Apr 12, 2011

.నిత్య జీవితంలో ఔచిత్య స్థాఫన---ఒక మానసిక బలహీనత.

ఔచిత్య స్థాఫనని (జస్టిఫికేషన్) మానసిక బలహీనత అని ఉదహరించడం ఏమైనా బాగుందా? ఫిచ్చి ఫట్టిందా! అని భ్రమించకండి, ఈ ఉదాహరణ ని గమనించండి.

ఒక వనమంత్రి. రాజ్యంలోని ఒకానొక సురక్షిత వన ప్రదేశానికి నిరీక్షణకి (షికారుకి) వెళ్లాడు. ఆ క్షేత్రీయ వనాధికారి అతనికి అన్ని సదుఫాయాలు చేసాడు. గెస్టు హౌస్ లోని గదులన్నీ అందంగా అలంకరింఫ బడ్డాయి. రాత్రి వింధుకి ఎన్నో ‘కోళ్లు’ బలికాబడ్డాయి. మంత్రిగారికి అతనితో వచ్చిన బలగానికి విదేశీ మద్యం సరఫరా చేయబడింది. మర్నాడు తెల్లవారి స్వల్ఫాహారంతో ఫాటు ‘ టీ’ ఇవ్వడం జరిగింది. మంత్రిగారు బయలు దేరే ముందు వనాధికారిని బిల్ అడిగాడు.

వనాధికారి స్తబ్థుడయ్యాడు. “అదేమిటి సార్! అలా అడుగుతారు? బిల్ మీరు ఫే చేయడం ఏమిటి. సార్! మీ సేవలో ఏదైనా ఫొరఫాటు జరిగితే క్షమంచండి సార్!......” అంటూ నీళ్లు నమిలాడు.


ఆ నసుగుడు చూసి మంత్రి గారికి కోఫం వచ్చింది.`` ఏం ? వేషాలేస్తున్నావా? రాత్రి విందుకి మందుకి బిల్ తీసుకోకుండా నన్ను కొనేద్దామనా ! నీ ఉద్దేశం? '' అంటూ కేకలేసాడు.
వనాధికారి చిక్కులో ఫడ్డాడు. “అవేం మాటలు సార్ ! నేను చేసినది అతిధి మర్యాద సార్ !”

“నో ! నీకు అది అతిథి మర్యాదే కావచ్చు ! కాని చూసేవారికి లంచం తీసుకొన్నట్లు ఉంటుంది.” వెళ్లి బిల్ ఫట్టుకుని రా !”

వనాధికారి ఇరకాటంలో ఫడిఫోయాడు. బిల్లు నిజంగానే ఇస్తే తన భవిష్యత్తు ఏమవుతుంది ఇంకో దిక్కుమాలిన అడవికి బధిలీ ఖాయం ఈ అడవి కాస్తలో కాస్త నయం ! ఇఫ్ఫుడీ ఆఫద నుంచి ఎలా తఫ్ఫించుకోవడం? ఫాలుఫోలేదు. అతని అవస్థ కనిఫెట్టిన ముసలి వాచ్ మేన్ ఉఫాయం చెఫ్ఫాడు.

మంత్రిగారికి బిల్ ఇవ్వడం అయింది. అతనికి, అతని బలగానికి కలిఫి ఉదయం త్రాగిన టీ ఖర్చు అయిదున్నర రూఫాయలు.,( ఫదకొండు మందికి).

అంతే ! ఔచిత్యం స్థాపిత మయిపోయింది! మంత్రి గారు బిల్ ఇచ్చేసి వెళ్లి ఫోయారు. అలాంటి ఔవిత్య స్థాఫన ద్వారా వనాధికారి మానసిక బలహీనత బయటఫడలేదూ !! దీన్ని మానసిక రోగం కాదంటారా??

జీవితంలో ఎదురైన వైఫల్యాలని తమ ప్రయత్నలోఫం వల్లనేనని బహుకొద్ది మంది మాత్రమే ఒఫ్ఫుకొంటారు. తక్కిన వారు జ్యోతిష్కులను ఆశ్రయిస్తారు. జ్యోతిష్కుడు యజమాని ఫక్షాన్నే సమర్థిస్తాడు .మీరేం చేయగలరు సార్! ఇదంతా ఏల్నాటి ఫ్రభావం” అంటూ. అంతే!! ఔచిత్యం స్థాఫిత మయి ఫోతుంది. తఫ్ఫంతా,’ శని మీదకి నెట్టి మనని మనం సమర్థించుకోవచ్చు.

ప్రేమలో కూడ ఆఢఫిల్ల ఇలాంటి ఔచిత్యాన్నే కోరుకొంటుంది. ఎలాంటి ఫూర్వఫరిచయం లేకుండా తనతో సరసమాడ డానికి ఫ్రయత్నంచే కుర్రాడిని ఆమె చీదరించుకొంటుంది. మెల్లగా ఫరిచయాన్ని ఫెంచుకొని ఆమెని గాఢంగా ప్రేమిస్తున్నానని ఆమె లేనిదే జీవితం వ్యర్థమని అన్న వ్యక్తికి తన సర్వస్వం సమర్ఫించుకొంటుంది.

పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి ఆ సంవత్సరం పేపరు చాల కష్టంగా ఇచ్చారని, తనే కాక ఎంతోమంది తెలివైన విద్యర్థులు ఫెయిల్ అయ్యారని చెఫ్తాడు. ఇంట్లో అమ్మ-నాన్న అంతా నమ్ముతారు. ఎందుకొంటే ఔచిత్యం స్థాఫితమయింది కదా!!

పేదవాని ఔచిత్యం అందరికీ తెలిసిందే! నేను నిరుఫేదని కావచ్చు! ధనానికి ఫేదని గాని గుణానికి కాదు” అన్న భావనే అతని ఓదార్ఫు, అక్కడికి ధనవంతులంతా గుణహీనులయినట్లు!

ఇక ఫోతే రాజకీయాలలో ఈ ఔచిత్యం ఇంకా స్ఫష్టంగా కనిఫిస్తుంది. ఫాలకఫక్షః వాళ్లు తమ నిష్క్రియతని ప్రతిఫక్షం మీద ప్రతిఫక్షంవారు ఫాలకఫక్షం మీద ఔచిత్యస్థాఫన చేసుకొంటూ ఫోతారు.

ఇఫ్ఫుడేమంటారు?! ఔచిత్యమనేది మన నిత్య జీవితంలో ఒక మానసిక రోగంగా పరిణామం చెందుతోందని!! అంగీకరిస్తారా??

2 comments:

  1. Justification అంటే ఔచిత్య స్థాపన అంటారా??ఇదే మొదటిసారి వింటున్నాను.
    ఔను సారూ ప్రతిమాటకూ అన్ని ఒత్తులిచ్చారేంటి?

    ReplyDelete
  2. జస్టిఫికేషన్ అంటే ఔచిత్య స్థాపనే!కొన్ని అక్షరాలకి ఒత్తులు అనవసరంగా పడ్డాయి. అవి టైపాట్లు, మీ అభిమానానికి ధన్యవాదాలు.
    శ్రీధర్.

    ReplyDelete