Skip to main content

మంటల్లో మైకా గని ౩

మంటల్లో మైకా గని ౩

( ప్రవేశం సక్లేచా. విష్ణుప్రసాద్ )

సక్లేచా ---- మిస్టర్ ప్రసాద్ ! మీరు చెప్పింది నిజమే ! డ్రిల్సులో నిద్ర పోతున్న డైనమైట్లు ప్రేలినట్లయితే, గని దారులు మూసుకొని పోయే ప్రమాదం ఉంది. పరిస్థితి నిజంగానే ప్రమాదకరంగా ఉంది. నీకేమైనా ఉపాయం కనిపిస్తోందా ?

విష్ణుప్రసాద్ --- కార్మికులు వీలయినంత త్వరగా పనిలో చేరడమే దీనికి తరుణోపాయం !

సక్లేచా --- అవును అదొక్కటే తరుణోపాయం ! కార్మికులు అతి త్వరలో పనిలో ప్రవేశించాలి. నేను యూనియన్ నాయకులని వెంటనె పిలిపిస్తాను. మీరు వాళ్లతో కాంప్రమైజు అయిఫోండి.

విష్ణుప్రసాద్ ---- ( బాధతో ) నిజమే సర్ ! మీరు చెప్పింది చాల బాగుంది. వర్కర్సుతో సంఘర్షణ తెచ్చుకొని సమ్మె చేయించమన్నది మీరే ! తిరిగి వాళ్లతో కాంప్రమైజు అయిపోయి సమ్మెని ఆపేయమన్నదీ మీరే ! మీరు పెద్దలు, ఎప్పుడేం మట్లాడినా మీకే చెల్లింది. మేము మీ చేతిలో కీలుబొమ్మలం, ఆడించినట్లల్లా ఆడాలి, హు ! మేనేజిమెంటులో ఒక భాగమయిన నన్ను కూడా, మీరు సామాన్య కార్మికునిలాగే ట్రీట్ చేసారు. మీలాంటి ఎం.డిల దగ్గర పని చేసేకన్న స్వతంత్రించి పని చేసుకోవడం చాల మంచిది. ( రీములోపలికి వెళ్లి ఒక కాగితం మీద ఏదో వ్రాస్తాడు. ఆ తరువాత బయటికి వచ్చి ) ఇదుగో నా రాజీనామా పత్రం ! ఈ రోజు నుండి, నన్నీ కంపెనీ ఛీఫ్ ఇంజనీరు భాద్యత నుండి, విముక్తుణ్ని చెయండి.

( కాగితం ఏం.డి చేతికి ఇచ్చి వెళ్లిపోతాడు )

సక్లేచా – (విష్ణుప్రసాద్ వెళ్లినా వైపు చూస్తూ ) గుడ్ బై మిస్టర్ ప్రసాద్ ! మీ రాజీనామా పత్రం కూడా నాటకీయంగా మంచి సమయంలో వచ్చింది ! దీన్ని వర్కర్సుకి చూపించి, సమస్యని సులువుగా పరిష్కారం చేయవచ్చు.!

( సక్లేచా ,వింగు వైపుకి చూస్తూ “పెంటయ్యా” అని పిలుస్తాడు )

( పెంటయ్య , “బాబూ ” అంటు వస్తాడు )

సక్లేచా – తెల్లటోపీ పంతులు గారిని పిలు.

( పెంటయ్య వెళ్తాడు. అదే వింగు నుండి పంతులు వస్తాడు )

సక్లేచా -- గుడ్ మార్నింగ్ మిస్టర్ పంతులూ ! ( అని షేక్ హేండ్ చేస్తాడు.)

పంతులు --- వెరీ గుడ్ మార్నింగ్ సార్ ! మీరు నన్ను పిలిచారట !

సక్లేచా --- అవును ప్రస్తుత పరిస్థితి గురించి మీతో డిస్కస్ చేయడానికి పిలిచాను.చిన్న ప్రిస్టేజి ఇష్యూ గురించి, కార్మికులు ఇలా డైరక్టుగా సమ్మె చేయడం బాగులేదు !,

పంతులు -- సమ్మె నా ఆద్వర్యంలో జరగడం లేదు. ఆ విషయం మీరు గమనించాలి.

సక్లేచా --- ఆ విషయం నాకు తెలుసు పంతులుగారూ ! మీరు మేనేజిమెంటు చేత గుర్తింపబడిన యూనియన్ నాయకులు సమ్మె ఎలా జరిగినా, ఎవరి వల్ల జరిగినా, దానిని ‘కాల్ ఆఫ్ ’చేసే అధికారం మీకే ఉంది ! ఇదుగో ఇది చూడండి, ఇది చీఫ్ ఇంజనీరు ప్రసాద్ ఇచ్చిన రాజీనామా పత్రం ! అతను కన్నయ్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు నేను ఆ విషయంగా అతనితో ఘర్షణ పడ్డాను. ఈ సమ్మెకి నేను అతనినే భాధ్యుణ్ని చేసాను ! అందుకే అతను రిజైను చేసాడు. ఇప్పుడు సమస్యకి పరిష్కార మార్గం కనిపించినట్లే కదా ! మీరు వర్కర్సుని ఈ పత్రాన్ని చూపీంచి వాళ్లు రాజీకి వచ్చి, వెంటనే పనిలో చేరేలా చేయండి.

పంతులు – కన్నయ్యకి, సస్పెంషన్ నోటీసు జారీ చేసిన ఇంజనీరు అది విత్ డ్రా చెయ్యకుండానే, రిజైను చేసాడు. ఇప్పుడా నోటీసుని ఎవరు విత్ డ్రా చేస్తారు ?

సక్లేచా -- కొత్త సి. ఇ. చేస్తాడు. లేదా నేను చేస్తాను.

పంతులు --- ఇన్ని రోజులుగా సమ్మె చేసిన కార్మికుల సంగతి ఏమిటి ? వాళ్లకి జీతం నష్టం కలగదని మీరు హామీ ఇస్తారా ?

సక్లేచా – (చేతులు నలుపుకొంటూ ) అదెలా వీలవుతుంది, ‘ నో వర్క్ నో పే’ ( నవ్వి ) మీకు తెలిసిందే కదా ?

పంతులు --- పనిలో చేరిన తరువాత వర్కర్సు మీద ఎలాంటి విక్టిమైజేషన్ చర్యలు తిసుకోమని అగ్రిమెంటు ఇవ్వగలరా ?

సక్లేచా -- పంతులుగారూ ! ముందు వాళ్లని పనిలో జాయన్ అవనవ్వండి. ఆ తరువాత మనమందరం కూర్చొని మాట్లాడుకొందాం..

పంతులు --- అలాంటప్పుడు నేనీ సమ్మెని విరమించమని కార్మికులని ఒప్పించలేను.. ఈ పని నా వల్ల జరగదు.!

సక్లేచా --- సరే పంతులుగారూ ! ‘నల్లటోపీ’ నాయకత్వంతో ఒప్పందం కుదురినట్లియితే, మీ ‘తెల్ల టోపీ’ యూనియన్ గుర్తింపుని రద్దు చేసి, వళ్లకి గుర్తింపు ఇవ్వ వలసి ఉంటుంది. బహుశా మీకు తెలుసనే అనుకొంటాను.

పంతులు – అలాగే కానివ్వండి, ‘ జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల’ అన్నట్లు, మా తెల్లటోపీ యూనియన్కి ఒకరి గుర్తింపుతో పనిలేదు, నేను వెళ్తాను. ( పంతులు వెళ్లిపోతాడు )

సక్లేచా --- పెంటయ్యా ! నల్లటోపీ రెడ్డిగారిని పిలు !

( పెంటయ్య వింగునుండే , అలాగే బాబూ” అంటాడు. తరువాత ఆ వింగునుండే, రెడ్డి, కన్నయ్య ప్రవేశిస్తారు )

సక్లేచా -- ( రెడ్డితో కరచాలనం చేస్తాడు,) గుడ్ మార్నింగ్ మిస్టర్ రెడ్డీ !

