ఇది అన్ని కథల లాంటిది కాదు !
ధృఢమైన సమున్నత కాయమూ, సూదిగా కోటేరు లాంటి ముక్కు, గాంభీర్యము మూర్తీభవించినట్లుండే ముఖం, ఆలోచిస్తున్నట్లుండే కళ్లు, ఇంచు మించు అర అంగుళం లోతైన గడ్డమూ, పట్ట విడిచిన నుదురు కలిగి నలభైవ పడిలో పడ్డ ‘వెంకట చలం’ కథానాయకుడూ కాలేడు.
అయినా నిజమైన జీవిత చిత్రణ కథలా ఉంటుందనీ, ఎన్నదగిన రూప సంపద, లెక్కించదగిన గుణాలు కలవాడే ‘కథా---నాయకుడు’ కావాలనీ అనుకోవడం పొరపాటేనేమో !
1964 వ సంవత్సరం జూలై నెలలో కాబోలు , ‘ఖరగ్ పూరు రైల్వే వర్క్ షాపులో’ ట్రైనీగా పని చేస్తున్న రోజులవి. వెంకట చలాన్ని మొట్ట మొదటి సారిగా చూసాను నేను.
“ మీరు ఈ రోజు ఇతనితో పని చేయండి” అన్న చార్జిమేన్ మాటల ననుసరించి కావలసిన పనిముట్లు తీసుకొని,‘ చలం’ వెనుక బయలుదేరాను
అతనితో పని చేసిన నాలుగు గంటలలోనే , 22 ఏళ్ల సర్వీసు తీర్చి దిద్దిన పనివాడని తెలుసుకొన్నాను.
పని అంతా ముగించుకొని, పంపు దగ్గర చేతులు కడుగుకొనే సమయంలో ఎవరో అడిగారు, “ వెంకట చలంతో పని చేసారా ?” అని.
అవునన్నట్లుగా తల ఊపాను.
అంతే !
అతనితో పాటు అక్కడున్న అందరూ ఫక్కుమని నవ్వారు !
“ ఏం?” అని ఆశ్చర్యంతో అడిగాను.
“ ఇంకా నిన్న మొన్న సర్వీసులో చేరిన కుర్రాడోయ్ ! చలం చేసే పనులు అతనికెలా తెలుస్తాయి ?” హేళనగా నవ్వారు అందరూ., నన్ను చూసి. నలో ఏదో తెలియని కుతూహలం తలెత్తింది. ‘ అంతగా చెప్పి నవుకొనేంత పని’ , వెంకట చలం ఏం చేస్తున్నట్లు’ అని.
పోతే నా గురించి ఎక్కువ చెప్ప నవసరం లేదనుకొంటాను.
‘ తెలుగు సాహితీ క్షేత్రంలో పండని ఆశలని సాగుచేసే నిర్భాగ్య రచయితని ’ అని చెప్పుకొంటే చాలు !’
ఒక విధంగా కథలు వ్రాయాలనే జిజ్ఞాస కలిగి ఉండటం వల్లనే నేమో., వెంకట చలం గూర్చిన వివరాలు రాబట్టడానికి ఎక్కువ కష్టపడ నవసరం లేక పోయింది నాకు.
ఎందుకంటే వెంకట చలం అందరికీ తెలిసిన వ్యక్తి.
అలా అని అతను అసాధారణమైన వ్యక్తిత్వం కల్వాడేమీ కాదు. అయితే మాత్రం చాల గుంభనగా ఉండే మనిషి.
అవసరాన్ని మించి మాట్లాడడం గాని, ఒకరిని గూర్చి నిందా పూర్వకంగా చర్చించడం గాని అతను చెయ్యగా నేను చూడలేదు.
పోతే ఒకే ఒక్క బలహీనత ఉంది అతనిలో ! అదేమిటంటే హృదయం నిండిన దయ, ఒకరి కష్ట నష్టాలని విని సహాయం చేయగల సహృదయత !
రైల్వే ఇచ్చే జీతంతో నెలలో పదిరోజులు మాత్రమే సంసారాన్ని గడపగల దౌర్భాగ్య స్నేహితులకి చలం ఆప్తబంధువు. వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడమే కాకుండా , దానిని తిరిగి తిరిగి అడగడం కూడా అలవాటు లేదతనికి.
క్రమంగా ఇదంతా గమనించిన నాకు, చలం మీద మంచి అభిప్రాయమూ, అతనిని అనవసరంగా ఆడి పోసుకొనే వారి మీద చులకన భావమూ, కలగక పోలేదు. అయినా ఆ రోజు ‘నారాయణ రావు ’ నోటి వెంట వెంకట చలం చరిత్ర విన్న నేను, రాయి కొట్టినట్లయి, కొన్ని లిప్తల పాటు స్తబ్ఢుణ్నే అయ్యాను !
వెంకట చలానికి ఒక భార్య ఉండేదట. నారాయణ రావు మాటల ప్రకారం ఆమె కష్టాలతోనూ, కన్నీళ్లతోనూ , చలం కల్పించిన అనర్థాలతోనూ, రెండేళ్ల పాటు కాపరం చేసి, జీవితం చాలించిందట.
దానికి ముఖ్యమయిన కారణం ‘పార్వతి’.
భార్య చనిపోయిన నాలుగయిదు నెలలకి, చలం, ఇంట్లో పార్వతిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారట !
“ పార్వతి ఎవరు ? ఏమిటీ కథ ?” అని అడిగిన వారికి, ఆమె తన అక్క కూతురనీ, తను తప్ప వేరే దిక్కు లేదనీ ఇక మీదట ఇక్కడే ఉంటుందని చెప్పాడట, చలం.
ఇంత వరకు చెప్పి, ఒకసారి నా వైపు, మరొకసారి చుట్టు పట్ల పరిసరాల వైపు, చూసాడు నారాయణ రావు.
మేము కూర్చొని ఉన్న ఒక చిన్న సిమెంటు తిన్నె మీద, నలుప్రక్కలా స్టీము ఇంజన్ బాయిలర్లు మమ్మల్ని, మరొకరి కంటికి చాటు చేస్తున్నాయి.నిజానికి మేమలా కూర్చోవడం ఎవరైనా ఆఫీసరు కంట పడినట్లయితే, విపత్కర పరిస్థితులు ఎదురు వస్తాయన్న సంగతి మా కిద్దరికీ తెలుసు.
అందుకే
ఎంతో వివరించి చెప్పాలన్న తపన ఒకమూల పీడిస్తున్నా, రెండు ముక్కల్లో తరువాతి కథ తేల్చి పారేసాడు నారాయణ రావు.
అలా గుమ్మం ఎక్కిన పార్వతి ఈనాటి వరకూ అంటే మూదు సంవత్సరాల వరకూ, బయటికి రావడం ఎవరూ చూడలేదు. చలం కూడా ఆమెకి పెళ్లి చేసే ప్రయత్నాలు గానీ, తను పెళ్లి చెసుకోవడం గాని చెయ్యలేదు.
“ ఇంతకీ ఆమె ఎలా ఉంటుంది ?” కుతూహలంగా ప్రశ్నించాని నేను.
నారాయణ రావు నా వైపు అదోలా చూసి, గట్టిగా నవ్వాడు. నా భుజం తట్టుతూ .
జరిగింది జరిగినట్లు, ఉన్నది ఉన్నట్లు వ్రాయాలనే అభిలాష నాకు ఉన్నప్పటికీ , ఆ సమయంలో నారాయణ రావు అన్న మాటలు సభ్యత కోసం వదిలి వేయవలసి వస్తూంది నాకు.
నాలాంటి కుర్రాడిని పట్టుకొని అలాటి మాట ఆడడం కూడా ఎబ్బెట్టుగా అనిపించి, నారాయణ రావు మీద గౌరవ భావం లేకుండా చేసాయి.
అయినా వెంకట చలం విషయంగా విన్న నిజం మాత్రం నిప్పులాగే తగిలింది నాకు. అంత వరకూ నేను చేసిన పరిశీలన, అతనిని చదవాలని పడిన ప్రయాస వ్యర్థమయ్యాయన్న భావం ఎంతగానో నొప్పించింది నన్ను.
అందుకేనేమో, కళ్లతో చూసినది కాని నిజం కాదన్న నిశ్చయానికి వచ్చి, చలంతో పరిచయాన్ని పెంచుకొన్నాను.
ఆ రోజు శనివారం—
పానుగంటి వారి ‘సాక్షి’ సంపుటాలలో నాలుగవ భాగాన్ని తెచ్చి చలం చేతికి ఇచ్చాను. “ ఇది మీ పెట్టెలో పెట్టండి, వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్తాను” అంటూ.
పుస్తకం వంక ఓ మారు చూసి ,ముభావంగా పెట్టెలో పెట్టేసాడు చలం.
తిరిగి 11 గంటలకి పని ముగించుకొని, వర్క షాపు గేటు బయట పడేసరికి, పుస్తకం సంగతి ఙ్ఞాపకం వచ్చింది. పరిస్థితిని బట్టి అతని ఇంటికి వెళ్లిపోవడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చాను.
అంతేకాదు, చలం ఇంటికి వెళ్తే ‘పార్వతి’ కంట పడవచ్చనీ, ఆమె స్వరూప స్వభావాలు గమనించవచ్చనే అంతర్గతమైన కోరిక కూడా దానికి తోడయి, ఆ సాయంత్రమే ,చలం ఇంటికి బయలుదేరాను.
***************

Comments
Post a Comment