Skip to main content

స్మిత నయన.1

నిర్విరామంగా రాజ్యం చేస్తున్న నిశ్శబ్దం, చిక్కగా అలముకొన్న చీకతితో కలసి మంతనాలు సలుపుతోంది. దూరాన పల్చగా పరచుకొన్న వెన్నెల జాలులో తళ తళ. మెరిసిపొతున్న ఇసక నేలను దాటి మంచి ముత్యాల లాంటి అలల వరసలతో కాంతులు విరజిమ్ముతూ, గలగలమని నవ్వుకొంటూ ప్రవహిస్తున్న ,‘ చీనాబ్’ నదిపై దాడి చేయాలని, దబదబ మని అదుగుల చప్పుడు , దాని అనుసరిస్తున్న గుర్రాల సకిలింపు.

తమ ఏకాంత సమావేశానికి అంతరాయం కలిగించేది ఎవరా, అనే సందేహంతో , ‘చీకటి’ కళ్లు గ్రుచ్చుకొని చూసింది.

‘ కత్తి వాటుకైనా రెప్ప విదల్చని కండ్లు, యుధ్ధ రంగంలో ప్రాణాలని సైతం లక్ష్యం చేయని వీరుని మనో ధైర్యంలా సమున్నత మైన నాసిక, వయస్సునీ అనుభవాన్నీ చెప్పక చెప్పుతూ, ముఖం లోని బ్రహ్మ వర్ఛస్సుని కప్పి వేయాలనే వ్యర్థ ప్రయత్నంతో విస్త్రుతంగా అల్లుకొన్న పండు గడ్డం , సమున్నత దీర్ఘ కాయమూ’ గల వృధ్ధుడొకడు , ఆకర్ణాంతం లాగి విడిచి పెట్టిన బాణం లాంటి వేగంతో, మంచి అశ్వం మీద, దూసుకొంటూ పోతున్నాడు.

అతని వెన్నంటి బిగించిన ఉక్కుతీగల్లాంటి, నలుగురు యోధులు చేత కాగడాలతో రావడం చూసిన,‘ చీకటి, నిశ్శబ్దమూ’ రెండూ కూడ బలుకుకొని, భయంతో పారి పోయాయి.

“ ఆగండి ! నా పిలుపు నందు కొనేవరకు, మీరిక్కడ నిల్చొని ఉండండి. ”

అంటూ, గుర్రంపై నుండి, ఒక్క దూకు దూకి, విశాలంగా పరచుకొన్న, ‘ చీనాబ్ ’ నదీ సైకత శ్రేణిని దాటి, మృత్యుదేవత నొసటి కుంకుమలా, ఎర్రగా,ఆమె కరాళ దంష్ట్రల మధ్య వ్రేలాడే జుహ్వాగ్రంలా వాడిగా, తొడల వరకూ జారిన వినీల కచభరం లాంటి, దట్టమైన పొగతో, జ్వాజ్వ్యల్య మానంగా మండుతున్న ఒక చితి ముందు కూర్చొని, నిశ్శబ్దంగా కూర్చొని, విలపిస్తున్న ఒక యువకుని వంక దృష్టి సారిస్తూ, మెత్తని ఇసుకలో వడి వడిగా నడక సాగించాడా వృధ్ధుడు.

“ నేను –దాదాజీ—నేను—”

“ ఆ మాట అనవద్దు యువరాజా !”

“ మీకు తెలియదు దాదాజీ ! నేను ఇంక ఎవరి కోసం బ్రతుక-----”

“ యువరాజా !” ఆ కంఠంలో క్రొత్తగా, వినిపించిన శాసనకి ఆశ్చర్య పోతూ, వృధ్ధుని ముఖంలోకి సూటిగా చూసాడు యువరాజు ‘ ఆనంద పాలుడు.’

ఆ ముఖంలో ముఖయంగా, బాణాల్లా వాడిగా, కాగడాల్లా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న ఆ కండ్లల్లో జీవితం మీద ఆలంబనం దొరికినట్లయింది.

దూరంగా మబ్బులే లేని వినీలాకాశంలో క్రొత్త కాంతులకు అంకురార్పణ చేసినట్లు, విచిత్రంగా మెరిసింది సౌదామినీ రేఖ !,

“ కర్తవ్య నిష్ఠుడు కాని వాడు ఎందుకూ కొరగాడు యువరాజా ! ఇప్పటికి పధ్నాలుగు సంవత్సరాల క్రితమే, ‘ సబుక్తగీన్; యొక్క మతప్రచారపు మాటున దాగిన ధన దాహాన్నీ, రాజ్య విస్తరణ కాంక్షనీ పసికట్టి, హిందూ ధర్మాన్నీ, సంస్కృతినీ కాపాడే మహాయఙ్ఞంలో మీ తండ్రి జయపాలుడు ఆత్మార్పణకు సిధ్ధమైనాడు. సాటి రాజుల నమ్మక ద్రోహం వలన రెండు సార్లు ,‘ సబుక్తగీన్ చేతిలో ఘోర పరాజయాన్ని పొందిననాడే, కంటికి రెప్పలా కాపాడి, ‘భగవతి జ్వాలాముఖి’ మీద ఆనతో, భవిష్యత్తు మీద ఆశని కల్పించి , మీ నాన్నని ఆత్మహత్యా ప్రయత్నం నుండీ తప్పించ గలిగాను ! కాని ఈ నాడు, --- యువరాజా ! ఈ నాడు ---” దాదాజీ కంఠం రుధ్ధమయింది.

యువరాజు ఆనంద పాలుడు ఏదో ధృడ నిశ్చయంతో లేచి నిలబడ్డాడు. అతని మనో నిశ్చయాన్ని, ప్రోత్సహిస్తున్నట్లుగా ఆకశంలో ధృవతార తళుక్కుమని మెరిసింది.

“ మీ అభిప్రాయం నాకు అర్థమయింది దాదాజీ ! జీవం లేని అభిమానంతో, చేవ లేని పౌరుషంతో, అడుగంటిన ఆశలతో, జీవఛ్ఛవంలాగ మారిన నా తండ్రి మీద, చచ్చిన పాముపై, దెబ్బ తీసినట్లు విజయాన్ని సాధించి, సంధి షరతుల క్రింద, అతని ప్రాణానికి ప్రాణమైన అన్న విజయుణ్నీ, కుమార ప్రతర్దునుణ్నీ, నష్ట పరిహారంగా ఏభైవేల దీనారాలనీ, అంత కంటె విలువైన అతని స్వాభిమానాన్నీ దోచుకొని వెళ్లిపోయాడు, దుర్మార్గుడూ, నరహంతకుడూ, అయిన సబుక్తగీన్ కొడుకు ‘ మహమ్మద్ గజనీ’ ,
చూడండి దాదాజీ ! ఈ చితిని చూడండి ! అభిమానం దెబ్బతిని ఆత్మహత్యకి ఒడిగట్టిన నా తండ్రిని మ్రింగి, అతని హృదయం లోని ప్రతీకారాన్నే జ్వాలా రూపంలో బయటకు క్రక్కుతోంది. భగవతి జ్వాలాముఖి సాక్షిగా , యుధ్ధ ఖైదీలుగా చిక్కిన అన్న విజయుణ్నీ, కుమార ప్రతర్దునిణ్నీ, విడిపించడానికి కాకపోయినా, హిందూ ధర్మ సంస్కృతుల గౌరవ రక్షణకైనా, ‘ మహమ్మద్ గజనీపై’ దండయాత్ర చేస్తాను. మీ ఆశీర్వచనమూ, భగవతి జ్వాలామిఖి కటాక్షమూ, ప్రజల అండ దండలు ఉంటే చాలు, ఈ మహత్కార్య నిర్వహణలో నేనొక సమిధనైనా నా జీవితం ధన్యమైనట్లు భావిస్తాను దాదాజీ !”

“ సెభాష్ యువరాజా ! నీ నిశ్చయం తిరుగు లేనిది కావాలని ఆశీర్వదిస్తున్నాను. కాని ఆవేశం చూపే దారిలో తొందరపడి,అడుగు వేయవచ్చు.గజనీ పైకి దండు వెడలే ముందు ప్రజల సానుభూతిని, తోటి రాజన్యుల సహకారాన్నీ పొందడానికి ప్రయత్నించు.”

యువరాజు ఆనంద పాలుడు తలెత్తి దాదాజీ ముఖంలోకి చూసాడు.

అతని ముఖం లోని గంభీరతనీ చాటు చేసుకొని, విడీ విడని పెదవుల మధ్య లీలగా మెరసిన , ‘ హాసరేఖ’ శరీరం లోని పంచేమ్ద్రియాల బంధంలో సున్నితమైన నాడులని స్పృశించినట్లయింది.

దూరంగా ‘ భఠిండా’ నగర రాజప్రసాదం ,మీద, ‘ షాహి’ వంశపు రాజుల పతాకం చుక్కల సీమతో సరాగాలాడుతూ ‘ రెపరెప లాడింది.

*****************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