Skip to main content

పడగ మీద మణి--1


శ్రీ సోమనాధుని ఆలయం, రంగు రంగుల దీప తోరణాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా ఉంది.
రోజు మాస శివరాత్రి, పర్వదినం. రాత్రి పన్నెండు గంటలయింది.
ద్వాదశ జ్యోతిర్లింగాల పరంపరలో ఎనిమిది మూర్తులని చూపించే యాత్రలో భాగంగా, శ్రీ వైద్యనాధ, శ్రీ విశ్వేశ్వర, శ్రీ మహాకాళేశ్వర, శ్రీ ఓంకారేశ్వర లింగాలని దర్శించుకొని శ్రీ సోమనాధుని దర్శనార్థమై రోజే చేరుకొన్నారు ఆంధ్రదేశం నుంచి వచ్చిన తీర్థ యాత్రీకుల గుంపు.మాస శివరాత్రి పర్వదినం కూడ కలిసి రావడంతో, స్థానిక తెలుగు పండితునితో సామూహిక రుద్రాభిషేక కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి హడావుడి పడుతున్నారు.
వారిలో ఆనందోత్సాహాలతో నిండిపోయి ఉన్నాయి, సత్యనారాయణ శర్మ, కనక మహాలక్ష్మమ్మల హృదయాలు ! దానికి కారణం దగ్గరలోనే , ‘బరూఛ్లో ఇంధన తైలాన్ని అన్వేషించే ప్రయత్నంలో, ‘ భారత చమురు మరియు సహజ వాయువు పరిశోధనా సంస్థలో ఇంజనీరుగా పని చేస్తున్న వాళ్ల అబ్బాయివిరించికోడలుఅపాలఏడేళ్ల మనవరాలుశ్రేయ’ కలిసి వాళ్లను చూసేందుకు, అక్కడికే వచ్చినందుకు !
విరించీ ! ఎలాగూ రానే వచ్చావు. నువ్వూ కోడలూ కూడా పీటల మీద కూర్చోండిఅన్నాడు శర్మ వాళ్లను ఉద్దేశించి.
వీలవదు నాన్నగారూ ! నేను అత్యవసరంగా మాట్లాడ వలసిన ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయి. అభిషేకం ముగియడానికి ఇంకా మూడు నాలుగు గంటలైనా పడుతుంది గదా అందుకని---?”
రాత్రి పూట కూడ ఫోన్లు ఏమిట్రా ?” అమాయకంగా అడిగింది మహాలక్ష్మమ్మ.
విరించి మౌనం వహించాడు. అపాల అత్తగారికి సమాధానం ఇచ్చింది. “నా పోరు పడలేక ఇక్కడకు వచ్చారు అత్తయ్యా ! లేకపోతేసైటు ఆఫీసువదిలి రావడానికి ఇష్టపడనే లేదు. ‘అట్లాంటానుంచి, ‘క్రైన్సుకంపెనీ, ఎగ్జిక్యూటివు ఇంజనీరుగారు చేసే ఫోను కాలు గురించి ఎదురు చూస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు పగలే కదా ! అతనేదో కాన్ఫరెన్సులో ఉన్నారట, అది అవగానే పిలుస్తామని అన్నారట !” అని.
`` సరేనమ్మా, ఏం చేస్తాం? దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా ! ఫోనునిదద్దరిల్లే విభాగంలో (వైబ్రెంటు మోడ్ )పెట్టి మా వెనుకనే వచ్చి కూర్చోండి. నమక చమకాలైనా చెవిన బడతాయి,” అన్నారు శర్మగారు.
విరించి, అపాల, శ్రేయ వాళ్ల వెనుకనే వచ్చి కూర్చొన్నారు.
పురోహితుడు తాను సంకల్పం చెప్తూ, పీటల మీద కూర్చొన్న వారినందరినీ సంకల్పం చెప్పమని ఆదేశించాడు.
స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర, మార్గశిర బహుళ త్రయోదశీ, తత్కాల చతుర్దశీ . అనూరాధా నక్షత్ర యుత, భృగువాసరే (తేదీ ..౨౦౦౯ ) మాస శివరాత్రి పర్వ దినే, అహం హరితస గోత్రోద్భవస్య సత్యనారాయణ శర్మ నామధేయస్య, కనక మహాలక్ష్మీ నామ్నీ ధర్మ పత్నీ సమేతస్య, విరించి నామధేయస్య పుత్ర , తద్ధర్మ పత్నీ అపాల నామ్నీ పుత్రవధూ, తదేవ పుత్రీ శ్రేయా నామ్నీ పౌత్రీ సమేతస్య,అస్మాకం క్షేమ, స్థైర్య విజయ, ఆయు, ఆరోగ్య , ఐశ్వర్య వృధ్యర్థం, శ్రీ రుద్రాభిషేకం కరిష్యే --- అంటూ ఆచమనం చేసాడు సత్య నారాయణ శర్మ.
తన ప్రక్కనే కూర్చొన్న భార్య చేతిలో తీర్థం పోసి, ఆమె ఆచమనం చేసాక, అపాల చేతలోనూ, శ్రేయ చేతిలోనూ పోసి, తరువాత విరించి చేతిలో తీర్థం పోసారాయన. విరించి అన్య మనస్కం గానే తీర్థాన్ని అందుకొని ఆచమనం చేసాడు.
అపాల అపురూపంగా చూసింది విరించి వంక. తీర్థ యాత్రలో భాగంగా, దగ్గరగా
వస్తున్న అత్త మామల్ని కలిసేందుకు, మామ్మనీ తాత గారినీ చూసేందుకు ఉత్సాహ పడిన శ్రేయని సమాధాన పరచేందుకు, అతని భాద్యతని గుర్తు చేసి, ప్రోత్సహించి, పంతగించి,మరీ తీసుకొని వచ్చింది అతనిని !ఇక్కడ వీళ్ల వెనకన కూర్చొని, ఆచమనం చేసిన భర్తని,చూసాక హర్షమూ, ఆశ్చర్యమూ రెండూ కలిగాయి ఆమెకి.
ఆనందం ఎంతో సేపు నిలవదని ఆమెకు తెలుసు. మరి కొన్ని క్షణాలలో ఎలాగూ, ఫోను దద్దరిల్లు తుంది. వెంటనే అతను లేచి వెళ్లిపోతాడు.అతనికి ఇలాంటి పూజా కైంకర్యాల పట్ల సుముఖత ఏనాడూ లేదు.
బరూచ్దగ్గర అన్వేషణా స్థలం నుండి,‘ సోమనాధ్రావడానికీ, తిరిగి పోవడానికీ, ఎనిమిది గంటల సమయం వ్యర్థమవుతుంది. సమయం ఆఫిసులోనే గడిపితే, పని ఎంతో ముందుకి వెళ్తుంది. కదా ! అని వాదించిన అతనితో, సమానంగా తర్కించి, తల్లి తండ్రులని కలియడం భాద్యత అని గుర్తు చేసి, చివరికి చీవాట్లు కూడా తిని, సోమనాధుని దర్శనం చేసుకొని తరించాలనుకొంది ఆమె స్త్రీ హృదయం !
మగవాళ్లు స్త్రీకి దగ్గరగా ఉంటూనే, స్త్రీ హృదయానికి సుదూరంగా ఎందుకు ఉంటారో కదా, సోమనాధా ! నీ లింగోధ్భవ కాలం వరకైనా, ‘ఫోనునిదద్దరిల్లకుండా చేయి. అనుకొంది మనసులో.
రుద్రాభిషేకం మొదలయింది. మంత్ర పఠనం ప్రవాహంలాగ ఉరకలు వేస్తూ సాగుతోంది. మరి కాస్త దూరంలో అఖండ పంచాక్షరీ మంత్ర పఠనం కూడ తార స్థాయికి చేరుకొంది. అంత ఘోషలో కూడా , సోమనాధుడు, అపాల పిలుపు విన్నాడో ఏమో, ‘ హర హర మహాదేవ, శంభో శంకరఅంటూ, మిన్ను ముట్టిన శంఖారావాలతో, లింగోధ్భవ కాలం దాటే సరికి, విరించి చేతిలోని ఫోను దద్దరిల్లింది !
విరించి ఆత్రుతతో దానిని అందుకొని, మంటపం చివరికి పరుగెత్తాడు.
గుజరాత్ లోనిబరూచ్దగ్గరలో, ప్రభుత్వ సంస్థ అయిన .ఎన్.జి.సి అన్వేషణలో
క్రూడ్ ఆయిల్నిల్వలు ఉన్నట్లు తెలిసాయి. దానిని వెలికి తీయడానికి కంపెనీ, అమెరికా లోని, ‘క్రైన్సుకంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది.
ప్రభుత్వ సంస్థ పర్యవేక్షణలో, ‘ క్రైన్సుకంపెనీ త్రవ్వకాలు మొదలు పెట్టింది. లభ్యమయేక్రూడ్ ఆయిల్నిల్వలలో, ముఫ్ఫయిశాతం ప్రభుత్వానికి ఇవ్వడానికి, మరో ఇరవై అయిదు శాతం .న్.జి.సి కి సబ్సిడీ రేటుకి ఇచ్చాక, తక్కిన నలభై అయిదు శాతం, ఆయిల్ని కంపెనీ తన ఇష్టం వచ్చిన ధరకి, ఇష్టం వచ్చిన చోట అమ్ముకో గలిగే అవకాశాన్ని హక్కుగా పొందుతుంది. అదే ఒప్పందం సారాంశం !.
అయితే ప్రాధమిక శోధనలో త్రవ్వి తీసిన ఆయిల్, వాళ్లు ఆశించిన నాణ్యత లేక, నల్లటి, చిక్కటి, అంజనం లాంటి రూపంలో బయట పడింది. ద్రవ రూపంలో లేని నూనెని, నూనెశుధ్ధి కర్మాగారానికి పంపించ డానికి, దానిని పూర్తిగా వేడి చేసి,ద్రవంలాగ చెయ్యాలి.అలా వేడి చేయడానికి ప్రతీ మూడడుగుల దూరంలోను, ‘బార్బిక్యూలు (హీటర్లు) అమర్చాలి, దాంతో నిర్మాణ వ్యయం అధికమయి, ఒప్పందాన్ని తిరిగి వ్రాసుకో వలసిన అవసరం పరిస్థితి ఏర్పడింది.
నిర్మాణ వ్యయం అంచనా వేసేందుకు, ఆయిల్ని వేడి చేసే సాంకేతిక సహాయం కొరకు, ‘క్రైన్సుకంపెనీటాటా ప్రొజెక్ట్సుకంపెనీని’, ‘ ఎల్ & టి కంపెనీని సంప్రదించింది.
సంస్థలు రెండూ తమ తమ ప్రతినిధులని పంపేందుకు సిధ్ధమయ్యాయి.
ముందుగా తమ ప్రాథమిక సమీక్షని పంపించాయి, రెండు సంస్థలు. వాటిని పరిశీలించాక, ఒప్పందాన్ని మార్చి వ్రాసుకోవాల్సిన అవసరం ఉందని, ‘క్రైన్సుకంపెనీ, .ఎన్ .జి.సి లేఖ వ్రాసింది. దానికి అంగీకారం దొరికాక, తమ ప్రతినిధిని పంపుతామని ప్రకటించింది. క్రొత్త ఒప్పందం ఎలా ఉండాలి, అన్న విషయం మీద రోజే అక్కడకాన్ఫరెన్సుజరుగుతోంది.
కాన్ఫరెన్సు పూర్తి అయ్యాక వివరాలని, తెలుసుకొని, క్రైన్సు ప్రతినిధిని
ఆహ్వానించడానికి, విరించి తొందర పడుతున్నాడు ! సైటు ఆఫీసులోనే ఉండి ఉంటే , అతని పని సులువు అయి ఉండేది. కాని అపాల, శ్రేయల పట్టుదల వల్ల, తల్లి తండ్రులని కలిసేందుకు అతనీ సోమనాధ్ కి బయలు దేరాడు.
కంపెనీ నుండి వచ్చే ప్రతినిధి , ఎలాంటి వాడో, విదేశీయుడో, లేక ఎన్. ఆర్. వస్తాడో, ఎలాంటి నక్క జిత్తులు వేస్తాడో, వాళ్ల పథకం తమ సంస్థకి అనుకూలంగా ఉంటుందో, ఉండదో అన్నదే అతని ఆతృత !
ఇష్టంతో వచ్చినా, అయిష్టంతో వచ్చినా, సోమనాధుని దర్శనం వల్ల తమ కంపెనీ ప్రయోజనాలని దెబ్బ తినే విధంగా కాక, సానుకూలంగా మారిందన్న విషయం అతని కెలా తెలుస్తుంది !
లింగోద్భవ కాలం దాటేక, వచ్చిన ఫోను పిలుపుని ఆతృతతో అందుకొని, చెవికి ఆనించాడు విరించి, “ హలో, విరించి హియర్ !” అంటూ.
హలో ! విరించీ ! నేనురావిష్ణు మాధవ్ని. క్రైన్సు కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచే మాట్లాడు తున్నాను. మా కాన్ఫరెన్సు ఇప్పుడే ముగిసింది.”
నువ్వా విష్ణూ ! నువ్వు క్రైన్సు నుంచి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందిరా !”
అవునా ? .ఎన్.జి.సి తరఫు నుంచి, నువ్వు ప్రతినిధిగా ఉండడం నాకూ ఆశ్చర్యాన్ని కలిగించింది. నీకు ఇంకో న్యూసు చెప్పనా , నేనే వస్తున్నానుక్రైన్సుతరఫున ప్రతినిధిగా ! ఫేమిలీని కూడా తీసికొని వస్తున్నాను.”
అలాగా ! చాలా సంతోషం ! నీ భార్య వినతతో పాటు, కొడుకు శ్రీకర్ బాగున్నారా ? వాడొక్కడేనా, ఇంకెవరైనా ఉన్నారా ?”
శ్రీకర్ కి ఇప్పుడు పదిహేను ఏళ్లు, వాడి తరువాత ఇంకెవరూ లేరనే అనుకొన్నాం. ఏడు సంవత్సరాలు గడిచాకఅమ్మాయి పుట్టింది ! అందుకేసృష్టిఅని పేరు పెట్టాం ! మేమందరం కలిసే రావడానికి కారణం కూడా అదేన్రా ! వినతసోమనాధునికి అభీషేకం చేస్తానని మొక్కుకొందట ! తరువాతే అది పుట్టింది. అందు చేత అందరం కలిసే వస్తున్నాం, నీ ఫేమిలీని కూడా తీసుకురారా !”
అపాలకి కూడా అలాంటి సెంటిమెంట్లు ఉన్నాయిరా ! ఇప్పుడు నేను సోమనాధ దేవాలయం నుంచే మాట్లాడుతున్నాను.ఇవాళ అక్కడేదో పండగ ఉంది ! అమ్మా నాన్నా కూడా ఇక్కడ అభిషేకం చేయిస్తున్నారు.”
అలాగా, నీ కెలాంటి సెంటిమెంట్లు లేక పోయినా , నువ్వు అక్కడ నుంచే మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది.”
సరేరా ! కాన్ఫరెన్సు వివరాలు చెప్పు.”
ఏమున్నాయి ? మారిన విలువల నేపథ్యంలో అగ్రిమెంటులో కొన్ని మార్పులు చేయాలని తీర్మానించాం ! ముందు అనుకొన్నట్లు ఏభయి అయిదు / నలభై అయిదు నిష్పత్తిలో కాక, నలభై అయిదు / ఏభయి అయిదు నిష్పత్తిలో అగ్రిమెంటు చేయాలిరా ! దానికి నువ్వు సహకరించాలి !”
నీ నిష్పత్తిలేవీ నాకు అర్థం కాలేదురా ! వివరంగా చెప్పు.”
ఏముంది? మీప్రభుత్వానికి ఇరవై అయిదు శాతం,మీ కంపెనీకి సబ్సిడీ రేటులో ఇరవై శాతం ఇస్తాం ! మాకు యాభై అయిదు శాతం దక్కాలి !”
ప్రభుత్వం వాటా సరే ! మా కంపెనీకి దీని వల్ల అయిదు శాతం చవకగా లభించాల్సిన నూనె దొరకడం లేదు ! ఎంత నష్టం వస్తుందో ఆలోచించావా ? దానికి నేను సహకరించాలా !”
నాణ్యత తగ్గిన చమురు రవాణా ఖర్చుల సంగతి ఆలోచించావా ? అయినా అవన్నీ అక్కడికి వచ్చాక ఆలోచించ వచ్చు, నీకు మరి కొన్ని విషయాలు చెప్పాలి.”
చెప్పరా !”
నిర్మాణ వ్యయాన్ని అంచనా వేయడానికి, మా సంస్థటాటా ప్రొజెక్ట్సుని సహాయం అడిగింది కదా, సంస్థ నియమించిన ఇంజనీరు ఎవరో తెలుసా ?”
ఎవరు ?”
మన ద్యుతిధర్ రా ! ప్రోజెక్టు ఖర్చు సుమారుగా అంచనా వేసి, అప్పుడే ప్రాథమిక పరిశీలనా ప్రతులు పంపించేసాడు. అప్పుడే తెలిసిందిరా ప్రాజెక్టులో వాడి హస్తం కూడా ఉందని !
నిజమా ! నమ్మలేకుండా లేకుండా ఉన్నానురా, అయితే వాడు కూడాసైటుకి వస్తాడన్న మాట !
అవునురా ! మన కుటుంబాలు ఎలాగూ అక్కడికే వస్తాయి కదా, అందుకని తనని కూడా ఫేమిలీని తెమ్మనమని చెప్పాను.
వాడి పెళ్లయి మూడేళ్లయింది కదూ, వాడి భార్య పేరు ధరణి కదూ !”
అవునురా ! ఇంకా ఎవరూ పిల్లలు కలగ లేదు.”
మనం ముగ్గురం కలవ బోతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా !
ముగ్గురం కాదు నలుగురం ! ‘రవొకాంత్కూడా ప్రాజెక్టులో ఉన్నాడు.
రవి కాంత్ ఎల్ & టిలో కదా పని చేస్తున్నది ?
అవును సైటు నుండి రిఫైనరీవరకు పైపు లైను వేయడం , దాని హీటింగు అరేంజిమెంటు ఎల్ & టి చేస్తోంది. పని మీదే వాడు వస్తున్నాడు.”
అలాగా, వాడీ మధ్య పెళ్లి చేసుకొన్నాడట కదా ?”
అవున్రా ! భార్య పేరు ప్రాంజలి’ , ఆమెను కూడా తీసుకొని వస్తున్నాడురా ! ‘ చమురు వేడి చేసేందుకు చాల గొప్ప ఉపాయం చెప్పిందిరా వాడి కంపెనీ !
ఏమిటా ఉపాయం ?
మా కంపెనీ ఆరేడు అడుగుల దూరంలో చమురు వేడి చేసేందుకు, ‘బార్బిక్యూలుఏర్పాటు చేయలనుకొంది కదా, దానికి ఖర్చు మాట ఎలా ఉన్నా, చాల శ్రమ, సమయం అవుతుంది అనుకొన్నాం. ఎల్ & టి చమురు తీసుకెళ్లే పైపు లోనే రెండు పొరలు ఏర్పాటు చేసి, ఒక పొరలో హీటింగ్ కాయిల్ పెట్టి పైపు మొత్తాన్ని వేడి చేసే సాంకేతిక పరిఙ్ఞానాన్ని సాధించిందట ! దానినే మనరవికాంత్ అమలు చెయ్యడానికి వస్తున్నాడు, అర్థమయిందా ?
అర్థమయిందిరా , రకంగా బాల్య స్నేహితులమైన మన మందరం మళ్లీ కలియ బోతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా , కాని---”
ఏమిట్రా మళ్లీ కానీ అంటున్నావు ?
