Skip to main content

రెండున్నర నెలల విరామం తరువాత---

రెండున్నర నెలల విరామం తరువాత---

నవంబరు ౫ తరువాత ‘ క్షీర గంగలో ’ టపా పెట్టడం జరుగ లేదు ! దానికి కారణం నా చిన్న కూతురి యొక్క , చాలా విలువైన ‘గర్భధారణ, ప్రసవం !’ చాలా విలువైన గర్భధారణ అని ఎందుకంటున్నానంటే, అది సహజమైనది కాదు, పరీక్ష నాళిక ద్వారా జరిగిన గర్భధారణ !

నా చిన్న కూతురి పేరు ‘ఇ౦ద్రాణి’, ప్లస్ టూ తరువాత, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాలలో పోలిటెక్నిక్ డిప్లొమో చేసింది. ఆ విద్యార్హత ఉన్న కారణంగా, రైల్వేలో అతి చిన్న క్లాసు ఫోరు ఉద్యోగిగా ప్రవేశించింది. ఆ తరువాత అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ , డిపార్టుమెంటు పరీక్షలో అసాధారణ ప్రతిభ కనబరిచి, జూనియర్ ఇంజనీయరుగా పదోన్నతి పొందింది. రైల్వే శాఖలో పదేళ్లలో అతి చిన్న స్థాయినుండి, సూపర్వైజరు స్థాయికి ఎదగడం అబ్బురమే మరి !

ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగం లభించడం వల్ల , ఆమె వివాహం జరిగింది. ఆమె భర్త శ్రీ జోగారావు రైల్వేలోనే ‘గార్డుగా’ పని చేస్తున్నారు.అతనిది పశ్చిమ రైల్వేలో పని ,అమ్మాయిది దక్షిణ మధ్య రైల్వేలో పని, ఇద్దరూ ఉద్యోగ రీత్యా చెరొక దిక్కులోనూ ఉండేవారు ! చివరికి ఎంతో ప్రయత్నము, నిరీక్షణ తరువాత పదేళ్లకి అతనికి బదిలీ మంజూరు అయి, ఆమె ఉన్న చోటికి రావడం జరిగింది.

ఈ మధ్య కాలంలో ఇంద్రాణికి రెండు సార్లు గర్భస్రావం జరిగింది ! దానికి కారణం మధుమేహం, థెరాయిడ్ సమస్యలేనని చెప్పారు. వాటికి చికిత్స జరిగినా తిరిగి గర్భధారణ కలుగ లేదు. చివరికి సాహసంతో ఇంద్రాణి ఐ.వి.ఫ్, చేయించుకో వడానికి తీర్మానించింది. లక్షన్నర ఖర్చు పెట్టి, స్థానిక ఫెర్టిలిటీ సెంటరులో చేరింది.
ఆమె మొదటి ప్రయత్నం ఫలించ లేదు. పదిహేను రోజుల తరువాత జరిగిన రక్త పరీక్షలో ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్ము కాలేదు. ఆమె నిరాశ పడక రెండవ సారి ప్రయత్నం చేసి విజయం సాధించింది !

అయితే. గడ్డుకాలం ఇంకా గట్టెక లేదు, మడవ నెలలో స్కేనింగు చేసినప్పుడు , ఆమె గర్భంలో కవలలు పడ్డారనీ, అందులో ఒక పిండం ఎనిమిది వారాల తరువాత, చనిపోయిందనీ తేలింది. ! ఇంద్రాణి బాగున్న పిండానికి జన్మ నివ్వడానికి, అది ప్రాణాపాఉఅం కాగలదని తెలిసినా నిశ్చయించింది.దానికి కారణం ఆ కాలనీలో గృహిణుల అసూయ, గొడ్రాలనే ముద్ర వేసి ఎత్తిపొడుపులంటే అబధ్ధం కాదు. అయిదవ నెలలో ఆమెకి రక్తస్రావం జరిగింది. బిడ్డకి, తల్లికి అనుసంధానమైన నాభి నాళిక తల్లి మూలంలో కన్నం పడి, ప్రక్కకి జరిగి పోయిందని తెలిసింది.అయినా ఇంద్రాణి బిడ్డకే ప్రాధాన్యం ఇచ్చింది ! రక్త స్రావాన్ని ఆపారు, ఆ తరువాత ఇంద్రాణి నమ్మిన దైవం శిరిడీ సాయి ఆమెని కాపాడాడు, నాభి నాళిక చిత్రంగా అతుకుకొంది.

ఆమెని పురిటికి తీసుకొని రావాలని వెళ్లిన మేము డాక్టరు పర్మిషన్ ఇవ్వక పోవడం వల్ల, అక్కడే ఉండి పోయాము. చివరికి ఎంతగానో ఎదురు చూసిన ప్రసవం అయింది. బిడ్డని బయటికి తీసిన తరువాత, ఆ శిశువుని ఇన్క్యుబులేటర్లో ఉంచాల్సి వచ్చింది ! శిశువుకి మధుమేహం, పచ్చ కామెర్లు వచ్చే అవకాశల నుండి రక్షణ కోసమని, ఆ విధంగా ఇంద్రాణి తన బిడ్డని ప్రసవించగానే చూసుకోలేక పోయింది ! మరో పది రోజుల నిరీక్షణ తరువాత తల్లీ పిల్లలు కలిసారు.

ఆ తరువాత ఇరవై ఒకటి రోజులకి , మేము తల్లీ పిల్లలతో సహా మా ఇంటికి వచ్చాము. అదండీ, క్షీరగంగ నిల్చి పోవడానికి కారణం .

Comments

  1. ఇంద్రాణి, బిడ్డతో సుఖంగా ఉండాలని దీవిస్తున్నాను..

    ReplyDelete
  2. Let God blesses always with the baby.

    ReplyDelete
  3. Indrani garu_bidda kshemamga..undaalani korukuntoo.. god is dreat..mothership is allways great.Indrani garu..become A good mother.

    ReplyDelete
  4. మీ అందరికీ ఇంద్రాణి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  5. భగవంతుడు ఆ బిడ్డకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద