Skip to main content

అళియ అరాళీయము--౩


దృశ్యము 3
( రాయచూరు దుర్గంలోని ఏకాంత నర్తన శాల )
( తెల్లని తెర మీద నాట్యశాలని తలపించేలాంటి ఛాయారూపం కనిపిస్తుంది )
( నర్తన శాలలో కూర్చొని నలుగురు పౌరులు కబుర్లు చెప్పుకొంటూ ఉంటారు)
1.పౌరుడు
            రోజు నర్తన శాలలో లకుమాంబ కొత్త శిష్యురాలు  గజ్జె కట్టి చేసిన దృశ్యం అద్భుతంగా ఉంది కదూ ?
2. పౌరుడు
            నర్తకి పేరు అరాళ కుంతల అట ! రూపం పేరు అన్నీ ప్రబంధ నాయికలాగ ఉన్నాయనుకో !
3. పౌరుడు
            శకుంతలగా, రతీ దేవిగా, పార్వతిగా, మోహినిగా ,కుమారి అరాళ కుంతల రంగంలో ప్రవేశించి చేసిన నృత్యం మైమరిపించిందనుకో !
4. పౌరుడు
            శకుంతలగా ఆమె కాళిదాసు శకుంతలనే మరిపించిందయ్యా ! అడవిలో విచ్చలవిడిగా ప్రకాశించే వెన్నెల లాంటి తేజస్సు, ముగ్ధ మనసుతో దుష్యంతుని లాంటి రాజశేఖరుణ్ని వశం చేసుకొన్న హావ భావ విలాసం , ఆహా , శకుంతల దిగి వచ్చిందనుకో !
1. పౌరుడు
            రతీ దేవిగా, అరాళ కుంతల రంగ ప్రవేశం చేసినప్పుడు, నాలో కోర్కెలు బుసలు కొట్టాయనుకో ! హృదయంలో పొంగు లేచింది. శరీరంలో చైతన్యం కట్లు తెగి పారింది, గగుర్పాటు పుట్టించే తీరుకి , పరువం, కులుకుకి మన్మథుడే దిగివచ్చాడనుకో !
2. పౌరుడు
            కేశ పాశాల విస్తృతి, స్తన యుగళం యొక్క సౌభాగ్యం, పిరుదుల కదలిక లోని గంభీరత, లేత నడుము వంపుల్లోని విద్యుత్వేగం, కంటి చూపుల ధాళధళ్యం , పద ఘట్టన లోని భావుకత, అచ్చు త్రిలోక సుందరి పార్వతీ దేవియే నాకు ప్రత్యక్షమయిందనుకో !
3. పౌరుడు
            మోహినిగా తస్సాదియ్యా ! అరాళ కుంతల అబ్బ , నన్ను మత్తులో పడేసిందనుకో !అది అమృతం పంచిందని అనుకొన్నావేంటి ? నవ్వుల వెన్నెలని కంటి చూపులల లోని కోర్కెని, వంటి ఊపుల లోని తీపిని, వయ్యారం లోని విన్యాసాలని పంచి పెట్టింది.
4. పౌరుడు
            నర్తకి అరాళ కుంతల స్వయంగా దుర్గాధీశుల వారి మనసు హరించి ఉంటుంది. ! నాట్యము ముగిసిన వెనక , ఆమెని తన సన్నిధికి రమ్మని కబురు పంపారట !
1. పౌరుడు
            మహలుకి పిలిపించి సన్మానం చేస్తారంటావా ?
2. పౌరుడు
            ఏమో మరి ప్రత్యేక ఏకాంత ప్రదర్శన  కోరుతారేమో ?
3. పౌరుడు
            ఆమె ఏకాంత ప్రదర్శన ఎలా ఉంటుందో తలచుకొంటేనే నాకు అబ్బ ! మనసు మురిసిపోతోంది.
4. పౌరుడు
            ఆపండి ఊహాగానాలు ! మనబోటి సామాన్య పౌరులకు, అంతటి మహిమాన్విత కళాకారిణి  ఏకాంత ప్రదర్శన తిలకించే భాగ్యమెక్కడిది ? ఇప్పుటికి తిలకించినదే బహు బాగు !
1. పౌరుడు
            నిజమే, పరాకు మాటలలో పడి పని మరచి పోయాను.
2. పౌరుడు
          పద పోదాం.
(అందరూ ఒకరి వెనకగా మరొకరు నిష్క్రమిస్తారు)
( లైట్లు ఆరుతాయి)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద