రత్న గర్భ యీ వసుంధర ౩
“ఆంజనేయుడి గుడి దగ్గర పడి ఉంటే—”
“చూసి, తీసుకు వచ్చావా పార్వతీ !”
“అవును పెదనాన్నా !”
“మంఛి పని చేసావు, నా మాటలకి ఊ కొడుతూంటే ఇంకా విస్సేమో అనుకొన్నాను.”
“నువ్వెప్పుడూ అంతే పెదనాన్నా ! ఒకరిని చూసి ఒకరనుకొంటావు,నన్నెప్పుడు చూసినా గౌరీ అనే అంటావు! నీతో పెద్ద చిక్కే వచ్చి పడింది.”
“ నేనేం చేసేదే ! నువ్వు అచ్చు మీ పెద్దమ్మ లాగే ఉంటావు. అంతే కాదు ,పెద్దమ్మ లాంటి పన్లే చేసావు.”
“పెద్దమ్మ లాంటి పన్లా?”
“అవునే ! సరిగా పదమూడేళ్ల క్రిందట.కార్తీక పౌర్ణమి నాడు ,మీ పెద్దమ్మ ఇలాగే పదేళ్ల బాలుడిని తీసుకొని వచ్చింది. ఆ పిల్లాడికి కూడా అప్పుడు పచ్చ కామెర్లే ! వాడేనే మన విస్సిగాడు.”
“అప్పుడేం చేసావు పెదనాన్నా ?”
“ నీతో పాటే వాణ్ని కూడా పెంచుకొన్నామే ! ”
“ అదికాదు పెదనాన్నా! ఆ రోగం తగ్గడానికి ఏం చేశావు?”
“ మూడు రోజుల పాటు వరసగా మంత్రం వేసి తగ్గించానే ! నీకు గుర్తులేదూ! నువ్వు వాడి కన్న రెండేళ్లే పెద్దదానివి. ఇప్పుడునిలబడ్డ చోటనే నిలబడ్డ జాగాలోనే నిలబడి, మత్రం వేస్తావా పెదనాన్నా! నీకు మంత్రాలు వేయడం వచ్చా? అని అడిగావు”
“అదే మాట ఇప్పుడూ అడుగుతున్నాను పెదనాన్నా ! మంత్రం వెయ్యవూ !”
“ ఈ పిచ్చి పెదనాన్న మంత్రం మీద నీ కంత గురి ఉందా పార్వతీ?”
“ నీకు పిచ్చి ఎక్కడ పెదనాన్నా! నిన్నన్న వాళ్లకే పిచ్చి, నువ్వు మహా జ్ఞానివి.”
“సరేనమ్మా ! నీ మాట ,గౌరి మాటే ! జవ దాట రానిది. వెళ్లు, వెళ్లి ఒకకంచు గిన్నె నిండా నువ్వుల నూనె, మూడు ధర్భ పుల్లలు తీసుకొని రా!”
మంచం మీద పడుకొని ఉన్న పశుపతికి అంత మగత లోనూ నవ్వు వచ్చింది. చివరికి తన రోగానికి, పిచ్చివాని చేత మంత్రం వేయిస్తోందా పార్వతి ! పాపం మరేం చేస్తుంది, ఈ ఇంటికి ఏ వైద్యుడూ రాడేమో కదా !!”
ఇంతలో పార్వతి కంచు గిన్నెలో నువ్వుల నూనె తెచ్చి, పశుపతి నుదుటి మీద పెట్టి పట్టుకొంది. దర్భ పుల్లలు వీర్రాజు చేతికి ఇచ్చింది
వీర్రాజు ధర్భ పుల్లలతో ఆ నూనె కలుపుతూ, మంత్రం పఠించ సాగాడు. ఇంతలో తలుపు చప్పుడయింది.“బుడ్డోడు వచ్చినట్లున్నాడు పెదానాన్నా! పాలు పట్నం పంపించాలి.”
“ఏం తల్లీ ! ఈ ఊర్లో వాడికలు మానేసావా ?”
“ మానేసాను పెదనాన్నా! మరీ తక్కువ డబ్బులు ఇస్తున్నారు.”
“అవునమ్మా , గోశాల వైభవమంతా గౌరితోనే పోయింది.”
“లేదు పెదనాన్నా ! ఆ విస్సిగాడు తాగి, తందనా లాడి తగలెయ్యక పోతే, మన మీ పాటికి డైరీ ఫారం పెట్టేసి ఉండే వాళ్లం ! ” తలుపు తీసి, బుడ్డాడిని లోపలికి పిలిచి, పాల కావడి చేతికి ఇచ్చింది పార్వతి.
“పార్వతిగారూ ! ” నీరసంగా పిలిచాడు పశుపతి.
“ ఏం కావాలి ?”
“ నా సంచీలో—”
‘ ఒక మనీ పర్సు, అందులో ౪౦౦ రూపాయలు,ఇంకా చాలా క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైలు ఫోను , ఒక మడతపడే కలన యంత్రం (లేప్ టాప్ కంప్యూటర్), ఉన్నాయి, అంతేనా?”
“అవును.”
“ఆ డబ్బు అవసరం ఇప్పుడు లేదు లెండి.—అతిశయం, అభిమానం తొంగి చూసాయి ఆమె కంఠంలో. పశుపతి మరి మాట్లాడ లేదు. ” బుడ్డాడి చేతికి ఛీటీ ఇచ్చి, హోమియోపతి మందు తెమ్మనమని చెప్పాను. వాడు సాయంత్రానికి గాని రాడు.అంత వరకు మాపెదనాన్న మంత్రం ,నా పథ్యం తప్పవు మీకు, కళ్లు మూసుకొని పడుకోండి.”
“ బుడ్డాడు ఎవరు?”
“ వాడా వాడు గోమారులకి వారసుడు.మరిక ప్రశ్నలు వేయక పడుకోండి.”
‘గొమార్లకి వారసుడు’ పార్వతి మాటల అర్థం మరి కాసేపటికి గాని బోధ పడ లేదు పశుపతికి. గోవుల చర్మ మాంసాలే జీవికగా గల కులస్థుల వారసుడన్న మాట ! పార్వతి మంచి పనే చేసింది. ఊరు తనని ‘గోమారి’ అని వెలి వేస్తే తనా గోమార్ల తోనే చేతులు కలిపిందన్న మాట !
“ అదుగో, కళ్లు తెరచే ఉంచారు కాసేపు బలవంతాన మూసుకొంటే నిద్ర దానంతటదే వస్తుంది.”
పశుపతి కళ్లు మూసుకొన్నాడు. ఈ ఇంటి పరిస్థితులు చాల చిత్రంగా ఉన్నాయి.! ఊరంతా వెలి వేసిన ఒక కన్నెపిల్ల ,ఆమెకి తోడుగా మంత్ర తంత్రాల పిచ్చి పెదనాన్న, వీళ్లకి జీవనాధారమైన ఒకపాడి పశువు .ఆ విస్సు ఎందుకో మరి ! తన లాగే పదమూడేళ్ల క్రిందట ఈ ఇంట చేరి, ఇంటీ వైభ్హవమంతా తాగి, తందనాలాడట! ప్రస్తుతం గోహంతగా జైల్లో ఉన్నాడట !
ఈ ఇంటి మనుషులకీ పశువులకీ ఏమిటో ఈ సంబంధం ! ముందు తను త్వరగా కోలుకోవాలి ! తరువాత వీళ్ల కుటుంబాన్ని ఒక కొలిక్కి తేవాలి. అలా ఆలోచిస్తూనే క్రమంగా నిద్ర లోకి జారుకొన్నాడు పశుపతి.
********************
కథాకాలానికి సరిగా రెండేళ్ల క్రితం, అంటే ౨౬-౧౧-౨౦౦౮ నాడు , ముంబయి నగరంలోని తాజమహల్ హోటల్ , ఒబెరాయ్ హోటల్, ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, కామా ఆస్పత్రులను ఏక కాలంలో పదిమంది ఆతంక వాదులు మారణాయుధాలతో దండెత్తి , భీభత్సాన్ని సృష్టించారు ! ముంబయి మహానగరాన్నే కాదు,మొత్తం దేశాన్నే కలవర పరచిన ఆ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తులైన భారతీయ పోలీసు దళాలు,కమెండో దళాలు ఆ దాడిని త్రిప్పి కొట్టేందుకు, వారి ఉక్కు కౌగిలిలో చిక్కుకొన్న స్వదేశ , విదేశ నాగరికులను రక్షించేందుకు ఎదురు దాడి చేసి, వారిలో తొమ్మిది మంది ఆతంక వాదులని మట్టుపెట్టారు. ఒకే ఒక టెర్రరిస్టుని ప్రాణాలతో పట్టుకో గలిగారు, ముంబయి పోలీసులు.వారిలో ముగ్గురు, కమెండో దళాలలో ఇద్దరు వీర స్వర్గాన్ని అలంకరించారు. కీర్తిశేషులయిన వీరులకి మొత్తం దేశమంటా నివాళులు ఇచ్చింది. వారి మృత దేహాలని రాజకీయ సన్మానంతో దహన సంస్కారాలు జరిపించారు.
దుర్మరణం చెందిన తొమ్మిది మంది ఆతంక వాదుల శవాలని , వారి స్వదేశం , మా వాళ్లు కారని తిరస్కరించింది. స్వఛ్ఛంధ సంస్థలు, మత వాద సంస్థలు కూడ ఆ మృతదేహాల సంస్కారానికి అంగీకరించ లేదు. వాటినేం చేయాలో తెలియని మహారాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వాటిని దావి పెట్టి, చివరికి రహస్యంగా వాటిని పాతిపెట్టారు.
మూడు రాష్త్రాల (మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ) సరిహద్దు ప్రాంతం లోని ఒక గ్రామంలోని ప్రకృతి సహజమైన లోయలో ఒక పురాతనమైన భవనం దగ్గర ,వాటిని పాతిపెట్టడం జరిగింది. క్షేత్రీయ వాదులలో ఎవరికి తెలుస్తే ఏమొస్తుందోననే సందేహంతో ఆ విషయాన్నిగోప్యంగా ఉంచారు.
తొమ్మిది మంది ఆతంకవాదుల శవాలలోని అతృప్త ఆత్మలు మాత్రం రహస్య సమాధిని నిశ్శబ్దంగా ఆమోదించ లేదు. అవి ఆ స్థలంలో ఉత్పాతాన్ని లేవదిసాయి. అర్థరాత్రి అరుపులు, ఆర్తనాదాలు ,మారణాయుధాల ప్రేలుడు చప్పుళ్లు ,రాపిళ్లు, నిప్పులు, మంటలు, కేకలు ఇంకా గరగరలు, మరమరలు ,బర బరలు,పరపరలు ఒకటి రెండు కాదు అనేకమైన భయానక వాతావరణాన్ని సృష్టించాయి ! ఫలితంగా ఆ గ్రామ ప్రజలే కాక చుట్టుపట్ల గ్రామ ప్రజలు కూడ ఆ ప్రాంతాన్ని ‘దెయ్యాలదిబ్బ’ అని నామకరణం చేసి పరిత్యజించారు
ముంబయిలోని ఆతంకవాదుల దాడికి సమానాంతరంగా ఇంకొక భయంకరమైన ఆర్థిక మాంద్యం ప్రపంచంలోని, ధనిక దేశాలని ఆందోళనకి గురిచేసింది. భారత దేశంలో కూడా,‘నిత్యకళ్యణం పచ్చతోరణంలా’ ఉన్న ఒక సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత ఆ కంపెనీ ఆర్ధిక అసమానతలని దాచి పెట్టి ఆ కంపెనీని నష్టాల ఊబిలోకి దింపాడు ! దానితో చాల మంది ఊద్యోగులు ఉపాధిని కోల్పోయారు
ఆ విధంగా వేటుకి గురి అయిన . సాఫ్ట్ వేర్ ఇంజనీరు పశుపతి తన స్థాయికి తగ్గ పదవిని తిరిగి పొందలేక, స్వతంత్ర ఉపాధికోసం అన్వేషణ మొదలు పెట్టాడు.
ఒక రోజు వార్తా పత్రికలో తన ఊరు గురించి వచ్చిన వార్త అతని మనసుని కలచి వేసి ఆలోచనకి గురి చేసింది.
గోవుల చర్మము, మాంసము కోసం వాటిని జబ్బుకు గురి చేసి సామూహిక హత్య చేసిన ఉదంతం అది ! విశ్వపతి అనే యువకుడు, మల్లన్న అనే మధ్య వయస్కుడు ఆ పనికి పాల్పడ్డారని, వారికి ఏడాదిన్నర జైలు శిక్ష, రెండు వందల జరీమానా కోర్టు వారి ఆదేశించారనే వార్త అది !
విశ్వపతి పేరు చూసిన అతని మనస్సు అంతరాంతరాలలో స్పందించింది. ఎక్కడే ఏదో తెలియని భాంధవ్య బంధం కలుక్కుమంది ! ఆ వార్తా పత్రికలోనే పడిన, ‘దెయ్యాల దిబ్బ’ ఉదంతం కూడ ఆ ఊరిదే కావడం మరింత కలవర పరచింది.
ఆ ‘దెయ్యాల దిబ్బ’ పదహారు ఎకరాల ప్రాంతం ! దాని ప్రక్కనే ఉన్న దివాణం రాజా వారిదని ప్రతీతి ! ఆ దివాణానికి వారసుడు,, ప్రస్తుతం ఐ.ఎ.ఎస్ పాసై మహారాష్త్ర ప్రభుత్వ హోం శాఖలో సహాయ కార్యదర్శి పదవిలో పని చేస్తున్న తన స్నేహితునికి ఫోన్ చేసి, తన ఆవేదన తెలియ జేసాడు.
అప్పుడు బయట పడింది ‘దెయ్యాల దిబ్బ’ అసలు రహస్యం ! ఆ దిబ్బనీ, దివాణంలోని భవనాన్నీ ౩౦ సంవత్సరాల పాటు లీజు తీసుకోమని, అక్కడ వ్యవసాయం చేసి, స్వయం ఉపాధి సాధించమని సలహా ఇచ్చాడు ఆ వారసుడైన స్నేహితుడు.కేవలం ప్రొసెసింగు ఫీజు ఇస్తే చాలు అన్నాడు.
అంత మంచి అవకాశాన్ని వదులుకో లేక, కార్యాచరణకి ఉపక్రమించాడు పశుపతి.
**********

Comments
Post a Comment