నీల గ్రహ నిదానము 7
(ద్వితీయాంకము)
( ద్వితీయ దృశ్యము )
( అయోధ్య లోని నాలుగు రోడ్ల కూడలి )
( బుధుడు ఒక ఆసనంపై కూర్చొని ఉంటాడు. అకంపనుడు ,అర్ణవ ష్ఠీవి --- శిష్యులుగా మారి అతనికి చెరొక ప్రక్క నిలబడి ఉంటారు.)
___పాట__
శిష్యులు --- సౌమ్య గురుని శరణు పొందండి, జనులార !
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి
అకంప -- అత్రి మునికి మనుమడండీ !
అసుర గురుని శిష్యుడండీ !
అర్ణవ -- తపస్సాధన చేసి , దండి
సత్యమును కనిపెట్టినాడండీ !|
శిష్యులు ---------- సౌమ్య గురుని శరణు పొందండి, జనులార !
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి
బుధుడు -------- హర హరిః ఓం, హర హరిః ఓం,
హర హరిః ఓం, హర హరిః ఓం
అయోధ్యాపురి వాసులారా !
అన్నాలారా, అక్కలారా !
పూజ్య మాతా పితరులారా !
నే చెప్పబోయే నిజము వినరండి

బుధుడు ------- ప్రజా రక్షకు పరమేష్ఠి ఘటితము
రోహిణీ నక్షత్ర శకటము
శనైస్వరుని కది ప్రథమ కబళము
కానున్న అరిష్ట తరుణము
సమీపించెను కరువు కాటకము
పన్నెండేళ్ల ప్రళయ తాండవము !
శిష్యలు --------- హర హరిః ఓం, హర హరిః ఓం,
హర హరిః ఓం, హర హరిః ఓం,
బుధుడు ---------- వాపీ కూప తటాకాదులు,
నదీ నద పాతాళ జలములు
వర్షించని రాతి మేఘాలు !
త్రాగు నీటిని చేయు గగ్గోలు !
శిష్యులు ------ పాహి పాహి , త్రాహి త్రాహి
పరమ గురుడా తెలుపు దారి !
బుధుడు ----- దారి తెన్ను కానలేరు
ఇసుక మేటల మధ్య మీరు
కోట నేలే ధర్మ ప్రభువులు
నిక్కముగ మీ వారు కారు !
అయోధ్యలో ఇక బ్రతుక లేరు
రాతి గోడలే బీట వారు !
శిష్యులు ------ సౌమ్య గురుని శరణు పొందండి, జనులార !
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి.
బుధుడు ---- సాటిలేని మేటి మగడు !
తొల్లి తాపసి గౌతముండు
శని పీడ బాపిన ఉత్తముండు
శివుని కొప్పున, బొరలు మెండు
దివిజ గంగను , తెచ్చె రండు !
శిష్యులు ------ సౌమ్య గురుని వెంట నడువండి
గోదారి జలములె మనకు దిక్కండి.
బుధుడు -------- హర హరిః ఓం, హర హరిః ఓం,
హర హరిః ఓం, హర హరిః ఓం,
( బుధుడు , మరోచోట పాట పాడడానికి లేస్తాడు. శిష్యులు వెను వెంట నడుస్తారు )
( సుమంత్రుడు పరుగు పరుగున వస్తాడు )
సుమంత్ర ---- వలదు వలదు వలదండీ !
అయోధ్య విడిచి పారి పోకండి
కలడు కలడు కలడు కలడండి
గౌతమునకు సరి జోడు నేడండి
భాగ్య వశమున మనకు నృపుడండి !
అరయుచున్నాడిదె దారి విడువండి.
( పాట ఆగిపోతుంది )\
( ప్రవేశం దశరథుడు )
దశరథ ---- (వస్తూనే సౌమ్యునికి నమస్కరించి ) సౌమ్య గురువరేణ్యా ! చంద్ర పత్నియైన రోహిణీ మాత మీ మాట నిజమని ధృవ పరిచినది. నా కర్తవ్యము నాకు తెలియ జేసినది .
బుధుడు ---- దశరథ రాజేంద్రా ! నా మాట నిజమని తెలుసుకొని నీ ప్రజల ముందు దానిని ఒప్పుకొనుట నా కెంతయో సంతోషము కల్గించినది ! నీ ప్రజలు అయోధ్య విడిచి వెళ్లుటకు కాతర నయనాలతో నీ వంక చూచు చున్నారు ! వారి నెట్లు సమాధాన పరచెదవో నీ ఇష్టము !
దశరథ --- గురువర్యా ! ముందుగా మీరు మీ శిష్యులతో పాటు మా అతిథులై రాజప్రాసాదమునకు విచ్చేయుడు. ఈ దశరథుని కంఠమున ప్రాణ మున్నంత వరకు, ఎవరును అయోధ్య విడిచి పోనవసరము లేదు.
బుధుడు ---- అటులనా దశరథా ! మంచిది ! మాకు అభ్యంతరము లేదు, అయినను కరువు కాటకముల నుండి మమ్ముల నెట్లు రక్షింతువో, వినుటకు కుతూహలముగా నున్నది.
దశరథ ---- మహాత్మా ! శనిపీడ వలన నేర్పడబోవు క్షామమును నివారించుటకు, పూజ్య గౌతముడే నాకు ఆదర్శము.
బుధుడు ------ ఏమంటివి దశరథా ! గౌతమునితో నీకు సామ్యమా !! అతధు భూసురుడు, బ్రహ్మర్షి ,తన తపశ్శక్తితో శివుని మెప్పించి , గోదావరి నదిని తెప్పించిన వాడాయెను !
దశరథ ----- విప్రోత్తమా ! శనిదేవుడు రోహిణిని భేదించుటకు ఇంకను కొన్ని దినముల వ్యవధి ఉన్నది కదా ?
బుధుడు ------ అవును అయిన నేమయినది ?
దశరథ ---- నేను నా కున్న క్షాత్ర శక్తితో శని మార్గమును నిరోధించి, సామ దాన భేద దండోపాయములతో అతనిని వశ పరచుకొని, ఈ దుర్భిక్ష నివారణ కొరకు సంకల్పించితిని. అందులకు మీ అందరి ఆశీస్సులు నాకు కావలె !
బుధుడు ------ (సంతోషంతో ) భళి ! అజ కుమారా ! భళి ! ఇప్పటికి కదా రాజోచితమైన మాట పలికినావు !! --- నీవు శనైశ్వరుని ఎదిర్చి నిలుచుటకే నిశ్చయించితివా ?!
దశరథ ----- అవును మహానుభావా ! నా బుద్ధికి అంత కన్న మార్గాంతరము తోచకున్నది.
బుధుడు ------ రాజేంద్రా ! నీ కిదే నా ఆశీస్సులు ! ( అని ప్రజల నుద్దేశించి) _ పాట
ఏమి సాహస మేమి సాహసము !!
అజకుమారా నీ దేమి సాహసము !!
ఏడేడు లోకములందు నుత్తమము !!
కాన జాలము దీని సరి సమము !!
శిష్యులు ---- ఏమి సాహస మేమి సాహసము !!
ఏడేడు లోకములందు నుత్తమము !!
బుధుడు ----- అజకుమారా ! శనిదేవుని నెదిర్చి నిల్చుటకు సంళ్పించిన నీ ధైర్య సాహసములే రక్షా కవచములై నిన్ను కాపాడ గలవు ! మేరునగ సమానమగు నీ ప్రజాహిత బుద్ధి స్వార్థ త్యాగ నిరతి, నీ శరీరమును వజ్ర కాయముగా మార్చును గాక ! --- నేను మా మంత్ర శక్తితో మృగాంకుని , హరిణ రథమును తెప్పించి, నిన్ను రోహిణి కడకు పంపగల వాడను. నీవు శస్త్రములను ధరించి సంసిద్ధుడవు కమ్ము !
దశరథ ------ ధన్యోస్మి ! సౌమ్య గురుదేవా ! ధన్యోస్మి !!
బుధుడు --- ( ఉత్సాహంతో ) అజ కుమారా ! నీకు జయమగు గాక !
( సుమంత్రునితో పాటు ప్రజా వాణి ఒక్కుమ్మడిగా “ అజ కుమారా నీకు జయమగు గాక ” అని ఘోషిస్తారు )
( ద్వితీయ దృశ్యము సమాప్తము )

Comments
Post a Comment