అదేన్రా ,చమురు వేడి చేసే ఖర్చులవీ తగ్గుతాయి కాబట్టి , మా కంపెనీకి దొరికే లాభాంశం ఎక్కువ చెయ్యవచ్చు కదా ?
టెక్నాలజీ చవక కాదురా , సదుపాయమైనది , అంటే మామూలు కన్నా ఖర్చు ఎక్కువే ! మీ కంపెనీ ప్రయోజనాల గురించి మరీ అంతలా వెర్రెత్తి పోకు ! ఒప్పందానికైనా సాధ్యా సాధ్యాలనేవి ఉంటాయి. మన మందరం కలుస్తున్నాం కదా, కలిసి చర్చించుకొందాం.”
సరేరా ! ఇంతకీ ఎప్పుడొస్తున్నావు నువ్వు ?
ఎల్లుండి కలుద్దాం , అంత వరకు గుడ్ బై & గుడ్ నైట్ !”
నీకు కూడా గుడ్ డే !
యాత్రీకుల బస్సు ఉదయం నాలుగున్నర గంటలకి తరువాత మజిలీ అయిన శ్రీ నాగేశ్వర్కి బయలు దేరింది. విరించి , అపాల , శ్రేయ , ‘ సత్యనారాయణ శర్మ ,మహాలక్ష్మమ్మ గార్లకి వీడ్కోలు ఇచ్చారు.
ఏమండీ ! మనం రోజుసోమనాధ దేవాలయాన్ని పూర్తిగా చూసి, సాయంత్రం బయలు దేరుదాం,అంది, అపాల బస్సు వెళ్లి పోయాక.
ఇంకా ఏం ఛూస్తావు అపాలా ?విసుగ్గా అన్నాడు విరించి.
నిన్న సాయంత్రం వచ్చాం. అత్తయ్యగారితో పాటు అభిషేకంలో కూర్చొన్నాను. దేవాలయం చూడడం ఎక్కడ అయిందండీ , కనీసం మధ్యాహ్నాని కయినా ---”
మధ్యాహ్నం బయలు దేరితేట్రాఫిక్లో ఇరుక్కుంటాం. నన్నడుగుతే ఇప్పటి కిప్పుడే బయలు దేరడం మంచిది. నాలుగయిదు గంటల ప్రయాణం ! ట్రాఫిక్ ఉండదు కాబట్టి లంచి టైముకి చేరుకోవచ్చు, ఆఫీసుకి వేగరం చేరుకొంటే చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి., అర్థం చేసుకో అపాలా !
సరే ! మీరు ఎప్పుడు నా సెంటిమెంటుకి ఓటు వేసారు గనుక ?అపాల అలిగింది.
మరీ అంతలా ముఖం ముడుచుకోకు, నీకో గుడ్ న్యూసు చెప్పడం మరచి పోయాను.”
ఏమిటండీ అది !
కారులో చెప్తాను, బయలు దేరడానికి రెడీ అయిపో !
నేను రెడీగానే ఉన్నాను. శ్రేయకేముంది ! కారులోనే కునుకు తీస్తుంది, మీరే తయారవండి/
నేను ఎవ్ర్రెడీ అపాలా ! పద, సామాన్లు తెచ్చుకొందాం,అన్నాడు విరించి.
మరొక అరగంటలో కారు బయలు దేరింది. విరించి కారు నడుపుతున్నాడు. అపాల అతని ప్రక్కనే కూర్చొంది. శ్రేయ వెనక సీటులో పడుకొంది. కారు కాస్త దూరం వెళ్లగానే అపాల అడిగింది. “ ఏదో శుభవార్త చెప్తానన్నారు,” అని.
అవును, క్రైన్సు కంపెనీ ప్రతినిధిగా ఎవరొస్తున్నారో తెలుసా ? మనవిష్ణువర్ధన్వస్తున్నాడు.
మంచిదే, ఎవరో దొరలు రాకుండా, మన వాళ్లనే పంపిస్తున్నారన్నమాట ! ఇది మీకు గుడ్ న్యూసు అయింది. నా కెలా అయింది ?
పూర్తిగా విను మరి ! విష్ణు వర్ధన్ తో పాటు, వినత, పిల్లలు వస్తున్నారు.
నిజమ్గా !” ఎగిరి గెంతేసినంత పని చేసింది అపాల. “ వినత వస్తోందా ! పిల్లలు అంటున్నారు, శ్రీకర్ తరువాత ఎవరైనా పుట్టారా?
ఔను, శ్రీకర్ వెనక ఏడేళ్ల తరువాత అమ్మాయి పుట్టిందట ! పేరుసృష్టిఅని పెట్టారట ! ఇక్కడే నీ సెంటిమెంటు గెలిచింది. అమ్మాయి,‘సోమనాధునికృప వల్ల పుట్టిందనీ,అందువల్ల అభిషేకం చేయిస్తుందనీ చెప్పాడు. విష్ణు వర్ధన్.
చూసారా ! మీకు లేక పోయినా విష్ణుగారికి భార్య అభిప్రాయాలు,నమ్మకాల పట్ల,గౌరవమూ, మక్కువా ఉన్నాయి.ఎంతైనా నాకు అన్నయ్య గారి వరస కదా !అంది అపాల.
విరించి లోలోపలే నవ్వుకొన్నాడు. “ అందుకే అన్నాను గుడ్ న్యూసు అని. నువ్వు ,వినత కలిసి వెళ్లి సోమనాధుని అభిషేకం చేయించు కోవచ్చు
’ “ నిజమే నండి, కేవలం దర్శన మాత్రం చేతనే మంచి అవకాశమే ఇచ్చాడు. ”
విరించి వంక సాభిప్రాయంగా చూస్తూ,ధరణి ,ప్రాంజలి కూడా ఉంటే ఇంకా బాగుండేది,” అంది.
చూసావా,కోరికలకు అంతు ఉండదని అందుకే అంటారు. ఒక కోరిక తీరే అవకాశం కల్గగానే మరో కోరిక కోరుతున్నావు.” కొంటెగా అన్నాడు విరించి.
మీరు అందుకనే కోరుకోవడం లేదంటారా ?”
అవును, ఎప్పుడూ దేవుణ్నీ కోరనే లేదు.”
నిజమే ! అధికార్లనీ, కార్పొరేటర్లనీ తప్ప !
‘ “ నేను కోరేది కోరిక కాదు నా పనికి తగ్గ ప్రతిఫలం.”
“ మేమందరం సోమనాధున్ని కోరుకొనేదీ అదే ! ప్రతిఫలం !
ప్రతిఫలమా !”అపాల వంక ఆశ్చర్యంతో చూసాడు విరించి.“ పని ముగించాక ఇచ్చేదే ప్రతిఫలం అంటారు. దానిని కోరడానికి మీరు సోమనాధునికి చేసిన సేవలేమిటో ?
మీరు సేవ అని దేనిని అంటున్నారో దానినే మేము పూజ అని అంటాం. పూజ చేసి కోరిక కోరుకొంటాం, అది తీర్చాక కానుక లిస్తాము.
అయితే రెండూ ఒకటేనంటావా ?
ఒకటి కాదు,రెండింటి లోనూ రెండవదే మిన్న అంటాను.
నువ్వు కోరినట్లు ధరణి, ప్రాంజలి వస్తే ఇంకా కానుకలు ఇస్తావు ?
అపాల విరించి వంక, విశాలమైన తన కళ్లని మరీ వెడల్పు చేసి వాటి చివర్ల లోంచి చూసింది.
అతను లోలోపలేనవ్వుకోవడం గమనించింది. అర్థమయింది లెండి ! మీ నలుగురు స్నేహితులూ యీ ప్రాజెక్టులో పాలు పంచు కొంటున్నారు. పని పూర్తవడానికి చాల సమయం పడుతుంది కాబట్టి , తోడు కోసం భార్యలని కూడా వెంట పెట్టుకొని వస్తున్నారు. అంతేనా ?
నిజమే ! విష్ణు మాధవ్, ద్యుతిధర్, రవి కాంతులు కూడా ప్రాజెక్టులో ఉన్నారు. మా మిత్రుల లాగే, మీరు కూడా కలిసి ఉండవచ్చు.అన్నాడు విరించి.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