శిథిలాలయ దేవత 1
( రేడియో నాటిక )
(స్థలం ఓకశిథిలాలయ ప్రాంగణం )
( చీకటి రాత్రి. భయంకరమైన నేపథ్య సంగీతం మధ్య ఈ క్రింది వ్యాఖ్య వినిపిస్తుంది )
వ్యాఖ్య --- ముప్ఫయి మంది ప్రయాణీకులతో బొంబాయి నుండి కొచ్చిన్ బయలు దేరిన స్టీమర్ , ‘జలపుష్ప’ ‘జాఫ్నా’ ద్వీపానికి కొంత దూరంలో , సుడిగుండంలో పడి మునిగి పోయింది. ఆ ప్రయాణీకులలో చావు తప్పి, తీర ప్రాంతానికి చేరుకొన్న వాళ్లే వీరిద్దరూ ! ఒకరు ‘రచయిత’, రెండవవాడు ‘ చరిత్రకారుడు’.
రచయిత – అదుగో చూడండి ! అదేదో ఆలయంలాగ ఉంది. ఈ రాత్రికి మన్ కష్టం గట్టెక్కినట్లే !
చరిత్రకారుడు – నిజమే కవిగారూ ! అఙ్ఞాత ప్రదేశం లోని ఈ శిథిలాలయం , చావు తప్పి చేరుకొన్న మనకి ఫైవ్ స్టార్ హోటల్తో సమానం. రండి, లోపలికి వెళ్దాం.
( ఇద్దరూ ఆలయం లోకి వెళ్లబోతారు. తెరలో నుండి “ ఆగండి” అన్న గర్జన వినిపిస్తుంది ! ఇద్దరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా ఒక ‘రాజు’ ప్రవేసిస్తాడు )
రాజు – ఆగండి ! గర్భ గుడిలోకి దేవత దగ్గరకి వెళ్లి ఆపద కొని తెచ్చుకోవద్దు.
రచయిత + చరిత్రకారుడు --- మీరెవరు స్వామీ?
రాజు --- నేను జాఫ్నా దీవిలోని ‘ నీలాపురి’ ఏలికని !
చరిత్రకారుడు --- మీ తలపాగా తీరు చోళరాజుల కాలం నాటిదిలా ఉంది ! మీరు చోళులా !?
రాజు --- ‘భళీ’ ! బాగా చెప్పావు !
రచయిత --- ( చరిత్రకారుని గట్టిగా పట్టుకొని ) చోళ రాజు ఇంత కాలం వరకు బ్రతికి ఉండడం అసాధ్యం ! ఇది అతని ప్రేతాత్మ కాదు గద !!
చరిత్రకారుడు --- ( ఆ విషయం అప్పుడే గుర్తించి ) కవిగారూ ! మీరన్నది నిజమే! ఛోళులు—క్రీ—శకం---
రాజు --- ( పగలబడి నవ్వుతూ) భయపడకండి. నేను ప్రేతాన్నే అయినా, మీకు హాని తలపెట్టాలని రాలేదు. పైపెచ్చు మిమ్మల్ని ప్రమాదం నుండి తప్పించడానికి వచ్చాను.
చరిత్రకారుడు – మీ పేరేమిటి మహారాజా ?
రాజు ---- ( ఆలోచించి ) ఉహు ! పేరు ఙ్ఞాపకం రావడం లేదు !
చరిత్రకారుడు --- అదేమిటీ , మీ పేరు మీకే తెలియదా?
రాజు --- రాజులు తమ పేరుని తాముగా చెప్పుకోరయ్యా, అందుకని---
రచయిత --- ( వ్యంగ్యంగా ) నిజమే మరి ! రాజుల పేర్లు, వంశావళులు వంది మాగధులకే తెలుస్తాయి. అంతే కాదు, సూర్యోదయం, సూర్యాస్తమయాలు కూడా వాళ్లకి తెలియవు, వైతాళికులు చెప్పేదాకా !
