నీల గ్రహ నిదానము 5
(ద్వితీయాంకము)
(ప్రథమ దృశ్యము )
(దశరథ మహారాజు శయన మందిరం )
( తెర తీయగానే సన్నని వెలుగులో దశరథుడు పాన్పు లేదా తూగుటుయ్యాలపై పడుకొని ఉన్నట్లు చూపించి, అతడు కాస్త ఒత్తిగిల్లగానే లైట్లు ఆఫ్ చేయాలి )
( తెర వెనుక లైట్లు ఆన్ అవుతాయి )
( దుస్వప్నాలు ఒక దాని వెనుక ఒకటిగా షేడో రూపంలో చూపించాలి )
1వ నీడ ---- ఒక మనిషిని కోతి తరుముతున్నట్లు ------
2వ నీడ ---- ఒక స్త్రీ జుత్తు విరబూసుకొని, రోదన చేస్తూ తిరుగుతున్నట్లు----
3వ నీడ ---- ఒక మనిషి, ఎనుబోతును ఎక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్లు -----
4వ నీడ ---- ఒక మనిషి చెరసాలలో బందీ అయినట్లు ----
(వరుసగా ఇన్ని దుస్వప్నాలు కనిపించిన తరువాత దశరథుడు పాన్పుపై లేచి కూర్చొంటాడు,)
( రంగ స్థలం పైన లైట్లు వెలుగుతాయి.)
(దశరథుడు తెప్పరిల్లి పాన్పు దిగుతాడు )
దశరథుడు ----- ( జనాంతికముగా ) ఏమిది ! ఇంద్రజాలము వలె కన్పట్టుచున్నది !! చతుర్దిశలయందు, `సరయు, నర్మద , గంగ , సింధు ' నదీ జల పరీత భూమండలమును, ఏక చ్ఛత్రము క్రింద పరిపాలించిన, అకళంక కీర్తి చంద్రులు, అయోధ్యా పురీ రమారమణులైన `మాంథాత, రఘు , దిలీప , అజ ' చక్రవర్తుల వంశజుడనైన, దశరథ రాజేంద్రుడ నేనా నేను !!! ( చెయ్యి గిల్లి చూసుకొని ) అవును ! నేను దశరథుడనే ! ( చుట్టు ప్రక్కల కలయ జూసి ) ఇది నా ఆలోచనా మందిరము వలె కన్పట్టుచున్నది.. రాత్రి చాలసేపటి వరకు, అమాత్య సుమంత్రుల వారితో మంతనము లాడి ,నే నిచటనే శయనించి యుండవలె ! --- అవునవును -- ఇచ్చోటనే శయనించితిని !! అనగా ఇంద్రజాలము వలె కన్పట్టిన ఈ దృశ్యములన్నియు, స్వప్న దృశ్యములా !! ఇసీ !! స్వప్నమునకా నే నింత కలవర పడినది !!! ( చప్పట్లు కొడతాడు ) ఎవరక్కడ ?
( ప్రవేశం -- అకంపనుడనే భటుడు. నిలువెల్లా వణుకుతూ )
అకంపనుడు ----- (కంపిస్తూ ) జ-జ --జ జయము ,జయము మహారాజా !
దశరథ ---- ఎవరు నీవు ?
అకంప --- మ –మ -- మహారాజా ! నేను అకంపనుడను.
దశరథ --- కాదు, నిశ్చయముగ నీ వకంపనుడవు కావు !
అకంప ---- అయ—య్యయ్యో మ---మహారాజా ! నేను --నేను అకంపనుడనే !
దశరథ ---- ఊఁహు ! నేను నమ్మ జాలను.
అకంప ---- మ—మ ---మహారాజా !ఎ--- ఎట్లా రుజువు చేసేది ! నేను అకంపనుడనే !
దశరథ ---- నీవు అకంపనుడవే అయిన , ఇట్లు భయకంపితుడవు కానేల ?
అకంప --- ( తేరుకొంటాడు ) క్ష---క్షమించండి మ-- మహారాజా ! నేను ముమ్మాటికీ అకంపనుడనే ! ఇలా--- ఇలా --- వణుకు పట్టదానికి తగినంత కారణం ఉంది మహారాజా ! నేను చూసిన దృశ్యాలని మీరు చూసినా, క్షమించండి---- ఇంకెవరు చూసినా, ఇలాగే వణికు పుట్టి కంపించి పోవలసినదే !
దశరథ ----- ఏమంటివి అకంపనా ! నివు భయాందోళనలకు గురిచేయు దృశ్యములను చూసితివా ?
అకంప ------ అవును మహారాజా ! నేనే కాదు, అర్ణవ ష్ఠీవి కూడా చూసాడు. వాడు అక్కడి కక్కడే రాయిలా నిలబడి పోయి, `ఉప్పుటేరులా' , ` చెమట ' కార్చేసుకొంటున్నాడు . ఇంతలో మీ పిలుపు వినిపించినది.
దశరథ ----- ఏ దృశ్యములు ? అకంపనా, కలలోనివా ?
అకంపన --- అయ్యయ్యయ్యో ! మహారాజా ! క్షమించండి క్షమించండి, క్షమించండి . కాపలా కాసే భటులం మేము కలలు కంటే, తలలు ఎగిరిపోవా మహాప్రభూ ! మేమా దృశ్యాలను మా కళ్లతోనే చూసాం. కావాలంటే అర్ణవ ష్ఠీవిని కూడ పిలిచి అడిగి చూడండి.
దశరథ ---- వెళ్లి తీసుకొని రా !
( అకంపనుడు వెళ్లి రెండవ భటునితో వస్తాడు )
అర్ణవ ష్ఠీవి --- జయము జయము మహారాజా ! నేనే అర్ణవ ష్ఠీవిని !
దశరథ ---- చిరంజీవీ ! నీకీ పేరు నీ తల్లి తండ్రులు పెట్టినదేనా ?
అకంప --- అవును, మహారాజా ! వీడు వర ప్రసాది, సార్థక నామథేయిడు !
దశరథ ---- ( నవ్వుతూ ) ఏమి ! సార్థక నామథేయుడా ? నిజమేనా అర్ణవ ష్ఠీవీ ! నీవు చెమటతో ఉప్పుటేరులు సృష్టించ గలవా ?
అర్ణవ --- అవును , మహాప్రభూ ! మా తలిదండ్రులకు నేనును, నా అన్న ‘సువర్ణ ష్ఠీవియును కవలలము. మమ్మిరువురను మా తల్లి, నారద మహర్షి వర ప్రసాదము వలన కనెనట !
అకంప ----- చిన్నప్పటినుంచి వీరిద్దరి చేష్టలు వింతగా ఉండేవట మహారాజా ! వీడి అన్న సువర్ణ ష్ఠీవి కన్నీళ్లు కార్చినా, చెమట కార్చుకొన్నా, మల మూత్రములు విసర్జించినా, చివరకి కక్కుకున్నా ఆ విసర్జకము లన్నియు బంగారముగా మారిపోయేవట ! ---
దశరథ ---- ఏమేమి, ఆశ్చర్యముగ నున్నదే !
అర్ణవ ---- మహాప్రభూ ! నా దురవస్థ ఏమని చెప్పను. నా విసర్జకము లన్నియు, తటాక ప్రమాణములో నుండేవట ! నా చెమటకి పరుపు తడిసి, ఎండ పెట్థిన తరువాత ----
అకంప ---- ఉప్పు దాశులు రాశులుగా రాలేదట మహారాజా !
దశరథ ---- పాపము ! అర్ణవ ష్ఠీవీ, నీ అన్నమాట ఎట్లున్నను, నీ విషయమున మాత్రము , వరము శాపము వలె పరిణమించినదన్న మాట !
అర్ణవ ---- లేదు మహాప్రభూ ! మా అన్నకు కూడ ఆ వరము వాని దౌర్భాగ్యము అయినది ! వాని కన్నీరు బంగారమగుట చూచి, చుడవచ్చినవారు పొత్తళ్లలో శిశువును గిల్లి గిచ్చి ఏడ్పించెడి వారట !
అకంప ---- దాది పాలెక్కువ పట్టి , నోట వేలు పెట్టి కక్కంచి ఆ కక్కును మూటకట్టుకు పోయేదట !
అర్ణవ --- వాని మల మూత్రముల సంగతి సరేసరి మహాప్రభూ ! మా తల్లి తండ్రులే వాటి అధికాధిక సేకరణకు వానికి ఏవేవో తినిపించెడి వారట !
దశరథ ---- అభోద శిశువు పట్ల ఎంతటి అత్యాచారము ! ఇప్పుడతడు ఎక్కడ నున్నాడు అర్ణవా !
అర్ణవ --- ఇంకెక్కడ ఉన్నాడు మహాప్రభూ ! వాని కఢుపులో బంగారముందని, అదే అలా బయట పడుతోందని నమ్మిన కొందరు దొంగలు మా ఇంట పడి -----
అకంప --- ఆరునెలల వయసులోనే వాన్ని ఎత్తుకుపోయి ఇంటి వెనుక తోటలోనే, పొట్టకోసి బంగారము కనపడక పారేసి పోయారట !
దశరథ ---- ఇసీ ! మనుజుల లోభగుణము ఎంత చెడ్ఢది ! అర్ణవా, నీవు ఇదివరకు ఎచట నుండెడివాడవు ?
అర్ణవ ---- చిన్న మహారాణి కైకమ్మగారి వద్ద కాపలా కాసేవాణ్ని మహాప్రభూ !
అకంప --- నెల రోజులలోనే వీడు కార్చిన చెమట చెరువయి పోవడం చూసి, కైకమ్మగారు , సుమంత్రుల వారితో ఆలోచించి బహిర్భూమిలోని మీ ఆలోచనా మందిరానికి మార్చారు మహారాజా ! నన్నడిగితే వీడు ----వీడు, కోట కవతల కందకం దగ్గర కాపలా కాస్తే బాగుంటుంది మహారాజా !
దశరథ --- తప్పు అకంపనా ! ఒరుల బలహీనతను చూచి ఓర్మి వహింపవలెను గాని, పరిహాసము సేయుట తగదు. అది సరియే ! మీరిద్దరు కలిసి చూసిన దృశ్యముల మాట ఏమి?
అర్ణవ --- మహాప్రభూ ! రాత్రి రెండుఝాములు దాటిన తరువాత, నేనును అకంపనుడను కలిసి, పహరా తిరుగుతూ వాటిని చూసాము మహాప్రభూ ! ఒక కోతి ---- మిమ్ములను--- క్షమించండి మహారాజా ! మీ వంటి పురుషాకృతిని--- తరుముతున్నట్లును -----
అకంప ---- ఒక దేవతా స్త్రీ --- తల విరబూసుకొని మనకోట నాలుగు బురుజుల మీదుగా తిరుగుచున్నట్లును------
అర్ణవ ---- మహాప్రభూ ! మీ వంటి పురుషాకృతి --- ఒక ఎనుబోతు నెక్కి, ఆకాసంలోకి దక్షిణ దిశగా వెళ్లుచున్నట్లును ----
దశరథ ----- ఆ పిమ్మట నేను, అదే నా వంటి పురుషాకృతి చెరసాలలో బందీ అయినట్లును ,ఇవియేనా మీరు చూసిన దృశ్యములు ?
ఇధ్దరూ ---- అవునవును మహారాజా -- !
దశరథ ---- నేను కూడ వాటిని చూచితిని, కాని నా కవి స్వప్న దృశ్యముల వలె కన్పట్టినవి.
అకంప ----- ( కంపిస్తూ ) మే-- మేము మాత్రం వాటిని కంటితోనే చూసాము మహారాజా ! కలలో కాదు---
అర్ణవ ----- అవును మహాప్రభూ ! కల కాదు, నిజంగానే చూసాం.
దశరథ ---- అకంపనా ! రాత్రి చాలసేపటి వరకు మాతో మంతనము లాడిన సుమంత్రులవారు ఇంటికి మరలి ఉండరు. ఇక్కడే రాజ ప్రసాదమునందే విశ్రమించినారేమో !--- నీకు తెలియునా ?
అకంప --- నుజము మహారాజా ! వారీ మందిరములోనే విశ్రమించి ఉన్నారు.
దశరథ ---- వారిని మేల్కొలిపి, రాజాజ్ఞ నెరిగించి తోడ్కొని రమ్ము.
( అకంపనుడు వణుకుతూ వెళ్లబోతాడు.)
దశరథ ---- ఆగుమాగుము అకంపనా ! నీ మేని కంపనములు ఇంకను తీరినట్లు లేదు. నీ విచ్చోటనే యుండుము అర్ణవ ష్ఠీవీ, నీవు వెళ్లి అమాత్యువారిని తోడ్కొని రమ్ము.
అర్ణవ ----- చిత్తము మహాప్రభూ ! ( వెళ్తాడు )
దశరథ ---- అకంపనా !
అకంప ---- ఆజ్ఞ మహారాజా !
దశరథ ---- అర్ణవుని యీ దురవస్థ నుండి తప్పించుటకు మార్గమేదైనను కలదా ?
అకంప ---- తపశ్శాలులైన మహాత్ములెవరో మా యందు దయయుంచి దీవించిన నాడే యీ దురవస్థల నుండి బయట పడుట !
దశరథ ---- ‘మా’ అనుచున్నావేమి అకంపనా ! నీవును ఆపదల పాలైతివా ?
అకంప ---- మహారాజా ! మీ కడ ఎటుల చెప్పుకోగలను. నా అత్త కూతురు ‘ మిత్తి’ వోలె నా గడప తొక్కి, నన్ను ఆపదల పాలు చేయుచున్నది.
దశరథ ------ ఇల్లాలిని మృత్యుదేవతతో పోల్చుట తగని పని అకంపనా !
అకంప ---- మహారాజా ! నా ఇల్లాలు ఆ మృత్యుదేవతకే మృత్యువు ! పగలు చూసిననే రాత్రి కలలోకి వచ్చు సౌందర్య విశేషము కలది. ఇక రాత్రి చూసిన వేరు చెప్పవలెనా ? నేను రాత్రి కొలువులు చేసేది అందుకే మహారాజా !
దశరథ ----- భార్యా రూపవతీ శతృః అన్న ఆర్యోక్తి వినలేదా అకంపనా ! నగుమోము గలచాన నల్లనిదైనా మగనికి లోకాన మరుపాల వాన కురిపింప గలదు సుమా !
అకంప ---- మహారాజా ! అది నల్లని తుమ్మ మొద్దు అయినను నేను భరింపగల వాడనే గాని, కణకణ మండే బొగ్గుల కుంపటి యేన ఎట్లు సహింప గలను ?
( అర్ణవ ష్ఠీవి _ సిమంత్రుల వారితో ప్రవేశం )
సుమంత్రుడు ---- మహారాజులకు జయమగు గాక !
దశరథ --- అమాత్యవర్యా ! మీ నిద్రా భంగము చేసినందులకు మమ్ములను-----
సుమంత్ర ---- ( అడ్డుపడి ) మహాప్రభూ ! మీ సౌజన్యము అనన్య సామాన్యము ! సేవకుని కడ మన్నన లెందుకు ? ఈ సుమంత్రుడు మీ ఆజ్ఞా బద్ధుడు.
దశరథ ----- మీరు అంతటి స్వామి భక్తి పరాయణులే ! అర్ణవా, అమాత్యులను పిలిపించిన కారణము నీవు వారితో చెప్పితివా ?
సుమంత్ర ------ దారి పొడవునా చెప్పుతూనే ఉన్నాడు మహారాజా ! అరిష్ట చిహ్నములు మీకు కూడ స్వప్న దృశ్యములయినవట కదా ?
దశరథ ----- అవును అమాత్యా ! అవి అరిష్ట చిహ్నములే నందురా ?
సుమంత్ర ---- నా కవి అటులనే గోచరించు చున్నవి. మహాప్రభూ ! త్రికాల దర్శులయిన వశిష్ట మహర్షి నారద మునీంద్రుల పిలుపున, రాజ్యము వదిలి నేటికి నాలుగు దినములు అయినది----
దశరథ ---- అవును, వారున్న యెడల వీటి అర్థము కరతలామలక మయ్యెడిది కదా ! మహామంత్రీ ! మీ ఎరికన వీటి అంతరార్థము తెలుపగల సమర్థు లెవరును లేరా ?
సుమంత్ర -----లేకేమి రాజేంద్రా ! మన రాజపురోహితులు థౌమ్య మహాశయులు ( ఈ పేరు కల్పితం ) అందులకు సర్వ సమర్థులు ( భటులతో ) అకంపనా, అర్ణవ ష్ఠీవీ,
భటులు ----- ఆజ్ఞ మాహామంత్రీ !
సుమంత్ర ----- తెల్లవారుట కింకను అర్థఝాము మాత్రమే ఉన్నది. మన రాజ పురోహితులు థౌమ్యుల వారు, ప్రాతఃకాల సంధ్యాధికములు నెరవేర్చుకొనుటకు, సరయూ తీరమునకు వెళ్లునది ఈ సమయమందునే ----మీరు సరయూ తీరమునకు వెడలి వారికి రాజాజ్ఞ నెరిగించి తోడ్కొని రండు.
దశరథ ----- భటులారా ! భూసురుల కడ తొందరపాటు పనికిరాదు. వారి స్నాన సంధ్యాధికములు పూర్తయిన తర్వాతనే ---- తీసుకొని రండు.
భటులు ---- ఆజ్ఞా ప్రకారము అటులనే చేసెదము మహారాజా ! ( వెళ్లిపోతారు )
దశరథ -----అమాత్యా ! థౌమ్య మహాశయులు విచ్చేయు లోపున, ప్రాతఃకాల కాలకృత్యములు నెరవేర్చుకొని వచ్చెదని గాక ! మీరు సుఖాసీనులు
కండు. ( వెళ్లిపోతాడు )
సుమంత్ర ----- ( జనాంతికముగా ) మహారాజులకు స్వప్నమందును, భటులకు ప్రత్యక్షముగను కన్పించిన అరిష్ట చిహ్నములకు కారణమేదియో ? రాక్షస మాయ కాదు గదా ? పరీక్షించెదము గాక !
( సుమంత్రుడు గదిలో వస్తువులని పరిశీలనగా చూస్తూ, రాజు పఢుకొన్న పాన్పు దగ్గరకు వెళ్తాడు. పాన్పును, తలగడాలను చూస్తూ పైకెత్తి చూస్తాడు )
( తెరలో భయం గొలిపే మ్యూజిక్ ! పిల్లి, కుక్క, కోతి లాంటి అరుపులు వినిపించి అతనిని భయ సందేహాలకు గురి చేస్తాయి )
( ప్రవేశం_ భటులు, విప్ర వేషంలో ఉన్న బుధునితో పాటు )
భటులు ----- జయము జయము మహామంత్రీ ! మీ ఆజ్ఞ ప్రకారము థౌమ్యలవారిని తొడ్కొని వచ్చాము
సుమంత్ర ---- ( బుధున్ని చూసి ఆశ్చర్యపోతాడు ) ఆర్యా ! మీరెవరు ? ( భటులతో) రేయ్ ! మందబుద్ధులారా !! సరయూతీరము నుండి , రాజ పురోహితులు థౌమ్యుల వారిని తెమ్మంటే యీ బడుగు బాపడిని వెంట పెట్టుకు వచ్చారెందుకు ? ( బుధునితో ) అయ్యా ! మీరెవరు ?
బుధుడు ----- మహామంత్రీ ! నా పేరు సౌమ్యుడు ! మీ భటులు పాపము ! ---- సరయూ తీరమందు, రాజపురోహితులను గానక, వారిని నెరియల యందును, బొరియల యందును వెదకుచుండుట చూసి, సౌమ్యగుణ సంపన్నుడను గావున, జాలిపడి---- నేనే థౌమ్యుడనని చెప్పి, ఇటుల వచ్చితిని .
సుమంత్ర ----- అటులనా ! విప్రవరేణ్యా !! నమస్కారము .మా భటులకు రాజపురోహితుల ఎరిక లేకపోవుట మా దౌర్భాగ్యము !!! అయినను థౌమ్యుల పేరు చెప్పుకొని తమరు వచ్చుటకు కారణము మాత్రము అగోచరము . ఏనుగు పేరు పెట్టుకొన్నంత మాత్రమున -----
అకంపన ---- ఊఁరకుక్కలు ఏనుగులవుతాయా ? మహామంత్రీ ! ఈయన మమ్మల్ని మోసపుచ్చాడు.
అర్ణవ ---- మీ సెలవయినచో పెడరెక్కలు విరిచి కట్టి-----
సుమంత్ర ---- వలదు భటులారా ! అథుల చేయదగదు. అయోధ్యలో విప్రుల కవమానము రాజావమానమే యగును.
బుధుడు ---- అదిగదా, అజకుమారుని సౌజన్యము !! అట్టి రాజుకి మంత్రి అయిన మిమ్ములను అది లేశమైన అంటక పోవుట , నిర్మల జల మధ్యమందున్నను, గాత్ర సౌలభ్యమబ్బని మండూకము వలె ,నిష్ప్రయోజనము !
సుమంత్ర ----- ఏమి ! నేను కప్పవలె బెకబెకలాడు చుంటినా ? విప్రుడా ! నీవు హద్దు మీరి మాట్లాడుతున్నావు.
బుధుడు ----- సుమంత్రా ! ఈ సౌమ్యుడెవరో తెలియక నీవే హద్దు మీరుతున్నావు.
( ప్రవేశం_ దశరథుడు )
దశరథ ---- అమాత్యా ! థౌమ్య మహాశయులు విచ్చేసినారా ? ( అని బుధున్ని చూసి ఆశ్చర్యపోతాడు )
బుధుడు --- అజకుమారా! నీకు జయమగు గాక !! నేను సౌమ్యుడను , అత్రి మహాముని పౌత్రుడను. సర్వ శాస్త్ర పారంగతుడను, శుక్రాచార్యుని కడ వేద వేదాంగములే కాక తంత్రము కూడ నేర్చిన వాడను.నీవు పిలువ నంపిన థౌమ్యునకు బదులు, నీ ఇంగిత మెరిగి వచ్చిన వాడను.
సుమంత్ర --- మహారాజా ! ఈతడు తన పేరే థౌమ్యుడని చెప్పి మన భటులని మోసపుచ్చి వచ్చినాడు.
దశరథ ---- థౌమ్య సౌమ్య నామములు సామ్యము చేత మన భటులే పొరబడి ఉండవచ్చు గదా ! అమాత్యా ! భూసురులకు అసత్య దోషము నాపాదింపకుడు. మన ఇంగిత మెరిగి వచ్చిన వారిని మనము గౌరవింప వలె !
సుమంత్ర --- అవశ్యము మహాప్రభూ ! కాని ఈతడు మన ఇంగితమెరిగి గాక, తన ఇంగితము సాధించు కొనుటకు వచ్చినట్లున్నది. రాక్షస గురువైన శుక్రాచార్యుల శిష్యుడైన ఈతడు భూసురుడు కాక, అసురుడై యుండ నోపునని తోచుచున్నది.
భటులు ---- అయ్యబాబోయ్ ! రాక్షసుడా ?
బుధుడు ----- సుమంత్రా ! ఏమి నీ వాచాలత్వము ? నన్ను భూసురుడు కాదనిన అనెదవుగాక ,అసురుడనుట మాత్రము క్షంతవ్యము కాదు.
సుమంత్ర ----- ఎందులకు కాదు ? విప్రుడవే అయిన వేద వేదాంగ పఠనముతో తృప్తి నందక, తంత్రము నేర్చుటేల ?
బుధుడు ---- తంత్రము నీ రాజకీయ కుతంత్రముల కన్న తుచ్ఛమైమది కాదురా తెంపరీ !
దశరథ ---- ( అడ్డు పడి ) మహాత్మా శాంతించండి. సత్వగుణ సంపన్నులయిన మిమ్ములను రెచ్చ గొట్టుట మా అమాత్యులదే పొరపాటు. మీ రాక మాకు పరమానందకరము, శుభప్రదము అయినది. మా వలన అయిన అపరాధము మన్నించి శాంతింపుడు. ( మంత్రితో ) సుమంత్రా ! అయోధ్యలో బ్రాహ్మణులకు రాజదర్శనము ఎట్టి సమయము నందైనను నిషేధము కాదన్న శాసనము మీకు తెలియనిది కాదు. ,రాజాజ్ఞను ఉల్లంఘించినందులకు మీకు పది పణములు దండన విధించితిని. ముందీ బ్రాహ్మణునకు క్షమాభిక్ష వేడి, సుంకము కోశాధికారికి చెల్లింపుడు. ( భటులతో ) భటులారా ! చెప్పిన పనిని చెరుపు చేసినందుకు, మీ కిరువురకు చెరి రెండు పణములు శిక్ష విధించితిని. మీరు, మీ వాచాలత వలన ఈ భూసురునికి జరిగిన అవమానమునకు క్షమాభిక్ష కోరుకొనుడు.
భటులు --- సౌమ్య విప్రవరేణ్యా ! క్షమింపుడు.
సుమంత్ర ---- (ముందు రాజుకి నమస్కరించి ) ప్రభూ ! మీ ఆజ్ఞా ధిక్కారము మాకు ఆత్మహత్యా సదృశము ! జీవితము మీ సేవకే అంకితము చేసిన యీ సేవకుడు సౌమ్యునకు నమస్కరించు చున్నాడు. ( నమస్కరించి ) విప్రోత్తమా తొందరపాటుతో నేను చేసిన తప్పిదమును మన్నింపుడు.
బుధుడు ---- ( భటులతో ) భటులారా, లెండు ! ( మంత్రితో ) మహామంత్రీ ! మీది తొందరపాటు కాదు, కర్తవ్య నిర్వహణ యందు తప్పనసరియగు రాజకీయ మంత్రాంగము ! కనుక మీ తప్పేమియు లేదు ( దశరథునితో ) అజకుమారా ! నీ సౌజన్య సచ్ఛరిత్రములు మా కెంతయు సంతసము కలిగించినవి.. అవి అజరామరమగును గాక ! ( దీవిస్తాడు )
దశరథ ---- మహాత్మా ! మీ ఆశీర్వాదములు మా కెంతయో శ్రేయోదాయకములు. థౌమ్యులయినను సౌమ్యులయినను ఈ ప్రాతః కాలమున మేము పిలిపంచినది----
బుధుడు ---- మీకు కనిపించిన అరిష్ట చిహ్నములకు కారణ మరయుటకే కదా , అవునా ?
దశరథ ---- అవును.
బుధుడు ---- రాజా ! నీ కాప్త మిత్రులు , హితులు , సన్నిహితులు, ప్రజలు , భృత్యులు వేయేల అయోధ్య యందే గాక నీ రాజ్యము మొత్తము, మృత్యుదేవతకు కబళము కానున్నారు., అదియే యీ అమంగళ దృశ్యముల అంతరార్థము.
( అందరూ ఆ వార్త విని నివ్వెర పోతారు. దశరథుడు చెవులు మూసుకొంటారు )

Comments
Post a Comment