Skip to main content

రత్న గర్భ యీ వసుంధర 2

రత్న గర్భ యీ వసుంధర 2

”పడకా---”
” అవును. అది, ఇంట్లో మంచం మీద ఇలా మర్రి చెట్టు కొమ్మల్లో కాదు.”

అతను తన ఉయ్యాల కేసి చూసాడు..” ఆ ఉయ్యాల్లో నా లేప్ టాప్ బేగు, బట్టలు ఉన్నాయి”---

” మీరేం శ్రమ తీసుకోవద్దు, నేనే దాన్ని తీసి ఇస్తాను.”

” మీరా ! మీరెలా తీస్తారు, నేలకి చాల ఎత్తులో ఉందది.”

”చూస్తూ ఉండండి ఎలా తీస్తానో,” అంటూ నవ్వుల జల్లు కురిపించి, నందినిని ఆ చెట్టు క్రింద నిలబెట్టి, తాను దాని మీద నిలబడి ఆ కొమ్మ నందుకొని ఉయ్యాల ముళ్లు విప్పసాగింది పార్వతి

ఉయ్యాలనీ దాంట్లోని సామాన్లనీ క్రింద పడకుండా పట్టుకొంటూ అడిగాడతను,” మీ పేరేమిటి ?”

”పార్వతి, మరి మీ పేరో”---

” పశుపతి.”

క్రిందకి దిగుతూ అంది పార్వతి.,” పశుపతి గారూ ! మీ సామాన్లన్నీ సరిగా ఉన్నాయా ?””

” ఉన్నాయి, కొన్ని కాగితాలు తప్ప”—

“ దానికి నేనేం చేసేది ! అది మా నందిని పొట్టలో ఉన్నాయి.”

”పోన్లెండి ! కనీసం అక్కడైనా చేరి, అవి పాలిస్తాయి, ఉండి నన్నేం ఉధ్ధరించాలి గనక”—

పార్వతి కళ్లు విప్పార్చి అతని వంక చూసింది.’ ఏమిటితను, ఇల్లు వదిలి పారిపోయి వచ్చిన బాపతు కాదు గద !’ అనుకొంది.’అలాంటప్పుడు ఎక్కడికి వెళ్తాడు ? అయినా నా కెందుకు ?’’ అని సమాధాన పడింది.” పశుపతి గారూ ! మాకు సెలవిస్తారా ?”అని.

”వెళ్లండి,” పశుపతి కంఠం వణికింది, ”కాని ఒక్క మాటకి జవాబిచ్చి వెళ్లండి”’.

” ఏమిటది ?”

ఉయ్యాల లాంటి బ్రతుకు నాది, నాతో అవసరం వచ్చిన వాళ్లు నన్ను ఆకాశానికి ఎక్కిస్తామని ముందుకి తోసారు. వాళ్ల అవసరం తీరింది. కాని ,నేను మళ్లీ వెనక్కి వచ్చాను. అలాంటి ఉయ్యాల రెండు కొసలు ఈ నాడు విప్పేసారు మీరు!.అదేమయి పోవాలో చెప్పి, వెళ్లండి.”

పార్వతి స్తబ్ధురాలై అతని వంక చుసింది. ’పుట్టెడు రోగంతో నన్ను వదిలి పెట్టి వెళ్తున్నారు, నేనేమయి పోవాలి?’ అన్న భావం ధ్వనించింది ఆమెకి అతని మాటలలో ’నిజమే ! కాని తనేం చేయ గలదు,’ ”చూడండి, మీది ఉయ్యాల లాంటి జీవితమైతే చెరువు మధ్యలో చిక్కిన ఖాళీ బిందె లాంటి జీవితం నాది,”

”అంటే?”

”ఈ ఊరు వెలి వేసింది., లేకపోతే యీ అర్థరాత్రి పూట , మంచి నీళ్ల అవసరం ఏమిటి ? అలాంటి నా -- నా మీద -- దార్న పోయే మీరు కూడా నింద వేస్తున్నారు. ’” -- పార్వతికి దుఃఖం తొసుకు వచ్చింది.

తాళ్ల ఉయ్యాల మడిచిఇ సంచీలో తోస్తున్న పశుపతి, ఆమె వంక ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు.” మిమ్మల్ని ఊరు వెలి వేసిందా ?”

” అవును.”

” ఎందుకని ?”

” నా తమ్ముడు , పెదనాన్న, నేను గోమారులం కనక !”

” గోమారులా, అంటే ?”

” చర్మం కోసం, మాంసం కోసం, గోవుల్ని చంపే వాళ్లు !”

పశుపతి నమ్మలేనట్లు పార్వతి వంక చూసాడు. ”పార్వతిగారూ ! ఒక గోవు చేత ఇంతగా ప్రేమించబడే మీరు, గోమారులా ?---నేను నమ్మను !”

పార్వతి జవాబివ్వలేదు. మౌనంగా నందిని వీపు మీద చెయ్యివేసి నడక సాగించింది.

పశుపతి తన సంచీ పట్టుకొని, ఆమె ప్రక్కనే అడుగులు వేస్తూ అడిగాడు. ” పార్వతిగారూ ! మీ జీవితానికి గట్టూ, నా బ్రతుకుకి ఆధారం ఇవ్వ గలిగే ఒక ఆశ్రయం కోసం, మనం కలిసి ఎందుకు వెతక కూడదు ?!”

”వద్దు, నాతో వస్తే, మీకు సరైన వైద్యం జరగదు ! మీరు ఊర్లోకి వెళ్లండి. అక్కడ మీకు మంచి రక్షణ దొరుకుతుంది,” అంది. పశుపతి ఆమె మాటల్ని పట్టించుకోలేదు, ఆమె ప్రక్కనే నడుస్తూ అన్నాడు. ”నేను మీతోనే వస్తాను.”

పార్వతి జవాబివ్వ లేదు.తనని విడవకుండా వస్తున్న అతనిని కాసేపటి వరకు, అలాగే రానిచ్చి, చివరికి ”రండి, మా వీర్రాజు పెదనాన్నని పరిచయం చేస్తాను,” అంటూ ఊరికి కాస్త దూరంగా నున్న ఒక ఇంటిని చూపించింది.

” అతనేం చేస్తూ ఉంటారు.””

“’ అతనికి లౌకిక వ్యాపారాలతో నిమిత్తం లేదు. లోకం ఈ నాడు మమ్మల్ని వెలి వేస్తే, అతను లోకాన్ని ఏనాడొ వెలి వేసాడు.”

“ అంటే?”

” అంటే ఏముంది, అతనో పిచ్చివాడు.”

” మరి మీ తమ్ముడు?”

” గోమారిగా పట్టుబడి, నేరం ఋజువయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.”

” అలాంటప్పుడు , ఇంకా ఈ వెలి---”

“ అది ఈ ఊరి పెద్దలు నాకు వెసిన శిక్ష ” అంటూ ఇంట్లోకి దారి తీసింది పార్వతి.

నందినిని గోశాలలో కట్టేసిన తరువాత పశుపతి ,పార్వతితో పాటు ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలో మంచం మీద మునగ దీసుకొని పడుకొని ఉన్నాడు పిచ్చి వీర్రాజు.. అలికిడి వినిపించి, తలెత్తి చూసాడు

” ఎవరు—గౌ—గౌరివా నువ్వు ?”

” కాదు పెదనాన్నా! నేను పార్వతిని.”

” పార్వతి !పిచ్చి పిల్లా , పార్వతే గౌరి—”

పార్వతి జవాబివ్వలేదు.

” గౌరీ ! ---గౌ + రీ ! ’గౌ’ అంటే ఈశ్వరుడు ’రీ’ అంటే ఏమిటో చెప్పు గౌరీ ?”

” మీకే బాగా తెలుసు, చెప్పండి ,” అంటూ చక చకా పనులు మొదలు పెట్టింది పార్వతి. మరో మంచాన్ని వాల్చి దాని మీద పక్క వేసింది. ” మీరు వెళ్లి దాని మీద పడుకోండి” అంటూ పశుపతిని దాదాపు దాని మీదకి నెట్టింది.

“”గౌరి ఎవరు ?” అడిగాడు పశుపతి ,మంచం మీద కూర్చొంటూ.

ఇంట్లోంచి చల్లముంత తెచ్చి ఇస్తూ, గౌరి చనిపోయిన మా పెత్తల్లి పేరు.
ఇదుగో ! ముందు మీరీ మజ్జిగ తాగండి. ఇక మీద మజ్జిగ ,కొబ్బరి బొండాలు , చెరుకు రసాలు, అలాంటివే తాగాలి.కఠిన పథ్యం చెస్తేనే గాని, మీ రోగం తిరుగు ముఖం పట్టదు.ఈ ఊర్లో మందు లిచ్చే ఆచారి మా ఇంటికి రాడు.పై ఊరు నుంచి తెప్పించాలి.”

” పాపం ! మీకు శ్రమ !”

”శ్రమ ఏమీ లేదు, మీరు పడుకోండి” అని అంది పార్వతి.

” ఆ ! తెలిసింది , ;రీ’ అంటే ,’రీంకారం’ అంటే ఆనందం, అంటే ’ దేవి’ తెలిసిందా—” వీర్రాజుకి ఇంత సేపటికి జ్ఞాపకం వచ్చింది.

”తెలిసిందండీ !” ఏవేవో సర్దుబాట్లు చేస్తూనే జవాబిచ్చింది ఆమె. ఇప్పుడు తన పిచ్చి పెదనాన్న కోసం, గౌరి పాత్ర అభినయిస్తోంది. ’నందినికి’ కుడితి సిధ్ధం చేయాలి. పాలు పితికి బుడ్డాడి చేతికిచ్చి పట్నం పంపించాలి.. ఆ పాలు యీ ఊర్లో అమ్మకం అవవు.

” గౌరీ !మళ్లీ పిలిచాడు వీర్రాజు.

’ ” ఊ !” ఊకొట్టింది పార్వతి. పశుపతి మజ్జిగా తాగేసి, ముంతని మంఛం కింద పెట్టి, మంచం మీద సాగిలా బడ్డాడు. ఆ మజ్జిగ ఎంతో బలాఅన్ని, రిలీఫ్ నీ ఇచ్చినట్లుంది,పడుకొనే వీర్రాజు మాటలు విన సాగాడు.

”ఉండు చెప్తా ! గౌరేవ శంకరః రీ రేవ శక్తిః , తదవినా భావ సంబంధ మేవ గౌరీ ఇప్పుడైనా తెలిసిందా ?”

”తెలిసిందండీ,” పార్వతి మరో గదిలోంచే జవాబిచ్చింది. ఆమెకీ వాగుడు బాగా అలవాటయి ఫోయింది.

” ర-ల యోరభేధః-----అంటే ?”

” మీరే చెప్పండి.”

” అంటే -- రీ అంటే లీ --లీ లో మహిమ ఉంది. లీల చూసావా, మాయ అని అర్థం.”

పార్వతి గోశాలకి వెళ్లింది కాబోలు,పలక లేదు. “ఊరుకొంటావేం ?” రెట్టించి అడిగాడు వీర్రాజు.

”ఇదుగో వింటూనే ఉన్నాను, ఊ !”

” ఊ” కొట్టిందెవరో వీర్రాజు పట్టించుకోలేదు. ’గౌః’ అంటే గురు శబ్దమే గౌరీ.”

”ఊ!”

” గురు శబ్దమంటే ఏమో !”

” మీరే చెప్పండీ”

అప్పుడే గదిలోంచి వచ్చింది పార్వతి.వాళ్లిద్దరినీ ఆ స్థితిలో చూసి నిశ్శబ్దంగా నవ్వుకొని మళ్లీ వెళ్లిపోయింది.

”ఏమన్నాను ?—” వీర్రాజుకి సందేహం వచ్చింది.

”గౌరి అంటే గురు శబ్దం”జవాబిచ్చాడు పశుపతి.

”ఆ! గురు అంటే ప్రజ్ఙ, అంటే బ్రహ్మ ! అంటే శంకరుడు, ఇప్పుడు విడిపోయింది.”

” ఏం విడిపోయింది ?”