రాజు --- భళి ! నీవు కాస్త కుశాగ్రబుధ్ధిలా కనిపిస్తున్నావు ! నా పేరు ఙ్ఞాపకం రావాలంటే—
రచయిత --- మేమిద్దరం వంది మాగధుల్లాగ మారాలంటారు, అంతే కదా ?
చరిత్రకారుడు – అంటే ఏం చేయాలి ? నాకు అర్థం కాలేదు—
రాజు—వీడెవడు ? వంది మాగధులంటే తెలియదంటాడు !!-
రచయిత – అతడు చరిత్రకారుడు లెండి ! అండుచేత యీ విషయాలు తెలియవు, ఇది అతని ‘సబ్జెక్టు ’ కాదు గదా !
రాజు --- ‘సబ్జెక్టా ’, అది ఎలాంటి అట్టు ?
రచయిత --- పెసరట్టులాంటిది కాదు లెండి ( చరిత్రకారునితో ) నేను మొదలు పెడతాను, మీరు నా వెనకనే గొంతు కలపండి.
చరిత్రకారుడు--- సరే ! మొదలు పెట్టండి.
ఇద్దరూ ---రాజాధిరాజా ! రాజ మార్తాండా ! అరివీర కంఠీరవా ! ఆర్తజన శశాంకా ! ఆపద్భాంధవా ! చోళావంశ కులాంభోధి చంద్రా ! నీలా పురీ రాజ్య రమా రమణా !!---
రాజు ----( పేరు ఙ్ఞాపకానికి వచ్చి ) సిరికాల నామధేయా ! పరాక, బహు పరాక్ !
చరిత్రకారుడు--- ధన్యోస్మి మహారాజా ! ఇప్పటికి మీ పూర్వాశ్రమ నామధేయం శవణానందం కలిగించింది.‘ సిరికాల చోళుడు’ , క్రీస్తు శకం ---- అన్నట్లు మహారాజా, మీరు మీ శత్రువుల చేత , యుధ్ధంలో రాజ్యం పోగొట్టుకోని, కీర్తి శేషులయినట్లు చరిత్ర చెప్తోంది ! నిజమేనా ?
రాజు --- కాదు, జరిగిన యుధ్ధంలో ఓడిపోయిన నేను , చిన్న నౌకలో జాఫ్నాని విడిచి పెట్టి మిత్రుడైన ‘తంజావూరు రాజుని ’ శరణు పొందాలనుకొన్నాను. కాని, నా ఓడ సుడిగుండంలో చిక్కుకొని ఈ దీవిని, తరువాత ఈ ఆలయాన్ని చేరుకొన్నాను.
చరిత్రకారుడు --- ఇది చరిత్ర కందని సంగతి ! తరువాత ఏమయింది మహారాజా ?
రాజు --- ఆ రోజుల్లో ఈ ఆలయం దేదీప్యమానంగా ఉండేది. దేవికి ప్రతీ రోజూ రాగభోగాలు జరుగుతూ ఉండేవి. ఆశ్రయం లఏని నేను ‘సన్యాసిగా ’ మారి, ఈ దేవినే ఆశ్రయించాను. క్రమంగా దేవి భక్తులు నా శిష్యులయ్యారు.మారు వేషంలో ఉంతున్న నేను – నా పట్ల—అంటే, ‘ సిరికాలుని’ పట్ల ప్రజల భక్తి విశ్వాసాలు గమనింఛాను.
రచయిత --- ఆ భక్తి విశ్వాసాలను ఉపయోగించుకోవాలని అనుకొన్నారు, అంతేనా ?
రాజు --- అవును,కొంత సైన్యాన్ని కూడ గట్టుకొని తిరిగి దందయాత్ర చేస్తే నాకు వశమవుతుందన్న నమ్మకం కలిగింది. కాని నా దగ్గర ధనం కొరతయింది. ధన సేకరణ పెద్ద సమస్యగా మారి దిక్కు తోచని నేను, ఒకనాడు---
చరిత్రకారుడు --- ఏం చేసారు మహారాజా ?
రాజు – ఈ దేవత మణిరత్న ఖచిత కిరీటాన్ని, నగలనూ దొంగలించి. చిన్న ఓడలో ‘ నీలానగరికి’ బయలు దేరాను.
చరిత్రకారుడు ---‘ మై గాడ్ !’ ఈ రోజు ఎన్ని చారిత్రిక సత్యాలని తెలుసుకొంటున్నాను !! తరువాత---
రాజు --- హు ! జరగ కూడనిదే జరిగింది ! నగలు దొంగలించినందుకు ఈ దేవత నాపై కోపించింది. ఫలితంగా ఏ సుడిగుండం నుంచి బయట పడ్డానో, అదే సుడిగుండం నన్ను పొట్ట బెట్టుకొంది.
చరిత్రకారుడు --- ‘బాప్ రే !’ ఈ దేవత అంత శక్తివంతురాలా ?
రాజు --- అవును,అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను.
రచయిత --- క్షమించండి మహారాజా ! మీరు తిరిగి సుడిగుండంలో పడి పోవడం, కాకతాళీయం ఎందుకు కాకూడదు ?
రాజు --- కాదు, నిశ్చయంగా దేవత కోపానికి బలి అయ్యాను నేను ! అంతే కాదు, మీలాగే సందేహించిన ఒక ‘ బౌధ్ధ భిక్షువు’ కూడా ఆమె కోపానికి గురయ్యాడు ! అయినా ---( బిగ్గరగా నవ్వుతూ ) ఎవరి కర్మకి ఎవరు కర్తలు ! మీ నొసట దిక్కు లేని చావు రాసిపెట్టి ఉంటే ఎవరు తప్పించ గలరు ? – ఇప్పుడు నా చేతుల్లో చావడం కేవలం కాకతాళీయం ఎందుకు కాకూడదు ?
(రాజు వారిద్దరి చొక్కా కాలర్లు పట్టుకొని గుంజుతాడు )
ఇద్దరూ --- పొరపాటయింది మహాప్రభూ ! మమ్మల్ని క్షమించి విడిచి పెట్టండి.
రాజు --- ( వికటంగా నవ్వుతూ ) పిరికి పందల్లారా ! యీ మాత్రం దానికి దేవత శక్తి యుక్తుల్ని తర్కించ పూనుకొన్నారా? ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగిరిందట !! ( అంటు గుంజుతాడు )
చరిత్రకారుడు --- ఇప్పుడేం చేద్దాం ?
రచయిత --- స్తోత్రం మొదలు పెడదాం.
చరిత్రకారుడు – రాజాధిరాజా ! రాజ మార్తాండా !---
రచయిత --- అది కాదండీ ! – శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం---
చరిత్రకారుడు --- భజే ! వాయుపుత్రం , భజే ! వాల గాత్రం ! భజేహం, --భజేహం పవిత్రం---
రాజు --- ( పట్టు విడిచి పెట్టి ) ఏయ్, ఏమిటిది ?
రచయిత – భజే సూర్యమిత్రం—
చరిత్రకారుడు --- భజే రుద్ర రూపం—
రాజు – ఏయ ఆపుతారా, లేదా ?
చరిత్రకారుడు – భూత ప్రేతంబులన్, బెన్ పిశాచంబులన్---
రచయిత --- ఛీ ! ధూర్త మానవులారా ! మీతో తలబడుట మాదియే పొరపాటు-. నిష్క్రమించెదము గాక !—( వెళ్లి పోతాడు )
చరిత్రకారుడు --- అమ్మయ్య ! మరో గాలివాన వెలిసింది. అయినా మీరు కుతర్కం చేయకుండా ఉంటే, -- ఆ బౌధ్ధ భిక్షువు చరిత్ర ఏదో తెలిసి ఉండేది కదా ! ఇప్పుడా ఛాన్సు పోయింది.
( ఇంతలో నేపథ్యం నుండి -- ‘ బుధ్ధం శరణం గచ్చామి, --ధర్మం శరణం గచ్చామి, -- సంఘం శరణం గచ్చామి ’, అనే త్రిశరణాలు వినబడతాయి . వాటిని వల్లిస్తూ ఒక బౌధ్ధ బిక్షువు ప్రవేశిస్తాడు )
చరిత్రకారుడు --- అదుగో, బిక్షు రానే వచ్చాడు.
రచయిత – వెల్ కం ! భిక్షుక శ్రేష్టా ! వెల్ కం !
బిక్షు --- వత్సలారా ! మీ రెవ్వరు ఈ శిథిలాలయానికి ఎలా వచ్చి చేరారు ?
రచయిత – సుడిగుండం వల్ల మునిగి పోయిన పడవ నుండి, ప్రాణాలతో సముద్రం చేత నెట్టబడి, ఈ ద్వీపానికి చేరుకొన్నాం. మీరు కూడ అలాగే వచ్చారా సార్ ?
బిక్షు --- నిజమే బిడ్డా ! నా పేరు ఆనందుడు ! బుధ్ధుని అమృత వాణి ప్రచారానికై, శిష్యులతో కలిసి, పెద్ద పడవలో గోవా నుండి, జాఫ్నాకి బయలు దేరిన నేను, సుడిగుండంలో చిక్కుబడి, ఒంటరి వాడినై, యీ ద్వీపానికి చేరుకొన్నాను. ఇక్కడ శిథిలాలయం చూసిన నాకు ---
చరిత్రకారుడు --- చిన్న సందేహం స్వామీ ! మీరు వచ్చినప్పటికే ఈ ఆలయం శిథిలమయిందా ?
బిక్షు --- అవును బిడ్డా ! అప్పటికిది రాగ భోగాలు లేని వివిక్త ప్రదేశం లోని ఏకాంత మందిరం. ఇప్పుడున్నంతగా శిథిలం కానప్పటీకీ, శిథిలమయిందనే చెప్పాలి.
చరిత్రకారుడు --- తరువాత ఏమయింది స్వామీ ?
బిక్షు --- సుందరమూ, ఏకాంతమూ అయిన ప్రదేశం లోని ఈ ఆలయం, నా మనస్సుని ఎంతో ఆకట్టుకొంది. నేనేమో మత ప్రచారకుడిని ! ఈ ఆలయమే బౌధ్ధ విహారమై ఉంటే ఎంత బాగుండేదన్న ఆలోచన నా మనసులో దూరింది.
రచయిత --- ఆలయ స్వరూపాన్ని మార్చదలచుకొన్నారంటే--- మీరు శిల్పి కూడా అయి ఉంటారు, అవునా ?
బిక్షు --- నిజమే ! దేవతా ప్రతిమకి, నాలుగు చేతులు ఉండేవి ! నేను రెండింటిని విరగగొట్టి, తక్కిన వాటిని, బుధ్ధ భగవానుని, అభయ హస్త ముద్రలోకి మార్చి వేసాను. విగ్రహాన్నయితే కొన్ని రోజులలో మార్చ గలిగాను గాని, ఆలయాన్ని --- విహారంగా మార్చే పని, నా ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదు ! అందుకని--- ఒక చిన్న పడవని చేసుకొని, సహాయం కోసం తిరిగి గోవా బయలు దేరాను, కాని ----
రచయిత --- అప్పుడేం జరిగింది స్వామీ ?
బిక్షు --- నౌకతో సహా తిరిగి జలగుండంలో పడి, జలసమాధి కావలసి వచ్చింది.
రచయిత --- స్వామీ, మీరు ‘తథాగతుని’ శరణా పన్నులు కదా ! మీ అకాల మరణం దేవత ఆగ్రహం వల్లనే అని నమ్ముతున్నారా ?
చరిత్రకారుడు --- కవిగారూ ! అదిగో మళ్లీ కుతర్కం—
బిక్షు – కుతర్కం కాదు బిడ్డా ! హేతువాదం ! మీ అణు యుగం లోని బుధ్ధిజీవులకు, హేతువాదం అణువణువునా ఒంట పట్టింది కదా !