రెడ్డి --- గుడ్ మర్నీంగ్, ఎందుకో పిలిపించారట ?

సక్లేచా --- అవును, సమ్మె విరమించమని మిమ్మల్ని అభ్యర్థన చెయడానికి పిలిచాను. ( కన్నయ్య భుజం మీద చెయ్యి వేసి ) ఈ కన్నయ్య సస్పెండు చేసి, సి. ఇ.ప్రసాద్ పెద్ద పొరపాటు చేసాడు. ఇన్ని రోజుల సమ్మె, ఇంత ధన నష్టం అతవ్ని కారణం గానే జరిగింది. దానికి మిమ్మల్ని గాని, వర్కర్సుని గాని నిందించిన చెయ్యాల్సిన పనిలేదు ! కాని వెంటనే సమ్మె ప్రకటించకుండా నాకు చెప్పి ఉంటే, ఈ విషయాన్ని ఇంతవరకు రానిచ్చేవాడిని కాను. సరే ఏమైతేనేం , ఛీఫ్ ఇంజనీరు ప్రసాద్ తన తప్పు తెలుసుకొని, రిజైన్ చేసి వెళ్లాడు. ఇదుగో ఆ లెటర్ ! ఇక సమస్య తీరిపోయిందని భావించ వచ్చా ?

( సక్లేచా మాటలు ముగియగానే , ‘వెంకట్’ గాభరాతో ప్రవేశిస్తాడు )

వెంకట్ ---- గోరం జరిగిపోనాది బాబూ ! గోరం !

సక్లేచా --- ఏమయింది వెంకట్ ?

వెంకట్ --- మన ధర్మయ్య , రక్తపు మడుగులో మైకా గుట్టల చాటున చచ్చి పది ఉన్నాడు బాబూ ! పంతులు గారు, ఇనస్పెక్టరు బాబు కూడా అక్కడే ఉన్నారు.

సక్లేచా + రెడ్డి --- ఆ ! ధర్మయ్య చనిపోయాడా ?

( పంతులు, అతని వెనుకనే ఇనస్పెక్టరు ప్రవేశం)

పంతులు -- కాదు, ధర్మయ్య చనిపోలేదు, చంపబడ్డాడు.. రాజకీయ చదరపు టెత్తులకి. బలి పశువు అయి, రక్తపుటేరుల మధ్య శాశ్వత విశ్రాంతి తీసుకొన్నాడు. ఇనస్పెక్టర్ , ( రెడ్డిని చూపిస్తూ ) ఇదుగో ఈ నల్ల టోపీ నాయకుడే ఆ కిరాతక చర్యని అమలు జరిపిందింది.తన పలుకుబడి కోసం, మనుష్యుల ప్రాణాలకి గడి పోచలకున్న, విలువ కూడ ఇవ్వని , ఇతనే ఆ హంతకుడు ! పట్టి అరెస్టు చెయ్యండి.

( పంతులు ఆ మాటలంటూ ఉండగానే , రెడ్డి వెనకాల్ ఉన్న ‘కన్నయ్య’ పార్తిపోయే ప్రయత్నం చేస్తాడు. ఇనస్పెక్టర్ ఒక్క అంగలో అతనిని చేరుకొని జబ్బ పట్టుకొంటాడు )

రెడ్డి --- ( కోపంతో ) పంతులూ, ఏమిటిది, నా మీద హత్యానేరం ఏమిటి ? సంధి ప్రేలాపన కాదు గదా ?

ఇనస్పెక్టర్ -- సంధి ప్రేలాపన కాదు రెడ్డిగారూ ! ధర్మయ్య ఇచ్చిన డయింగు డిక్లరేషన్ ! నీ ఆఙ్ఞమేరకి కన్నయ్య అతనిని కొట్టి హతమార్చినట్లు స్టేటుమెంటు ఇచ్చాడు. రెడ్డీ ! ధర్మయ్య హత్యానేరం మీద నిన్నూ, కన్నయ్యనీ అరెస్టు చేస్తున్నాను.