” రీ లోంచి బ్రహ్మ విడిపోయింది. ---”అయ్యో !” అంటూ ,వీర్రాజు బిగ్గరగా ఏడ్వడం మొదలు పెట్టాడు. పశుపతికి ఏమ్ చెయ్యాలో అర్థం కాలేదు. అతన్ని నిస్సత్తువ ఆవరించు కొంటోంది. కళ్లు కూరుకు పోతున్నాయి. ఇంతలో పార్వతి వచ్చింది.,” లేదండీ, ఏడవకండీ ! ’ఈ’ మీ దగ్గరే ఉంది, చూడండి ---”అంటూ అతని తలని తన గుండెలకి అదుముకొంది.

వీర్రాజు పార్వతిని కౌగలింఛు కొన్నాడు. ”అవును ,ఉంది. రీ పలుకవేం ? బ్రహ్మలో భాగం రీ కదూ ! చెప్పు గౌరీ !”

’పాపం’ ఇతడు తన గౌరిని ఎంతగా ప్రేమించాడో! అనుకొన్నాడు పశుపతి. అతనికి నిద్ర ముంచుకొని వస్తున్నా వీర్రాజు మాటలలో ఏదో కుతూహలం కలిగింది.

”ఆ! అవును,రీ లో భాగమే బ్రహ్మ--మెల్లగా అంది పార్వతి, పశుపతి వైపు చూస్తూ, ” అద్గదీ అలా చెప్పు---” వీర్రాజు ఆమెను పట్టుకొని ఊపేసాడు..పార్వతి ఏమీ అనలేదు.

” ఊరుకొన్నావేం ?”

” వీర్రాజు అంటే విను, ;వీ’అంటే వీనియందు ’రా’ అంటే ’ఈ’ అనే ఆనందం—’జు’ అంటే జ్వలిస్తుంది అని అర్థం.”

”బాగా అర్థమయింది.”

” ఓ !రీ! నాకు బాగా దహం వేస్తోంది”

పార్వతి అతని పట్టు విడిపించుకొని ”మజ్జిగ తెచ్చి ఇస్తాను తాగండి” అంటూ.

”అయ్యో ! ఆ --నీళ్లు దాహం తీరదు.”

” మరే నీళ్లు కాఅవాలి, చెప్పండీ—కొబ్బరి నీళ్లా ?”

”రాగం నీళ్లు కావాలి.”

పార్వతి అక్కడ లేదు, వంటింట్లోకి వెళ్లింది. ” అర్థమయేటట్లు చెప్పండి.” పశుపతి అందుకొన్నాడు.

”ఆనందంలో ఉన్న రాగం”

పశుపతి మాట్లాడలేదు.

” చెప్పవేం గౌరీ ?”

”అవును, ఆనందంలో ఉన్న రాగం.”

” గౌరి అంటే ఆనంద రాగం, అంటే ఆనంద భైరవీ రాగం.”

” ఆనంద భైరవీ రాగం పాడమంటారా ?”

” ఆ ! అదీ ! అదీ ! నువ్వు పాడతావా ?”

” పాడతాను.”

” పాడు, మరి ! దాహం ! గొంతు ఎండి పోతుంది.”

పశుపతి పడుకొనే గొంతు సవరించు కొన్నాడు.రాగాలాపన మొదలు పెట్టాడు..వీర్రాజు చెవులు రిక్కించాడు. ఆలాపన కుదర లేదు, స్వరం భ్రంశమయింది. ” ఏం బాగు లేదు.” అన్నాడు వీర్రాజు.

‘’బాగులేనిది రాగాలాపన కాదు పెదనాన్నా!”

”మరేమిటి ?”

”అతనికి ఒంట్లో బాగులేదు.”

” ఏం రోగం వచ్చింది?”

”కామెర్ల రోగం, పెదనాన్నా !”

”కామెర్ల రోగమా ! ” దిగ్గన తన మంచం మీద నుండి లేచి వచ్చి, పశుపతిని చూసాడు వీర్రాజు .కాసేపలా చూసి, ”ఎవరమ్మా ఈ అబ్బాయి?” అని అడిగాడు.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