చరిత్రకారుడు --- బాగా సెలవిచ్చారు స్వామీ ! అందులోనూ మా ఆంధ్రదేశం లోని రచయితలకి బాగా నెత్తికెక్కింది.
రచయిత --- మా హేతువాదం వల్ల సమాజానికి మరమ్మత్తే గాని – హజామత్తు జరగడం లేదు లేవయ్యా ! అయినా పానకంలో పుడకలాగ---
చరిత్రకారుడు--- నేనెందుకు అడ్డుపడాలి, కానివ్వండి.
బిక్షు --- నేనీ దేవతలో బుధ్ధున్నే దర్శించాను బిడ్డా ! నాకు కలిగిన ప్రమాదం భగవానిని శరణం లభింపక పోవడం వల్లనే అని గాని, దేవత వల్ల అని నేనెలా చెప్పగలను ?
రచయిత --- మీ ప్రయత్నంలో ఏదో లోపం జరిగిందని నమ్ముతున్నారా ?
బిక్షు -- తప్పక జరిగింది బిడ్డా ! తప్పక జరిగింది. అది తెలుసుకొన్న నాడే నాకీ ప్రేత రూపం నుండి ముక్తి లభిస్తుంది ! – మీరు మాత్రం సాహసంతో యీ మందిరంలోకి చొరబడి, ‘ బుడత కీచు దొర’ వలె ఆపద పాలు కావద్దు ! ( బిక్షు వెళ్లి పోతాడు )
చరిత్రకారుడు ---- అయితే మనం మరొక దెయ్యాన్ని, కలుసుకోబోతున్నాం. ఈ సారి ‘బుడత కీచు దొరవస్తాడేమో !!
( నేపథ్యం లోంచి ,“ స్కౌట్ ! ఎటెన్షన్ !” అన్న మాటలు, ఆ వెనుకనే బూట్ల చప్పుడు, వినిపిస్తాయి )
( బుడతకీచు దొర ప్రవేశిస్తాడు “ లెఫ్ట్ ! రైట్ ! లెఫ్ట్ ! రైట్ ! ”అన్న కమాండ్ తో పాటు )
బుడత కీచు దొర --- ( ఇద్దరినీ ఉద్దేశించి ) ఎటెన్షన్ !
( రచయిత, చరిత్ర కారుడు చూస్తూ నిల్చొని ఉంటారు )
దొర --- చెప్తోంది మీక్ కే ! ఎటెన్షన్ !
( ఇద్దరూ అటెన్షన్లో నిలబడతారు )
దోర --- గుడ్ ! స్టేండ్ ఇట్ ఈజ్ !
( ఇద్దరూ స్టేండ్ ఇట్ ఈజ్ లో నిలబడతారు )
దొర --- హౌడిడ్ యూ కమ హియర్ ? మీరు ఇక్కడ్ కీ ఎల్లా వచ్చార్ ?
చరిత్రకారుడు --- ఈ ద్వీపం విషయంలో చరిత్ర మాటిమాటికీ రిపీట్ అయింది సార్ ! మేము కూడ సుడిగుండంలో పడి, బయట పడి, వచ్చాము. మీరు కూడ అలానే వచ్చారా సార్ !
దొర --- యస్ ! నేను గోవాలోని పోర్చ్ గీస్ కేంప్ కమాండర్ని ! నెహ్రూ ఆర్డర్ మీద, మీ ఇండియన్ మిలిటెరీ మా గోవా పైన వార్ డిక్లేర్ చేసింది కదా !
చరిత్రకారుడు --- అవును ‘జనరల్ చౌదరి ’ నాయకత్వంలో , ఒకే ఒక్క రోజు యుధ్ధంలో పోర్చ్ గీసు సైన్యం గోవా వదిలి పారిపోయింది.
దొర – (హర్ట్ అయి ) మా హైకమాండ్ ఆర్డర్ మీద, మేము గోవా విడిచి పెట్టాం ! బట్ ! యుధ్ధం చెయ్యలేక కాదు !
