Skip to main content

ప్రేమాయణంలో ‘ అ, ఆ, క, ఖ

ప్రేమాయణంలో ‘ అ, ఆ, క, ఖ
అ , ఆ
అతను
ఆమె
అతని ముందు ఆమె
ఆమె వెనక అతను,
ఒకే తారు రోడ్డు పైన నడుస్తున్నారు.
వీళ్లిద్దరే కాక, ఆ రోడ్డు మీద, పడీ పడని చీకటి తెరలు విడీ విడని వీధి దీపాల వెలుగు రేఖలు కూడ, వెనక ముందులుగా నడుస్తూ, కదంబ మాలికలు తురిమిన ఆమె నల్లని జడని ఙ్ఞప్తికి తెస్తున్నాయి.
ఆ రోడ్డుక కలకత్తా ‘ సిటీమేప్’ లో ఉన్న పేరు, రోడ్ వగైరాలేవో తెలియవు గాని, రెండు పెద్ద సెంటర్ లని కలిపే లింక్ రోడ గ దికి ఒక ప్రత్యేకత ఉంది.
కొన్ని నెలలుగా ప్రతీ రోజూ, వాళ్లిద్దరూ ముందు వెనకలుగా లేక ప్రక్క ప్రక్కలుగా, సిటీ బస్సులో ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూనే ఉన్నారు.కాని ఇలా కాలి నడకన చేయాల్సి రావడం ఇదే మొదటి సారి.
ప్రతీ రోజూ బస్సులో ఒకరినొకరు చూసుకొంటున్న కారణాన, వాళ్లిద్దరూ పూర్తిగా అపరిచితులు కారు. ఇద్దరి మాతృభాష తెలుగేనన్న సంగతి ఇద్దరికీ తెలుసు. అయినా ఒకరి పేరు మరొకరికి తెలియదు, కలిసి మాట్లాడే ఘనిష్టత ఇంకా ఏర్పడ లేదు !
కాని ఆ రోజు
నడుస్తున్నారు.
కాని వాళ్ల ఉద్దేశాలు వాళ్ల మనస్సుల లోనే ఉన్నాయి.
ఇంతలో –
ఒక లేంపు పోస్టు, దాని వెలుగులో ,‘ మద్రాసు కేప్’ అన్న బోర్డు కనిపించి ఆమె ఆగింది. ఆగి బోర్డు వంక నిదానించి చూసింది.
ఆమె ఆగి చూసిన వైపు , అతను కూడ చూశాడు.
‘ మద్రాసు కేఫ్’ ఇద్దరికీ నోరూరించింది.
అతను-
ఆమె ఆమె వెనకగా అతను,
ఆమె వెనకగా అతను అ( తని ) ముందు ఆ ( మె)
మద్రాసు కేఫ్ లో దూరారు.
ఖాళీగా ఉన్న ఒకే టేబిలుకి ఎదురెదురుగా కూర్చొన్నారు.
మంచి నీళ్ల గ్లాసులతో వచ్చిన సర్వారావుతో-
ఆమె “ కాఫీ” అని చెప్పింది.
అతను కాస్త తటపటాయించి , “ రొండు దోశా” అన్నాడు.
‘ రెండు దోశెలు ఇతనే తింటాడా’ అని అనుకొంది ఆమె .తెప్పించి ఆఫర్ చేసిన తరువాత, ‘ ఆమె ఏమనుకొంటుందో; అని ‘ గుబులు పడ్డాడు’ అతను.
ఫలహారాలు రెండు, పానీయం ఒకటి టేబిల్ పైన వచ్చి చేరాయి.
ఒక ఫలహారం ఆమె ముందుకు తోసి, “ మీరూ తీసుకోండి,” అనేసి, ఎవరెస్టు ఎక్కినంతగా సంబర పడి పోయి, అలసి పోయాడు అతను. ఆమె సిగ్గు పడుతూ అలవోకగా తలవంచుకొని ,పలువరస తళుక్కు మనేలా నవ్వింది.
ముత్యాలు నేల జారేయేమోనని టేబిలు క్రిందకు దృష్టి సారించాడు అతను.
“ నాకు ఆకలిగా లేదు, మీరు తీసుకోండి” తూఛి తూచి అంది ఆమె మెల్లగా .
“ ఫరవా లేదు తీసుకోండి, ఒక్క డోశెకి మీ కడుపులో ఖాళీ ఉండక పోదు.” అన్నాడతను కాస్త నిబ్బరంగా.
ఆమె తిరిగి నవ్వింది, మరీ సిగ్గుపడకుండా !
ఈ సారి ముత్యాల కోసం అతను నేల చూడ లేదు ( మొదటి సారి అవి నేల రాలలేదు కాబట్టి ) ఆమెకళ్ల లోకి సూటిగా చూశాడు.
ఆమె దోశె ప్లేటు ముందు తీసుకొని , “ సరే కానీయండి ” అంది ( నిజంగానే ఆకలి వేస్తోంది కాబట్టి )
“ మీరు చీట్ ఫండు కంపెనీలో పని చేస్తున్నారు కదూ ” అడిగాడు అ ( తను ).
“ అవును , మీరు టీ బోర్డులో పని చేస్తున్నారా ?” అడిగింది ఆమె.
ఆ తరువాత అ, ఆ లు ఇద్దరూ , ఎందుకూ పనికి రాని ఆఫీసు విషయాలు మాట్లాడుకొంటూ హౌరాస్టేషను దాకా కలిసి వెళ్లారు.
“ మీరు సంతరాగాఛీలో ఉంటున్నారా ?” అడిగాడు అడిగాడు , అ.
ఆమె నవ్వి తల ఊపింది, “ మీరు శిబ్ పూర్లో ఉంటున్నారా ?” అంటూ.
“ కాదండీ ! లిలువాలో ఉంటున్నాను ఆఫీసు వదిలిన తరువాత ‘ శిబ్ పూరు’ కు వెళ్తూంటాను. అక్కడ ‘ ట్రాన్సిస్టరు రిపైరు’ నేర్చుకొంటున్నాను” అన్నాడు, అ.
“ అలాగా ! అయితే మీరు మా ఇంటికి తప్పక రావాలి. మా ఇంట్లో ఒక ట్రాన్సిస్టరు ఉంది, ఎవరికైనా ఇవ్వాలంటే ---”
“ ఎంత మాట ! రేపు ఆదివారం కదా, ఆపీసులు ఎలాగూ ఉండవు కాబట్టి, రేపే వస్తాను, మీ ఎడ్రస్సు ఇవ్వండి.”
‘ ఆ’ అడ్రెస్సు తీసుకొని, ‘ గోల్డుమైన్’ కనుగొన్నంత సంతోషంతో ఇంటి ముఖం పట్టాడు, ‘అ’.
*************

“ ఇంతకీ నేనెవరో తెలుసా మీకు ? నేను కవిని, మీ అన్నయ్యతో పరిచయం కవిత్వం ద్వారానే అయింది. అనకూడదు గాని, మీ అన్నయ్య కూడ మంచి భావుకుడు ! జిలుగు వెలుగు ల్లాంటి అయుడియాలు అతని బుర్రలో చాలా ఉన్నాయి. మీరు నా కవిత్వం ఏదీ పత్రికలో చూడలేదు కదూ ----”
“ లేదు” మర్యాదగా జవాబిచ్చింది ఆమె.
‘కవిత్వం మాట ఏమో గాని , కపిత్వం మాత్రం చూస్తూనే ఉన్నాను’ మనసులోనే విసుక్కొంది ఆమె. పావు గంట పైఅన ఇంకో పావు గంట సమీపిస్తున్న కవి వాక్ప్రవాహం నుండి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తూ.
‘ వస్తానని అన్న అ ( తను ) వేగంగా వచ్చి, ఈ కవి కవిత్వానికి అడ్డుపడితే బాగుండును, ’ అనుకొంటూ వీధి గుమ్మం వంక దృష్టి సారించిన ఆమె కళ్లకి –
నల్లగా నిగనిగ లాడుతూ ఛెర్రీ బ్లాసం ఎడ్వర్టైజుమెంతుకి పనికొచ్చే బూట్ల జత, వాటి పైన పొగ గొట్టాలులా పరచుకొన్న బెల్ బాటం నీలిరంగు గాబర్డీన్ ఫేంటు కనిపించింది !
వడదెబ్బ ( మినప్పప్పు వడ కాదు లెండి ) దెబ్బ తిన్న వ్యక్తికి శైత్యోపచారం చేసినట్లయింది !
కూర్చొన్న చోటి నుండి లేచి,“ రండి, రండి’ ,అలా నిలబడి పోయారేం, లోపలికి రండి,” అంది మె వీధి గుమ్మం వైపు దారి తీస్తూ.
మరో పావుగంట సమీపిస్తున్న పావుగంటకి, పావిగంట క్రితం వచ్చి, కవి గారి మాఅటలు వింటు, లోపలికి వెళ్లాలా, వద్దా అని సతమతమవుతూన్న ‘ అతను’ ఆమె ఆహ్వానాన్నందనుకొని రంగ ప్రవేశం చేసాడు.
ఆ (మె) అంత మర్యాదగా రాబట్టుకొన్న అ (తని ) వంక, ‘ క’ ( వి ) తిరస్కార , మాత్సర్యాలు కూడుకొన్న చూపు విసిరి , ముఖం నిండా గాంభీర్యం పులుముకొన్నాడు.
తరువాత -
మూడు కప్పుల టీ తీసుకొచ్చి చెరో కప్పు అందిస్తూ, వారిద్దరినీ ఒకరినొకరికి, పరిచయం చేసింది ఆ.!
“ ఈయన కవి ‘టాటా’ నివాసం. ట్రైనింగు నిమిత్తం, మూడు నెలల పాటు వెళ్లిన మా అన్నయ్యతో పరిచయం అయింది. మా అన్నయ్యకి, నేనిక్కడ ఒంటరిగా ఎలా ఉంటున్నానో అని ఊరికే తెగ బెంగ ! అందుకని పని మీద కలకత్తా వచ్చిన ఇతనిని, నన్ను కలిసి చూడమని పంపాడు.”
“ కవి గారూ ! ఇతను టీ బోర్డులో ఎకౌంటెంటు . మా ఆఫీసులు రెండూ, దగ్గర దగ్గరగా ఉన్నాయి. ప్రతీ రోజూ ఒకే వేళకి ఒకే బస్సులో ప్రయాణం ఉంటాం. ఇతనికి ట్రాన్సిస్టరు రిపేరంగు బాగా వచ్చు ! మా ట్రాన్సిస్టరు ఈ మధ్య ఒకేసారి చాల రకాల కవిత్వాలు పాడుతోంది లెండి ! దాని రిపేరింగుకి పిలిపించాని ఇతనిని.”
అని ట్రాన్సిస్టరు తేవడానికి లోపలికి వెళ్లింది ఆమె.
ఆమె పరిచయం చేసిన తీరులోనే , ఒకరి రాక లోని ఆంతర్యం మరొకరికి తెలిసి పోయింది. ఇద్దరూ ఒకరినొకరు అఫోజిషన్ పార్టీ నాయకుల్లా చూస్తూ నులువునా దహించేసుకొన్నారు !
ట్రాన్సిస్టర్ తెచ్చి ఇచ్చిన తర్వాత అతను మరి అక్కడ ఉండేందుకు అవకాశం లేకుండా పోయింది. సెలవు తీసుకొని బయట పడ్డాడు అ.!
‘అ’ వెళ్లిన వెంటనే ‘ఆ’ , ‘క’ కి కూడా సెలవు ఇచ్చింది.
“ కవి గారూ ! రేపు ఈరు టాటా వెళ్లేముందు కనిపిస్తే, అన్నయ్యకి ఉత్తరం వ్రాసి ఇస్తాను ” అంటూ.
‘ క’ అంగీకారంగా తల ఊపి కదిలాడు.
అలా కదలిన ‘ క’ వీధి చివరికి చేరుకొన్న,‘ అ’ ని చప్పట్ళు చరిచి పిలిచాడు.
‘ అ ’ ఆశ్చర్యంతో, ‘క ’ వైపు అడుగులు వేశాడు.!
“ చూడండి మిస్టర్ ! మీ పేరేమిటో ఆమె చెప్పలేదు. బహుశా ఆమెకి కూడా తెలిసి ఉండదేమో ! బస్సులో జరిగిన స్వల్ప పరిచయంతో ఇలా ఆడ పిల్ల ఇంటికి రాకపోకలు జరపడం బాగా లేదు. ఇలాంటిదేదో అవుతుందన్న అనుమానం తోనే, ఆమె అన్నయ్య నాకు మరీ మరీ చెప్పాడు. ఒకసారి కనుక్కోమని ! అందుకని మీకు వార్నింగు ఇస్తున్నాను. మరోసారి ఆమె ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయకండి. ఆ ట్రాన్సిస్టరు నా చేతికి ఇవ్వండి. నేను రిపేరు చేయించి పట్టుకెళ్తాను,” అంటూ చేయి చాపాడు కవి.
మంఛుదిమ్మతో కొట్టినట్లయి క్షణకాలం దిమ్మెర పోయాడు ‘ అ’ .తరువాత తేరుకొని జవాబిచ్చాడు.
“ చూడండి ‘క ; గారూ ! నాకు ఆమెతో అల్పమో, స్వల్పమో కాస్త పరిచయమైనా ఉంది ! ఒక గంట క్రితం వరకు, మీకు అది కూడా లేదు ! ఆమె ఇంటికి మీ రాక నాకూ అనుమానాస్పదం గానే ఉంది ! ట్రాన్సిస్టరు రిపేరు చేసి, రేపు నేనే ఆమె కిస్తాను . ఆ సమయానికి అక్కడ మీరుండడం జరిగితే మంచి మాట కాదు, జాగ్రత !” అని..
“ హు !” హుంకరించాడు ‘ క’ !
“ హె ! ” చప్పరంచాడు , ‘అ! ’.
ఇరువురూ ఒకరినొకరు మింగేసేలా చూసుకొని చెరొక దిక్కూ, సాగిపోయారు.
*************

మరునాడు ఉదయం పది గంటలకి-
రైజ్ ఇన్స్టిట్యూట్లో పాతిక రూపాయలు పెట్టి రిపేరు చేయించిన ట్రాన్సిస్టిర్ని పట్టుకొని , ‘ఆ’ ఇంటికి చేరుకొన ‘అ;’
‘ ఆ ’వాళ్ల అన్నయ్యకి ఇవ్వబోయే ఉత్తరం కోసం, టిప్ టాప్ గా , తయారయి వచ్చిన ‘క’
వీధి గుమ్మం లోనే ఒకరికొకరు ఎదురయ్యారు !
ఒకరినొకరు తీక్షణంగా చూసుకొన్నారు.
ఆ రోడ్డు మీద పచ్చగడ్డి లేదు గాని, లేకపోతే ఆ చూపుల వేడికి అది కాస్తా భగ్గుమని పెద?ద అగ్ని ప్రమాదం జరిగి ఉండేది !
“ ట్రాన్సిస్టర్ రిపేర్ అయిపోయిందా ?” అడిగాడు ‘క’.
“ ఆ ! దాని మరమ్మత్తు అయిపోయింది, మరొక మరమ్మత్తు బాకీ ఉండి పోయింది.”
“ ట్రాన్సిస్టరు మరమ్మత్తు మీరెలా చెయ్యలేదో తక్కిన మరమ్మత్తులు కూడ మీ చేత కావన్న సంగతి తెలుసుకోండి.”
మెరుపు కొట్టినట్లయింది, ‘అ’ కి.
ఏదో జవాబివ్వాలనుకొని ,‘ అ’ వీధి తలుపులు తీసి బయటికి వచ్చిన వ్యక్తిని చూసి ఆగి పోయాడు.
‘క’ కూడా ఆ మూడవ వ్యక్తిని చూసి ఆగి పోయాడు !
“ రండి, రండి, సరిగ్గా అనుకొన్న సమయానికి వచ్చారు. అలాఅ నిలబడి పోయారేం ! లోపలికి రండి” అన్నాడు మూడవ మనిషి.
‘ క’ ముఖం మీద చిరునవ్వు పులుముకొని, “ ఇంతకీ మీ పరిచయం ?” అని అడిగాడు.
మూడవ మనిషి మధురంగా నవ్వాడు, “ నా పేరు ఖగపతి ! నేను ఆమెకి బావ నవుతాను. నిన్న సాయంత్రం మెయిల్లో వచ్చాను. మా వాడు టాటా వెల్లినట్లు నాకు తెలియనే తెలియదు— ”
“ అలాగా, గ్లాడ్ టు మీట్ యూ !” ‘క’ కర చాలనం చేసాడు.
‘అ’ కూడ అదే విధంగా గొణిగాడు.
ముగ్గురూ లోపలికి వెళ్లి కూర్చొన్నారు.
ట్రాన్సిస్టరు ‘ ఆన్’ అయింది.
“ వండర్ ఫుల్, చాల బాగా రిపేరు చేసారు.! దీనిని మా మరదలికి ప్రెజెంటు చేసింది., నేనే !” నవ్వాడు ఖగపతి.
“చూడండి మిస్టర్ పతిగారూ ! – ” ఏదో అనబోయాడు , ‘క’.
“ అమ్మమ్మ ! అలా పిలువకండి, అలా పిలిచే హక్కు ఆమె కెప్పుడో ధారాదత్తం అయిఫోయింది” వంటింటి వైపు చూపిస్తూ అన్నాడు, ‘ఖ ’( గపతి )
“ ఫో, బావా !” అంటూ లోపలి నుంచి కాపీ గ్లాసులతో వచ్చిన ఆమె మధురంగా సిగ్గు పడింది.
“ మీరు భలేగా జోక్ చేస్తారే ! మరెలా పిలవమంటారు ? ఖగ అనా , లేక ,‘ఖ’ అనా, ప్లేటు ఫిరాయించి ఇష్టాగోష్టికి తలపడ్డాడు, ‘క’.
అలా చెయ్యలేని ,‘అ’ ముఖం పందల పాక ముతక ఖద్దరు బట్టలా వెలవెలా పోయింది.
చప్పున కాఫీ త్రాగేసి,“ మరి నే వస్తానండి, చిన్న పనుంది,” అంటూ బయట పడ్డాడు.
పాతిక రూపాయలు పే చేసిన బిల్లు కాగితం అతని చేతిలో నలిగి పరపర లాడింది.
*************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద