Skip to main content

చిలక రథంలో సరదా షికారు ౩

    ద్వాపర యుగంలో దూర్వాస ముహాముని ప్రేమ కానుక అయిన ,‘ కస్తూరి కదళి’ బాగా విస్తరించింది. కలియుగంలో కుంటుబడింది.

    కలి ప్రభావం వల్ల కాబోలు, ధర్మదేవత మూడు పాదాలు ముడుచుకొని పోయి, ఒకే పాదం బాగుండడం వలన, ద్వాపర యుగంలో మరణించిన , అసుర వర్గాల ప్రేతాత్మలు, అదను కోసం ఎదురు చూస్తూ, తమ క్రూర కర్మల కోసం తగిన మానవ శారీర మాధ్యమాలని  వెతుకుతూ పరిభ్రమించ సాగాయి.దూర్వాస ముని చేత , భస్మం చేయబడిన , ‘వ్యాఘ్రుడనే’ రాక్షసును దుష్టాత్మ కూడా , అదను కోసం ఎదురు చూడసాగింది.

    కస్తూరి కదళి మహిమని కూడా , స్వార్థపరులైన , భూకామందులలో  కొందరు దుర్వినియోగం చెయడం మొదలు పెట్టారు. దాని ఇతర ప్రయోజనాలని మరుగున పెట్టి, కేవలం సంతాన ఫలంగా దాని వాడకాన్ని ప్రోత్సహించారు. దాని కోసం కొన్ని కఠిన నియమాలని పెట్టారు.

    కస్తూరి కదళిని ఆడవాళ్లు మాత్రమే సేద్యం చేయాలన్నది వాటిలో ఒకటి ! స్త్రీలే వాటిని నాటి నీరు పోసి చుంబన ఆలింగనాది క్రియల చేత, కాపుకి వచ్చేలా దీహదం చేసేవారు.పౌర్ణమి నాటి రాత్రి , గెలవేసిన కస్తూరి కదళి, దివ్య సువాసనలు వెదజల్లేది ! దానిని కేవలం తడిసిన చీర ధరించిన స్త్రీలు మాత్రమే కొయ్యాలనే నిబంధన ఉండేది !ఆ విధంగా సాగు చేస్తేనే దాని మహిమ నిలుస్తుందని, దానిని ఆరగిమ్చే కులీన స్త్రీలకు  పుత్ర సంతానం కలుగుతుందని నమ్మ బలికారు. దాంతో సాగు చేసే స్త్రీ అంద చందాలని బట్టి కూడ, ఆ కదళీ ఫలాల విలువు నిర్ణయింప బడేది !!

    ఇలాంటి వింత నియమాలని చూసిన, వ్యాఘృని ప్రేతాత్మ కస్తురి కదళీ వనాల చుట్టూ తిరుగుతూ, తగిన అవకాశం కోసం ఎదురు చూడ సాగింది !

    అదుగో ఆ అవకాశం ,  రంగ భైరవ స్వామి వలన లభించింది !

    అయిదు వందల శరత్తుల క్రిందటి మాట.
    కాపాలిక సాంప్రదాయ వాదులు అప్పట్లో ‘రుద్ర భైరవ’  పూజలు జరిపే  వారు, కొండలు, కోనలు,లాంటి దుర్గమమైన రహస్య స్థలాలలో..వాళ్లందరి పేర్లు భైరవులే’ !

     ఒకరు కాల భైరవు డయితే,తక్కిన వారు, ‘వీర భైరవ, విజయ భైరవ, నాధ భైరవ, జిత భైరవ, మదన భైరవ’ లాంటి పేర్లతో ఒకరినొకరు పిలుచుకొనే వారు.

    వాళ్ల సాధనలో  ‘పంచ మకరాలు’ ముఖ్య మయినవి.పంచ మకారాలంటే, మద్యము, మాంసము, మత్స్యము, మదిర, చివరగా  అయదవది  ‘మగువ’ !

     ఆ మగువల పేర్లు కూడా, ‘కరుణ భైరవి, అరుణ భైరవి, దివ్య భైరవి, నాగ భైరవి, ముగ్ధ భైరవి, స్నిగ్ధ భైరవి’,ఇట్లాంటి పేర్లతో పిలిచే వారు.

    పంచ మకారాలతో  ‘రుద్ర భైరవ’ సాధన, కాపాలికుల  జీవితాశయం !

     అలాంటి కాపాలిక సాంప్రదాయవాదులలో ఒకడు,‘ రంగ భైరవ స్వామి’ . స్వామి అంటే తండా నాయకుడు అని అర్థం ! ఒక్కొక్క  తండాకి  ఒక  గురువు ఉండేవాడు.గురువు మాట వారికి రుద్ర భైరవుని ఆఙ్ఞతో  సమానం !

    రంగ భైరవుడు కేవలం భైరవ సాధానకి పాటు పడక , సత్వర లాభం కోసం, అసుర శక్తులని ఆరాధించడం మొదలుపెట్టాడు. అదే అదను కోసం చూస్తున్న,‘వ్యాఘృడు’ రంగ స్వామికి  ప్రసన్నుడై, తన ఆవాహన రహస్యాన్ని తెలిపాడు. వ్యాఘృడు ఆవహిస్తే రంగ స్వామి అసహాయ శూరుడు, అమిత బలాఢ్యుడు,
 అవుతాడు.క్రూర మృగాలని సైతం, ఒంటారిగా ఎదిరించ గలడు ! ఆ బల సంపదే రంగ స్వామిని , రంగ భైరవ స్వామిగా, కాపాలిక తండాకి నాయకునిగా చేసాయి.

    అయితే అసుర శక్తులు బలితో గాని తృప్తి చెందవు !

    వ్యాఘృనికు కూడ అలాంటి బలిని సమర్పించాలి !

    ప్రతీ పౌర్ణమికీ స్త్రీ శరీరాన్ని బలిచేయాలి !

    ఇంకేముంది ! వ్యాఘ్రున్ని తృప్తి పరిచేందుకు ,రంగ స్వామి కస్తూరి కదళి తోటలని ఎన్నుకొన్నాడు.ఒంటరిగా తడి బట్టాలతో వచ్చి, కదళి గెల కోసే నిస్సహాయ స్త్రీలు , రంగస్వామికి సులభ సాధ్యలయ్యారు.

    పౌర్ణమి నాటి రాత్రి రెండవ ఝాము ప్రారంభ సమయంలో , రంగ స్వామి ,‘ వ్యాఘ్రుణ్ని ఆవాహన చేసుకొని ,‘ పెద్ద పులిలాగ ’ మారిపోయే వాడు ! అరటి తోపులలో చొరబడి, అక్కడ చిక్కిన ఆడవాళ్లని , భయ భ్రాంతుఅల్ని చేసి, వారిని పాశవికంగా అనుభవించి, ఆ పైన వారి శరీరాంగాలని భక్షించి, బలిని సమర్థవంతంగా సమర్పించేవాడు !!

    రంగ భైరవ స్వామి, ప్రతీ పౌర్ణమికి,‘ బెబ్బులిగా’ మారతాడన్న విషయం తండాలో ఎవరికీ తెలియదు !

    ఆ రహస్యాన్ని రంగస్వామి చాల జాగ్రత్తగా కాపాడుకొనేవాడు. నిజానికి ‘ కాపాలికులు రుద్రభైరవ సాధన ’ మాత్రమే చేసేవారు.

    పంచ మకారాలలో ఒకటైన  మగువల  కోసం వారు  పడరాని పాట్లు  పడేవారు. జన పదాలకు  వెళ్లి, చిన్నారి  ముక్కు పచ్చలారని  బాలికలని అపహరించి, తమ గుహల లోకి తరలించి, పెంచి పెద్ద చేసేవారు. భైరవీ సాంప్రదాయానికి అనుగుణంగా వారిని మలచుకొనే వారు. ఆ పనిని వృధ్ధులైన  భైరవీ మాతలు నిర్వర్తించే వారు.బాలికలకి చిన్నప్పటి నుండి, రతి కేళిలో రహస్యాలని తెలియ జేసి,వాళ్లు వ్యక్తులయ్యే సరికి, ‘పూజకి’ సిధ్ధం చేసేవారు.

    అలాంటి ఒక స్నిగ్ధ భైరవిని, మొట్ట మొదటి సారి చూసాడు చాళుక్య యువరాజు , రాకుమారుడైన ఆనందుడు ! చాళుక్య వంశీయులు ‘ చామర్లని’ రాజధానిగా చేసుకొని అక్కడ ఒక కోట నిర్మించారట ! ‘ చామర్ల కోట’ క్రమంగా ‘సామర్ల కోట’గా’ మారిందట !

    ,అందమైన ‘వసిశ్ఠ నది’ గోదావరిలో కలిసే చోట , ఒక దుర్గమారణ్యంలో ,మనోహరమైన ఆ దృశ్యం కన్నుల  పండువుగా, ‘శోణ నదీ ప్రవాహ ఝురిలో స్నానం చేస్తూ,‘ స్నిగ్ధ భైరవి’ రూపంలో కనిపించింది.

    రాకుమారుడు ఆనందుడు తన కళ్లని తాను నమ్మలేక పోయాడు !

    ఎత్తైన శిఖరం నుండి, నర్తిస్తూ దిగుతున్న వశిష్ట నదీ సౌందర్యాన్ని మైమరచి చూస్తూ, ఆ నదిలోతన రత్న ఖచితమైన ఛురికను జార విడుచుకొన్నాడు ఆ రాకుమారుడు. వెంటనే తన ఛురికను వెదుకుతూ, ఆ నదీ ప్రవాహం జారిన చోట్లని అవరోహిస్తూ, లోయలో దిగి, ఆ దృశ్యాన్నిచూసి, ఆ నదీమ తల్లే తన  ముందు కన్యామణి రూపంలొ కనిపించిందని బావించాడు !

    ఆ పరవశత్వంతో తన రత్నాల ఛురికను మరచి పోయాడు.!

    పదహారేళ్ల ప్రాయం లోని ,స్నిగ్ధ భైరవి శోణ నదీ ప్రవాహంలో స్నానం చేస్తూ, తన రెండు చేతులూ జోడించి, అస్తమిస్తున్న సూర్యునికి అంజలి ఘటించింది.

    ఆ పైన చేతులు చాచి,అతని కాంతిని ఆహ్వానిస్తూ, మొల లోతు నీళ్లల్లో నిలబడింది.ఆమె!

    మూడు పాయలుగా శరీరానికి ముందు వెనుకల విస్తరిస్తూ ఆమె నగ్నత్వాన్ని దాచుతున్న, విశాలమైన కబరీ భరం తప్ప మరే ఆఛ్ఛాదనా లేని ఆమ శరీరంలో,నదీ ప్రవాహం ద్వారా అరుణారుణ కిరణాలని పరావర్తనం చేసి, ప్రార్ధనని అంగీకరించిన, పద్మ ప్రియుడు ఆమె  మేని కాంతిని మెరిసి పోయే కాంచనంలా చేసి, జీవ కళలు ఉట్టి పడే సాల భంజిక లాగ చేసాడు !.

    అదే ఆనందుడు చూసిన మనోహరమైన దృశ్యం ! చూడడానికి  రెండు కళ్లూ చాలని  అపురూపమూ, అనుపమానమూ అయిన దృశ్యం !!

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద