Skip to main content

అళియ అరాళీయము--1 (సరాగ - ఉగాది పత్రికలో బహుమతి పొందిన చారిత్రిక నాటకము )



( శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి ఇతివృత్తానికి , ఒకింత శృంగారము, ఒకింత ఉత్కంఠ కలగలిపి రూపొందించిన నాటకము)

ప్రధాన పాత్రలు  ( ప్రవేశ క్రమాన్ని అనుసరించి )

1. సుల్తాన్  కులీ  (గోల్కొండ నవాబు.) 2రామరాజు    (కథా నాయకుడు)3. రహీంఖాన్    (సుల్తాన్ కులీ సిపాయి సలార్.)
4. అరాళ కుంతల (కథా నాయిక.) 5. అప్పాజీ (విజయనగర మహామంత్రి.) 6. శ్రీ కృష్ణ దేవ రాయలు(విజయనగర ప్రభువు).

ఇంకా

భటులు, సిపాయిలు, పౌరులు, సేవకులు, కొజ్జాలు వగైరా అవసరాన్ని, అవకాశాన్ని బట్టి.

హామీ
(స్వల్పమైన చారిత్రికాంశానికి కల్పనని జోడించి వ్రాసిన నాటకం ఇది. ఇది వరకు ఎక్కడా ప్రస్తావించబడ లేదని నా అంచనా ! కథనం, నాటకీకరణ, పూర్తిగా మౌళికం. దేనికీ
 అనుసరణ గాని , అనువాదం గాని కాదు.   ఎ. శ్రీధర్)

( రంగస్థల అలంకరణ—రంగస్థలానికి కుడి ఎడమ వైపు రెండు ప్రవేశ ద్వారాలు ఉండాలి. మధ్యప్రవేశ ద్వారం ఉండకూడదు. దృశ్యాన్ని తెల్లని తెర పైన  ఛాయా రూప ప్రదర్శన ద్వారా, లేక చిత్రీకరించిన తెరలు మార్చడం ద్వారా చూపించేందుకు ప్రయత్నించాలి నేను తెల్లని తెరపైన ఛాయారూపాలను ప్రతిపాదిస్తున్నాను.)

( దుస్తులు, పాత్రల అలంకరణ—ఆ నాటి చారిత్రిక నేపథ్యానికి తగినట్లు యథోచితంగా చేసుకోవాలి )

అళియ అరాళీయము

దృశ్యము 1

.(సుల్తాను కులీ యుధ్ధనౌకలో సుల్తాను యొక్క ప్రత్యేకమైన గది. తెల్ల తెర వెనుక ఒక నది , ఒక పడవ ఛాయా రూపంలో ప్రదర్శించాలి.అలాగే నదీ జలాల హోరుని నేపథ్యంలో వినిపింఛేలా చేయాలి)

(సుల్తాను కులీ ఎత్తైన ఆసనం మీద కూర్చొని ఉంటాడు.వెనుక ఇద్దరు సేవకులు నిలబడి వింజామర వీస్తూ ఉంటారు.)

( ప్రవేశం _ రామరాజు )

రామరాజు :  ( వస్తూనే సుల్తానుకి సలాం చేస్తాడు ) కుతుబ్ షాహి వంశ్’కీ చాంద్! దిగ్గజ్ రాజావోం కే స్వప్నోం కీ షేర్!! జరూరత్  మందోంకీ రెహమాన్ !!! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో ! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో !!సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో !!!

సుల్తాన్ :  వీర్ సిపాయీ ! నీదీ జయ్ నాదం మాకీ నచ్చింది. నీ పేరు ఏమి?


రామరాజు :, జహాపనాహ్ ! నా పేరు రామరాజు. మీ యుధ్ధ నౌకలో కాపలాదారునిగా చేరిన చిన్న సిపాయిని. ఇంతకన్న ఏం పరిచయం చెప్పమంటారు ?

సుల్తాన్ :నీకీ తల్లీ, తండ్రీ, ఖాన్ దాన్  ఏవీ లేవా ?

రామరాజు :లేకేమి జహాపనాహ్ ! నా పేరు రామరాజు. నేను చాళుక్య వంశ క్షత్రియుణ్ని. నా తండ్రి పేరు శ్రీ రంగ రాజు, తల్లి వెంగమాంబ. నా తాత  యోధాను యోధుడైన బుక్కరాజు రంగరాజు, అతని పేరునే నాకు పెట్టారు.

సుల్తాన్: (ఆశ్చర్యంతో) ఏమి, పరం వీర్ సిపాయి బుక్కరాజు రామరాజు ‘పోతావా’ నువ్వు ! నీ తాత తండ్రి విజయనగర సేనలో పని చేసేవారు కదా ?

రామరాజు: ఔను జహాపనాహ్ ! విజయనగర సైన్యం తరఫున కళింగ యుధ్ధంలో పోరాడి, నా తాత తండ్రులిద్దరూ వీరస్వర్గం అలంకరించారు. శ్రీ రాయల వారికి విజయాన్ని సమకూర్చారు

సుల్తాను:గజబ్:గా ఉందే ! కీర్తి శేషులైన వారి సేవలకి మారుగా, నీకు విజయనగర రాజ్య సేనలో పని దొరకలేదా ?

రామరాజు: దొరికింది హుజూర్ ! నన్ను ‘దశపతిగా’ నియమించారు.

సుల్తాను: దశ్ పతీ గానా ! హవ్వ ! అది చాలా చిన్న, చిన్న-- ననననన  (వ్యంగ్యంగా)పని కాదా సిపాయీ ?

రామరాజు: జహాపనాహ్ ! మీరన్నది అక్షర సత్యం. అంత చిన్న పదవిలో నా నియుక్తి అవమానంగా తోచింది. విషయం రాయలవారి వద్దకు వెళ్లక ముందే, నేను పదవీ త్యాగం చేసి, నా అదృష్టాన్ని వెతుక్కొంటూ బయలు దేరాను. ‘ పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మే’ దుస్థితి రాకూడదని !

సుల్తాన్: అర్థమయింది సిపాయీ , మాదీ కొలువులో ఎలా చేరావు ?

రామరాజు: జహాపనాహ్ ! మీ యుధ్ధనౌక ,‘మంజీరా నదిలో’ జలప్రవేశం చేయడం చూసి,ఏదైనా పని దొరుకుతుందేమోనని అడిగాను. మీ సిపాయి సలార్ ‘రహీంఖాన్ సాహెబ్’ నన్ను కాపలా దారుగా నియమించారు.

సుల్తాన్: షహబాష్ వీరుడా ! నిన్ను కాపలాకీ పెట్టిన మాది సిపాయి సలార్;కీ షుక్రియా చెప్పాలి.

( అంటూ చప్పట్లు కొడతాడు. ఒక భటుడు ప్రవేశిస్తాడు )

భటుడు:( సలాం చేసి ) హుకుం జహాపనాహ్ !

సుల్తాన్: సిపాయి సలార్ రహీంఖాన్’ని పిల్చుకురా.

భటుడు: జో హుకుం జహాపనాహ్ ! (అంటూ వెళ్తాడు)

( ప్రవేశం సిపాయి సలార్ రహీం ఖాన్ )

రహీం ఖాన్:సలాం ఆలేకుం జహాపనాహ్ ! (సలాం చేస్తాడు)

సుల్తాన్: రహీం ఖాన్ ఈ రామరాజుకి ఏమి పనీ ఇచ్చావ్ ?

రహీం ఖాన్ : జహాపనాహ్ ! ఇతనికి కత్తి యుధ్ధం, విలువిద్య తెలుసునని చెప్పాక, కాపలా సిపాయిగా నియమించాను.

సుల్తాన్: చాలా చిన్న పని ఇచ్చావ్. సరే , రాత్రి ఏం జరిగిందో చెప్పు.

రహీం ఖాన్ : గుస్తాకీ మాఫ్ జహాపనాహ్ ! చిన్న పని ఇచ్చినా, ఇతను పెద్ద పనే చేసినాడు హుజూర్ ! నిన్న రాత్రి ‘దోన్ పహర్’ దాటాక, నదిలో మినుకు మినుకు మంటూ వెలుగుతున్న దీపాలు చూసి, ఇతను అది దొంగల ముఠా పడవ అని చెప్పాడు. అప్పుడు నేను దూర్భిణిలో చూసాను, ఒక యుధ్ధనౌక దాని తల్లా మీద, విల్లంబులు పట్టుకొని, ఉన్న మనుష్యులు కనిపించారు హుజూర్ ! అది దొంగలదే అని ఎలా చెప్పగలవని అడిగాను హుజూర్?

సుల్తాన్: హవును, అది దోపిడీ దొంగ ‘ సంబువ రాయుడి’ దొంగల ముఠాదని ఎలా గుర్తించావ్ రామరాజూ ?

రామరాజు: జహాపనాహ్ ! ఆ సమయంలో మంజీరా నదిలో తిరుగాడే యుధ్ధనౌక సంబువ రాయుడిదేనని  నేను అనుమానించాను. మీ యుధ్ధనౌక బయలుదేరక ముందే   జల మధ్యంలో ఉన్న ,‘ పులిబొమ్మ పతాకం గల  ఆ యుధ్ధనౌకని నేను చూసాను. వాడే సమయం కోసం వేచి చూసి వెంటాడి ఉంటాడని అనుకొన్నాను.

రహీం ఖాన్  జహాపనాహ్ ! ఆ దొంగల నాయకుడు దగ్గర విలుకాండ్ర సైన్యం ఉందని, వాళ్లు తమ లక్ష్యం మీద బాణాలు ప్రయోగించి, భయపెడతారని ఇతను చెప్పాడు.

సుల్తాన్: భేష్ ! ఆ విధంగా మన సైన్యం ముందుగానే యుధ్ధానికి  తయారయిందన్న మాట ?

రహీం ఖాన్: ( రహీం ఖాన్ మాట్లాడడు, తరువాత తడబడుతూ అంటాడు) హుజూర్ ! హుజూర్ ---

రామరాజు: లేదు, జహాపనాహ్ ! తమ సైన్యం ప్రమత్తులై నిద్రలో జోగుతున్నారు. వాళ్లని సిధ్ధం చేసి  తెచ్చేంతలోగానే  దొంగల  ముఠా బాణాల తాకిడి మొదలయింది. వాళ్ల విషలిప్త బాణాలు అప్పటికే కొందరిని తాకి గాయాలు చేసాయి. మన వాళ్లు విల్లంబులని తీయకుండా చేసాయి.

సుల్తాన్: క్యా రహీంఖాన్ ? రామరాజు నిజమే చెప్తున్నాడా ?

రహీంఖాన్: రహం కీజీయే జహాపనాహ్ ! రాత్రి జరిగిన విందులో వాళ్లు బాగా తాగేసారు.

సుల్తాన్: హు ! పనికి మాలిన పందులు ! ఫిర్ క్యా హువా, రహీంఖాన్ ?

రహీంఖాన్: రామరాజు ఒక్కడే ఆయుధాలు ధరించి నీటిలో దూకాడు.

సుల్తాన్: వాహ్ ! ఎంత ధైర్యం ! వాళ్లని ఎలా లొంగదీసావ్ రామరాజూ ?

రామరాజు: నది నీటిలో మునిగి, గుట్టుచప్పుడు కాకుండా , వాళ్ళ నౌక మీదకి ఎక్కాను. విలుకాండ్ర వెనకకి చేరి, సద్దు చేయక వాళ్లని ఊచకోత కోసాను. శతృవులు ఎందరో , ఎలా వచ్చారో తెలియక, వాళ్లు అయోమయంలో పడ్డారు.

రహీంఖాన్: అప్పుడు రామరాజు ఇచ్చిన సంకేతాన్ని బట్టి, మనవాళ్లు బాణాలతో దాడి చేసారు. దాంతో దొంగలు వెనక్కి తగ్గి, పారిపోయారు.

సుల్తాన్ : సెభాష్ ! నీ సాహసంతో శక్తి సామర్థ్యాలతో , అసాధారణ ప్రతిభ చూపించావ్ , రామరాజూ ! నిన్ను సిపాయి సలార్’గా నియమిస్తున్నాను. ఈ రహీంఖాన్  నీకు సహాయకుడిగా ఉంటాడు.

రామరాజు: ధన్యవాదాలు జహాపనాహ్ ! నా మీద నమ్మకం ఉంచి, సేనాపతిని చేసినందుకు కృతఙ్ఞుడను . మీరు ఆనతినిస్తే, ఆ దొంగకి గుణ పాఠం చెప్తాను. వాడి నౌక మీద ఎదురు దాడి చేసి, వాడి సంపదనంతా తెచ్చి, మీ పాదాల మీద ఉంచుతాను.

రహీంఖాన్: (తనలో) ఈ రామరాజు సిపాయిగా చేరి నా మీదకే ఎక్కి సవారీ చేస్తున్నాడు. సుల్తాను వాడి మీద మెహర్’బాన్  అయి ఉన్నాడు. ఇప్పుడు ఏమీ మాట్లాడక పోవడమే మంచిది. సమయం వచ్చినప్పుడు వీడి మీద చాడీలు చెప్పి పగ  తీర్చుకోవచ్చు.(ప్రకాశంగా) హుకుం దీజియే జహాపనాహ్ ! రామరాజు నాయకత్వంలో దొంగల మీద ఎదురు దాడి చేస్తాం.

సుల్తాన్: ( ప్రశంసా పూర్వకంగా చూస్తాడు ) రామరాజూ ! సంబువ రాయుని ఖజానాని తెచ్చి ఇస్తే, నిన్ను సత్కరిస్తాను. నువ్వు సేనాపతి కన్న మిన్న అని మేము గ్రహించాం. సంపద తెస్తే నిన్ను దుర్గాధిపతిని చేస్తాను. రహీంఖాన్’తో  వెల్లి దాడికి పథకం వెయ్యి.

రామరాజు, + రహీంఖాన్ : ( ఇద్దరూ ) జో హుకుం జహాపనాహ్ !

    ( అంటూ వెళ్లిపోతారు )       

 ( రంగం స్థలం మీద లైట్లు ఆరిపోతాయి )
(ఇంకా ఉంది)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