అయిదు వందల శరత్తుల క్రిందటి మాట.
కాపాలిక సాంప్రదాయ వాదులు అప్పట్లో ‘రుద్ర భైరవ’ పూజలు జరిపే వారు, కొండలు, కోనలు,లాంటి దుర్గమమైన రహస్య స్థలాలలో..వాళ్లందరి పేర్లు భైరవులే’ ! ఒకరు కాల భైరవు డయితే,తక్కిన వారు, ‘వీర భైరవ, విజయ భైరవ, నాధ భైరవ, జిత భైరవ, మదన భైరవ’ లాంటి పేర్లతో ఒకరినొకరు పిలుచుకొనే వారు.
‘వాళ్ల సాధనలో ‘పంచ మకరాలు’ ముఖ్య మయినవి.పంచ మకారాలంటే, మద్యము, మాంసము, మత్స్యము, మదిర, చివరగా అయదవది ‘మగువ’ ! ఆ మగువల పేర్లు కూడా, ‘కరుణ భైరవి, అరుణ భైరవి, దివ్య భైరవి, నాగ భైరవి, ముగ్ధ భైరవి, స్నిగ్ధ భైరవి’,ఇట్లాంటి పేర్లతో పిలిచే వారు. ఒక్కొక్క తండాకి ఒక గురువు ఉండేవాడు.గురువు మాట వారికి రుద్ర భైరవుని ఆఙ్ఞతో సమానం !
పంచ మకారాలతో ‘రుద్ర భైరవ’ సాధన, కాపాలికుల జీవితాశయం ! వాటిలో ఒకటైన మగువల కోసం వారు పడరాని పాట్లు పడేవారు. జన పదాలకు వెళ్లి, చిన్నారి ముక్కు పచ్చలారని బాలికలని అపహరించి, తమ గుహల లోకి తరలించి, పెంచి పెద్ద చేసేవారు. భైరవీ సాంప్రదాయానికి అనుగుణంగా వారిని మలచుకొనే వారు. ఆ పనిని వృధ్ధులైన భైరవీ మాతలు నిర్వర్తించే వారు.
అలాంటి ఒక స్నిగ్ధ భైరవిని, మొట్ట మొదటి సారి చూసాడు రత్నపురి రాకుమారుడైన ఆనందుడు !
,అందమైన ‘శోణ నది’ తన ఉద్గమ స్థలమైన ‘అమర కంటక’ పర్వత శానువుల నుండి, జరజరా జాలువారి, కళ కళ లాడుతూ, లోయలోకి ప్రవేశించిన చోట, అగమ్యమూ, దుర్గమమూ, కష్ట సాధ్యమూ, కేవలం పాదచారులు మాత్రమే చేర గలిగిన స్థలంలో మనోహరమైన ఆ దృశ్యం కన్నుల పండువుగా, ‘శోణ నదీ ప్రవాహ ఝురిలో స్నానం చేస్తూ,‘ స్నిగ్ధ భైరవి’ రూపంలో కనిపించింది.
రాకుమారుడు ఆనందుడు తన కళ్లని తాను నమ్మలేక పోయాడు !
పర్వత శిఖరం నుండి, నర్తిస్తూ దిగుతున్న శోణ నదీ సౌందర్యాన్ని మైమరచి చూస్తూ, ఆ నదిలో
తన రత్న ఖచితమైన ఛురికను జార విడుచుకొన్నాడు ఆ రాకుమారుడు. వెంటనే తన ఛురికను వెదుకుతూ, ఆ నదీ ప్రవాహం జారిన చోట్లని అవరోహిస్తూ, లోయలో దిగి, ఆ దృశ్యాన్నిచూసి, ఆ నదీమ తల్లే తన ముందు కన్యామణి రూపంలొ కనిపించిందని బావించాడు !
ఆ పరవశత్వంతో తన రత్నాల ఛురికను మరచి పోయాడు.!
పదహారేళ్ల ప్రాయం లోని ,స్నిగ్ధ భైరవి శోణ నదీ ప్రవాహంలో స్నానం చేస్తూ, తన రెండు చేతులూ జోడించి, అస్తమిస్తున్న సూర్యునికి అంజలి ఘటించింది.
ఆ పైన చేతులు చాచి,అతని కాంతిని ఆహ్వానిస్తూ, మొల లోతు నీళ్లల్లో నిలబడింది.ఆమె!
మూడు పాయలుగా శరీరానికి ముందు వెనుకల విస్తరిస్తూ ఆమె నగ్నత్వాన్ని దాచుతున్న, విశాలమైన కబరీ భరం తప్ప మరే ఆఛ్ఛాదనా లేని ఆమ శరీరంలో,నదీ ప్రవాహం ద్వారా అరుణారుణ కిరణాలని పరావర్తనం చేసి, ప్రార్ధనని అంగీకరించిన, పద్మ ప్రియుడు ఆమె మేని కాంతిని మెరిసి పోయే కాంచనంలా చేసి, జీవ కళలు ఉట్టి పడే సాల భంజిక లాగ చేసాడు !.
అదే ఆనందుడు చూసిన మనోహరమైన దృశ్యం ! చూడడానికి రెండు కళ్లూ చాలని అపురూపమూ, అనుపమానమూ అయిన దృశ్యం !!
“ సుందరీ ! నీ పేరేమిటి ? నీ వెవరవు? కన్యారూపం లోని శోణ నదివి కాదుగదా ?” ఆనందుని ప్రశ్న ఆమెని చకితురాలిని చేసింది..
రాజఠీవి ఉట్టిపడే దుస్తులతో ధృడమై,సుదర్శనమైన సమున్నత కాయంతో, విశాలమైన ఫాలభాగంతో. దట్టమైన కుంచె లాంటి కనుబొమల క్రింద వృషభాక్షాలతో,కోటేరు లాంటి నాసికతో,చతురస్రాకారమైన చిబుకంతో, పొడవైన మెడతో, ఉన్నతమైన భుజకీర్తులతో, వెడల్పైన భుజ స్కందాలతో, క్రీడాభూమి లాంటి వక్షస్థలంతో, సన్నని నడుముతో, ఆజాను బాహువులతో, తన ముందు నిలిచిన ఆ పురుషుణ్ని, బాల్యం నుంచీ భైరవులని తప్ప,ఇంకెవరినీ చూసి ఎరుగని ఆమె, విశాలమైన తన కళ్లని ,మరింత విశాలంగా చేసి,విస్మయంతో చూసింది.
అంత వరకు ఆమె మేని కాంతులనే చూసి, పరవశించిన అతను, ఆమె శరీర సౌందర్యానికి జోహార్లు
అర్పించాడు. ఆంద్ర భాషలోని పంచ కావ్యాలైన ‘మనుచరిత్ర’ లోని ‘వరూధిని’, ‘వసు చరిత్ర’ లోని ‘గిరిక’,‘ ఆముక్త మాల్యద’లోని ‘గోద’, ‘విజయ విలాసం’ లోని ‘ఉలూచి’, ‘పాండురంగ మహాత్మ్యం’ లోని ‘సుశీల’ కలిసి కట్టుగా వచ్చి, ఆమెని చూసినట్లయితే,తమని తాము చూసుకొని అసూయ పడేటంత, అందంగా ఉంది ఆమె !
“ నాపేరు స్నిగ్ధ భైరవి ! మీ పేరేమిటి ? మిమల్ని చూస్తే భైరవ సాధకుల లాగ లేరే ! ఇక్కడికి ఎలా రాగలిగారు ?” ప్రశ్నల వర్షం కురిపించింది ఆమె !
‘‘వాహురే ! ఇన్ని ప్రశ్నలు కురిపించారంటే, నిశ్చయంగా మీరు శోణ నదీమతల్లి కారన్నమాటే !నాపేరు ఆనందుడు, నేను రత్నపురి రాజ కుమారుణ్ని, మీరు నది లోంచి బయటికి వస్తే, ఎన్నోవిషయాలు మాట్లాడుకో వచ్చు! ”అన్నాడు ఆనందుడు.
ఆమె అక్కడి నుంచే ప్రశ్నించింది. “ఇక్కడికి ఎలావచ్చారు ?”అని.
“నా రత్నఖచితము, రాజచిహ్నము గల ‘ఛురకత్తి’, ఈ నదీ ప్రవాహంలో పడిపోయింది.దాని కోసం కొండ మీదనుండి క్రిందకి దిగాను. మిమ్మల్ని చూసాక ---”
~ ఈ ఛురకత్తేనా మీరు పోగొట్టుకొన్నది ? ” అంటూ, ఆమె నదిలోంచి బయట పడింది. కేవలం ఊరువుల వరకే ఉన్న, తన కటివస్త్రం లోంచి, ఆ ఛురికను బయటికి తీస్తూ..నదినుంచి బయట పడిన ఆమె అరటి బొదెల్లాంటి, తొడలు, ఛురికను బయటికి తీస్తున్నప్పుడు, గుహలా లోతుగా కనిపించిన ఆమె నాభిని చూసి ముగ్ధుడయ్యాడు అతను.
“నదీ ప్రవాహంలో దొరికిందిది ! మీదేనేమో చుసి చెప్పండి.”, అంది ఆమె నదీతిరానికి వచ్చి.ఛురికను ఆమె చేతుల్లోంచి అందుకొంటూ,ఆ కర స్పర్శని పొందిన అతని మేను పులకరించి.నిటారుగా అయింది !
“ ఇది నాదే ! దీని కోసమే దిగి వచ్చాను . సుందరీ ! మీరెవరు ? ఇక్కడ ఎందుకున్నారు ?”
“చెప్పానుగా, నేను భైరవిని ! అనంగరంగ ఆచార్యుని భైరవ దళంలో అతి చిన్న సభ్యురాలిని. ఇక్కడే ‘ఛత్రశాల రాజ వంశం’ లోని ‘ఇద్దరు తోడికోడళ్లు’ నిర్మించిన, ‘రుద్ర భైరవ’ మందిరం ఉంది. ఆ మందిరం దగ్గరున్న కొండ గుహలో, వాళ్లతో కలిసి ఉంటున్నాను. మానవ కాంతని, అల్పురాలిని అయిన నన్ను, దేవ
కన్యలతో పోల్చకండి. మీ ఛురికను తీసుకొని తిరిగి వెళ్లిపోండి.మా దళం లోని భైరవులు, నిరంకుశులు,రాక్షస ప్రవృత్తి గల వారు. మనుష్యులంటే వారికి ఇష్టం ఉండదు.వారు కంట పడి వాదనకి దిగుతే, చంపి వేస్తారు.”
“ నేను సుక్షత్రియ వంశానికి చెందిన వాడిని. చంపడమే గాని, చావుకి భయపడే వాడిని కాదు ! మామూలుగా అయితే ఛురికతో, వెళ్లి పోయే వాడినే ! మిమ్మల్ని చూసాక , మీతో మాట్లాడాక అసలు వెళ్లను ! ఇంతకీ మీరీ దళంలోకి ఎలా వచ్చారు ? మీ తల్లి తండ్రులు కూడా దళంలోనే ఉన్నారా ?”
“ నా తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు ! నేను మూడేళ్ల వయస్సులో తప్పి పోయానట ! నన్ను ఒక వృధ్ధ భైరవీ మాత తెచ్చి పెంచిందట !”
ఆమె మాటలు అతనికి ఆశ్చర్యాన్ని కలిగించ లేదు ! ఆ విషయాన్ని అతను ముందుగానే ఊహించాడు ! నిస్సంకోచంగా ఆమె వామ హస్తాన్ని, అందుకొని తనవైపుకి లాగుతూ అన్నాడతను. “సుందరీ ! ఈ దళం వదిలి, నాతో వచ్చేయి ! నేను నిన్ను వివాహ మాడుతాను.” అలా అంటూ, ఆమె ఎడమ భుజం మీద ఉన్న ‘పులి ఆకారంలో’ ఉన్న పచ్చబొట్టు చూసాడు.,“ సుందరీ ! ఈ పచ్చబొట్టు నీ భుజం మీద ఎలా వచ్చింది ?” అని అడిగాడు.
“ ఇది నా చిన్నప్పటి నుంచీ ఉంది !” అంటున్న ఆమెను, తన హృదయానికి హత్తుకొంటూ, ఆమె చిబుకాన్ని తన కుడిచేతి బొటన వ్రేలితో ఎత్తి,, ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడతను, “ ఈ పులి బొమ్మ నా మేనమామ కేశవ చంద్ర మౌర్యుల రాజవంశపు గుర్తు ! వారి మూడేళ్ల బాలికని, ఎవరో ఎత్తుకు పోయారు ! తెలిసిందా ఆ బాలికవి నిస్సందేహంగా నువ్వే ! నాకు వరసకి మరదలివి ! నీ మీద సర్వ హక్కులూ నావే ! నన్ను కాదనకు,” అంటూ ఆమె బుగ్గలని ముద్దు పెట్టుకొన్నాడు అతను.
ఆమె అతని హృదయ సీమలో తల వాల్చి, “ నన్ను త్వరగా తిసుకు పో, బావా ! నాలుగు రోజుల వెనుక వచ్చే పున్నమి నాడు, నన్ను వీళ్లు భైరవీ సాధనకి ఎన్నుకొన్నారు. అనంగరంగ భైరవ గురువు ఆ రోజు నన్ను ‘మదన భైరవిని’ చేసి, తొలిసారి కన్నెరికం చేస్తాడట ! అందుకే ఈ రోజు సూర్య భగవానుని వేడుకొన్నాను, నువ్వు కనిపించావు, ””అంటూ వెక్కి వెక్కి.ఏడ్చింది.
ఆనందుడు ఆమెని పొదివి పట్టుకొని, తన కౌగిలి లోకి తీసుకొన్నాడు. ఆమె కన్నీటిని తన పెదవులతో తుడిచాడు. ఆమె అతనికి చేరువయి, అతి చేరువయి, గువ్వలా కౌగిలిలో ఒదిగి పోయింది. అతడామె అధరాలని, తన పెదవుల మధ్య బిగించి, సుదీర్ఘ చుంబనం చేస్తూ, ఆమె అంగాంగాలని స్పృశిస్తూ, మృదువుగా మర్దిస్తూ, దగ్గరకి హత్తుకొంటూ, ఆమెకి ధైర్యాన్నీ ,పులకింతలనీ, మధురానుభూతులనీ, ఆనందాన్నీ కలిగించాడు. ఆమె తనని తాను అతనికి సమర్పించుకొని, సంరక్షణ లోని భద్రతనీ, కౌగిలి లోని కమ్మదనాన్నీ, స్త్రీత్వం లోని మధురిమని తొలిసారి చవి చూసింది.
ఆనందుడు, భైరవి ఆ విధంగా ఒకటిగా చేరి ‘ఆనందభైరవిగా ’ మారారు. వారిద్దరూ ఒకరి బాహు బంధంలో మరొకరు,ఒకరి అధర బంధంలో మరొకరు,ఒకరి దృష్టి బంధంలో మరొకరు కలసి పోయి, మురిసి పోయి, మైమరిచి పోయిన తరుణంలో,--“వాహురే !” అన్నకేక,దాని ప్రతిధ్వని వినిపించాయి. ఆనందుడా ప్రతిధ్వనికి స్పందించి, తన కౌగిలిని సడలించి, “ఆ, పిలుపు మా మనుష్యుల సంకేతమే ! మా సైనికులు, మా కోసం వెతుకుతూ, లోయలోకి ప్రవేశించినట్లు ఉన్నారు ! ” అన్నాడు.
ఆమె కూడ అతని నుండి విడివడింది. “బావా ! నా దళం లోని వారు కూడ, నా కోసం వెతుకుతూ ఇక్కడకు రావచ్చు. వాళ్లనుండి నన్నెలా విడిపిస్తావు ?” అని అడిగింది.
“ ఏముంది ! వారిని నేను ఒంటరిగానే ఎదుర్కోగలను, ఇప్పుడు మా సైనికులు కూడ తోడవుతారు ! ఇక సమస్య ఏముంటుంది ?”
“ రక్తపాతం నాకు ఇష్టం లేదు బావా ! ఎంతైనా పన్నెండేళ్లు నన్ను పెంచారు.”
“ అయితే ఏమంటావు ? నేను అహింస పాటించినా, వాళ్లు ఎదురు దాడి చెయ్యకుండా ఉంటారా ?”
“ నా కో ఉపాయం తోచింది, చెప్పనా ?”
“ అలాగే చెప్పు !”
ఆమె అతని తలని,తన ఎద మిదకి లాగుకొని, అతని ముంగురులు తన చేతి వ్రేళ్లతో సరి చేస్తూ, అతని చెవి దగ్గర తన ముఖాన్ని పెట్టి, చెవిలో రహస్యంగా చెప్పింది..ఆనందునికి, ఆమె చెప్పిన ఉపాయం, అది చెప్పిన తీరు నచ్చాయి.,
ఆనందుని దుస్తులు ధరించిన భైరవి, లోయ వైపుకి నడిచి, అతని సైనికులని కలిసింది. తన కరవాలాన్ని,ఛురికని, మాత్రమే తన దగ్గర ఉంచుకొని. నదీ గర్బంలో ప్రవేశించి ఈత కొట్టడం మొదలు పెట్టాడు ఆనందుడు. భైరవ దళం సభ్యులు, దూరం నుండి, ఈత కొడుతున్న అతనిని చూసి, భైరవనే అనుకొన్నారు !. ఎలుగెత్తి పిలిచారు.పలకక పోయె సరికి, అనుమానంతో, ఈటెలు, త్రిశూలాలు, లాఠీలతో నదీ తీరాన్ని చేరు కొన్నారు. వారిని చూసిన ఆనందుడు నది బయటికి వచ్చాడు. “భైరవులారా!నేను రత్నపురి రాకుమారుడిని ! మీ అధీనంలో ఉన్న,‘స్నిగ్ధ భైరవి’ నా మేనమామ కూతురు.మీరు ఆమెను బాల్యంలోనే ,ఎత్తుకు వచ్చారని నాకు తెలుసు. రెండు రాజ కుటుంబాలతో శతృత్వం మీకు మంచిది కాదు ! భైరవిని నాకు అప్పగించండి.
“ భైరవి ఎక్కడ ?” అడిగాడు అనంగ రంగడు.
“ ఆమె మీ గుహ దగ్గరకి నా సైనికులని తీసుకొని వెళ్లింది. మీ భైరవీ గణాలు వాళ్ల వశంలో ఉన్నారు. మీరు నా మిదకి కత్తి ఎత్తితే, వారినందరినీ మా సైనికులు మట్టు బెడతారు. ఏం నిర్ణయం తీసుకొంటారో త్వరగా తెలియ జెయ్యండి.”
భైరవీ గణాలు బందీలయ్యారని తెలియగానే, వారందరి ముఖాల లోనూ ఆందోళన ప్రస్ఫుట మయింది. ఆ గణాలు’ లేనిదే వారి సాధన సాగదు ! అందరూ అనంగ రంగ గురువు ముఖం చూసారు. “శిష్యులారా ! మన ‘స్నిగ్ధ భైరవిని’ , రాకుమారుడు ఆనందునికి ఇచ్చి, పెళ్లి చేసి, అతనిని మన జామాతగా చేసుకొందాం, మీరేమంటారు ?” అన్నాడు అనంగ రంగడు. అందరూ కోలాహలంతో గెంతులు వేసారు.
వివాహమంటే అందరికీ వేడుకే కదా మరి !!
*******************

శతటపోత్సవ శుభకాంక్షలు శ్రీధర్ గారు..
ReplyDeleteధన్యవాదాలు జ్యోతీ ! మీరు నా ఛేయి పట్టుకొని మూడు అడుగులు వేయించారు. ఈ నాడు అది శతాధికమైంది. ఇలాగే ఎల్లప్పుడూ, ‘నొప్పింపక తానొవ్వక ’ -- అన్న విధంగా మీ వ్యక్తిత్వాన్ని మలచుకొని అందరికీ మేలు చేస్తూ ఉండండి. -- శ్రీధర్.ఎ
ReplyDelete