నీల గ్రహ నిదానము 10 రోహిణి ---దశరథా ! వికృతాకారుడు, భయంకరుడు అయిన గుళికుని నీవు మాటలతోనే మరల్చినావు. ఇది నీ విజయమునకు తొలి మెట్టు.! దశరథ ----- తల్లీ ! ఆకారములు, చేష్టలు వికృతములయినంత మాత్రమున , మనో వ్యాపారములు వికృతములనుట పొరపాటు ! గుళికు డెంతటి భయంకరుడైనను న్యాయమును అభిలషించు వాడని, వెల్లడి అయినది కదా ! ఎందరో సుందరాకారులు కపట మానసు లగుట నేను ఎరుగుదును. రోహిణి ----రాజా ! నీ మాటలలో శ్లేష ధ్వనించు చున్నది. నేను నా సవతులతో ప్రవర్తించిన విధము వికృతము, భయంకరము అందువా ? దశరథ --- తల్లీ ! నా మాటల వెనుక నీ కట్టి యర్థము స్ఫరించిన యెడల నన్ను క్షమించుము. తల్లి తండ్రుల వర్తనమును విమర్శించు అధికారము తనయునకు లేదు ! ( దశరథుని మాటలు పూర్తవగానే, తెరపై నీలి రంగు వెలుగు పడుతుంది, స్టేజంతా నీలం అయిపోతుంది ) రోహిణి ---- దశరథా ! ఇదుగో శని తేజము ! శని వచ్చుచున్నాడు. సంసిద్ధుడవు కమ్ము ! దశరథ ---- ( చూసి ) అవును, శని దేవుడు ప్రవేశింప నున్నాడు. తల్లీ ! సామమున