రచయిత --- తరువాత సుడిలో పడి ఈ ఆలయాన్ని చేరి ఉంటారు, అవునా సార్ ?
దొర --- ఎగ్జాట్లీ ! యస్ ! నేను టూ కంపేనియన్స్ తో ఇక్కడికి వచ్చాను. ఈ టెంపుల్ చూసి ఐ వాజ్ ఎస్టానిష్డ్ ! బికాజ్ టెంపుల్ హిందూ స్టైల్ లో ఉంది ! బట్, ఇమేజ్ ఈజ్ బుధ్ధా !! వెంటనే నాకు ఒక అయిడియా వచ్చింది.
రచయిత --- దొరగారూ ! ఏమిటి సార్ ! అంత బ్రిలియంట్ ఐయిడియా ?
దొర --- యస్ ! ఇట్ వాజ్ ఎ బ్రిలియంట్ అయిడియా ! ఇమేజ్ ని తవ్వి మా దేశం తీసుకు పోతే ఐ కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ !! అందుకని---
చరిత్రకారుడు --- అందుకొని ఏం చేసార్ సార్ ! మీ ముగ్గురూ కలిసి, విగ్రహాన్ని తవ్వి పారేసారా ?
దొర --- యస్ ! ఎగ్జాట్లీ ! అదే చేసాం ! బట్ , దట్ వాజ్ ఎ మిస్టేక్ !! అదే నా పొరపాటు --టెంపుల్ టవర్ మా మీదకి పడి, వుయ ఆర్ బరీడ్ బై స్టోన్స్ !! దట్స్ వై మీకు వార్నింగ్ ఇవ్వడానికి వాచ్చాఆన్ ! డోంట్ గో ఇన్ సైడ్ !
రచయిత --- ఎక్స్యూజ్మీ సార్ ! ఆలయం గోపురం మీ మీద పడి పోవడం ఏక్సిడెంట్ ఎందుకు కాకూడదు ? బాగా శిథిలమయిన ఆలయ గోపురం మీరు జరిపిన తవ్వకాలకి, చప్పుళ్లకీ కొలాప్స్ అయి పడి పోవడం సహజమే కదా !?
దొర --- కావ్ వచ్చు, కాక పోవచ్చు ! మే బి,! మే నాట్ బి ! అయినా ఇది మీద్ ది ఫ్యూనరల్ ! ఐ కేమ్ జస్ట్ టు వార్న్ యూ ! సో ఐ డిడ్ ! ఇంక వెళ్తాన్ ను.
( దొర వెళ్లబోతాడు, కాని అతని కాలు కదలదు )
దొర --- అర్ రే ! నా కాల్ లు, మై లెగ్ కదల్ టం లేదు.
( రచయిత, చరిత్రకారుడు కాలు కదపడానికి ప్రయత్నిస్తారు , అది కదలదు )
చరిత్రకారుడు – ఐ థింక్ ఐ నో ది రెమిడీ ! దీనికి మందు ఒకటే ఉంది.
రచయిత --- ఏమిటది ?
చరిత్రకారుడు --- చూస్తూ ఉండండి ! – స్కౌట్ ఎటేన్షన్ !!
( అంటూ అటెన్షన్ లోకి వస్తాడు రచయిత అతనిని అనుకరిస్తాడు. దొర కాలు చిత్రంగా కదులుతుంది )
దొర --- అటెన్షన్ ! యస్ ! మై లెగ్ ఈజ్ మూవింగ్ నౌ !! స్టాండ్ ఇట్ ఈజ్ !!
( ముగ్గురూ స్టేండిటీజ్ )
చరిత్రకారుడు --- స్కౌట్ ఎటెన్షన్ ! –మార్చ్ ! లెఫ్ట్ రైట్ , లెఫ్ట్ రైట్ !---మార్చ్ !
దొర --- లెఫ్ట్, రైట్ , లెఫ్ట్ రైట్ ! ( అంటూ వెళ్లిపోతాడు )

baagundi
ReplyDelete