( అంటూ జేబులోంచి, ఒక తాదు తీసి, ఇద్దరి చేతులకీ చెరొక కొస కడతాడు.. అతనలా కడుతూ ఉండగానే , తెర లోంచి పెద్ద ‘ధమాకా’ , డైనమైటు ప్రేలిన చప్పుడు వినిపిస్తుంది )

( అందరూ ఆశ్చర్యంతో తెరవైపు చూస్తాడు. పెంటయ్య చేత్తో ఒక పంజరంతో ప్రవేశిస్తాడు. పంజరంలో ఒక చిలక, దానికి వ్రేలాడుతూ ఒక పాము, ఆ పాము పడగ మీద, ఒక మణి ఉంటాయి )

పెంటయ్య --- భయపడకండి, మిస్టర్ సక్లేచా ! అది డైనమైటు ధ్వని ! ఇంకా ఒక్కటే మాత్రమే ప్రేలింది. తక్కినవి ఎప్పుడు ప్రేలుతాయో తెలియదు ! మీరు ఒక్కరూ అక్కడికి వెళ్లి ఏమీ చెయ్యలేరు. ఇక్కడే నిలబడండి, ( అంటూ పంజరాన్ని స్టేజికి మధ్యగానున్న హుక్కుకి తగిలిస్తాడు )

సక్లేచా --- పెంటయ్యా ! ఏమిటిది ? నన్ను పేరుపెట్టి పిలిచే సాహసం నీకు ఎలా వచ్చింది, ఈ పంజరం , చిలక , పాము బొమ్మలు ఏమిటి ?

పెంటయ్య --- మిస్టర్ సక్లేచా ! ‘ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను పెంటయ్యని కాను, సి.బి.ఐ. ఇనస్పెక్టరు పతంజలిని ! ( కార్డు తీసి చూపిస్తాడు ) నీ మైన్సులో మైకా ఎగుమతులలో , రవాణాలో జరుగుతున్న గడబిడని కనిపెట్టేందుకు, మీ సి.ఇ. ఆఫిసు ప్యూనుగా కంపెనీ ఉద్యోగంలో చేరాను. వారం రోజులుగా జరుగుతున్న సమ్మె అంతర్నాటకానికి ప్రత్యక్ష సాక్షిని నేను. పొతే ఈ పంజరం ఏమిటని కదూ నీ ప్రశ్న ? వినండి, అందరూ వినండి. ‘ఈ పడగ మీద మణి’ మనిషి స్వార్థానికి చిహ్నం ! ఆ మణిని అందుకోవాలని, ప్రయత్నించే స్వార్థపరులు, పాము కాటికి గురి కాకుండా తప్పించుకోలేరు. మీ విషయమే తీసుకోండి, సక్లేచా, మీరు మీ స్వార్థం కోసం, కార్మికులని, చిలకలుగా చేసి సమ్మె అనే పాముకి ఏర వేయాలని చూసారు. చివరికి జరిగిందేమిటి ?

సక్లేచా -- యూ ఆర్ కరెక్ట్ మిస్టర్ పతంజలీ ! నా ప్లానుని డైనమైటు తలక్రిందులు చేసింది. నేను మిగల్చాలను కొన్న ధనానికి రెండింతలు ఖర్చయేలా చేసింది. లభం గూబల్లోకి వచ్చినట్లయింది నా పని !

పతంజలి --- మిస్టర్ రెడ్డీ, మీరు మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ పలుకుబది కోసం, కార్మికులని చిలకలని చేసి, సమ్మె అనే విషసర్పానికి ఎర వేసారు, ఒక్కాసారి ఆలోచించి చూడండి, మీకేం దక్కింది ?

