Skip to main content

లక్ష్మి ఎందుకు అలుగుతుంది !?

లక్ష్మి ఎందుకు అలుగుతుంది !?

లక్ష్మి ధనానికి అధిష్టాన దేవత. ఆమె అలుగుతే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ? ఆమె చంచలమైనదని , ఒకచోట నిలువదని అందరూ అంగీకరించిన విషయమే !.ఆమెని స్థాయీ రూపంలో ఇంట్లో నిలుపుకోవాలని ప్రతీ గృహ యజమానులే కాక, గృహంలో తక్కిన సభ్యులు సైతం ఎగబడడం కద్దు.

కొందరు ధన ప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయడమే కాక, శ్రమని కూడా ఆపేస్తారు, అలాంటప్పుడు ఆమెని నిలుపుకోవడం ఎలా జరుగుతుంది ? ఇంతకీ ఆమె ఎందుకు అలుగుతుంది ? అలా అలగకుండా మనమేదైనా ఉపాయాలు చెయ్యగలమా ? అన్న ప్రశ్నకి తంత్రం సమాధానం ఇచ్చింది. వాటిలో కొన్ని నాకు తెలిసినవి పాఠకుల కోసం ఇస్తున్నాను.

 మంగళ వారం నాడు అప్పు తీసుకోకూడదు, అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును స్థాయీ రూపంలో
నిలిపివేస్తుంది..

 బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు. అలా మాటిమాటికీ చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి వెళ్లిపోతుంది.

 తామర పువ్వులు , బిల్వ పత్రాలు నలప కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 ఈశాన్య కోణంలో వంట ఇంటిని గాని శౌచాలయాన్నిగాని కట్ట కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 పూజా గృహంలో ఎంగిలి, ఆశౌచము ఉంచ కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 నగ్నంగా స్నానం చేయకూడదు, సరస్సులలో, నదులలో మల మూత్ర విసర్జన చేయ కూడదు. అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 భూముల మీద, గోడల మీద అనావశ్యకంగా వాయ కూడదు, బూతు గాని , చెడు గాని అసలు వ్రాయ కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు, చేతితోనే రుద్ది కడుగుకోవాలి. అతిథికి మర్యాద లోపం చేయ కూడదు. పశు పక్షుల గ్రాసాన్ని కాజేయ కూడదు, గోవుని అనావశ్యకంగా కొట్ట కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 సంధ్యా సమయంలో ఇల్లు ,వ్యాపార స్థలం ఊడ్చే పని చేపట్ట కూడదు, ఉదయ సాయం సంధ్యలలో కనీసం అగరు వత్తి ధూపంతో నైనా దేవతారాధన చేయకుండా ఉంచ కూడదు, తులసి చెట్టుని అనాదరం చేయకూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 . సూర్యోదయం తరువాత కూడా అనవసరంగా నిద్రించ కూడదు, సోమరి తనాన్ని అలవరచుకో కూడదు. అలా
చేస్తే లక్ష్మి అలుగుతుంది

 ఏ ఇంటిలో అయితే గృహ కలహాలు తరచుగా జరుగుతుంటాయో, మహిళలు, వృధ్ధుల అనాదరణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటి పైన లక్ష్మి అలుగుతుంది..

 దేవీ దేవతల చిత్తరువులని చిత్తు కాగితాల లాగ వాడ కూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 అభావగ్రస్తులని అవహేళన చేయకూడదు అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 వంచనతో తీసుకొన్న ఋణాన్ని తీర్చకుండా జాప్యం చేయకూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 పురుషార్థ రహితంగా, అంటే వ్యాపార నిమిత్తం కాక, ఎంగిలి, అశౌచము, అబధ్ధము, జూదము, లాటరీ లాంటి పనులు చేయకూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

 వ్యసనానికి బానిస కాకూడదు, అలా చేస్తే లక్ష్మి అలుగుతుంది.

చూడడానికి చిన్న చిన్న కారణాలలా కనిపించినా ఇవి తప్పక పాటించ వలసిన నియమాలు. తరువాత వ్యాసంలో లక్ష్మీ కటాక్ష ప్రాప్తి రహస్యాలు వివరిస్తాను.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద