Skip to main content

రత్న గర్భ యీ వసుంధర 5

రత్న గర్భ యీ వసుంధర 5

పెళ్లి ప్రసక్తి వచ్చి, పార్వతి పెరట్లో గోశాల వైపు పారిపోయిన తరువాత కూడ, వీర్రాజు, పశుపతుల మధ్య సంభాషణ కొనసాగింది. వీర్రాజు మంచి మూడ్ లో ఉన్నాడనీ, ఇలాంటప్పుడే అతని నుంచి మరింత సమాచారం రాబట్ట వచ్చనీ, అనుకొన్న పశుపతి ప్రశ్నమీద ప్రశ్న వేయసాగాడు. “మామయ్య గారూ ! దెయ్యాల దిబ్బ మీద ఎలాంటి పంట పండుతుంది?”

“ అది ఇప్పుడు దెయ్యాల దిబ్బ అయింది గాని ఇంతకు ముందు కూడా, అంటే దివాణంలో మనుషులున్నప్పుడు కూడ దిబ్బే ! పచ్చగడ్డి తప్ప మరేమీ అక్కడ పండించ లేదు ఆ మనుషులు. వాళ్లు వెళ్లిపోయక అక్కడ పిచ్చి మొక్కలు మొలిచాయి.”

“పిచ్చి మొక్కలా ? మొక్కలలో కూడా పిచ్చివి ఉంటాయా మామయ్య గారూ ?”

“ పిచ్చి నామ వాచకం కాదు బాబూ ! అది విశేషణం ! మనిషికైనా ,మొక్కల కైనా దాన్ని తగిలిస్తే అర్థం కాని, అక్కరకి రాని, ప్రయోజనం లేని అపదార్థము అని తెలుసుకోవాలి.

“ అంటే మీరు చూసిన మొక్కలు మీకే అర్థం కానివా ?”

“ నాకెందుకు అర్థం కాలేదు. పిచ్చి మొక్కలు పిచ్చి వాళ్లకే అర్థమవుతాయి. మామూలు మనుషులు అంటే మీ లాంటి వాళ్లకి వాటి గురించి తెలియదు.”

“ నేను అడుగుతున్నది అదే మామయ్య గారూ ! మీకు అర్థమయినది ఏమిటీ అని ?”

“ అవి ఇంధన తైలంమొక్కలని అర్హమయింది !ఇంధనం అంటే తెలుసా, వంట చెరుకు ! వంట అంటే తపస్సు చేసి, అంటే సాధన చేసి –’

“నాకు అర్థమయింది మామయ్యగారూ !”

“ ఏమిటి అర్థమయింది ?”

“ సాధనతో తపస్సు చేసి, ఆ మొక్కలని పండిస్తే, అంటే వండితే, వంట చెరుకు అంటే ‘బయో ఫ్యూయల్’ లభ్యమవుతుంది!”

“ ఇన్నాళ్లకి నన్ను అర్థం వాడివి దొరికావు. ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా ?”

“ ఉన్నాయి మామయ్యగారూ ! దెయ్యాల దిబ్బ నుండి వాటిని ఎలా పారదోలాలి ?”

“ దెయ్యాలు కూడా పిచ్చివే బాబూ ! అశాంతితో మనుషుల మీద పడి వేధిస్తాయి ! అవి శాంతికే లొంగుతాయి.”

“ అవి లొంగుతే గాని నా తపస్సు మొదలవదు. వాటిని మీరే లొంగదీయాలి.”

“ ప్రతీ దెయ్యానికి ఒక పేరు, దాని అశాంతికి కారణం ఉంటాయి అవి తెలియాలి. అవి ఎన్ని ఉన్నాయో కూడా తెలియాలి.”

“ అవి మొత్తం తొమ్మిది ఉన్నాయి.వాటి పేర్లు,నాకు తెలుసు ! పోతే వాటి అశాంతికి కారణం అమాయక ప్రజల హత్యా కాండ !!”

“ హత్యలంటున్నావు ! దెయ్యాల దిబ్బ మీద అలాంటి వేవీ జరగ లేదే ?”

