[ ధర్మాధర్మ , ఉచితానుచిత, న్యాయాన్యాయ విధులను, వివిధ వాఙ్మయ ధారల నుండి సేకరించి గ్రుచ్చెత్తిన ప్రకీర్ణకము]
1. ఙ్ఞానాన్ని పొందాలని ఆశించే వ్యక్తి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తదితర హీన నిమ్న మరియు హూణ జాతుల లోని ఏ వ్యక్తి నుండి అయినా దానిని అనగా ఙ్ఞానాన్ని సముపార్జించవచ్చు, అందులో దోషము లేదు. ( మహాభారతం—శాంతిపర్వము ౩౧౮/౮౮; మనుస్మృతి-- ౨/౨౩౮; భవిష్యపురాణం –బ్రహ్మ పురాణం ౪/౨౦౭)
2. శాస్త్రాధారము లేకుండా కేవలము మౌఖికంగా, ప్రాయశ్చిత్త, చికిత్స, జ్యోతిష, ఫలాదేశములను చెప్పే వ్యక్తి బ్రహ్మహత్యా పాతకము చేసిన వానితో సమానుడు అవుతాడు.( నారద పురాణం—పూర్వ ౧౨/౬౪)
3. రేపటి దినము చేయవలసిన విధిని నేడు, సాయంత్రము నిర్వర్తింప దలచిన విధిని ప్రాతఃకాలమందే పూర్తిచేయవలెను, ఎందుకంటే మృత్యువుకు కార్య పరిసమాప్తితో నిమిత్తము లేదు.( విష్ణుస్మృతి – ౨౦)
4. ఇవ్వ వలసినవి, పుచ్చుకో వలసినవి మరియు యోగ్యమయిన సుకర్మలను శీఘ్రముగా చేసివేయవలెను, ఏలననగా కాలయాపనము వాటి రసమును పీల్చివేయును.( హితోపదేశము –సంధి ౧౦౧ )
5. అనేక కార్యములను చేయవలసి వచ్చినప్పుడు, బుధ్ధిమతి అయిన వ్యక్తి సుయోగ్యమైన కార్యములను సత్వరము చేయవలెను. లౌకిక కార్యకలాపములను వెనుకగా చేయవలెను ( శుక్రనీతి ౩/౧౪౧—౧౫౦ )
6. కుటుంబములో ధన, భాగ్య, సంపదల పంపకములు ఒకే ఒక పర్యాయము చేయవలెను. అదే విధముగా కన్యాదానము కూడ ఒకే ఒక పర్యాయము చేయవలెను. ఏదైనా ఒక వస్తువుని దానమిచ్చే ప్రతిఙ్ఞని కూడా వెంటనే ఒకే ఒక పరి చేయవలెను అదియే సత్పురుషుల మతము ( మనుస్మృతి ౯/౪౭; మహాభారతం – అరణ్య ౨౯౪/౨౬)
7. కనులు మూసుకొని నిద్రని జయించాలని ప్రయత్నించ వద్దు. కామోపభోగము చేత స్త్రీని అనుభవించి ఆమెని వశపరచుకోవాలని అనుకోవద్దు, వంట చెరుకుని వేసి అగ్నిని జయించాలని ఆశించ వద్దు, అత్యధికముగా మదిరా పానము చేసి వ్యసనాన్ని త్యజించాలని ఊహించ వద్దు. ( మహాభారతం – ఉద్యోగపర్వం—౩౧/ ౮౧ )
8. బాగుగా ఆలోచన చేసి ఏ పనినైనా చెయ్యవలెను. తొందరపాటుతో ఏ విద్యనైనా నేర్చుకోకూడదు. అవివేకముతో హఠాత్తుగా ఏ పనినైనా చేబడితే, విపత్తులను ఎదుర్కొనవలసి వస్తుంది. అందువలన సువిచారముతో పనిని చేసిన వారి దగ్గరకి సంపద తనంతట తానే వస్తుంది. ( మహాభారతం – ఉద్యోగపర్వం—౩౪/ ౮ )
9. బుధ్ధిశాలియైన వ్యక్తి, రాజు , బ్రాహ్మణ, వైద్య, మూర్ఖ, మిత్ర, గురు, ఇంకా తదితర ప్రియజనులతో వాద వివాదములకు పూనుకోడు. ( పద్మపురాణం—సృష్టి—౫౧/౧౦౧; చాణక్య సూత్రం ౩౫౨)
10. పాములతోను, ఆయుధములతోను క్రీడించకూడదు ( విష్ణుస్మృతి—౭౧;కూర్మపురాణం—ఉత్తర—౧౬/౫౮;పద్మపురాణం—౫౫/౫౮;విష్ణుధర్మాంతరం ౩/౨౩౩/౨౫౩)
11. ఉదయ సూర్యుని కిరణాలని, చితి యొక్క పొగనీ, వృధ్ధురాలైన స్త్రీని, పూర్తిగా తోడుకోని పెరుగునీ, చిరిగి పోయిన ఆసనాన్నీ, ఉపయోగించే పురుషుడు దీర్ఘాయువు కాలేడు. అనగా వాటిని అనుభవించినట్లయితే దీర్ఘాయువు లభ్యమవదు. ( మనుస్మృతి-- ౪/౬౧; కూర్మపురాణం – ఉత్తర—౧౬/౬౭;పద్మపురాణం—స్వర్గ – ౫౫/౬౭; గరుడ పురాణం – ఆచార—౧౧౪/౪౦)
12. దీర్ఘాయువుని ఆశింఛే వ్యక్తి, గో—మహిషాల వీపుపై కూర్చోకూడదు. చితి యొక్క పొగని తన అంగాంగ స్పర్శ చేయనివ్వకూడదు. గంగానది తప్ప ఇతర నదీ తటములపై కూర్చొన కూడదు. ఉదయకాలీన సూర్యుని కిరణాలని స్పర్శించ కూడదు. మరియు మధ్యహ్న కాలమందు నిద్రించ కూడదు. ( స్కంధ పురాణం – బ్రహ్మ—ధర్మ – ౬/౬౬—౬౭ )
13. చిరిగిపోయిన జీర్ణమయిన , లేదా కొంతవరకు కాలిపోయిన ఆసనాన్ని, మరియు బీటలు వారిన పాత్రలని త్యజించి వేయాలి. ( మహాభారతం- అనుశాసన పర్వం—౧౦౪/౬౬; వామన పురాణం—౧౪/౪౭; మార్కండేయ పురాణం—౩౪/౩౧; బ్రహ్మపురాణం—౨౨౧/ ౩౧)
14. గృహము లోపలికి ద్వారము నుండి మాత్రమే ప్రవేశించాలి. తాను గాని, తదితరులని గాని, ద్వారము నుండియే లోపలికి ప్రవేశింప చేయాలి. ఇంకొక మార్గము అనగా గవాక్షముల ద్వారా ప్రవేశిస్తే, గోత్ర నాశనము కలుగుతుంది. ( మనుస్మృతి—౪/౭౩; యాఙ్ఞవల్క స్మృతి—౧/౧౪౦; అగ్నిపురాణం-౧౫౫/౨౭;స్కందపురాణం – బ్రహ్మ—ధర్మ- ౬/౭౧; గరుడ పురాణం –ఆచార—౭౬/౪౩)
15. చిన్న చిన్న విషయ నిరూపణలకి, ఒట్లు పెట్టకూడదు. వ్యర్థ ప్రమాణాలు చేసే వ్యక్తుల ఇహ పరాలు రెండూ నష్టమవుతాయి. ( స్కందపురాణం—కాశీ—పూర్వ—౪౦/౧౫౩)
16. గంధము, పుష్పము, కుశము, గోవు, పెరుగు, శాకము, తేనె, జలము, ఫలము, కందమూలము, మరియు అభయము, దక్షిణ, ఇవి నికృష్టుడైన మనుష్యుని చేతినుండి అయినా ప్రాప్తమయే అవకాశము కలిగితే దానిని స్వీకరించ వలెను. స్కందపురాణం—బ్రహ్మ—ధర్మ—౬/౧౦౧—౧౦౨)
17. అగ్ని వద్ద, గోశాల వద్ద, దేవాలయము వద్ద, బ్రాహ్మణ సన్నిధి యందు, జప, తప, స్వాధ్యాయములు భోజనాదులు చేసేటప్పుడు పాదరక్షలు విడువ వలయును. ( ఆంగీర స్మృతి-, ఆపస్తంభ స్మృతి ౭/ ౨౦ )
18. మంత్రహీనమైన ఆహుతి, సకేశ విధవ, స్నానము చేయకుండా వ్రతము, వైష్ణవుడు లేని రాజ్యము, దశమితో ( ఇక్కడ దశమి అంటే పదవ నక్షత్రమైన మఘ కావచ్చు ) కూడిన ద్వాదశి శ్రేష్టమైనవి కావు. ( స్కందపురాణం—వైష్ణవ—మార్గశీర్ష—౧౧/౩౫-౩౬)౭౩
19. అత్యవసరమైతే తప్ప వృక్షారోహణము చెయ్యకూడదు.నూతిలో దూకకూడదు, నూయ్యిని, గొయ్యిని తొంగి చూడకూడదు (విష్ణుపురాణం—౩/౧౨/౮; చరకసంహిత- సూత్ర – ౮/౧౯)౯; వశిష్ట స్మృతి—౪/౧౯)
20. ఆసనము, శయ్య, సవారీ, పావుకోడు, పలుదోము పుల్ల, పాదపీఠము లాంటి వస్తువుల కోసం ‘పలాశ’ వృక్ష శాఖలను ఉపయోగించకూడదు. ( బౌధాన్య స్మృతి—౨/౩/౫౪/౫౫; గోభిలగుహ్య సూత్రం—౩/౫/౧౩)
21. వామహస్తంతో భోజనం చేసేవాడు, ఒడిలో కంచాన్ని పెట్టుకొని భుజించే వాడు, పలాశ కలపతో
చేసిన ఆసనంపై కూర్చొని భోజనం చేసేవాడు, తేందూ కర్రతో దంత ధావన చేసేవాడు , ప్రాతః కాలమున నిద్రించే వాడు, నరకానికి పోవుదురు. ( మహాభారతం – ద్రోణపర్వం—౭౩/౩౮--౩౯ )
22. గుమ్మడికాయని తరిగే లేదా పగలగొట్టే స్త్తీ, దీపాన్ని నోటితో ఆర్పేసే పురుషుడు, జన్మ జన్మల వరకు దరిద్రులు, రోగ గ్ర్రస్తులు అవుతారు ((బ్రహ్మవైవర్త పురాణం—శ్రీకృష్ణ—౭౫/౭౫ )
23. హోమశాలలోను, దేవ మందిరాల లోను, గోవుల మధ్య, బ్రాహ్మణుల మద్య, స్వాధ్యాయములందు, కుడి చేతినే ఉపయోగించ వలెను.( మహాభారతం—శాంతిపర్వం—౧౯౩/౨౦; బౌధాయన స్మృతి – ౨/౩/౬౪),
24. దీపం యొక్క , మంచం యొక్క, మరియు మానవ శరీరం యొక్క, నీడలు; ఇంకా కేశములు, వస్త్రముల, అల్లిన చాపల రేశాలు, మేక యొక్క, చీపురు యొక్క, పిల్లి యొక్క కాలి మట్టి , ఇవన్నీ ఎవరివైనా శుభ ప్రారబ్ధములను హరించి వేస్తాయి. ( నారద పురాణం—పూర్వ—౨౬/౩౨ )
25. చాట ఎగరవేయునప్పుడు వెలువడే వాయువు, గోరు కత్తిరించినప్పుడు ఉపయోగించే నీరు, స్నానము ముగించిన పిమ్మట అధో వస్త్రములను జాడించి పిండిన నీరు, తడి తలనుండి జాలువారే నీరు, చీపురుతో పోగు చేసిన ధూళి, మనుష్యుల పూర్వ జన్మల పుణ్య ఫలాలని కూడా హరించి వేయగలవు ( లఘుశంక స్మృతి—౬౯; అగ్ని సంహిత—౩౧౬; దాలభ్య స్మృతి—౧౩౫; గరుడపురాణం – ఆచార – ౧౧౪/౪౪; నారద పురాణం—పూర్వ—౨౬/౩౩ )
26. ఎదురుగా వచ్చే వాయువు, ధూళి, పొగ, మంచు, తుఫానుల నుండి తనని తాను రక్షించుకోవాలి అనగా వాటిని ఎదుర్కొన కూడదు.( సుశ్రుత సంహిత – చికిత్స—౨౪/౧౬; అష్టాంగ హృదయ సూత్రం—౨/౪౦/౪౪; చరక సంహిత—సూత్ర—౮/౧౯;విష్ణుపురాణం – ౩/౧౨/౧౮)
27. నదీ తటము నందు, వృక్షముల ఛాయక్రింద నిద్రించ కూడదు (అష్టాంగ హృదయ సూత్రం—౨/౪౧)
28. పక్షులని తరిమి వేసేటప్పుడు రిక్త హస్తముతో తరమాలి, మరియు అవి ఎగిరిపోయిన తరువాత ఆ చేతిని జలముతో శుభ్రము చేసుకోవాలి ( ఆపస్తంభ సూత్రం – ౧/౫/౧౫/౭ )
29. సామర్థ్యము కలిగిన యెడల ఆచరించ గలిగిన యెడల ,ఒక్క క్షణమైనను అపవిత్రముగాను, నగ్నముగా ఉండరాదు.( ఆపస్తంభ సూత్రం –౧/౫/౧౫—౮-౯ )
30. ఉద్దండులైన వారితోను, ఉన్మత్తులైన వారి తోను, మూడుల తోను, అవినీతి పరుల తోను, శీల హీనుల తోను, దొంగల తోను, లోభులతోను, శతృవుల తోను, కులట యొక్క పతితోను, అధిక బలవానుల తోను, అధిక దుర్బలుల తోను, నిందితుల తోను, సందేహ పరుల తోను, స్నేహము చేయకూడదు. సాధువుల తోను, విద్వాంసుల తోను, సరళ స్వభావుల తోను, ఉద్యోగ ఉద్యమ ప్రవృత్తి గల వారి తోను విరోధము చేయకూడదు. ( మార్కండేయ పురాణం—౩౪/౮౭—౯౦)
31. “అయ్యా నాకేదైనా దానం చేయండి”, అన్న వాక్యం నోటి నుండి వెలువడిన మరుక్షణం ‘ బుద్ది, శ్రీ, లజ్జ, శాంతి, మరియు కీర్తి అనబడే శరీరము నాశ్రయించి నిలిచిన అయిదు దేవతలు బహిర్గత మవుదురు.( బ్రహ్మ పురాణం – ౧౩౭/౧౦ )
32. తన పాదరక్షలను తనంతట తానే మోసుకొని వెళ్లకూడదు ( గోభిల గుహ్య సూత్రం—౩/౫/౧౨; మను స్మృతి ౪/౭౨; కూర్మ పురాణం—ఉత్తర—౧౬/౬౭; పద్మ పురాణం – స్వర్గ—౫౫/౬౭ )
33. కంఠము నుండి తీసి వేసిన పూల మాలను తిరిగి ధరించ కూడదు. ( మనుస్మృతి—౩/౧౨; వశిష్ట స్మృతి—౧౨/౩౫; కూర్మ పురాణం—ఉత్తర—౧౬/౮౩; పద్మ పురాణం – స్వర్గ—౫౫/౮౪—౮౫)
ఇంకా వైవిధ్య భరితమైన చాలా సూక్తులు సేకరించడం జరిగింది. అవన్నీ వ్రాసేస్తే బోరు కొట్టించినట్లు అవుతుంది అని వ్రాయలేదు. ఈ పాఠాలకి సూక్తి ముక్తావళి అనే పేరే సమంజసం కాని ఆ పేరు పెడితే ఎవరూ క్లిక్ చేయరనే అనుమానంతో వెరైటీ శీర్షిక పెట్టాను.
ఇది నా నూరవ పోస్టు. గమనించండి. ఎ.శ్రీధర్.
**********************

పూజ్య సమానులైన శ్రీధర్ గారికి నా నమస్కారాలు.
ReplyDeleteనాకు ఇలాంటి వైవిధ్య భరితమైన సూక్తులు చదవడం అంటే నాకు ఎంతో ఇష్టం. చదివిన వాటిని బద్రపరుస్తాను కూడా. మీ దగ్గర ఉన్న మిగతా సూక్తులు తెలుపగలరని ఆశిస్తున్నాను.
ధన్యవాదములు
వాసు