మంటల్లో మైకా గని 1
(స్త్రీ పాత్ర లేని దృశ్య నాటిక )
( రంగ స్థలం మీద రెండు దృశ్యాలు ఉండాలి. ఒక ప్రక్క ‘మహాలక్ష్మీ మైకా మైన్స్’ ఛీఫ్ ఇంజనీయరు ఆఫీసు. రెండవ భాగం
అంతా, వర్కింగ్ స్పాటు. వర్కింగు స్పాట్లో , ఒక బెంచీ, దానికి ఒక’ బెంఛి వైస్ ఉండాలి. తక్కిన అలంకరణ అంతా యథోచితం )
(ముందుగా ఆఫీసు గదిలో లైట్లు వెలిగించాలి. రెండవ భాగం చీకటి)
( తెర లేచే సరికి ఛీఫ్ ఇంజనీయరు విష్ణుప్రసాదు కుర్చీలో కూర్చొని ఉంటాడు.పేపరు తిరగవేస్తూ ఉండగా, టెలిఫోను మ్రోగుతుంది. విష్ణు రిసీవరు అందుకొంటాడు )
విష్ణుప్రసాద్ --- హలో, ఛీఫ్ ఇంజనీయర్ విష్ణుప్రసాద్ స్పీకింగ్ !
[ టెలిఫోను నుండి ఆపరేటర్ వాయిస్,( స్త్రీ గొంతుక అయితే బాగుంటుంది), వినిపిస్తుంది ) ]
ఆపరేటర్ ---- గుడ్ మార్నింగ్ సార్ ! మేనేజింగ్ డైరక్టర్‘ మిస్టర్ సక్లేచా ’ ఆన్ లైన్.
విష్ణుప్రసాద్ ---- కనెక్ట్ హిం !
( కనక్ట్ చేసిన చప్పుడు)
సక్లేచా -- మిస్టర్ ప్రసాద్ !
విష్ణుప్రసాద్ ---- గుడ్ మార్నింగ్ సార్ !
సక్లేచా --- గుడ్ మార్నింగ్ ! ఈ రోజు ఉదయం వార్తా పత్రిక చూసారా ?
విష్ణుప్రసాద్ ---- లేదు సార్ ! ఇప్పుడే చూస్తున్నాను.
సక్లేచా --- వినండి, మైకా రేటు అంతర్జాతీయ విపణిలో పడిపోయింది, మన మైన్సు ఉత్పాదన చాలా ఎక్కువగా ఉంది, అవునా ?
విష్ణుప్రసాద్ ---- అవును సార్ !
సక్లేచా --- మనదగ్గర సరుకు చెల్లేవరకు, ఉత్పత్తి ఖర్చులు తగ్గించాలి., అర్థమయిందా ?
విష్ణుప్రసాద్ ---- అర్థమయింది సార్ ! మైకా డ్రిల్లింగు తగ్గించి , ఉత్పత్తిని అదుపులో పెట్టాలి.
సక్లేచా ---- మిస్టర్ ప్రసాద్ ! అర్థం లేని పధ్ధతులు వద్దు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.మేనేజుమెంటు తనంత తానుగా ఉత్పత్తిని ఆపే పని చెయ్యకూడదు, కార్మికులే పని మానివేసేలా చేయాలి –
విష్ణుప్రసాద్ ---- అదెలా సాధ్యమవుతుంది సార్ ! కార్మికులు తమంత తాముగా పని మానేయాలంటే ---
సక్లేచా --- వాళ్ల చేత స్ట్రైకు చేయించండి ! ఫేక్టరీలో సమస్య సృష్టించి అల్లర్లు పెరిగేలా చేయండి. కార్మికులని సమ్మెలో దిగేలా చేయండి. అర్థమయిందా ?
విష్ణుప్రసాద్ ---- అర్థమయింది సార్ !
( టెలిఫోను పెట్టేసిన శబ్దం )
( విష్ణుప్రసాదు తన టేబిలు మీదనున్న చిన్న డేన్సింగు బొమ్మని గిరగిరా త్రిప్పుతూ ఆలోచనలో పడతాడు )
( ఇంతలో రెండవ బాగం నుండి సుత్తితో కొడుతున్న శబ్దం . రంగ స్థలం ఈద పూర్తిగా లైట్ళు వెలుగుతాయి. ఆ వెలుగులో కార్మికుడు ‘వెంకట్ ’ బెంచీ మ్ది వైసులో జాబ్ బిగించి, దానిని ఛిసెలింగు చేస్తూ ఉంటాడు. విష్ణుప్రసాద్ ఆ ధ్వనికి ఆకర్షితుడయి, అటువైపు వస్తాడు. బెంచి వైసుకి మీదుగా, ‘ సురక్షా వారము’ అన్న పోస్టరు ఒక కొసన అతికించబడి ఉంటుంది. దాని క్రిందనే మరొక పోస్టరు ఒక కొసన అతికించబడి రెండవ కొస ఊడి ఫోయినందు వల్ల వ్రేలాడుతూ ఉంటుది. ఆ పోస్టరులో ఏముందో బయటికి కనిపించ కూడదు )
( వెంకట్ చేతిలోని సుత్తి హేండిల్ నుండి మాటిమాటికి జారిపోతూ ఉంటుంది. అయినా అతను హేండిల్ని మార్చడానికి ప్రయత్నించడు. హేండిల్ని తిరగేసి బెంచీ మీద కొడుతూ ,జాబ్ పూర్తి చేస్తాడు. పూర్తి అయిన తరువాత, దానిని తీసుకొని వెళ్లిపోతాడు. వెళ్లేటప్పుడు వైసుని ముయ్యడు. సుత్తిని అక్కడే వదిలేసి వెల్లిపోతాడు )
(విష్ణుప్రసాద్ , అతను వెళ్లిన తరువాత, అక్కడికి వచ్చి, సుత్తిని చేతిలోకి తీసుకొంటాడు.. దాని హేండిల్ ఎంత డీలాగా ఉందో పరీక్షించి, దానిని తీసుకెళ్లి తన గదిలో పెడతాడు )
( ఈ సారి మరో కార్మికుడు ‘ధర్మయ్య’ వచ్చి, వైసులో జాబ్ బిగించి, ఫైలింగు చేస్తాడు. ఫైలు హేండిల్ నిలువునా చీలిపోయి ఉంటుంది. ధర్మయ్య జేబులోంచి జూటు / కాటన్ వేస్టు తీసి, హేండిల్ని పట్టుకొని తన పని పూర్తి చేస్తాడు. తరువాత జాబ్ తీసుకొని, ఆ పైలుని అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. విష్ణుప్రసాద్ ఆ ఫైలుని కూడా తీసుకొని వెళ్లి తన రూములో పెడతాడు )
( ఈ సారి స్వీపరు ‘కన్నయ్య’ చేత బాల్చీలో తుడిచే సామగ్రి ఉంటుంది. వచ్చి చీపురుతో బెంచీని క్లీన్ చేసి, తెర మీదుగా వ్రేలాడుతున్న పోస్టరుని చింపి, బాల్చీలో కుక్కేస్తాడు.తరువాత బాల్చీ పట్టుకొని వెళ్లిపొతూ ఉండగా బాల్చీ కాడ ఊడి వచ్చి, చెత్తంతా స్టేజి మీద పడిపోతుంది. ఇదంతా చూస్తున్న విష్ణుప్రసాద్ ,కోపంతో కన్నయ్య దగ్గరకి వస్తాడు )
విష్ణుప్రసాద్ ---- బ్లడీ ఫూల్ ! బొక్కెన ఎత్తే ముందు , దాని కాడ సమంగా ఉందో లేదో చూసుకో వద్దూ ! పనిలో ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. ( బాల్చీ హేండిల్ని కూడ చేతిలోకి తీసుకొని ) సురక్షా వారంలో నువ్వు చేసిన ఈ ఛండాలపు పనికి ,. నిన్ను ఈ రోజు నుండి సస్పెండు చేస్తున్నాను. ( రూము లోనికి వెల్లి ఒక కాగితం తీసుకొని వచ్చి, ) ఇదుగో నోటీసు ! రేపటి నుంచి పనిలోకి రానక్కర లేదు, వెళ్లు .
( కన్నయ్య నోటీసుని చేతిలో పటుకొని దిగులుగా కాసేపు నిల్చొంటాడు )
కన్నయ్య --- తప్పయి పోనాది బాబూ , చమించండయ్యా ! ఆ తొక్కంతా ఎత్తి మళ్లీ సఫు చేసేస్తాను. ఈ కాయితం వాపసు
చేసేయి బాబూ ! ( అంటూ చీపురుతో తొక్కులన్నీ ఒక మూలకి తుడుస్తాడు )
విష్ణుప్రసాద్ ---- చేసిన ఘనకార్యం చాలు. పో ! నా కంటి కెదురుగా నిలబడకు వెళ్లు.
( కన్నయ్య ఇంకేదో అనబోయి అభిమానం అడ్డురాగా చీపురు మూల పడేసి, వొంగు వైపు రెండడుగులు వేస్తాడు. వింగు లోంచి వెంకట్, ధర్మయ్య వస్తారు )
ధర్మయ్య --- ఏం జరిగింది కన్నయ్యా ?
కన్నయ్య --- ఇంజనీయరు బాబు సస్ పెంచన్ కాయితం ఇచ్చిండన్నా ! రేపటి నుండి పన్లోకి రాకూడదంట !
( నల్ల టోపీ యూనియన్ నాయకుడు రెడ్డి ప్రవేశం )
ధర్మయ్య ---- అదుగో నల్లటోపీ రెడ్డిబాబు వచ్చిండు, అతన్తో చెప్పు.
రెడ్డి ----- ( వస్తూనే ) ఈ నోటీసు చూసి భయపడుతున్నావు కదూ ! వద్దు నేస్తం భయపడకు, విచారంతో చెంపలేసుకొని, ఇది నా ఖర్మ అనుకొని, అణిగి మణిగి ఆత్మ వంచన చేసుకొంటూ, వెట్టి చాకిరీ చేసే, రోజులు పోయాయి దోస్త్ ! ఆ
రోజులు పోయాయి. చింతించ వలసింది ఈ కాగితాన్నందుకొన్న నువ్వు కాదు, దీన్ని నీ ముఖాని కేసి కొట్టిన ఈ పెద్ద మనిషి, బూర్జువా వర్గానికి ప్రతినిధి అయిన ఈ ఇంజనీరు చింతించాలి. కార్మికుల జాతకాల మీద కలం పోటు పెట్టిన , పెడ్తున్న, ఈ ఇంజనీరు చెయ్యి ఈ నాటిది కాదు కామ్రేడ్ ! తరతరాలుగా కార్మిక వర్గాన్ని, ‘చెప్పు క్రింద తేలులా’, చప్పున నలిపేస్తూ , గుప్ చుప్ గా తమ బావుటా లెగరేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థది ! భవిష్యత్తులో ఈ చెయ్యి మళ్లీ నిన్ను శాసించకుండా, దానిని నరికి పారెయ్యాలి కామ్రేడ్ ! అందుకు మీరంతా ఏకం కావాలి. నా ‘ నల్ల టోపీ ’ క్రిందకి వచ్చి--- ( జేబులోంచి మూడు నల్ల టోపీలు తీసి ముగ్గురి తల మీదా పెడతాడు ) ఒక్కరుగా సాధించ లేని పనిని ఐకమత్యంతో, సాధించాలి. ఇన్కిలాబ్ జిందాబాద్ , ఇన్కిలాబ్ ---
( ధర్మయ్య , కన్నయ్య, వెంకట్ , రెడ్డి ఉపన్యాసంతో వేడెక్కి అతను ఇన్కిలాబ్ అనగానే జిందాబాద్ అని అరుస్తారు )
( ఆ నినాదాలకి విష్ణుప్రసాద్ , ఆఫీసు గది నుంచి బయటికి వస్తాడు, అతనిని చూసి రెడ్డి రెచ్చిపోతాడు )
రెడ్డి --- ( ప్రసాద్ తో ) హలో మై డియర్ ఇంజనీర్ ! ఇంత ఉదయమే వర్కింగు స్పాటుకి రావలసిన కారణ మేమిటో ! వచ్చిన వాడివి వచ్చినట్లుండక , నీ మేనేజిమెంటులోని ఒక స్వీపరుకి సస్పెంషన్ నోటీసు ఇవ్వాల్సిన అవసరమేమిటి ! రాత్రి పాదసేవ చెయ్యాల్సిన పెళ్లాం వరస తప్పి, బడితె పూజ చేయలేదు కద !
విష్ణుప్రసాద్ ---- మిస్తర్ రెడ్డీ ! మీరు చాలా అధికంగా మాట్లాడుతున్నారు. కన్నయ్యకి ఇచ్చిన కారణం అడుగు తున్నావు కదూ ? పనిలో అశ్రద్ధ, నిర్లక్షాలే దానికి కారణం ! కన్నయ్యే కాదు, ఈ వెంకట్, ధర్మయ్య వీళ్లందరూ, మీరు మాట్లాడుతున్న భాషలోని, లేక మీ పరిభాషలోని కార్మిక వర్గానికి కాదు, పేరుకొన్న బధ్ధకానికి, నిర్లక్ష్యానికి ప్రతినిధులు ! ఇదుగో ఆ విషయాన్ని ఇప్పుడే రుజువు చేస్తాను. ( అని, వింగులోకి చూస్తూ, ‘పెంటయ్యా ’అని పిలుస్తాడు ప్యూను పెంటయ్య ,‘ అయ్యా ’అంటూ వస్తాడు) పెంటయ్యా ! అదుగో ఆ కన్నయ్య బాల్చీలోని పోస్టరుని తీసి గోడకి అతికించు.
( పెంటయ్య గోడ మీద పోస్టరుని బాల్చీ లోమ్చి బయటికి తీస్తాడు.)
రెడ్డి ---- ఏమన్నావ్, ఇంజనీర్ ! వీళ్లు – వీళ్లా బధ్ధకస్తులు ? ఈ కార్మిక వర్గం, నిర్లక్ష్య వైఖరి అవలంబించి, బధ్ధకించిన నాడు, కాలమే స్తంభించి పోతుంది ! అండర్ స్టాండ్ ! గుట్టలు గుట్టలుగా నీ గౌడౌన్సులో పేరుకొని , కళ్ళు చెదిరేలా మెరిసిపోయే ఈ కాకి బంగారం కూడా తళుకు తగ్గి పెంట పాలు కాక తప్పదు , తెలిసిందా ! నీ భాషలోని కార్మికునికీ, నా పరిభాషలోని కార్మికునికీ చాల వ్యత్యాసముంది మిస్టర్ ! ఈ రోజు ఆ వ్యత్యాసాన్ని నీకు వెలికి తెచ్చి చూపిస్తాను. మరో ప్రపంచపు మార్గం వైపు కార్మిక రథాన్ని కదిలిస్తాను ! కార్మిక సోదరుల అండదండలతో స్వర్గ ద్వారాలని
తెరిపిస్తాను..
( ఈ లోగా పెంటయ్య పోష్టరుని పట్టుకొని నిలబడతాడు ఆ పోస్టరు ఇలా కనిపిస్తుంది)
సురక్షా వారము ( సేఫ్టీ వీక్ )
హేండిల్లు పనిముట్లని
నడిపే సాధనాలు.
సురక్ష కోసం వాటిని
జాగ్రత్తగావాడుకోవడం
అపాయాలని కలుగ
జేయవు.
లూజు హేండిలు చీలి పోయిన హేండిలు విడిపోయిన హేండిలు సురక్షా సూచన
విష్ణుప్రసాద్ --- మిస్టర్ రెడ్డీ ! ఈ ఉపన్యాస వన విహారం చాలించి ప్రస్తుతం లోకి రండి. అదుగో ఆ పోస్టరు చూడండి. ఈ వెంకట్, ధర్మయ్య, కన్నయ్యలు ముగ్గురూ ఆ పోస్టరులో చూపించిన విధం గానే లూజు హేండిల్, చీలి పోయిన హేండిలు, ఊడి పోయిన హేండిల్లు కలిగిన పనిముట్లతో పని చేసారు. ( వాటిని, అంటే సుత్తిని, ఫైలుని, బాల్చీకాడనీ చూపించి ) వాళ్ల తప్పు వాళ్లకి తెలియాలనే వీటిని ఇక్కడ పోగు చేసాను.
రెడ్డి ---- సురక్షా వారంలో సురక్షకి విరుధ్ధంగా పని చేసిన వాళ్ల మీద చర్య తీసుకోవచ్చు. కాని హఠాత్తుగా సస్పెన్షన్ నోటీసు ఇవ్వడం ఏ మేనేజుమెంటు రూల్సులో ఉంది.? పైగా తప్పు చేసిన వాళ్లు ముగ్గురయితే కన్నయ్యని మాత్రమే శిక్షించడంలో న్యాయమేమిటి ?
విష్ణుప్రసాద్ --- వాళ్ళిద్దరూ పాడైపోయిన హేండిళ్లతో పని చేసినా, ఏదో విధంగా పని ముగించి వెళ్లిపోయారు. కన్నయ్య పని పాడు చేశాడు, అంటే కాదు, గోడనుండి వ్రేలాడుతున్న పోస్టరుని, సరిచేసి అంటించడం గాని, చేయమని ఇంకొకరికి చెప్పడం గాని చెయ్యకుండా, చింపి చెత్తబుట్టలో కుక్కేసాడు ! ఒక ముఖ్యమయిన పోస్టరు ద్వారా చెప్పిన దానిని, నిరాకరించడమే గాక, దాన్ని చించి పారేయడం, అనుశాసన నియమాలకి విరుధ్ధం ! అందుకే కన్నయ్యకి నోటీసు ఇవ్వడం జరిగింది.
రెడ్డి --- ‘ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వెయ్యడం ’, ఘనత వహించిన తమరి కొలువులోనే చూసాను ! మీ ఆవేశం ఆ పోస్టరు గోడ నుండి అలా వ్రేలాడుతూ ఉండడానికి , ఈ పనిముట్లు ఇలా పాడైపోయి ఉండడానికీ, కారకులైన వారి మీద చూపించండి ! దానికి భాధ్యులెవరు, మేనేజిమెంటు కాదూ ! మాట్లాడరేం ?
విష్ణుప్రసాద్ --- అవి అలా ఉన్నందుకు మేనేజిమెంటు భాద్యత ఇరవై శాతం మాత్రమే , తక్కిన ఎనభై శాతం కార్మికులదే ! అయినా విషయానికి రండి మిస్టర్ రెడ్డీ ! ఈ కార్మికులని కూడ గట్టుకొని , మీరు చేయదలచు కొన్న దేమిటి , మీ డిమాండు ఏమిటి ?
రెడ్డి --- ఇంజనీయరు ప్రసాదు గారూ ! కాస్త దిగి రండి . అహంకారపు శిఖరాలు అవరోహించి, ఆవేశపు టలలు అధిగమించి, మానవత్వపు సరిహద్దుకు దిగిరండి ! అలా వచ్చి, ఈ కన్నయ్య కాళ్ల మీద పడి, ఇచ్చిన నోటీసు విత్ డ్రా చెయ్యండి..
విష్ణుప్రసాద్ --- ఆశ్చర్యంగా, అర్థరహితంగా ఉంది, మిస్టర్ రెడ్డీ, నేను కన్నయ్య కాళ్లమీద పడాలా ! దేనికని ?
రెడ్డి --- జరిగిన దాంట్లో ఇరవై శాతం, మేనేజిమెంటుదు కూడ ఉండి గనుక, ఆ విషయం నువ్వే ఒప్పుకొన్నావు ! కన్నయ్యే కాక, మరో ఇద్దరు ఆ పోస్టరుని నిర్లక్ష్యం చేసినా, అందరి వంతు శిక్ష అతనికే ఇచ్చావు గనుక ! పోస్టర్ని నిర్లక్ష్యం చెయ్యడం అనుశాసన నియమాలకి విరుధ్ధమని, ఆ నియమాలకి కొత్త భాష్యం చెప్పావు గనుక ! ( కన్నయ్య భుజం తడుతూ ) అంతే కదూ, కన్నయ్యా ! నీకు సరైన న్యాయం జరగాలంటే, ఈ రోజు ఈ ఇంజనీయరు చేతుల్లో కార్మిక వర్గానికి జరిగిన అవమానాన్ని కడిగి పారేయాలంటే, అదొక్కటే దారి ! ఏమంటావు కన్నయ్యా, నేనన్నది సబబేనా ?
(కన్నయ్య అవునన్నట్లు తల ఊపుతాడు, వెంకట్ ధర్మయ్య లిద్దరూ, ఒక్క అడుగు ముందుకు వేసి, ఒక చూపుడు వ్రేలుతో ఇంజనీర్ని, మరొక చూపుడు వ్రేలితో కన్నయ్య పాదాలనీ చూపిస్తారు. తెరవెనుక నుండి, “ ఇంజనీర్ డౌన్, డౌన్” అన్న స్లోగన్సు వినిపిస్తాయి )
రెడ్డి --- విన్నావా ఇంజనీయర్ ! ఇదే మా కార్మికుల డిమాండ్ ! నోటిసు తిరిగి తీసుకొని, నువ్వు కన్నయ్య కాళ్లు పట్టుకొనే దాకా, ఈ కార్మికులెవరూ, పనిముట్లు పట్టుకోరు. అంతేనా కామ్రేడ్స్ !
( తెరలో నుండి, , “ ఇన్కిలాబ్ జిందాబాద్, ఇంజనీర్ డౌన్ డౌన్ ” అంటూ స్లోగన్సు ! వినిపిస్తాయి )
( ఇంతలో రెడ్డికి ఎదురుగా ఉన్న వింగులోంచి, “ ఆగండి, సోదరులారా, ఆగండి, తొందర పడకండి” అంటూ , తెల్లటోపీ
యూనియన్ నాయకుడు ‘పంతులు’ ప్రవేశిస్తాడు )
పంతులు --- ( వస్తూ ) సోదరులారా ! తొందర పడకండి. ( అంటాడు )
( వెంకట్, ధర్మయ్య, కన్నయ్యలు తమ పొజిషన్ నుంచి విత్ డ్రా అవుతారు )
రెడ్డి --- ఓహో, తెల్లటోపీ పంతులు గారా ! ఈ సుగంధం తమదాకా ఎలా ప్రాకిందో ?
పంతులు -- ( రెడ్డితో ) ఎక్కడ సుగంధం ఉంటుందో , ఈ పంతులు అక్కడ ఉంటాడు. ( కార్మికులతో ) సోదరులారా ! నా మాట వినండి. జరిగిన దానికి, భూతద్దం పట్టి, రాజకీయపు రంగులు పులిమి, వ్యక్తిగతమైన సమస్యని వర్గ గతం, జాతి గతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ నల్లటోపీ మాటలు నమ్మకండి. వివేకంతో విచక్షణ చేసి, సమస్యని తూర్పార బెట్టండి. కన్నయ్యకి ఇంజనీరు ఇచ్చిన నోటీసు విత్ డ్రా చేయించడానికి మీరందరూ సమిష్టిగా సమ్మె చేయ్యనక్కర లేదు. శాంతియత పరిష్కారానికి ఎన్నో దారులుండగా, సమ్మెనే ఎన్నుకోవడం. ఈ నల్లటోపీ నాయకులకే చెల్లింది. కన్నయ్య గాని, అతని తరఫున ఎవరో ఒకరు గాని, నిరాహార దీక్ష అవలంబిస్తే, ఈ ఇంజనీరేం ఖర్మ ! సాక్షాత్తు సోనియా గాంధీయే దిగి వచ్చి, కర్మిక వర్గానికి జై కొట్టక తప్పదు.
విష్ణుప్రసాద్ --- సరే ! మీ యూనియన్లకి, వర్కర్లకీ మధ్య నే నెందుకు ? ఏ మాలోచిస్తారో ఆలోచించి మీ తుది నిర్ణయం నాకు తెలియజేయండి ( ఆంటూ వెళ్లిపోతాడు )
***********

Comments
Post a Comment