“జరిగింది అక్కడ కాదు మామయ్యగారూ ! అవి జీవాత్మలుగా ఉన్నప్పుడు ,మత వైషమ్యానికి లోబడి, ఆగ్రహ పూరితమైన ఆవేశంతో చేసిన హత్యలు !!”

“ మత వైషమ్యం అంటున్నావు ! అవి తురక దెయ్యాలా ?”

“ అవును మామయ్య గారూ ! అవి, అవే !!”

“ అవి అక్కడికి ఎలా వచ్చాయి ?”

“ లారీతో శవాలని మోసుకు వచ్చి, అక్కడ కట్ట కట్టి పాతి పెట్టేసారు.”

“ ఎవరు?”

“ వాటినుండి అమాయక ప్రజల మాన ప్రాణాలను రక్షించడానికి వాటిని చంపేసిన రక్షకభటులు!”

“ అర్థమయింది బాబూ ! అంటే నువ్వు చాలా తపస్సు చేయాలి !”

“ ఏం చేయాలి ?”

“ఆ ప్రేతాత్మలకు తొమ్మిది గోరీలు తవ్వాలి.నీ కష్టమంతా ఇక్కడే ఉంది. గోరీలు తవ్వడానికి, అవి నీకు సహకరించవు.”

“ పగటి పూట తవ్వుతాను మామయగారూ !”

“ ఒకే ఒక్క పగటి పూట అన్ని గోరీలు తవ్వడం, ఎలా చేస్తావు ?”

“ పట్నం నుంచి ఎస్కవేటర్ తెప్పిస్తాను. తొమ్మిది గోరీలకి, ౬ అడుగుల పొడవు, ౨౭ అడుగుల వెడల్పు, ౪ అడుగుల లోతు గొయ్యి చాలు. ఎస్కవేటర్ ఆ గోతిని ౩ గంటలలో తవ్వి పారి పోతుంది.”

“కొన్ని గుడ్డ బొమ్మలు తయారు చేయించాలు. వాటిని ఆయా శవాల కొలతలని బట్టి తయారు చేయించాలి. ”

“వాటి కొలతలు తెలుసు మామయ్యగారూ ! బొమ్మలు తొమ్మిదే కదా చేయించాలి ?”

“ అవి మొదటి సారికే నీకు లొంగుతే , లెక్క ప్రకారం తొమ్మిది చాలు !”

“ అర్థమయింది, తొమ్మిది ఇంటూ మూడు వెరసి ఇరవై ఏడు చేయిస్తాను. సాఫ్ట్ టాయ్స్ దుకాణానికి ఆర్డరు ఇచ్చి చేయిస్తాను.వాటి మీద వాటి పేర్లు కూడా వ్రాయిస్తాను.” ఉత్సాహంగా బదులిచ్చాడు పశుపతి. అతను మామూలు ధోరణిలో మాట్లాడడం అతనికి ఆశ్చర్యం గానే ఉంది.

పాపం పశుపతి ! పిచ్చి కూడ అశాంతి వలనే వస్తుందని, వీర్రాజు అశాంతికి కారణమైన పార్వతీ, విశ్వపతుల సమస్య, పరిష్కారమయే మార్గం కనిపించడమే అతని ప్రశాంతతకి కారణమని తెలుసుకో లేక పోయాడు.

“ బాగుంది బాబూ ! నువ్వుముందు గోరీలు తవ్వించు.ఆ గోరీలలో బొమ్మలని పెట్టించి వాటిని ఆహ్వానించి సమాధి చేయిస్తాను. ఆ తరువాత శాంతి క్రియలు ఎలా చేయాలో ఆలోచిద్దాం !”

“ అలాగే మామయ్యగారూ ! మీరు దగ్గరుండి అన్ని పనులూ చేయించాలి.”

“ అలాగే బాబూ ! నన్ను నమ్మినా, మానినా నీ కోసం తప్పక నిజాయితీగా చేస్తాను,”

“ ఆ దెయ్యాల దిబ్బ ౩౦ సంవత్సరాలకి చాలా చవకగా లీజుకి తీసుకొన్నాను మామయ్యగారూ !”

“ ఆ తరువాత ఏం చేస్తావు ?”

“ సాధన చేసి వంట చెరుకు వండుతాను.”

“ నువ్వు నాకు నచ్చావు బాబూ !”

************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద