవ పూజితా !
పంకజేక్షణ ! భద్ర లక్షణ ! పావనాంఘ్రి సరోరుహా !
శంకర స్తుత ! శాంతి సంభృత ! సాధు సంఘ నమస్కృతా !
వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! వేంకటేశ్వర ! పాహిమాం !
శ్రీనివాస --- తొండమాను రాజా ! నీ హృదయమును నేనెరిగితిని ! నీవు పాపము చేసితివి ! నేనేమి చేయగలను ? నీవు మరలి నీ భవనమునకు పొమ్ము.
తొండమాన--- ప్రభూ ! డేవదేవా ! వేంకటేశా ! నా పాపమును ధగ్ధము చేయుము.
శంక వీడుచు, సర్వభూప్రజ సాకి కోరిక తీర్చుచున్
బింక మూడ్చుచు, బాప జాతిని, భస్మమౌనటు మాడ్చుచున్
జంకు లింకుచు శేషభూధర సానువందు, వసించుచున్

వేంకటేశ్వరా ! నీకు శిలాభవనము నిర్మించునప్పుడు, నా కొక వరము నిత్తునని, పలికితివి ! ఆ వరమును ఇప్పుడు అనుగ్రహింపుము ! నన్ను పాప విముక్తుని చేసి, రక్షించుము. లేదన్న నేను నీ పాదముల కడ మరణింతును.
రణసింహ--- దేవాది దేవా ! ఏడుకొండల వాడా ! ఆపద మొక్కులవాడా ! మా మహారాజుతో పాటు నేను కూడ, ఈ ఘోర పాతకమునకు భాధ్యుడనే ! మహారాజు కోరికే నా కోరిక ! నా కోరిక తీర్చిన యెడల ఈ మహారాజు నాకిచ్చు సంవత్సర భృతియందు షోడశ భాగము మీకు సమర్పించు కొందును. లేకున్న నేనును నా రాజునే అనుసరించి ఆత్మాహుతి చేసుకొందును.
శ్రీనివాస--- తొండమాను రాజా ! రణసింహా ! మీరు అకార్యము చేసితిరి ! మీరు చేసిన పాపము నేను చేసినట్లే అయినది !! ఏలననగా , చిన్నారి బాలకుడైన రాఘవుడు, నా పూజ చేసి ముగించిన గంట పలుమార్లు మ్రోగించి, సహాయ మర్థించినాడు. నేను పాపిని ! దురాచారిని ! నిత్య దుఃఖ యుక్తుడనై ఉన్నాను ! నేను అకాల మరణము నైన పొందవలయును, లేదా నరకమున కైన పోవలయును !
నా భక్తులకు సంభవించిన దౌర్భాగ్యము నా వలన రాకూడదు ! మీ రిద్దరూ పాపము చేసి, నన్ను కూడ భాగస్వామిని చేసినారు !! అందుచేత అకాల మరణము పొందిన బ్రాహ్మణ కుటుంబమును మరల సజీవులుగా చేసెదను !!! కలి యుగమున మహా పాతకులకు పాప విముక్తి యగునట్లు చేసెదనన్న కీర్తి, నాకు కలుగు గాక ! రాజా ! నీవు ముందు మరణించిన వారి యస్థికలను తెప్పింపుము.
తొండమాన--- దేవాధిదేవా ! అటులనే చేసెదను.
(అంటూ రణసింహుని వైపు చూస్తాడు )
రణసింహ ---- మహాప్రభూ ! నేను సత్వరము వెడలి, ఆ అస్థికలను తెచ్చెదను.
*******************
( దృశ్యము 115 )
( వేంకటాచలము దాపులోని పాండు తీర్థము )
( శ్రీనివాసుడు ,రణసింహుడు , తొండమానుడు ఉంటారు )
( బ్రాహ్మణ స్త్రీ, శిశువుల అస్థి పంజరములు ఒక తెల్లని వస్త్రములో, ఒక రాతి పలక మీద పేర్చి ఉంటాయి )
( శ్రీనివాసుడు పాండు తీర్థము లోని, లోతైన ప్రదేశములో, కంఠము మునిగే వరకు నిలబడి, రెండు చేతులు పైకెత్తి, నిలబడి, కాసేపు ధ్యానం చేస్తాడు. ఆ తరువాత ఆ తీర్థం లోని జలాలను అస్థికలను జల్లుతాడు )
( ఆ తీర్థ ప్రభావం వల్ల, శ్రీ వేంకటేశ్వరుని ప్రభావం వలన, ఆ అస్థి శకలాలు అతుక్కొని , బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి, ఆమె కొడుకు రాఘవుడు, గర్భస్థ స్త్రీ శిశువుతో సహా పునర్జీవితులౌతారు )
( ఆకాశం లోంచి, పుష్ప వృష్టి కురుస్తుంది. ఆకాశ వాణి పలుకుతుంది )
ఆకాశవాణి---- శ్రీనివాసుని ఛేత నిర్జీవములైన , అస్థి శకలములను ప్రోక్షించి సజీవులుగా చేసిన ఈ పాండు తీర్థము అస్థితీర్థముగా వ్యవహరింప బడును. నరకమునకు పోయిన మహా పాతకుల అస్థులను కూడ , యీ అస్థి తీర్థమున నిమజ్జనము చేసినచో,వారికి స్వర్గ ప్రాప్తి కలుగ గలదు !
( ఆకాశ వాణి ముగిసిన వెంటనే శ్రీనివాసుడు అంతర్ధాన మవుతాడు )
( బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మి, తన శిశువు నెత్తుకొని, మహారాజునకు నమస్కరిస్తుంది )
తొండమాన---- తల్లీ ! నేను మీ నమస్కారాదులు అందుకొనుటకు తగను ! మిమ్ములను నిర్దాక్షిణ్యముగా మరణ యాతనకు గురి చేసిన నన్ను క్షమింపుము.
(అని తొండమాన మహారాజు బ్రాహ్మణ స్త్రీకి నమస్కరిస్తాడు )
మహాలక్ష్మి--- మహారాజా ! నేను మరణావస్థలో కూడ మిమ్ములను నిందింప లేదు. అది అంతయు నా స్వయంకృతమైన అపరాధము ! మీరు రాణీ వాసమున నన్ను పరిచారికల మధ్య, నివసింపమని కోరినను, నేను వారెవ్వరూ వలదని చెప్పి, ఏకాంత వసమును కోరి యీ విపత్తును తెచ్చుకొంటిని !
( ప్రవేశం కూర్మావధాని )
కూర్మ ---- తొండమాను మహారాజా ! మీకు జయమగు గాక ! మీ కీర్తి ఆచంద్ర తారార్కమగును గాక !!
( అకస్మాత్తుగా వచ్చిన కూర్మావధానిని చూసి, అతను పలికిన జయ వాదం విని తొండమానుడు నిర్ఘాంత పోతాడు )
తొండమాన--- విప్రోత్తమా ! మీరు ~~ మీరు ~~
కూర్మ --- మహారాజా ! నేను మీ ఆస్థాన పురోహితుల ఇంటి విడిది చేసిన మాట వాస్తవము ! ఆ ఇంటి ఇల్లాలి వలన మీ కన్నియ లెవరూ వేంకటాద్రి యాత్రకు పోలేదని తెలిసి, నేను మీ మాటల పట్ల అవిశ్వాసమునకు లోనయితిని ! ఆ పిమ్మట పురోహితుల వారి వల్ల, మీరు నా భార్యను ఏకాంత మందిరమున నుంచినట్లు తెలిసినది ! అక్కడకు వెడలి చూసిన నాకు రణసింహుడు , కొన్ని అస్థికలను మూటకట్టుకొని, వెళ్లినట్లు తెలిసినది ! నేనీ తీర్థరాజమునకు నా కుతూహలము పట్టలేక వచ్చితిని ! జరిగిన దంతయు చూసితిని !!
తొండమాన----భూసు రోత్తమా ! మీకు జరిగిన దంతయు తెలిసినది కదా ? మీ భార్య సాధ్వీమణి మహాలక్ష్మి గారు నా యపరాధమును నిండు మనసుతో క్షమించినారు ! మీరు కూడ నన్ను క్షమించినచో నాకు మనశ్శాంతి కలుగును.
కూర్మ ---- నేను మీకు ముందుగానే ‘జయవాదము’ పలికితిని. మీ కీర్తి ఆచంద్రతారార్క మగునట్లు దీవించితిని ! శ్రీనివాసునిపై గల మీ భక్తి ప్రపత్తులు అనన్య సామాన్యమైనవి ! నా భార్యా బిడ్డలకు పునర్జన్మ నొసగిన మీరు నన్ను, క్షమాభిక్ష అడుగుట పాడి కాదు ! మీ వలన యీ కలి యుగమున అసంభవమగు కార్యము సంభవ మయినది !!
ఈ అస్థి తీర్థ ప్రభావము ఆకాశవాణి మూలమున తెలిసినది. నేను కాశీ, గయ, ప్రయాగాదులు మా నాన్నగారి అస్థికలు తీసుకొని వ్యర్ధముగా తిరిగితిని !! సమీపము నందే, ఇంత మహిమ గల వేంకటాచల క్షేత్రము నుంచుకొని, అస్థి నిమజ్జనము చేయుటకు అడవులు పట్టి తిరిగితిని ! మహారాజా ! మీ అనుమతి లభించినచో , నేనొక విన్నపము చేసుకొనెదను !
తొండమాన--- బ్రాహ్మణోత్తమా ! విన్నపము కాదు, ఆఙ్ఞాపింపుడు ! నేను మీకు ఋణపడి ఉన్నాను.
కూర్మ ---- ఈ తీర్థ మహాత్మ్యము ఆకాశవాణి వలన వినిన వెనుక, నా కొక ఆలోచన వచ్చినది ! ఇక్కడనే స్థిర నివాస మేర్పరచుకొని, అస్థి నిమజ్జనము చేయుటకు ఇచటికి వచ్చు శ్రధ్ధాళువుల కొరకు, వారి వారి స్వజనుల అంత్య క్రియలు జరిపించు కార్యము నిర్వర్తింప దలచితిని. మీరు నా కొరకు, యాత్రికుల కొరకు ఒక శాల, సత్రము, నిర్మాణము చేయించిన బాగుండును.
తొండమాన --- భూసురోత్తమా ! బహు చక్కని ఆలోచన చేసితిరి ! ఈ అస్థి తీర్థమునకు నేనును ఋణపడియే ఉన్నాను, అందువలన మీరు కోరిన ఏర్పాట్లు చేసి, ఋణ విముక్తుడ నగుదును గాక ! మీరు నిశ్శంశయముగా ఇచ్చోటికి వచ్చి నివసించి, పితృ కార్యము నెరవేర్చుటకు వలయు ఏర్పాట్లను స్వయముగా పర్యవేక్షింపుడు
*********
( ఈ రచయిత అభిప్రాయము ~~ ‘ అస్థి తీర్థ ’ ప్రభావాన్ని టి.టి.డి వారు ప్రమోట్ చేస్తే బాగుంటుంది. కాశీ గయ ప్రయాగల కన్న ఎంతో మహిమాన్వితమైన యీ తీర్థము వల్ల జనావళికి ప్రయోజనము సమ కూరుతుంది.)

chaalaa baagundi. manchi vishayamulu chepparu. krutajnatalu
ReplyDeletefrom
srinivas postal department yellamanchili visakhapatnam district
mee blog choosthe kontha punyam vastundhi
ReplyDelete