రెడ్డి ---- చేతికి ఈ అరదండాలు దక్కాయి ( దీనంగా అంటాడు )

పతంజలి – పంతులు గారూ ! మూరు నమ్మిన సిధ్ధాంతాల కోసం, పని గట్టుకొని, సాంతి పెఇయులైన కార్మికులని ప్రోత్సహించి, పని చేయించారు. ఏదీ మీ శాంతి ద్వారా వచ్చిన కార్మిక సంక్షేమం ? మీ మాట మీద పని చేసిన కార్మికులకి, మీ ద్వారా ఏం దొరికింది ? వాళ్లకి కనీసం రక్షణ ఏర్పాట్లైనా కలిగించ లేక పోయారు,, సరికదా, మీ శాంతి సందేహం తలకెక్కించి, ఆత్మరక్షణ చేసుకొనే ధైర్య్యాన్నయిన్ని కూడా ఇవ్వలేక పోయారు. అలా చేసి ఉంటే ధర్మయ్య లాంటి విశ్వాసపాత్రుడైన బంటుని పోగొట్టుకొనే వారు కారు., నిజమేనా ?

పంతులు --- నిజమే, నా సిధ్ధాంతాల లోని, ‘శాంతి ప్రియత్వం , అహింసా వాదంలో’ , ఏదో కొంత మార్పు రావాలి. ధర్మయ్య దుర్మరణానికి, నా భాద్యత లేదని నేను తప్పించుకోలేను.

పతంజలి --- కన్నయ్యా ! వెంకట్ ! మీరు కార్మిక వర్గానికి ప్రతినిధులు. ఆ పంజరంలో చిలకల్లాంటి వారు.ఇంజనీరు శిక్షించాడని అభిమాన పడ్డారే గాని, అందులో మీ పొరపాటు ఎంత ఉందో గ్రహించలేక పోయారు. ఇదుగో ఈ పంజరం చూసారా, ఇది క్రమశిక్షణ, ఋజువర్తన భాద్యత నిర్వహణ అనే కవచం ! చిలక లాంటి కార్మికునికి భాద్యతా నిర్వహణే పంజరంలా రక్షణని ఇస్తుంది. ఆ పంజరం నుండి, బయట్స పడ్దనాడు, ఈ పాముకి ఎర కాక తప్పదు ,తెలిసిందా ?

( కన్నయ్య చేతులతో ముఖం కప్పుకొని ఏడుస్తాడు )

( వెంకట్ తల దించుకొంటాడు )

సక్లేచా – పంతులుగారూ ! మ్,ఈరు పెట్టీన షరతిలన్నిటికీ ఒప్పుకొని, అగ్రిమెంటు వ్రాసి ఇస్తాను. సమ్మె విరమణ చేయించండి.

పతంజలి --- మిస్టర్ సక్లేచా ! కంపెనీ విషయంలో ఎలాంటి అగ్రిమెంట్లు ఇవ్వడానికి .నీకు ఎలాంటి పవర్సు లేవు. కార్మికుల మీద సమ్మె రుద్దినప్పుడే నీ అధికారం దుర్వినియోగ మయింది.. ఇంతమంది కార్మికుల బ్రతుకులతో ఆటలాడుకొన్నందుకు నిన్ను, అరెస్టు చేయిస్తున్నాను. నీ ఛీఫ్ ఇంజనీరు విష్ణుప్రసాద్ సమయానికి, సద్భుధ్ధి కలిగి, రిజైన్ చేసాడు. లేకుంటే అతనికి కూడా నీతొ పాటు, ‘సమన్స్’ వచ్చి ఉండేవి. ఇదుగో అరెస్టు వారంటు ( అంటూ సక్లేచా చెయ్యి పట్టుకొంటాడు )

పంతులు – ఆగండి, పతంజలి గారూ ! అందరం కలిసి, ధర్మయ్య ఆత్మశాంతికి, క్షణకాలం మౌనం పాటిద్దాం.

( అందరూ మౌన భంగిమలో స్టిల్, తరువాత తెర )

*****************( సమాప్తం ) రచన ఎ. శ్రీధర్. *****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద