Skip to main content

సింహాద్రి

సింహాద్రి లాంటి ‘ఓబులయ్య’ సాహసానికీ,

అద్రి లాంటి ‘ముత్యాలు’ ఓర్పుకీ , పరీక్ష పెట్టాడానికే ,

‘ సింహాద్రి’ పుట్టాడా ! ఏమో !!

*************

ఊరికి నాలుగు మైళ్ల అవతల, నల్లటి తారు రోడ్డు మీద, కళ్లు తెరిచిన ,‘ సింహాద్రి’, ఏడుపు లంకించుకొనే సరికి, శర వేగంతో కదుల్తున్న , ‘లారీ’ చక్రాలు ‘ కంయ్యి’ మంటూ ఆగి పోయాయి.

“ ఛ ! వెధవ సంత !”

విసుగుకొంటూ లారీ నుండి క్రిందకి దిగాడు ‘ఓబులయ్య’.

‘ ఓబులయ్య’ అంటే

లారీ డ్రైవర్ల భాషలో ,‘ సింహం లాంటి మడిసే,’ అయినా

ఊరి చివర శివాలయం దగ్గర , మర్రి చెట్టు మొదట్లో నివసించే, ‘ముసలమ్మకి’ మాత్రం ,‘ఎర్రినాగన్నే’!ఓబులయ్య ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవడం మాత్రం, నిజానికి అసాధ్యమనే చెప్పాలి.

అంతెందుకు-

“ ఓబులయ్యా, ఓబులయ్యా ! నువ్వెవెరివి ? ఎక్కడి నుంచి వచ్చావ్ ?” వగైరా ప్రశ్న ఎవరైనా అడిగితే, వచ్చేది---

సగం విడీ విడని పెదాల మధ్య మెరిసే చిన్న ‘హాసరేఖ’ మాత్రమే .

“పోతే అతనెలాంటి వాడు ?” అన్న ప్రశ్నకి మాత్రం, “ అమ్మ బాబోయ్ !” అని వాపోయి నలుద్రిక్కులూ చూసి, మెల్లగా జారుకొంటారు ఆ వాడలోని జనం. చిన్న_ పెద్ద , పిల్లా _ పిచికా , అందరికీ అతనంటే అంత భయం అతనంటే !

అలాగని ‘ ఓబులయ్య’ రాక్షసుడని గానీ, అలాంటి లక్షణాలు గల మనిషి అని గాని కాదు.

నిజానికి అతని యెడల వారికుండేది భయమని చెప్పడం సరి కాదు, అదో విధమైన జుగుప్స, అంతే !

అయినా ఓబులయ్యని అని ఏం లాభం.

అతను చిక్కిన ‘ విషవలయం’ అలాంటిది, దానిని ‘ విషవలయం’ అనడం కన్నా ‘ చెట్టియార్’ అనే పేరితో పిలిస్తే, సరి పోతుందేమో !

‘ చెట్టియార్’ ఎవరూ ? ఏ మా కథా ?’ అనే అడిగే వాళ్లు ఫక్తు అమాయకులని అనుకోవడం నూటికి నూరు పాళ్లు నిజం అని వేరే చెప్పనవసరం లేదు.

చెట్టియార్ యముడయితే, ఓబులయ్య అతని దూత ! ఫాలాక్షుడైతే, అతని మూడో కన్ను, బ్రహ్మ అయితే కపాలం. మెరుపు అయితే అందులోని విద్యుత్తు, ఉరుము అయితే దాంట్లోని ధ్వని, నీరు అయితే అందులోని ఆక్సిజన్, గాలి అయితే దాంట్లో కలిసిన కార్బన్ డ్యాక్సైడ్, అగ్ని అయితే దాని పొగ, పొగ అయితే దాని నలుపు, రైలు బండి అయితే అది నడిచే చక్రం, చక్రం అయితే అది తిరిగే సీల, కసాయి అయితే అతని చేతిలోని కత్తి, అవినీతి అయితే దాని రుచి, అన్యాయం అయితే దాని పదును, చెట్టియార్ అయితే అతని తరాజు, లారీ అయితే దానికి డ్రైవరు.

‘చెట్టియార్’కీ , ఓబులయ్యకీ ఉన్నసంబంధం చెప్పాలంటే, ఒక్క మాటలో లేదా, ఒక్క వాక్యంలో చెప్ప గలిగేదీ, చెప్ప వలసిందీ కాదు.

ఆ రోజు ఉదయమే మరీ మరీ చెప్పాడు చెట్టియార్.

“ చూడు ఓబులయ్యా ! సరుకు రెండు అంగల్లో , ‘దివాణం’ చేరాలి. మధ్యలో ఏ అడ్డంకి వచ్చినా ఆపవద్దు. ట్రాఫిక్ పోలీసు ఎవరైనా కంట బడితే మాత్రం లారీ కాస్త ‘ స్లో’ చేసి, --- అయినా నీకు చెప్పేదేముంది, ” అంటూ చేతిలో నాలుగయిదు విచ్చ రూపాయలు మూటలు పెట్తూ కన్ను గీటాడు చెట్టియార్.,

ఆ విచ్చ రూపాయల్లొనే ఉంది బ్రతుకంతా ! నిజానికి విచ్చ రూపాయలని అనడం పొరపాటేమో !

దారి నిష్కంటకం చేసే ‘ రస గుళికలవి !’వాటిని కాగితంలో చుట్టి , సరిగ్గా ట్రాఫిక్ పోలీసు కాళ్ల దగ్గర పడేలా , ~షూట్’ చేయగలిగితే చాలు, లారీలో సరుకు కాస్త ఎగుడు దిగుడైనా, మంచి చెడూ అయినా దివ్యంగా నడిచి పోతుంది.

పోతే ,‘దివాణం’ దగ్గరే వస్తుంది చిక్కంతా.

అదేమిటో , ఆ పదానికి అర్థమేమిటో చెప్పే చెట్టియారుకి , తీసుకెళ్లే ఓబులయ్యకీ మాత్రమే తెలుస్తుంది. అంతే కాదు,‘ “దివాణం’ ‘అంగణం’ ‘గౌడౌను’, వంటి, ఇంకా చాల ‘కోడ్ వర్డ్స్’ఉన్నాయి వారి మధ్య, అయితే ఒక్కటి మాత్రం నిజం, ఆ పేర్లన్నిటిలో ఘనత వహించిన పరువైన మనుషుల బరువైన పేర్లు యిమిడి ఉన్నాయి ఉన్నాయన్నదే అది.

“ఇది చాల అన్యాయం చెట్టియారూ ! రాత్రంతా నేను లారీలో పడి అఘోరించాలి. నువ్వేమో ఇంట్లో ,పడుకొని,‘ ఇస్క్’ చేస్తూ ఉంటావు”

“ అలా అంటే ఎలా ఓబులయ్యా ! నీకు తెలీందేముంది ? నువ్వు నా పని కోసం, నేను నీ కోసమే పుట్టామయ్యా ! ” అల్మారా నుండి నోట్ల దొంతరలు తీస్తూ అన్నాడు చెట్టియార్.
చెట్టియార్ నుండి ఏ సమయంలో డబ్బు ఎలా లాగాలో ఓబులయ్యకీ, అతని చేత ఎపుడు ఏ పని చేయించాలో చెట్టియారుకీ బాగా తెలుసు.

“ చెట్టియారు ఇవాళ చాలా ఖుషీగా ఉన్నాడు. అదనంగా దొరికిన నోట్ల దొంతరలు మొలలో దోపుకొంటూ నవ్వుకొన్నాడు ఓబులయ్య. అయినా ఖుషీ కాక మరేమిటి !?

ఇది వరకెన్నడూ దొరకని, ‘పంచె వన్నెల రామ చిలకని’ తెచ్చి, పంజరంలో పెడితే ! ఎందుకనో ఒక్కసారి మనసు కలుక్కుమంది ఓబులయ్యకు. ‘ పాపం ముత్యాలు గతి ఏమి కానుందో !’ ఆమె అందమైన అమాయకమైన ముఖం ఓబులయ్య కళ్లకి కట్టినట్లయింది. ~ ఆ ! అయినా ఏటయిందిలే ! నాను కాకపోతే మరొకడు, ఏ నాడైనా దాని గతి ఇలా మారవలసిందే !’ మనస్సుకి సర్ది చెప్పుకొన్నాడు అతను.

నిజానికి ఓబులయ్యకి, ముత్యాలుకీ కలయిక చిత్రంగా జరిగింది !

చెట్టియార్ పురమాయించిన పని మీద, ‘ రామభద్ర పురం’ ట్రిప్పు మీద వెళ్తున్న ఓబులయ్యకి ‘ పారాది’ వంతన దగ్గర కూర్చొని దూరంగా ఉన్న చెరువు కేసి, చూస్తూ దుఃఖిస్తున్న ఆమె కంట పడింది. లారీ అద్దాల ద్వారా, దూరం నుండి చూసిన ఒక్క చూపులోనే చాల అందమైన పిల్ల అని గ్రహించేసాదు ఓబులయ్య.

గోధూళి వేళ దాటి పోయినా, ఇంటికి వెళ్లే ప్రయత్నం గాని, తలంపు గాని లేకుండా ఒంటరిగా కూర్చొన్న ఆమెని చూడగానే, ఒక విధమైన కుతూహలంతో పాటు, చిన్న దురాశ కూడ మెదిలింది అతని మనస్సులో.

అంతే !

రోడ్డుకి ఒక వారగా ఉన్న, ఒక టీ దుకాణం ముదు లారీ ఆపి, పది పైసల ‘చా’ తో పాటు ఆ పిల్ల వివరాలన్నీ లాగేసాడు అతను. ముత్యాలు, నాగులయ్య ఇద్దరూ, టీ దుకాణంలో పని చేసే కుర్రాడి మాటల ప్రకారం , ‘గువ్వ పిట్ట లాంటి జంట’

.అసలు నాగులయ్య ముత్యాలుని మనువాడడమే చాల చిత్రంగా జరిగిందట !

సెలవుల్లో , సరదా కోసం ఆ ఊరు వచ్చిన ప్రెసిడెంటు నాయుడు కొడుకు , దిన దినమూ పెరుగుతూ వస్తూన్న ముత్యలు అందాన్ని అందుకోవాలని, ఊరుకు ఉత్తరాన, ‘ వేగవతి’ అవతలి ఒడ్డున మామిడి తోపులో ఆమెని పట్టుకొన్నాడట !

అయితే—

ముత్యాలు అందరిలాంటిదీ కాదు, “ నువ్వు మనువాడితే నేను నీకు లొంగుతానన్నదట ”.

‘ మనువు’ మాట వినగానే, ముచ్చెమటలు పోసాయట ’ఎదురి మగాడికి. అయినా ఎలాగైనా పని నడిపించాలనే ఉద్దేశంతో,, “సరే ’ అన్నాడట !

ఇంట్లో అయ్యకి గంజినీళ్లు పొయ్యడం అవదు, రేపు సందె వేళకి ఈ తోటలోనే అయ్యతో చెప్పి వచ్చి కలుసుకొంటాలే” అని తప్పించుకో చూసిందట.

కాని ---

‘దాని’ చలాకీ తెలిసిన నాయుడు చెయ్యి ఒడిసి పట్టుకొని, చీరకొంగు లాగే సరికి,‘ కెవ్వు’ మంటూ కేకేసింది ముత్తాలు.

దూరాన జనప కట్టలు నానబెట్తున్న నాగులయ్య , ఆ కేక విని తాత చెప్పిన దెయ్యాల కథలు కూడా మరచి పోయి, ఒక్క అంగలో అక్కడికి చేరుకొన్నాడట !
అప్పటికే ముత్తాలు చీరమామిడి చెట్టు కొమ్మలకి వ్రేలాడుతోందట ! జాకెట్టు_లంగాల , చీలికలు, పేలికలై ఒంటికి అతుక్కు పోయాయట ! నాయుడు మాత్రం , క్రింద పడి వారిస్తున్న ముత్తాలు చేతులతో గట్టిగా పెనగులాడుతున్నాడట!

అంతే –

మెడ మీద బలంగా పదిన దెబ్బనుండి, నాయుడు తేరుకొని చూసేసరికి, నాగులయ్య బెబ్బులులా కంటికి గోచరించాడట ! అలా జరిగిమ్ది నాగులయ్యకీ, ముత్యాలుకీ తొలొచుపుల పరిచయం ! ఆ తరువాత అలా ఎప్పుడూ ఒకరినొకరు చూసుకొనేల ఉఅండడం కోసం , ఆమ్ర్ని మనువాడాడు నాగులయ్య.

కాని మూన్నాళ్ల ముఛ్ఛటే అయింది వాళ్ల దాంపత్య జీవితం.

వంతన దగ్గర చెరువులో నానపెట్టిన జనప నార ఒలిచి, కుప్పలు పోస్తున్నప్పుడు , పాము కాటేసి కన్ను’ మూసాడు నాగులయ్య.

అప్పటి నుండి ఇదే వరస , అలా ఒంటరిగా వంతెన మీద కూర్చొని ఆ చెరువు కేసి చూస్తూ, ఎంతో రాత్రికి గాని ఇల్లు చేరుకోదు ముత్యాలు.

అంతా ఓపికగా విన్న ఓబులయ్య , పొగాకు కాడ తుపుక్కున ఉమ్మేతూ అడిగాడు,“ మరి ఇంటికాడ ఎవురూ లేరేటి ఆ పిల్లకి” అని.

“ లేరు, అయ్య పోగా ‘ముసల్ది’ మాత్రమే మిగిలింది , ఇక పోతే, దాని బావ, ‘బొబ్బిలిలో’ లారీ బ్రోకరుగా పని చేస్తున్నాడట. ఒక్కసారి కూడా ముఖం చూపించిన పాపాన పోలేదు.

అంతే ! ఓబులయ్య కండ్లు సెర్చిలైట్లలా వెలిగాయి. కుర్రాడి చేతిలో , చాయి డబ్బులు పెట్టి, లారీ స్టార్టు చేసి, ఒక్క ఉదుటున వంతెన దగ్గరగా ఆపాడు.

లారీ కుదుపుకి ముత్యాలు ఆశ్చర్యంతో వెనుతిరిగి చూసింది.“ముత్యాలూ !”అంటూ ఆమె దగ్గరగా చేరాడు ఓబులయ్య.

‘ ఎవరా,’ అన్న ఆలోచన ముత్యాల్ని తీవ్రంగా వేధించింది.‘ పట్నంలో లారీ బ్రోకరుగా పని చేసే బావ కాబోలు ’ అనుకొంది. మనసులో.

“ ఇంటికి పద ముత్యాలూ !”

“ బావా !”

“ అవును నేనే ! పద ఇంటికి పోదాం, అంటూ లారీ వైపు అడుగు వేసాడు ఓబులయ్య. ఒకసారి ఓబులయ్య వంక, మరొక సారి లారీ వంక చూసి, అతని వెనకనే లారీ ఎక్కింది ముత్యాలు.

అయితే ఆమె అనికొన్నట్లుగా లారీ మలుపు తిరిగి, ఊరు వెల్లడానికి బదులు తిన్నగా, రామభద్రపురం వైపు సాగి పోయింది. కొద్ది సేపటిలోనే నిజాన్ని తెలుసుకొన్న ముత్యాలు, దిగిపోతానని గోల పెట్టింది. అరిచింది, కన్నీళ్లు కార్చింది. కాని ఓబులయ్య మనస్సుకి అవేం ఎక్కలా ! దీనాలాపం పెరుగుతున్న కొద్దీ అతనిలో వెర్రి ఆనందం చిందులు తొక్కింది.
ఆఖరికి ఓడిపోయిన ముత్యాలు అలాగే , లారీలోనే సొమ్మసిల్లి పడి పోయింది. ముత్యాలుని చూసిన వెంటనే చెట్టియారు మారు మాట్లాడకుండా మామూలు కంటే ఇబ్బడిగ డబ్బు ముట్ట చెప్పాడు ఓబులయ్య కయినా, చెట్టియారు కయినా

అదొక లెక్కా ! వేసుకొన్న పథకం సానుకూలంగా నడిస్తే, ఆ కోడి పెట్ట ( ముత్యాలు ) బంగారు గ్రుడ్లు పెట్టదూ !

ఇవాళ రాత్రి చెట్టియారు నడకతో బోణీ అవుతాది ముత్యాలు రాస్తా. ఆ పైన సరకుల గౌడౌను శ్రీరామ చంద్రయ్య చేతి మీదుగా షిప్పు దాటి, ప్రోవిన్సు దాటి, ఎక్కడికో వెల్లిపోతుంది. ఆ తరువాత అలసి పోయి అదే జీవితానికి అలవాటు పడి పోతాది. ఎందుకో ఎప్పుడూ లేని విధంగా కలుక్కుమంది ఓబులయ్య మనసు.

‘ కేర్, కేర్ ’ ఇంకా గట్టిగా వినిపిస్తున్న ఏడుపు ఓబులయ్య ఆలోచనలకి షడన్ బ్రేక్ పడింది.

గబగబా ఆ వైపు అడుగులేసాడు ఓబులయ్య.

రోడ్డు మధ్యగా గుడ్డపీలికల నడుమ ఏడుస్తూ,‘ సింహాద్రి’ కంట పడ్డాడు.

‘ఎవరో ఆడ కూతురు బలిమిని కని పారేసింది.’

మెరుపు కొట్టినట్లయింది ఆ ఆలోచన రాగానే ఓబులయ్యకి.

‘ మరి తన మాటేమిటి ?’

మర్రిచెట్టు ముసలవ్వ అకస్మాత్తుగా ఙ్ఞాపకానికి వచ్చింది. అతనికి ‘ ఆ అవ్వ దయ తలచి పెంచక పోయినట్లయితే, ఏ లారీ క్రిందనో పడి ----- ’

ఆ పైన మరి ఊహించ లేక రెండు చేతుల్తోనూ ఆ పిల్లాడిని ఎత్తుకొని లారీ వైపు పరుగెత్తాడు ఓబులయ్య. తీరా లారిలో కూర్చొన్నాక సమస్య తలెత్తింది అతని మనస్సులో. ~ ఈ కుర్రాడిని ఏం చెయ్యడం !!’ అని.

కొన్ని క్షణాల పాటు ఏదో నిశ్చయాన్ని వచ్చి, లారీ వెనక్కి నడిపి మలుపు త్రిప్పాడు అతను. లారీ నిండిన డబ్బాలు ‘ డబుక్, డబుక్’ మంటూ చప్పుడు చేసాయి.

నవ్వుకొన్నాడు ఓబులయ్య ఆ శబ్దాన్ని విని. ‘ ఈ కుర్రాడిని రాఘవులు ఇంట్లో విడిచి పెట్టి ‘ దివాణం ’ దారి పట్టాలి అనుకొంటూ.

పాపం రాఘవులు నీతినీ , నిజాయితీని, నమ్ముకొని పట్నంలో రెక్కల కష్టం మీద బ్రతికే మనిషి.

“ చూడు ఓబులయ్యా ! పట్నంలో మన చిన్న మాస్టారి కొడుకు సూరిబాబు పంచదార మిల్లులో దొర అంట ! ని గురించి చెప్తే, పట్నం వచ్చి కలిస్తే, పని ఇప్పిస్తాను అన్నాడు. ఎందుకు చెప్పు, ఈ అన్యాయం బ్రతుకు, నా మాట విని చెట్టియార్ దగ్గర పని మానేయి.”

మూడు రోజుల క్రిందట రాఘవులు చెప్పిన మాటలు చెవుల్లో గింగురుమన్నాయి.

ఎందుకో అప్పట్లో రుచించలా ఆ మాటలు !

అయినా అన్నాయం బతుకు ఎప్పుడో ఓ నాడు బ్రద్దలవక తప్పదు.

మొన్నమొన్ననే ‘ వేగన్ సీలు’ విప్పుతూంటే, గుండేసి కాల్చేసినాడట పోలీసోడు తంగప్పని.

లారీ కుదుపుకి కుర్రాడు కేరుమన్నాడు. ‘ పాపం ఆకలేస్తోంది కావాల ! పాలు తాగి ఎంత సేపయిందో !

ఒకప్పుడు తాను కూడా ఇలాగే ఏడ్చాడేమో ! ముసలవ్వ చూసి పాలు పట్టక పోతే, ఏమయి ఉండెదో ?

‘రేపు ముత్తాలుకి కూడా ఇలాగే ఓ పిల్లవాడు పుడితే !.

‘ తల్లినీ పిల్లనీ బేరలు కుదరవని, వేరు చేసేస్తారు బ్రోకరుగాళ్లు, ఆడ పిల్ల అయితే ఏరేగా ఎక్కడో పెంచుతారు. మగ పిల్లడు అయితే ఇలాగే ఎక్కడో నడిరోడ్డు మీద----’
ఒళ్లు జలదరించింది ఓబులయ్యకి.

‘ హే భగవాన్ ! సిమ్మాద్రి అప్పల సామీ !’

అలవాటైన పాదాలు ఏక్సిలేటర్ని బలంగా త్రొక్కాయి.

లారీ ఒక్క కుదుపుతో ‘ రాఘవులు’ ఇంటి ముందు ఆగింది. రాఘవులు పరుగెత్తుకొని వచ్చాడు లారీ దగ్గరికి .“ ఎక్కడికి, సరుకా ?” అనిఅడిగాదు రాఘవులు. లారీలో లోడ్ చేసిన లక్ష్మీ ఘీ డబ్బాల వంక చూస్తూ.

డబ్బాల్లో ఉన్నది నెయ్యి కాదని, నల్ల మందు అని అతనికి బాగా తెలుసు.

“ ఆఖరి సారిగా చెప్తున్నాను ఓబులయ్యా ! నువ్వు ఈ పని మానేసి, పట్నం పంచదార మిల్లులో ---”

“ రాగవులూ !” బాధతో అరిచాడు ఓబులయ్య. ,“ అదంతా తరువాత, ముందీ పిల్లాడిని నీ ఇంట్లో ఉంచు, నేను చెట్టియారు దగ్గరికి వెళ్లాలి.”

“ చెట్టియారు దగ్గరికా ? ” పిల్లాడిని చేతుల్లోకి తీసుకొంటూ ఇనుమడించిన ఆశ్చర్యంతో అడిగాడు రాఘవులు.

“ అవును” అంటూ బ్రేకు రిలీజు చేసాడు ఓబులయ్య.

లారీ సర్రుమంటు ఊర్లోకి దారి తీసింది. ‘ చెట్టియార్ ఈ పాటికి భోజనం వగైరా ముగించి పడక గదికి చేరుకొని ఉంటాడు.’

వేగంగా వెళ్లక పోతే ముత్తాలు గతి ఏమవుద్దో !

స్టీరింగు గిర్రుమంటూ తిరిగింది ఓబులయ్య చేతిలో.

************

‘ ఈ తెగింపు, ఈ సాహసం ఆనాడు మామిడి తోపులో నాగులయ్య లోనే చూసాను నేను. చెట్టియారుని ఒక్క దెబ్బతో నేల కరుచుకొనేలా చేసినప్పుడు నాగులయ్యే కనిపించాడు నీలో.”

తల గిర్రున తిరిగి మతి పోయినట్లయింది ఓబులయ్యకి , ముత్యాలు మాటలతో.

‘ చెట్టియారు చేతుల్లోంచి తప్పించిన కృతఙ్ఞతతో ‘ తను’చేసిన పనే మరిచి పోయిందా ! అసలు ఆమె ఇంత వరకు రావడానికి తనే కదా, కారకుడు !’
ఆడది మగాడిలో పట్టుదలనీ, సాహసాన్నే ప్రేమిస్తుందనీ, ఆ ప్రేమ సుధా వాహినిలో తల మునకలయి, అతను చేసిన తప్పులన్నీ మరచి పోతుందనీ, పాపం ! ఓబులయ్యకి ఎలా తెలుస్తుంది ?

ఏం తెలిసినా, తెలియక పోయినా ఒక్కటి మాత్రం తెలిసి పోయింది అతనికి. ‘ ముత్తాలు అందరి ఆడాళ్లలాంటిది కాదనీ, ఆమె లేకుండా, తను ఇన్నాళ్లూ బ్రతికిన బ్రతుకు ఒక పీడ కల అని.

“ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొంటూ, “ పద, సిమ్మాద్రి కాడికి పోదాం” అన్నాడు ఓబులయ్య.

“ సిమ్మాద్రి ఎవురూ ?” ఆశ్చర్యంతో అడిగింది ముత్యాలు.

“ అదే !” జరిగినదంతా ఙ్ఞాపకానికి తెచ్చుకొంటూ, “ సిమ్మాద్రి అప్పన్న దయ వల్లనే జరిగింది ఇదంతా ! ఆ రోడ్డు మీద దొరొకిన కుర్రాడికి ‘ సిమ్మాద్రి’ అని నెనే పేరు పెట్టేసాను” అన్నాడు నవ్వుతూ.

ముత్యాలు అదేమీ అర్థం కాక, అయోమయంగా చూసింది అతని వైపు.

************

సింహం లాంటి ఓబులయ్య సాహసానికీ, అద్రి లాంటి ముత్యలు ఓర్పును జోడించడానికే పుట్టాడా , సింహాద్రి !

ఏమో ! అది ఆ కొండ మీద అప్పన్నకే తెలియాలి !!

( జాగృతి – ౧౧.౧౧,. ౧౯౬౮ )

*************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద