“సుందరీ ! నీ పేరేమిటి ? నీ వెవరవు? కన్యారూపం లోని శోణ నదివి కాదుగదా ?” ఆనందుని ప్రశ్న ఆమెని చకితురాలిని చేసింది..
రాజఠీవి ఉట్టిపడే దుస్తులతో ధృడమై,సుదర్శనమైన సమున్నత కాయంతో, విశాలమైన ఫాలభాగంతో. దట్టమైన కుంచె లాంటి కనుబొమల క్రింద వృషభాక్షాలతో,కోటేరు లాంటి నాసికతో,చతురస్రాకారమైన చిబుకంతో, పొడవైన మెడతో, ఉన్నతమైన భుజకీర్తులతో, వెడల్పైన భుజ స్కందాలతో, క్రీడాభూమి లాంటి వక్షస్థలంతో, సన్నని నడుముతో, ఆజాను బాహువులతో, తన ముందు నిలిచిన ఆ పురుషుణ్ని, బాల్యం నుంచీ భైరవులని తప్ప,ఇంకెవరినీ చూసి ఎరుగని ఆమె, విశాలమైన తన కళ్లని ,మరింత విశాలంగా చేసి,విస్మయంతో చూసింది.
అంత వరకు ఆమె మేని కాంతులనే చూసి, పరవశించిన అతను, ఆమె శరీర సౌందర్యానికి జోహార్లు
అర్పించాడు. ఆంద్ర భాషలోని పంచ కావ్యాలైన ‘మనుచరిత్ర’ లోని ‘వరూధిని’, ‘వసు చరిత్ర’ లోని ‘గిరిక’,‘ ఆముక్త మాల్యద’లోని ‘గోద’, ‘విజయ విలాసం’ లోని ‘ఉలూచి’, ‘పాండురంగ మహాత్మ్యం’ లోని ‘సుశీల’ కలిసి కట్టుగా వచ్చి, ఆమెని చూసినట్లయితే,తమని తాము చూసుకొని అసూయ పడేటంత, అందంగా ఉంది ఆమె !
“నాపేరు స్నిగ్ధ భైరవి ! మీ పేరేమిటి ? మిమల్ని చూస్తే భైరవ సాధకుల లాగ లేరే ! ఇక్కడికి ఎలా రాగలిగారు?” ప్రశ్నల వర్షం కురిపించింది ఆమె !
‘‘వాహురే ! ఇన్ని ప్రశ్నలు కురిపించారంటే, నిశ్చయంగా మీరు శోణ నదీమతల్లి కారన్నమాటే !నాపేరు ఆనందుడు, నేను రత్నపురి రాజ కుమారుణ్ని, మీరు నది లోంచి బయటికి వస్తే, ఎన్నోవిషయాలు మాట్లాడుకో వచ్చు! ”అన్నాడు ఆనందుడు.
ఆమె అక్కడి నుంచే ప్రశ్నించింది. “ఇక్కడికి ఎలావచ్చారు ?”అని.
“నా రత్నఖచితము, రాజచిహ్నము గల ‘ఛురకత్తి’, ఈ నదీ ప్రవాహంలో పడిపోయింది.దాని కోసం కొండ మీదనుండి క్రిందకి దిగాను. మిమ్మల్ని చూసాక ---”
“ ఈ ఛురకత్తేనా మీరు పోగొట్టుకొన్నది ? ”అంటూ ఆమె నదిలోంచి బయట పడింది. కేవలం ఊరువుల వరకే ఉన్న, తన కటివస్త్రం లోంచి, ఆ ఛురికను బయటికి తీస్తూ..నదినుంచి బయట పడిన ఆమె అరటి బొదెల్లాంటి, తొడలు, ఛురికను బయటికి తీస్తున్నప్పుడు, గుహలా లోతుగా కనిపించిన ఆమె నాభిని చూసి ముగ్ధుడయ్యాడు అతను.
“నదీ ప్రవాహంలో దొరికిందిది ! మీదేనేమో చూసి చెప్పండి.”, అంది ఆమె నదీతిరానికి వచ్చి.ఛురికను ఆమె చేతుల్లోంచి అందుకొంటూ,ఆ కర స్పర్శని పొందిన అతని మేను పులకరించి.నిటారుగా అయింది !
“ ఇది నాదే ! దీని కోసమే దిగి వచ్చాను . సుందరీ ! మీరెవరు ? ఇక్కడ ఎందుకున్నారు ?”
“చెప్పానుగా, నేను భైరవిని ! రంగ భైరవ స్వామి తండలోని అతి చిన్న సభ్యురాలిని ! ఇక్కడే ‘చాళుక్య రాజ వంశం’ లోని ‘ఇద్దరు తోడికోడళ్లు’ నిర్మించిన, ‘రుద్ర భైరవ’ మందిరం ఉంది. ఆ మందిరం దగ్గరున్న కొండ గుహలో, వాళ్లతో కలిసి ఉంటున్నాను. మానవ కాంతని, అల్పురాలిని అయిన నన్ను, దేవ కన్యలతో పోల్చకండి. మీ ఛురికను తీసుకొని తిరిగి వెళ్లిపోండి.మా దళం లోని భైరవులు, నిరంకుశులు,రాక్షస ప్రవృత్తి గల వారు. మనుష్యులంటే వారికి ఇష్టం ఉండదు.వారు కంట పడి వాదనకి దిగుతే, చంపి వేస్తారు.”
“ నేను సుక్షత్రియ వంశానికి చెందిన వాడిని. చంపడమే గాని, చావుకి భయపడే వాడిని కాదు ! మామూలుగా అయితే ఛురికతో, వెళ్లి పోయే వాడినే ! మిమ్మల్ని చూసాక , మీతో మాట్లాడాక అసలు వెళ్లను ! ఇంతకీ మీరీ దళంలోకి ఎలా వచ్చారు ? మీ తల్లి తండ్రులు కూడా దళంలోనే ఉన్నారా ?”
“ నా తల్లి తండ్రులు ఎవరో నాకు తెలియదు ! నేను మూడేళ్ల వయస్సులో తప్పి పోయానట ! నన్ను ఒక వృధ్ధ భైరవీ మాత తెచ్చి పెంచిందట !”
ఆమె మాటలు అతనికి ఆశ్చర్యాన్ని కలిగించ లేదు ! ఆ విషయాన్ని అతను ముందుగానే ఊహించాడు ! నిస్సంకోచంగా ఆమె వామ హస్తాన్ని, అందుకొని తనవైపుకి లాగుతూ అన్నాడతను. “సుందరీ ! ఈ దళం వదిలి, నాతో వచ్చేయి ! నేను నిన్ను వివాహ మాడుతాను.” అలా అంటూ, ఆమె ఎడమ భుజం మీద ఉన్న ‘పులి ఆకారంలో’ ఉన్నపచ్చబొట్టు చూసాడు.,“ సుందరీ ! ఈ పచ్చబొట్టు నీ భుజం మీద ఎలా వచ్చింది ?” అని అడిగాడు.
“ ఇది నా చిన్నప్పటి నుంచీ ఉంది !” అంటున్న ఆమెను, తన హృదయానికి హత్తుకొంటూ, ఆమె చిబుకాన్ని తన కుడిచేతి బొటన వ్రేలితో ఎత్తి,, ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడతను, “ ఈ పులి బొమ్మ నా మేనమామ కేశవ చంద్ర మౌర్యుల రాజవంశపు గుర్తు ! వారి మూడేళ్ల బాలికని, ఎవరో ఎత్తుకు పోయారు ! తెలిసిందా ఆ బాలికవి నిస్సందేహంగా నువ్వే ! నాకు వరసకి మరదలివి ! నీ మీద సర్వ హక్కులూ నావే ! నన్ను కాదనకు,” అంటూ ఆమె బుగ్గలని ముద్దు పెట్టుకొన్నాడు అతను.
ఆమె అతని హృదయ సీమలో తల వాల్చి, “ నన్ను త్వరగా తిసుకు పో, బావా ! నాలుగు రోజుల వెనుక వచ్చే పున్నమి నాడు, నన్ను వీళ్లు భైరవీ సాధనకి ఎన్నుకొన్నారు.రంగ భైరవ గురువు ఆ రోజు నన్ను ‘మదన భైరవిని’ చేసి,తొలిసారి కన్నెరికం చేస్తాడట ! అందుకే ఈ రోజు సూర్య భగవానుని వేడుకొన్నాను,నువ్వు కనిపించావు” అంటూ వెక్కి వెక్కి.ఏడ్చింది.
నగ్నత్వము, రతిక్రియ, మైథున భంగిమలు ఇవేవీ ఆమెకి కొత్తవి కావు. ప్రతీ అమావాస్యకీ , భైరవీ, భైరవుల మధ్య జరిగే సాధన అది !
ఆ రోజు మద్యము మాంసము , మత్స్యము, ఆరగించి తమ తమ భైరవీ గణాలతో వారు మైథున క్రియ చేస్తారు. ‘ మదన భైరవి’ అంటే తొలిసారి ఒక కన్నె పిల్లని గురువుకు అర్పించి ఆమెకి కన్నెరికం చేయడం ! గురువు తన ఇచ్చ వచ్చినంత కాలం ఆమెని తనతోనే ఉంచుకొని , ఆ తరువాత ఆమెని సకల భైరవిని చేస్తాడు ! అదీ ఆ కాపాలిక సాంప్రదాయం !
స్నిగ్ధభైరవి తనకి అణు మత్రమూ ఇష్టం లేని ఆ కార్యా చరణకి సిధ్ధంగా లేదు. అందికే ఆమ్ ఆ సాయ్త్రం, నదీ గర్భంలో నిలిచి, ఆ సూర్యదేవుని అర్థించింది, తనకి విముక్తిని ఇవ్వమని ! ఆ సూర్య దేవుని అనుగ్రహమో, ఏమో ఆమెకి, బావతో పిచయం అయింది !!
ఆనందుడు ఆమెని పొదివి పట్టుకొని,తన కౌగిలి లోకి తీసుకొన్నాడు.ఆమె కన్నీటిని తన పెదవులతో తుడిచాడు. ఆమె అతనికి చేరువయి, అతి చేరువయి, గువ్వలా కౌగిలిలో ఒదిగి పోయింది. అతడామె అధరాలని, తన పెదవుల మధ్య బిగించి, సుదీర్ఘ చుంబనం చేస్తూ, ఆమె అంగాంగాలని స్పృశిస్తూ, మృదువుగా మర్దిస్తూ, దగ్గరకి హత్తుకొంటూ, ఆమెకి ధైర్యాన్నీ ,పులకింతలనీ, మధురానుభూతులనీ, ఆనందాన్నీ కలిగించాడు. ఆమె తనని తాను అతనికి సమర్పించుకొని, సంరక్షణ లోని భద్రతనీ, కౌగిలి లోని కమ్మదనాన్నీ, స్త్రీత్వం లోని మధురిమని తొలిసారి చవి చూసింది.
వారిద్దరూ ఒకరి బాహు బంధంలో మరొకరు హత్తుకు పోయి పరిసరాలు మరచారు.
ఇంతలో “స్నిగ్ధా, స్నిగ్ధ భైరవీ !” అన్న పిలుపు వినిపించింది.
స్నిగ్ధ భైరవి, ఆనందుని కౌగిలినుండి విడివడింది.
“ బావా ! ఒంటరిగా నువ్వీ తండాని ఎదిరించడం దుస్సాహసం అవుతుంది. అందులో రంగ భాఇరవ స్వామి బల సంపద నీకు తెలియదు.నీకే కాదు, మా తండా లోని భైరవులకే తెలియదు. అతనికి, వ్యాఘాసుర సిధ్ధి ఉంది. అతని కుటీరంలో నాకు మాత్రమే ప్రవేశం ఉండడం వల్ల , నేను ఇతరులకి తెలియని ఎన్నో రహస్యాలను తెలుసుకొన్నాను”
“ ఏమిటి స్నిగ్ధా, ఆ రహస్యాలు ?”
“ రంగ భైరవ స్వామి ప్రతీ పౌర్ణమికి, పెద్ద పులిగా మారిపోతాడు ! ఎక్కడికి వేటకి వెళ్తాడో , ఏ జంతువులని వేటాడుతాడో తెలియదు! నోటినిండా రక్తం ఉంటుంది,తిరిగి వచ్చేసరికి ! ఆ తరువాత మళ్లీ నిజరూపం పొందుతాడు !”
“ అర్థమయింది స్నిగ్ధా ! కస్తూరి కదళి తోటలలో అమ్మాయిలపై, అత్యాచారాలు చేసి, ఆ పైన వారి శరీరాంగాలని ఎవరు కబళిస్తున్నారో అర్థమయింది ! నువ్వు అన్నట్లునేను ఒంటరిగా వాడిని ఎదిర్కోవడం సాధ్యం కాదు ! అమావస్య ల్ నా బలగంతో పాటు వచ్చి, ఈ కాపాలికులకి కాలిణ్ని అవుతాను. అంత వరకు మన విషయం గోప్యంగా ఉంచు.”
తరువాత వారిద్దరూ ఒకరిని ఇంకొకరు వదల లేక వదిలారు.
స్నిగ్ధ భైరవి తన నివాసానికి మరలింది.
ఆనందుడు ఆ కొండనే ఎక్కి వచ్చిన దారినే కోట చేరుకొన్నారు.
అలా వెళ్లిన ఆనందుడు రెండవ రోజుకే, ఒక రథం, ఇరవై మంది ఆశ్విక దళం, ఆ పైన ఏబది మంది పదాతి దళంతో, కత్తి, విల్లు, బరిశె, గద వాంటి ఆయుధాలతో వచ్చి, కాపాలికులని చుట్టుముట్టాడు.
రంగ భైరవ స్వామి చెక్కు చెదరలేదు ! దాసోహం అనలేదు. వీరోచితంగా పోరాడాడు. కొంత సేపు మనిషిగా, మరికాసేపటికి బెబ్బులిగా మారి, శతృవుల పైన తిరగ బడ్డాడు. అతనికి బలము, లాఘవమూ అయితే ఉంది, కాని కౌశలం లేదు. అందుకే భంగ పడ్డాడు. సైనికుల వలలో చిక్కుపడ్డాడు. ఆనందుడు కనికరించ లేదుమాత్రం, నిష్కారణంగా, నిస్సహాయులైన పదతులని, పెద్ద పులిలాగ వచ్చి, బెదరిమ్చి, వారి మాన ప్రాణాలు హరించిన ఆ దురాత్ముడుని ముక్కలు ముక్కలుగా నరికాడు. దాంతో తక్కిన భైరవులు లొంగి పోయారు.
అరటి తోట బెబ్బులి చావడమైతే చచ్చింది. కాని జరగాల్సిన నష్టం జరిగి పోయింది, అప్పటికే !
అరటి తోట సేద్యం నిలిచిపోయింది !
‘ రంగ స్వామి చస్తే ఏమయింది, వ్యాఘాసురుని ఆత్మ ఇంకో విధంగా రాదని నమ్మక మేమిటి ? అన్న ప్రశ్న త;ల ఎత్తింది !
అదీ ఆ విధంగా కస్తూరి కదళి జాతి అంతరించింది.
********************************
ఆ రాత్రి కొత్త అల్లుడి కోసం ,ప్రత్యేకంగా కేటాయించిన పందిరి మంచం మీద, సూర్యచరణ్ నిరీక్షిస్తూ కూర్చిని ఉన్నాడు. శ్రీలత చేత పాల గ్లాసుతో, పాము కుబుసం లాంటి తెల్లని పరిధానాలలో, ‘లక్ష్మి’ లాగ అడుగు పెట్టింది, చాల సేపటి తరువాత ! ఆమె లోఅపలికి రాగానే ,మల్లెపూల పరిమళాలు గుప్పుమన్నాయి ఆ గదిలో !
అతని నిరీక్షణ ఫలించింది. సూర్యచరణ్ ఆమె వంక తేరిపార చూసాడు.
శ్రీలత చేత పాలగ్లాసు పట్టుకొని, కుడి కాలు బొటన వ్రేలితో నేల మీద, అతని పేరునే వ్రాస్తూ, తిరిగి చెరిపేస్తూ, తలని అలవోకగా లజ్జా భారంతో క్రిందకి వంచి, అతని వంక క్రీగంట చూస్తూ, నిలబడింది. అలా నిలబడే ముందు గది తలుపులు .చప్పుడు చేయకుండా మూసేసింది !
సూర్యచరణ్ తృప్తితో , అనురక్తితో, ఆమె అలంకరంణని చూసాడు. శోభనం నాటి మొదటి రాత్రి గుర్తుకి వచ్చింది
“ సిరీ ! ఏమిటిలా ? ఇంత అలంకరణతో, మొదటి రాత్రిని తలపుకి తెస్తూ, అందాల రాజహంస నడకలతో, వలపులి రేకెత్తించే వాలు చూపులతో, క్శీర సాగర మథనం నాడు, అమృత భాండాన్ని పట్టుకొని, ప్రత్యక్షమయిన ‘ జగన్మోహినిలాగ వచ్చావ్ ! ఇదంతా ఈ అల్పుడి మీద ప్రేమాతిశయ్ చేత కాదు గదా ?!” అని అడిగాడు.
భర్త నోట తన సౌందర్య ప్రశంస వినాలనుకొన్న , శ్రీలత మనసు ఉప్పొంగి పోయింది ! రెండు రోజులుగా అతను చెప్పిన కథలు విన్న వారందరూ, శృంగార రసానుభూతికి లోనయి, ఆ రోజు రాత్రి గుంపుగా కాక, జంటలు జంటలుగా విడిపోయి, పడుకొన్నారు ! అందరూ ఎవరి స్థానాలలో వాళ్లు స్ర్దుకొన్నాక,ఆమె అలా అల్కరించుకొని అతని ఎదుట నిలిచింది.
ఉత్సాహంగా, ఉల్లాసంగా వచ్చిన భార్యామణిని , ఉప్పెనలా వచ్చి తాకబోయాడు అతను.
“ ఆగండి, అంత తొందరెందుకు ? ఇంతకీ నేనెలా ఉన్నానని అన్నారు, జగన్మోహిని లాగా ! ఆవిడ ఎవరు ?” అంది కొంటెగా.
ఎవరినో ఎందుకు పిలుస్తాను ! నన్ను మోహపరవశుణ్ని చేసే మోహినీ సౌందర్య సంపదలు , సుందర సుకుమార పుష్పలత అయిన నా శ్రీలతలో కాక ఇంకెవరిలో ఉంటాయి ?!”
“ అలాగా. అయితే ఈ పాలు త్రాగేసి, పడుకోండి.” అంటూ పాలగ్లాసు అందించింది/
“ పాలు పంచుకొంటానంటేనే , ఈ పాలు త్రాగుతాను.”
“పాలు పంచుకోవడమన్నది శృంగార కదన రంగంలో అని ఆమెకి అర్థమయింది !“ ఒద్దు బాబూ ! ఇప్పటికే చాల రాత్రయింది. నాకు నిద్ర వస్తోంది. నేను ఏ పాలూ పంచుకోలేను”’అంది.
“ భోజనంలో అందరి కన్నా ఎక్కువగా, మరో అరటి పండు వడ్డించావ్ !ఒకవేపు అలంకరణతో అలరిస్తూ, మరో వైపు కోరికతో చంపేస్తూ, నువ్వు మాత్రం నిద్ర పోతానంటే ఎలా ?” అంటూ ఆమెను , రెండు చేతుఅలతోనూ ఎత్తుకొని, మంచం పైన పరుండ బెడుతూ అన్నాడతను.
“ అబ్బ ! ఏమి శృంగార కథలు చెప్తున్నారండి !అందరి తలలు దిమ్ము అయిపోయాయంటే నమ్మండి. శాంతి అక్కయ్య కూడా , అలంకరీంచుకొని, బావ చెంతకి చేరింది ఎప్పుడో !”
“ నువ్వెందుకు ఆలస్యం చేసావ్ ?”
“ మిగతా ముసలాళ్లు ఏం చేస్తున్నారో చూద్దామని !”
“ ఏం చేస్తున్నారేమిటి ?”
“ అందరూ జంటలుగా విడిపోయి, దొంగ నిద్రలు తీస్తున్నారు. నలుగురూ కలిసే సరికి, గుంపులుగా పడుకొని, ఏవేవో వ్రతాలు, నోములూ, పిల్లల పెంపకాలు, ఇలాంటి కబుర్లతో కాలక్షేపం చేసే మా కుటుంబ సభ్యులని, ఒకే ఒక మీటింగిలో విడగొట్టి, సరసంగా విభజించారు మీరు !”
“ నా గురించి ఏమనుకొంటున్నారు, సిగ్గూ శరం లేని వాణ్ననా ?”
“ లేదండీ ! అందరూ సంసారాలు చేస్తున్నవాళ్లే ! అలా ఎందుకు అనుకొంటారు ? రోజువారీ పనుల్లో సతమవుతూ , మనసు లోని గుబులుని , మరో రకమైన వ్యాపకాలతో తీర్చుకోవాలని తాపత్రయ పడుతూ ఉన్నవాళ్లకి, దాంపత్యం లోని మధురిమలని చవి చూపించారు, మీరు !”
“ వాళ్ల సంగతి సరే ! నువ్వేమని అనుకొంటున్నావ్ ?”
“ పడుకోవాలని అనుకొంటున్నానండీ !”
సూర్యచరణ్ ఆమె మాటలకి విస్తుపోయాడు. శ్రీలత అల్లరికే ఆ మాటలు అన్నాదో, లేక నిజంగానే అంటున్నాదో అతనికి అర్థం కాలేదు !
“ మరయితే నా సరదా ఎప్పుడు తీరుస్తావ్ ?”
“ మీ సరదా తీర్చుకోండి,మా మామయ్యగారి ఇంట్లో !”
“మామయ్యగారి ఇల్లా, అదెక్కడ ఉంది ?”
“ ద్రాక్షారామంలో ఉంది.”
“ద్రాక్షారామంలో రేపటి సరదా సరే ! ఈ రోజు ఏమయింది ?”
“ నాకు ఎందుకో అలసటగా ఉందండీ ! మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తున్నందుకు బాధగా కూడా ఉంది ! ” అంది శ్రీలత దీనంగా ముఖం పెట్టి.
“ అలవాటు లేని బస్సు ప్రయాణం వల్ల అలస్టట వచ్చి ఉంటుంది. నేను దీన్ని ముందుగానే ఊహించాను. అందుకే ప్రత్యేక ఏర్పాటు చేసాను” అంటూ మంచం క్రింద నుంచి, ఒక ప్లాస్టిక్ పెట్టే తీసి, ఆమెకి చూపించాడు.
“ ఏమిటండీ ఇది ?”
“ గింజలు తీసి, ప్రొసెస్ చేసిన ఖ్ర్జూరపు పల్లు. ఇవి రెండు తింటే చాలు, అలసట ఎగిరి పోతుంది.”
“ నిజంగానా !” కళ్లు వెడల్పు చేసి విస్మయంతో చూసింది శ్రీలత.
“ అవును. తిని చూస్తే తెలుస్తుంది.” అంటూ రెండు ఖర్జూరపు పలుకులు ఆమె చేతిలో పెట్టాడు సూర్యచరణ్.
శ్రీలత వాటిని నోటిలో వేసుకొంది, మరుక్షణం అంది, “ నిజమే నండి ! అలసట అంతా పోయి, ఫ్రెష్’గా ఉన్నట్లుంది !” అంటూ.
``అదే ఖర్జూర రహస్యం ! ఎడారిలో ఎన్నెన్నో క్రోసులు నడిచిన వారు సైతం , కాస్త నీడ పట్టున చేరి, ఈ ఖర్జూరాన్ని తిని సేదతీరుతారు. ఇది తిన్న వెంటనే గ్లూకోజ్,ని రక్తం లోకి పంపి , రిలోఫ్’ని ఇస్తుంది. అంతే కాదు శృంగారానికి సరైన నిర్వచనం !”
“ అంటే ఖర్జూరానికి కూడా శృంగారానికి సంబంధం ఉందా ?”
“ చాల అవినాభావ సంబంధం ఉంది ! ఆ కథ తరువాత చెప్తాను. ఇప్పటికి నా సరదా తీర్చుకోనా ?”
“ మీ ఇష్టం వచ్చినట్లు తీర్చుకోండి ” అంటూ ఆమె తన బాహు వల్లరిని , అతని మెడ చుట్టూ వేసి, అతని తలని తన గుండేల కేసి అదుముకొంది.
స్త్రీ ఎద పోంగుల మీద తలపెట్టిన పురుషుని పౌరుషం రెచ్చిపోకుండా ఎలా ఉంటుంది !!
అతను రెచ్చిపోయాడు, ఆమె అతని కదలికలకి అనుగుణంగా స్పందిస్తూ, క్రొంగొత్త మరులు రుచు చూసింది. మరి కాసేపటికి అతని బాహు బంధం నుండి విడివడి, బాత్’రూంకి వెళ్లి వచ్చింది. “ నాకు మళ్లీ అలసి పోవాలని
ఉందండీ ! ” అంటూ అతని ఎద మీద తల వాల్చింది !
పురుషుని వక్షస్థలం మీద తల వాల్చిన స్త్రీత్వానికి సిగ్గెందుకు ఉంటుంది !
ఆమె తన చీర కుచ్చెళ్లు జార విడిచింది. అతడామె కంఛుకాన్ని విప్పి వేసాడు !
***********************

Comments
Post a Comment