Skip to main content

అళియ అరాళీయము--౫

దృశ్యము 5

( సుల్తాన్ కులీ దర్బారు)

( తెల్లని తెరలో దర్బారు ఛాయారూపాన్ని కనిపిస్తుంది)

(లైట్లు రాగానే సుల్తాను కులీ ఎత్తైన ఆసనం మీద కూర్చొని కనిపిస్తాడు. వెనక ఇద్దరు సేవకులు వింజామరలు వీస్తూ ఉంటారు. సుల్తానుకి ఎడమ వైపు రహీంఖాన్ నిల్చొని ఉంటాడు. సుల్తాను కుడివైపు ప్రవేశ ద్వారం మీద అందరి చూపులు ఉంటాయి)

సుల్తాన్:
    రహీంఖాన్ ! ఈ రామరాజు హింకా రాలేదేమి ?

రహీంఖాన్:
    వస్తూనే ఉంటాడు జహాపనాహ్ ! గుస్తాకీ మాఫ్ జహాపనాహ్ ! మీరు ఆ కాఫిర్’ని చాల ఎక్కువగా నమ్మారు.

సుల్తాన్:
    నీకీ అలా అన్పించిందా ?

రహీంఖాన్:
    అవును హుజూర్ !

సుల్తాన్:
    దుష్మన్;కీ  కోట అప్పగించి వచ్చినందుకు అలా అన్పించిందా ?

రహీంఖాన్:
    జహాపనాహ్ ! రామరాజు ఎలాంటి ప్రతిఘాటన చెయ్యలేదు. తననీ, తన సైనికులనీ, కోట వదిలి పారిపోయి రక్షించుకొన్నాడు. హిది లడాయికి భయపడడం కాదంటారా హుజూర్ ?

సుల్తాన్:
    రహీంఖాన్ నువ్వు తప్పుగా సోచాయిస్తున్నావ్ ! కోటలో సంపదని సైనికుల సహాయంతో తెచ్చి, ఖజానాకి చేర్చాడు కదా ?

రహీంఖాన్:
    నిజమే జహాపనాహ్ ! సంపదా తెచ్చాడు మంచిదే ! కాని ప్రజల మాట హేమిటి ? దుష్మన్  సిపాయిలు మన ప్రజల ధన, మాన ప్రాణాలను దోచుకొని హుంటే హేం జరిగేది ? మీకు బద్;నామీ అవదా హుజూర్ !

సుల్తాన్:
    యా అల్లా ! నిజమే ! రహీంఖాన్ నేను హిది హెంద్కు సోచాయించ లేదు ! మంఛి మాట చెప్పావ్, హిది వాడిని అడగాల్సిందే !

(ప్రవేశం రామరాజు సుల్తానుకి కుడివైపు నుంచి)

రామరాజు:
    ( వస్తూనే సలాం చేస్తాడు) కుతుబ్ షాహీ వంశ్ కీ చాంద్ ! దిగ్గజ్ రాజావోంకీ స్వప్నోంకీ షేర్ !! జరూరత్ మందోంకీ రెహమాన్ !!! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో ! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో ! సుల్తాన్ కులీ కుతుబ్ షాకీ జయహో !

సుల్తాన్ :
    రామరాజూ, జయవాదాలు అవతల పెట్టు, సంపద ఖజానాకి చేర్చావా ?

రామరాజు:
    జీ జహునాహ్ ! ఖజానాకీ లెక్కలతో సహా అప్పజెప్పాను హుజూర్ !

సుల్తాన్:
    నువ్వు చేసిన పనీ మాకీ నచ్చాలేదు రామారాజూ, ప్రజా రక్షణని గాలికి వదిలేసి, పారిపోయి వచ్చావ్ ! ఇదీ మాకీ బద్’నామీ కాదా ?

రామరాజు:
    (ఖంగు తింటాడు) జహాపనాహ్ ! నేను కోట మీద తెల్ల జండాని ఎగురవేసి వచ్చాను. విజయనగర ప్రభువులకి ఆ కోట, ఆ కోటలోని ప్రజలు కొత్తకారు జహాపనాహ్! వారు నిర్దోషులైన ప్రజల మీదకి అత్యాచారానికి దిగరు జహాపనాహ్ ! ఇదివరకు జరిగిన ఎన్నెన్నో యుధ్ధాలు ఆ విషయాన్ని ఋజువు చేసాయి. ఇపుడు కూడా అదే జరిగింది జహాపనాహ్ ! ప్రజలు సురక్షితంగానే ఉన్నారు. కేవలం దుర్గం మీద జండా మారింది!

రహీంఖాన్:
    ( కలుగ జేసుకొని) అలాగని విజయనగర రాజు నీతో సంధి చేసుకొన్నాడా ? నువ్వు లాలూచీ పడలేదా ? ఎలాంటి సూచనా లేకుండా , ఆ దుష్మన్ రాజు నీ పైకి దండయాత్ర ఎందుకు చేసాడు ?గుట్టూ చప్పుడూ లేకుండా ఆ దండాయాత్ర  చేసీ హుంటే ఆ విషయం నీకీ హెల్లా తెలిసింది ?

సుల్తాన్:
    చెప్పు రామరాజూ, రహీంఖాన్ ప్రశ్నలకి జవాబు చెప్పు.

రామరాజు:
    విజయనగర రాజు, తాను ఇది వరకు పోగొట్టుకొన్న దుర్గాన్ని తిరిగి పొందడానికి ఎలాంటి సూచనా ఇవ్వకుండా దాడి చేసాడు. శతృరాజుల రణనీతి ఉచితానుచితాలు నేనెలా చెప్పగలను ? అతని దాడి గురించి నాకు గూడచారుల ద్వారా తెలిసింది. మీకు సూచన ఇచ్చి, యుధ్దానికి అనుమతి పొందే సమయం మించిపోయింది. కేవలం పదిహేను వందల మంది సిపాయిలు, రెండు వందల ఆశ్వికులు గల నేను , వారి చతురంగ సేనని ఎదుర్కోవడం ,‘ గొర్రె కొండతో తలపడడం లాంటిది కాదా హుజూర్ ? మీరు నాకు ఆనతి నివ్వండి జహాపనాహ్ ! నేను సైన్యాన్ని తీసుకెళ్లి ఆ కోటని ముట్టడి చేసి, శతృవులని పరాజితులని చేస్తాను. విజయనగర రాజు చేసిన మెరుపు దాడికి సరైన శిక్ష వేస్తాను.

రహీం ఖాన్:
    (తనలో) ఈ రామరాజు తన మాటలతో సుల్తాన్’ని పడగొట్టేలా హున్నాడు. అలా జరగ కూడదు. ( ప్రకాశంగా) రామారాజూ ! చేసిన తప్పుని సమర్థించుకోవాలని చూడాకు. చేతనున్న కోటని విడిచి పెట్టి, తిరిగి దానినే ముట్టడించడానికి  సైన్యబలం కావాలంటావా ? నువ్వు లడాయికి భయపడ్డావు, ఆ సంగతి చెప్పు.

సుల్తాన్
    రామారాజూ ! రహీంఖాన్ చెప్పినది బాగు. నువ్వు చేసినదీ నాకూ నచ్చాలేదు. అయినా ఒకసారి నా ప్రాణాలని కాపాడావు. ఇప్పుడు సంపదని తెచ్చావు. అందూకని నీకీ దేశ బహిష్కార శిక్ష వేస్తున్నాను. రేపు సూర్యోదయం లోగా, నా రాజ్యం సరిహద్దులు దాటి పారిపో ! పట్టుబడితే శిరచ్ఛేదమే శిక్ష ! సమఝ్ అయిందా ?

( సుల్తాను కోపంతో అక్కడనుంచి నిష్క్రమిస్తాడు)

( రామరాజు నిరుత్తరుడై , విషాద వదనంతో వెళ్లిపోతాడు)

రహీంఖాన్:
    ఈ రామరాజుకు రేపటి సూర్యోదయం వరకు సమయం ఇస్తే పారిపోతాడు. అలాగయితే నా పగ హెల్లా చల్లారుతుంది ? కాపలా సిపాయిగా వచ్చి, నా మోదే పెత్తనం చేస్తాడా ? వీణ్ని బంధించి రాత్రంతా చెరలో పెట్టి, తెల్లావారాక పట్టుకొని తల నరుకుతాను. వాడు పారిపోకూడదు.

( అంటూ హడావుడిగా వెళ్తాడు)

( లైట్లు ఆరుతాయి)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