చేపకి ఈత కొట్టడం , స్త్రీకి ,మనోహరుడైన పురుషుని అభిరుచులు తెలుసుకోవడం, ఎవరూ నేర్ప నక్కర లేదు.
పెళ్లి ఎంత గుట్టుగా జరిగిందో, శోభనం అంతే గుంభనగా జరిపించమని చెప్పింది ప్రణీత. శ్రీనివాసునికి ఇష్టమయిన ఇల్లేదో ఆమెకు తెలుసు. అందుకే అతని వైద్య పరిచర్యలు, చికిత్స చేసిన ఇంటినే , తిరిగి తన ‘శోభన సదనంగా’ మార్చమని చెప్పింది. ఆ ఇంటికి లేత రంగులు వేయించింది.
మూడు అడుగుల వ్యాసార్థం గల గుండ్రని పర్యంకం గది మధ్యలో వేయించింది , దాని మీద మరీ మృదులంగానూ కాక, మరీ కఠినంగానూ కాక ,మధ్యస్థంగా ఉండే ‘రబ్బరైజ్డ్ కాయర్’ పరుపుని వేయించింది. గదికి ఎ..సి..చేయించింది. మంచానికి నాలుగు ప్రక్కలా, నాలుగు నిలువు టద్దాలు గోడలోకే ఉండేలా ఏర్పాటు చేయించింది. ఆ అద్దాలని లేత నీలి రంగు లేసు పరదాలతో .మరుగు చేయించింది.. ఫాల్సు సీలింగు వేయించి, దానికి రంగు రంగుల డిజైనరు విద్యుత్ దీపాలను అమర్చి, మంచాన్నీ,దాని చుట్టు పట్ల పరిసరాలనీ లేలేత కాంతిలో ముంచి, వరుసల వారీగా వెలిగి ఆరి, ప్రకాశ వంతం చేసేలా ఏర్పాటు చేయించింది. పాలు,పళ్లు, మిఠాయిలు చెయ్యి చాపితే అందేలా,మంచానికే అమర్చిన సొరుగులలో పెట్టించింది.పొగ వదుల్తూ సువాసనలు వెదజల్లే అగరువత్తులు కాక , ఫ్రెంచి పెర్ ఫ్యూముతో గదినంతా స్ప్రే చేయించింది.
గదిని తనకు కావలసిన విధంగా మలచి, దానిని పరిశీలించిన సంతృప్తి చెందిన వెనక ,తనని తాను శ్రీనివాసునికి నచ్చే విధంగా అలంకరించుకొంది.
విస్తృతమైన తన కబరీ బరానికి మరికొన్ని సవరాలు జోడించి, దట్టమైన పొడుగు పాటి, జడని అల్లుకొని దానికి బంగారపు జడకుప్పీలు పెట్టుకొంది. విశాలమైన కనులు, మరింత విశాలంగా కనబడేలా , కంటి మేకప్పు వేసుకొంది. కాఠిన్య రహిత చంద్ర శిలా సదృశమైన కాంతులు విరజిమ్మే తన శరిర ఛాయని , కొద్దిగా పసుపు ,గులాబీ రంగులు మిళితమైన , ఫేషియల్తో మెరుగు పరచింది. నిటరుగా ఎత్తుగా దర్పంగా సంపెంగి మొగ్గలాగ ఉండే నాసికకి బేసరి అమర్చి, దాని మీద కాంతి పడితే చాలు పరావర్తనం చెంది, ఇంధ్ర ధనస్సులా మెరిసేలాగ, ఆ బేసరికి జాతి వజ్రాన్ని అమర్చింది. శంఖంలాంటి ఛాయ, కూజా లాంటి, రూపుతో చూడు చూడు మనేలాగుండే తన మెడకి ,వజ్రాల నెక్లెసుని పెట్టుకొంది. శ్రీకారాల లాంటి చెవులకి, వ్రేలాడే వజ్రపు జుంకాలు పెట్టింది. సహజమైన కెంపు రంగు పెదాలని రంగు కాంతి తడి కనిపించేలా ,తీర్చి దిద్దింది. చేతులకి నాలుగు జతల రవల గాజులు పెట్టుకొంది. నడుముకి మణి మేఖలని, భుజాలకి నాగాభరణాలని అమర్చింది. ఆ పైన తెల్లని బెనారసీ పట్టుచీర కట్టుకొంది, దానికి తగిన కంచుకాన్ని ధరించింది. కస్తూరి బొట్టు పెట్టి కలహంస నడకతో , నవయవ్వన సౌందర్యవతి యైన , అప్సరోకాంతలా గదిలోకి ప్రవేశించింది.
ఆ గదిలొ తెల్లని మల్లు లాల్చీ, ధోవతితో, పర్యంకం పైన కూర్చొని , పరిసరాలని విస్మయంతో చూస్తూ కూర్చొన్న శ్రీనివాసుడు ఆమె రాకని చూసి లేచి నిల్చొన్నాడు.
“ ప్రణీతా ! ఏమిటిదంతా ? ఎందుకింత ఆడంబరం !?” అని అడిగాడు శ్రీనివాసుడు.
“ ఆడంబరం కాదండీ ! మనసు మెచ్చిన మగనికి, అత్యవసర నీరాజనం ! మీరు నా నుండి ఏమి ఆశించారో తెలియదు, నా సొగసునే అయితే, మీకు నచ్చే విధంగా అలంకరించు కొని వచ్చాను. ఆ సొగసుని మీకు సమర్పించి మురిపించాలంటే, ఈ పరిసరాల అలంకారం అవసర నేపథ్యం ! ఆ పర్యంకపు వేదిక మీద సౌందర్యంతో విందు చేసుకొని, నా నైవేద్యాన్ని అందుకోండి.” అంది ప్రణీత.
“ బాగుంది, నీ వాక్చాతుర్యం , బాగుంది ! కాని , నీ వాక్య విశేషాన్ని పూర్తి చెయ్యి. ” అన్నాడు శ్రీనివాసుడు కొంటెగా.
“ ఇంకా పూర్తికాని వాక్యం ఏముంది ?” బొమలు ముడి వేసింది ప్రణీత.
“నా నుంచి మీరు ఏమి ఆశించారో తెలియదు గాని , నా సొగసునే అయితే --- అన్నావు. ఒక వేళ కాకపోతే , దానికి కూడా ఔచిత్యం చెప్పాలి సుమా ! ” నవ్వుతూ అన్నాడు శ్రీనివాసుడు.
ప్రణీత ముఖం చిన్న బోయింది.‘ ఇతను తనని ఆట పట్టిస్తున్నాడా, లేక నిజంగానే తన సొగసు ఈయనకి నచ్చలేదా ! అదేదో అతనినే బయట పెట్టనీ ! అనుకొంది. వెంటనే ఇలాగంది, “ అది నిర్ణయించ వలసింది మీరే కదా ! నా సొగసు నైవేద్యం మీకు నచ్చ నప్పుడు ఏం నచ్చిందో మీరు చెప్తే .అప్పుడు దానికి అనుగుణంగా నా సమాధానం ఉంటుంది” అంది ప్రణీత.
“ గదుసుదానవే ! ” చిరునవ్వు నవ్వాడు శ్రీనివాసుడు. “ ప్రణీతా ! కంప్యూటరు రూములో నిన్ను చూసిన మొదటి చూపులోనే నీ సౌందర్యం నాకు నేత్రపర్వమయింది. ఆ పైన నీతో గడిపిన సన్నిహిత క్షణాలు, ఆ దివ్య సౌందర్య వీక్షణానందాన్ని పెంచాయే తప్ప తృంచలేదు. నీ పెళ్లి అయి నువ్వు పరాయి దాన వయినప్పుడు, నా సొగసుల రాణికి, మంచి జోడు కుదిరిందనుకొన్నానే గాని, నన్ను , నేను దానికి అర్హత గలవానిగా లెక్కించుకోలేదు. ఈ రోజు నీవే స్వయంగా నా శృంగార రసాధి దేవతగా వచ్చి నిల్చినా సరే, ఏదో తెలియని ఆశంక మనసుని తొలిచేస్తున్నది. రా ! ప్రణీతా ! నా చేయి పట్టుకొని ఇదంతా నిజమేనని చెప్పు.”అంటూ చేయి చాపాడు శ్రీనివాసుడు.
ప్రణీత అతనందించిన చేయి పట్టుకొని, అతనికి అభిముఖంగా నిలిచి, కనుదోయిని విప్పి, అతని ముఖంలోకి చూస్తూ, “ ఇదంతా నిజమే స్వామీ ! ఈ ప్రణీతని మీ సొంతం చేసుకోండి” అంటూ, సిగ్గు ముంచుకు రాగా, అతని ఎదపై తల వాల్చింది.
తన ఎదపై తల వాల్చిన, అమెని, ఒక చేతితో పొదివి పట్టుకొని, అతనికి రెండవ చేతితో ఆమె మోముని,చిబుకంతో ఎత్తి, పట్టుకొని, ఆమె ‘ నుదుటినీ, కనుదోయినీ, కపోలాలనీ,’చుంబించాడు శ్రీనివాసుడు. ఆమె తన చేతులని అతని మెడకి కంఠ హారం లాగ వేసి, తన కేసి హత్తుకొంది. అతడామె జఘనాల క్రిందకి రెండు చేతులనీ పోనిచ్చి, ఎత్తుకొని, ఆమె పెదవులను ,తన పెదవులని మద్య బిగించాడు.
అధర చుంబన రసాస్వాదనలో పరిసరాలని మరచి, ఎంతో సేపు గడిపారు ఆ ప్రేమిక మిథునం !
ముందుగా తేరుకొన్న శ్రీనివాస్ ఆమెని ఎత్తుకొని, పర్యంకంపై ఆమెని పడుకో బెట్టి, అమె ఎడమ తోడకి తగిలించిన జయపూరు కాలుని బయటికి తీస్తూ అన్నాడు. “ప్రణీతా ! రిలాక్సు అవు, ప్రణయ కేళిలో ఈ ఎడమ కాలుని తీయక పోతే , నీ ఊరువులని రక్త శిక్తం చేయవచ్చు. అందుకని తీసేసాను ” అన్నాడు.
ప్రణీత మనసులోనే అనుకొంది.‘ శ్రీనివాసు ఎంత మంచివాడు ! తన కేది కష్టమో తెలుసుకో గలిగాడు. ఆమెకి తన తొలి భర్తతో గడిపిన శోభన రాత్రులు తలపుకు వచ్చాయి. ఆయన ఈ కాలుని తీయనిచ్చే వారు కాదు. తను అభ్యర్ధిస్తే ఆ కాలు తీసేస్తే, నీ వికలాంగత నాకు రోత పుట్టిస్తుంది అనేవారు. పళ్ల బిగువున బాదని భరించి, అతనికి తన శరీరాన్ని సమర్పించేది. అది కేవలం యాంత్రిక చర్యగానే ముగిసి పోయేది. ఆ తరువాత డ్రెస్సింగు రూముకి వెల్లి కాలు తొలగించి, కారిన రక్తాన్ని తుడుచుకొంటూ ఊంటే, తొంగి చూసి, ‘ఛీ ’ అని చీదరించుకొనే వాడు. అది గుర్తుకి వచ్చి,ఆమె కళ్లల్లో నీళ్లు నిలిచాయి.
ఆ కన్నీటిని చూసిన శ్రీనివాసుడు ఇంకో విధంగా అర్థం చేసుకొన్నాడు. “ ప్రణీతా ! నీ సొగసుకి ఇదొక లోపమని బాధపడుతున్నావా ? నా దృష్టిలో ఇది లోపం ఎంత మాత్రమూ కాదు. దీనిని తీసేసిన తరువాత నువ్వెలా ఉన్నావో తెలుసా ?”
“ ఎలా ఉన్నాను ?” కన్నీటిని కొన గోటితో తుడుచుకొని, అడిగింది ప్రణీత.
“ నీ కుడి కాలుని, ఎడమ తొడ మీద పెట్టు చెప్తాను” అన్నాడు.
ఆమె అలాగే చేసింది.అతడామెను మురిపంతో చూస్తూ, “ నీ రెండు కాళ్లు ఒకటే అయిపోయిన ఈ తరుణంలోనువ్వు అచ్చు నాకు ‘ రసార్ణవం లోని, మత్స్యకన్య గానో, రసాతలంలోని నాగకన్య గానో కనబడు తున్నావు. నేనే గాని చిత్రకారుణ్నిఅయి ఉంటే, నీ చిత్తరువుని యథాతథంగా వేసేసి, మత్స్యకన్యా లేక నాగకన్యా అనే కాప్షను పెట్టేసే వాణ్ని.”
ప్రణీత దుఃఖాన్నంతా మరచి పోయి, కిలకిలా నవ్వింది. నేను నాగకన్యనీ,మత్స్య కన్యనీ కాదు. నేను శ్రీనివాస ప్రణీతను స్వామీ ! నన్ను మీలో త్వరగా కలుపుకోండి. అనురాగ బంధంలో బిగించి, నాకు ఊపిరి సలపకుండా చేసి, ఈ క్షణాన్ని శాశ్వతం చేయండి. ” అంది.
“ ఛ ! అవేం మాటలు ప్రణీతా !”” అంటూ ఆమె పెదవులని, తన పెదవులతో మూసి వేసి, ఆమెపై వాలి పోయిన శ్రీనివాసుడు, ఆమె జాకెట్టు హుక్కులు తొలగించాడు.
బరూచ్ ఆఫీసు సైటు దగ్గరి ,గెస్టుహౌసు గేటు తెరచుకొని,లోపలికి ప్రవేశించాడు. శ్రీనివాసుడు.
“ నమస్కారం నా పేరు శ్రీనివాసు. ప్రజాపతి ట్రేవెల్సు తరఫున ప్రతినిధిగా వచ్చాను, మీరు పిలిపించారట? ”
“ శ్రీనివాసు గారంటే మీరేనా ?” అడిగింది వినీత.
“ అవునండీ !”
“ మరి ప్రతినిధి అంటారేం ? మీరు మేనేజింగు పార్టనర్ కదా ?”
“ మా కంపెనీ ప్రొప్రయిటరు శ్రీ దత్తాత్రేయ దక్ష ప్రజాపతి గారు ! నేను ఆయన అల్లుడిని. అతను నన్ను ఆప్యాయతతో మేనేజింగు పార్టనర్ని చేసినా, నేను కూడా ఆ కంపెనీలో కర్మచారినే కదండీ ?”
“ అలాగంటారేం ! మీకూ, మీ మామగారికి, ఏమైనా మనస్పర్థలు ఉన్నాయా ?” ప్రాంజలి అడిగింది. ఆ మాటలన్నప్పుడు ఆమెలో అల్లుల్ల పట్ల ‘కసి’ ధ్వనించింది.
“ అలాంటిదేమీ లేదండీ ! మా మామయ్యగారు దైవ సమానులు.ఒక కర్మచారిగా సంస్థలో చేరిన నన్ను, దయతో అల్లుణ్ని చేసుకొన్నారు.ఆయన నన్ను అందలం ఎక్కించినా, నేను నా హద్దులు మరచిపో కూడదు కదండి.” అన్నాడు శ్రీనివాసుడు.
శ్రీనివాసుని మాటలు వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగించాయి.
“ మీ మామయ్య గారికి , ఇంకెవరైనా సంతానం ఉన్నారా ?” అని అడిగింది, వినత కూపీ లాగే ఉద్దేశంతో.
“ లేరండీ ! నా భార్య ప్రణీత తప్ప వేరెవరూ సంతానం లేరు .”
“ అయితే ఇల్లరికం అన్న మాట !” ధరణి వెటకారంగా అడిగింది.
“ అవునండీ, నన్ను ఆయన అల్లునిలా కాక, కొదుకు లాగే చూసుకొంటున్నారు. ”
“ అలాంటప్పుడు మీరు యజమానులు కాక, కర్మచారి ఎలా అవుతారు ?” అపాల నిలదీసింది.
“ దేవాలయ ధర్మకర్త ఆలయానికి యజమాని అయినా, దేవునికి సేవకుడే కదండీ ”
శ్రీనివాసు సమాధానం వాళ్ల నోల్లు మూయించాయి.
“ మేడం ! మీరు నన్ను పిలిపించిన పని గురించి మాట్లాడుకొంటే మంచిదేమో !” సంభాషణని ప్రక్క దారి నుండి, రహదారి పైన పెట్టాడు శ్రీనివాసుడు.
“ అవునండీ ! మీరు మా కోసం ఒక టైలరు మేడు టూరు తయారు చేయాలి.”
“ అలాగేనండి, మీరు ఏ ఏ స్థలాలు, ఛూడాలను కొంటున్నారో, చెప్పండి. దానిని బట్టి, ప్రోగ్రాం తయారు చేస్తాను.”
“ ముందు సోమనాధ దేవాలయానికి వెళ్లి, అభిషేకం చేయించు కోవాలి.” అంది వినత.
“ అలాగేనండి, పూజారితో పాటు అందరం కలిసి వేనులో వెళ్లి, సోమనాధునికి అభిషేకం చేయించాక, ద్వారక, బెట్ ద్వారక, నాగేశ్వర దేవాలయాలు చూసి వద్దాం.”
“ నాకు బోటు షికారు అంటే ఇష్టం,” అంది ధరణి.
“ నాకు సింహాలు, నెమళ్లు, అడవి జంతువులు చూడడమంటే ఇష్టం !” అంది శ్రేయ.
“ అంకుల్ గేమ్స్ స్పాట్సు ఏవీ లేవా ?” శ్రీకర్ ప్రశ్న.
శ్రీనివాసుడు వాళ్ల మాటలకి, చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, “ మీరు కోరిన స్థలాలన్నీచుట్టుపట్లనే ఉన్నాయి.ఇక పోతే మీరు మీ శ్రీవార్లతో కల్సి, ఎక్కడికి వెళ్లాలని అనుకొంటున్నారో చెప్పండి”
“ అది మీరే డిసైడు చేయండి.” అంది అపాల.
“ పురాతన కట్టడాలు, కోటలు లాంటివి చూసి, వాటి చరిత్ర తెలుసు కోవాలంటే నాకు మీ భర్తలకి చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం అందు చేత అందరం కలిసి, అలాంటి చోటికి వెళ్దాం.
ఆ మాటలు విన్న శ్రోతలు నలుగురూ ఉలిక్కి పడ్డారు. అపాలే ముందుగా అడిగింది, “ మా వారి చిన్నప్పటి సరదాలు మీకెలా తెలుసు ?” అని.
“ అవునండీ,అతని చిన్ననాటి సరదాలు నాకే తెలియవు ” వినత ఆశ్చర్య పోయింది.
ధరణి, ప్రాంజలులు సరే సరి ! “ శ్రీనివాసు గారూ ! చూడబోతే మీకు వాళ్లతో చిన్ననాటి పరిచయం ఉన్నట్లుంది. ఎలాంటి పరిచయమో చెప్పండి” అని అడిగారు.
శ్రీనివాసుడు నోరు జారాడు. ఇక చెప్పక తప్పదు. “ అపాల గారూ ! మీ శ్రీవారు విరించి వర్మగారు, నాగూరు కరణం సత్యనారాయణ శర్మ గారి అబ్బాయి కదూ ! నా తండ్రి అతని ఇంట్లో జీతగాడిగా పని చేసేవాడు. చిన్నప్పుడు వాళ్లు నలుగురూ ఆట లాడుకొనే వారు. నేనా ఆటలు చూస్తూ ఉండే వాణ్ని. పేపర్లో ఒ,ఎన్.జి,సి పరిశీలన గురించి, వివరాలు చూసి అందులో విరించి వర్మ గారి పేరు చూసి, అతనిని గుర్తు పట్టాను. ఆ తరువాత ‘ క్రైన్సు’ సంస్థ నుండి, ‘విష్ణు మాధవు గారు వస్తున్నట్లు పేపర్లొ పడింది. అది చదివాక నేనా విషయం కన్ ఫర్మ్ చేసుకొన్నాను, ”
“ అలాగా ! చాల ఆశ్చర్య్గంగా ఉంది. మీరు మా శ్రీవారికందరికీ బాల్య స్నేహితులన్న మాట ! ” అంది అపాల.
“ కాదండీ ! వాళ్లు యజమానులు, నేను సేవకుడిని ! వాళ్లు ఏ నాడూ నా వైపు స్నేహ హస్తం చాపలేదు, ఎప్పుడూ యజమానుల లాగే ఆఙ్ఞలిస్తూ ఉండేవారు, నేను వాటిని నెరవేరుస్తూ ఉండే వాడిని. నాగావళీ నదిలో ఈత కొట్టేటప్పుడు మాత్రం వాళ్లు నా సాయం తీసుకొన్నారు.”
“ తక్కిన వాళ్ల మాట ఏమో గాని, మా శ్రీవారు మాత్రం సంపద చూసే సంబంధాలు ఏర్పరుచు కొంటారు., ఆ అలవాటు అతనికి చిన్నప్పటి నుండే ఉండేదని, మీ మాటలు విన్నాక అర్థమయింది.” అంది ప్రాంజలి. ఆమె మన్సులో, తన తండ్రికి జరిగిన అవమానం ఇంకా మెదుల్తూనే ఉంది.
“ చిన్నప్పటి మాట ఏమో గాని, ఇప్పుడు మీరు ‘కార్పొరేటు స్థాయిలో నడిఛే, టూరు సంస్థకి యజమాని అని తెలిస్తే వాళ్లు సంతోషిస్తారు, మీరు ఆశించిన స్నేహ హస్తం తప్పక లభ్యమవుతుంది., చెప్పమంటారా శ్రీనివాసు గారూ ?” .అడిగింది అపాల.
“ వద్దండీ ! చెప్పవద్దు.” వెంటనే అడ్డుకొన్నాడు శ్రీనివాసుడు. “ ప్రాంజలి గారు అన్నట్లు, కలిమిని చూసి చేసే చెలిమి కాదు, నాకు కావలసింది. నా విషయం వాళ్ల దగ్గర గోప్యంగానే ఉంచండి. వాళ్లని సర్ప్రైజు చేద్దాం ! మీ టూరిస్టు గైడు ‘ బండ శీను ’ అని మాత్రమే చెప్పండి.” అని వెళ్లి పోయాడు.
ఆ రోజు రాత్రి అపాల, విరించితో చెప్పింది, “ ఏమండీ ! ఈ రోజు మా టూరిస్టు గైడుని కలిసాము. అతని పేరు బండశీను అట ! మీ గురించి తెలుసని అన్నారు.”అని.
“ బండశీనా ! అవును,మా ఇంటి పాలేరు కొడుకు. మేము వీరఘట్టం హైస్కూలులో చదివే రోజులలో మా స్కూలు సంఛీలు మోసేవాడు.మా జోళ్లు పాలిషు చేసేవాడు.మా బట్టలు చాకలికి వేసి, ఇస్త్రీలు చేయించి తిరిగి తీసుకొచ్చేవాడు. అలాంటీవే చాలా పనులు చేసి పెట్టేవాడు.” అన్నాడు విరించి.
“ మీ నలుగురు మిత్రుల పనులూ చేసేవాడా ?”
“ అవును, ఎందుకలా అడిగావు ?”
“ ఒకరి ఇంటి జీతగాని కొడుకు ,వారి ఇంటి పనులు చేయడమే అపురూపం ! మరో నలుగురి పనులు కూడా చేసి పెట్టేవాడంటే వింతగానే ఉంది.”
“ అపాలా ! నువ్వు ‘లా’ చదివావని నాకు తెలుసు గాని,ఆ కాలంలో,ముఖ్యంగా పల్లెటూరు బడుద్ధాయిలకి, లేబరు సూత్రాలు తెలిసేవి కాదు.అయినా మా నాన్నగారు వాడి చేత ఉత్తినే పని చేయించుకొనే వారు కారులే ! వాడి నాన్నకి అదనంగా గింజలు కొలిచేవారు.”
అంటే వాడు చేసే పనికిచ్చే కూలి, వాడి నాన్నకి ఇస్తే సరిపోయేదా ?”
“ చెప్పాను కదా, అది ఆ రోజులలో మాట అని ! వాళ్ల నాన్నేవాడిని పనిలోకి పెట్టాడు. అయినా కూలీలు, వారి కూలీ రేట్లు సంగతి ఎందుకు గాని, వాడిప్పుడు ఈ గుజరాతులో. టూర్సు ట్రేవల్సు కంపెనీలో పని చేస్తున్నాడన్న మాట ! చాలా ఆశ్చర్యంగా ఉంది.”
“ ఆశ్చర్యమా ! ఎందుకని ?”
“ వాడి నాన్న కొట్టిన దెబ్బలకి , ఇల్లు వదిలి పారిపోయిన వాడు, ఇక్కడ తేలాడంటే ఆశ్చర్యం కాదా,అందులోనూ టూరిస్టు గైడు ఉద్యోగం!వాడి బ్రతుకుకి అదిఎక్కువే కదా మరి !”
“ బ్రతుకు తెరువుకి ఏదో ఒకటి చేయాలి కదండి .”
“ బాగా చెప్పావు, వాడి బ్రతుక్కి మా సైటులో గోతులు త్రవ్వుతారు చూడు, ఆ కూలీ పనే సరి అయినది. అందుకే టూరిస్టు గైడు పని ఎక్కువే అన్నాను. అన్నట్లు ఒక పని చెయ్యి అపాలా !”
“ ఏమిటండీ అది ?”
“ టూరిస్టు గైడుకి చాల విషయాలు తెలిసి ఉండాలి. జనరల్ నాలెడ్జి, చరిత్ర, హోటల్ పేర్లు,వాటి ఫేర్లు, ఇంకా రూటు మేపు వగైరా వగైరా--- ఆ బండశీనుకి అవన్నీ తెలుసునంటే నమ్మ శక్యం కావడం లేదు. నువ్వు వాడిని బాగా గ్రిల్ చెయ్యి. నీ స్నేహితులతో కలిసి రేగింగు చెయ్యి. మజా వస్తుంది !”
“ మా ఆడవాళ్లకి అవన్నీ వెన్నతో పెట్టిన విద్యేనండీ ! విషయాలన్నీరాబట్టనిదే ఒక పట్టాన ఒదిలి పెట్టం , అలా చేసి, ఒకవేళ అతను. అదే ఆ బండశీను గైడుకి పనికిరాని వాడు అని ఋజువు అయితే ---”
“ వాడి ఉద్యోగం పీకించి పాలేరు పనే నయం అని తిరిగి గ్రామానికి పారి పోయేలా చేస్తాను.”
“ ఎందుకండీ అంత పగ ?”
“ పగ కాదు,అపాలా ! వినోదం, పైసా ఖర్చు పెట్టకుండా దొరికే టాం & జెర్రీ ఆట !”
అపాల విస్మయంతో చూసింది విరించి వంక !‘ ఏమిటితను, మనుష్యులలో ఇలాంటి చీకటి కోణాలు కూడా ఉంటాయా ?’ ఇతనింకా పూర్తిగా అర్థం కాలేదు నాకు ! ’ అనుకొంది.
“ ఏమిటి అపాలా ఆలోచనలో పడ్డావు ?”
“ మా టూరు చివరలో మిమ్మల్నందరినీ, కూడా తీసుకొని వెళ్దామని అనుకొన్నాం కదా, అతనేదో పురాతన కట్టడాలు, కోటలు అవీ చూపిస్తా నంటున్నాడు.---”
మధ్యలోనే అడుపడ్డాడు విరించి. “ గుడ్ ! అయితే ఆ టూరుని మా అందరితో కలిసి వేయించు. మేము వాడిని ఆ స్పాట్లలో బాగా గ్రిల్ చేసి, అవాకులు చవాకులూ వాగించి, ఎంజాయ్ చేస్తాం ! వాడి ఉద్యోగానికి ఎసరు పెడతాం !”
అపాల ,విరించి ఉత్సాహం చూసి, విస్తు పోయింది. శీను ఇప్పుడొక కోటీశ్వరుడని తెలుస్తే ఎలా రియాక్టవుతారో ఆమెకు చూడాలని అనిపించింది.‘ కానీ, బండశీనుని అలాగే ఉండనీ!. అసలు విషయం అకస్మాత్తుగా చెప్పడం లోనే టాం & జెర్రీ అసలు మజా వస్తుంది ,’ అనుకొంది.
Comments
Post a Comment