Skip to main content

చిలక రథంలో సరదా షికారు --౬

    బహుళ  పాడ్యమి  రోజు.

    హేమావతి ఆలస్యంగా నిద్ర లేచింది. ఆమె శరీర మంతా నొప్పులు, పాలిండ్లయితే- ముట్టుకొంటే చాలు నొప్పి  పెడుతున్నాయి, అయినా అది తీయని బాధ అనిపించింది.శరీరాన్నికర్పూర తైలంతో మర్దన చేసుకొని, స్నానం  చేసాక  హాయిగా అనిపించింది. కురులకు సాంబ్రాణి పొగ పెడుతూ ఆలోచించింది. రాత్రి  సోమదేవునికి ఎలా స్వాగతం చెప్పాలా! అని.ముందు రోజు రాత్రి  జరిగినదంతా తలచి,తలచి మధురోహలతో మురిసిపోతూ,ఆ రోజు రాత్రికి రూపకల్పన చేసింది.

    తండ్రి ననుకదేవునితో, సరోవర  విహారానికని  చెప్పి, ఒక  గూటి పడవ తెప్పించింది. తన అలంకార సామగ్రిని.   ఆభరణాలని రహస్యంగా ఆ పడవలో చేర్చింది. పడవగూటిపై లేలేత కొబ్బరిమట్టలను పరచింది.లోపల మెత్తని పట్టు పరుపు దిండ్లు అమర్చింది.వాటిని మల్లెలతో మరుగు పరిచింది. సుమహారాలతో ముఖద్వారాన్ని అలంకరించింది.

    రాత్రి మొదటి—ఝాముకే పడవని చేరి, తనని తాను అలంకరించుకొంది. సోమదేవుని ప్రశంసలు పొందిన తన  శరీర భాగాలకు,ముఖ్యంగా పాలిండ్లపై చూచుకాలకు బంగారు తొడుగులు తొడిగింది. నాభిలో వజ్రం పొదిగింది. చేతులకి  గాజులు పాదాలకు స్వర్ణమంజీరాలు తొడిగింది.చెవులకు గుత్తులు గుత్తులుగా వ్రేలాడే కర్ణాభరణాలు తగిల్చింది. నాసికను వజ్రపు బేసరితో సొగసులీనేలా చేసింది. పొడవైన అలివేణిని జడబంధంలో బిగించి, సువర్ణ నాగర పుష్పాలతో  అలంకరించింది. పట్టు పీతాంబరాలు ధరించింది అలంకరణ  పూర్తి అయి, వాసక సజ్జిక వలె తన మనోహరుని కోసం ఎదురు తెన్నులు చూడసాగింది.

    చంద్రుడు కూడ,తన హేమ సుందరిని, సంధించేందుకు త్వరపడి అరుదెంచాడు. ఆమె స్వాగత  సత్కారాలకు  ముగ్ధుడయ్యాడు తమకంతో ఆలింగనం చేసుకొన్నాడు.

    ఆమె మెడలోని మరకతమాలలను గ్రుచ్చుకొంటున్నాయని తీసేసాడు.చెవి తమ్మలను ముద్దాడాలని మాణిక్య కర్ణాభరణాలను తొలగించాడు.నాలికతో తుడిచేందుకు అడ్డమని వజ్రపుబేసరిని ప్రక్కన పెట్టేసాడు. చనుమొనలు చూడాలని ఉరోజ బంధాన్ని,వాటికి  తొడిగిన  బంగారుతొడుగులని తన పెదాలతో ఏరి పడేసాడు.నాభిలో పొదిగిన వజ్రాన్ని, మునివేళ్లతో చక్కిలిగింతలు పెట్టి జారిపోయాలే చేసాడు. చీనాంబర బంధం మునిపళ్లతో విప్పాడు. కౌగిలికి  ప్రతిబంధకమని గాజులు తీసేసాడు. పెనవేసుకోడానికి అడ్డుపడుతున్నాయని పాదాలకున్నసర్ణమంజీరాలని  జార్చేసాడు.మెత్తని మల్లెలతో నిండిన పాన్పుపై  ఆమెను పరుండ బెట్టాడు. చంద్రుని యదేచ్ఛగా తన హృదయాంతర  సీమల లోనికి ఆహ్వానించి ఆనందించింది. విశాల శీతల సరోవరంలోని గూటిపడవ, ఆ ప్రేమిక మిధునాన్ని తనలో  దాచుకొని,నీటి అలలపైన ఊయలలూగించింది.తీర ప్రాంతాలలోని తరులు తల పంకించి ప్రణయగీతాలు పాడాయి.

    బహళ చతుర్దశి!!

    నిజాన్నిబట్ట బయలు చేసాడు చంద్రుడు.

    హేమావతి తన రెండు చేతులతో,ముఖాన్నిదాచుకొని  రోదించింది.వంచనతో నా కన్యాత్వాన్నిదోచుకొన్నావు. జారుడవైనా చోరుడవైనా దేవుడివి కాబట్టి, నిన్నేదోషాలు అంటవు.కాని నా పరిస్థితి ఏమిటి?” అంటూ.

    “సుందరీ !  దుఃఖించకు. నిన్నుగాంధర్వ విధిని  పరిణయమాడి, పక్షం రోజులు నీతో  కాపురం చేసినట్లు,నీ  తల్లి తండ్రుల ఎదుట, గ్రామ పెద్దల ఎదుట నేను సాక్ష్యం చెప్తాను.నీ గర్భవాసాన నాతో  సరితూగగల బల పరాక్రమ  తేజస్వి అయిన పుత్రుడు జన్మిస్తాడు. వానిని నిర్భీతితో  ప్రసవించు, పెంచు.నా పుత్రుడు మరో కర్ణుడులా  కాకుండా,  నేను వానిని అన్ని వేళలా రక్షణ నిచ్చి,ఒక  విశాల సామ్రాజ్యానికి రాజుని చేస్తాను.వాడు మహారాజు అయ్యాక, మనకి  మన పాప కర్మలకి...నిష్కృతి కలిగిస్తాడు.” అని ఓదార్చాడు చంద్రుడు. అంతేకాదు తన మాటని  గ్రామస్థులందరి దగ్గరా  ఋజువు చేసేందుకు ఆ ప్రాంత వాసులు ఎన్నడూ చూసి ఎరుగని ఒక వృక్షాన్ని ఆ గ్రామానికి స్వాగత తోరణాలులా
 కనిపించే లాగ రహదారికి రెండు ప్రక్కలా సృష్టించాడు.అలా ఏర్పడినవే ఖర్జూర వృక్షాలు !!

    మహారాజు చంద్రవర్మ ఆ విశాల సరోవరానికి నలువైపులా, ఇరువది రెండు యజ్ఞకుండాలు నిర్మించి, ఏక కాలంలో యజ్ఞం చేయించి, జననీ జనకుల ఋణం తీర్చుకొన్నాడు.తరువాత అదే యజ్ఞవాటికలను, గర్భగృహాలుగా  మార్చి, ఎనుబది ఐదు దేవాలయ సముదాయానికి రూపకల్పన చేసాడు.అతను కొన్నిటిని కట్టించగా, అతని వారసులు  తక్కిన వాటిని కట్టించి పూర్తి చేసారు. అలా ఏర్పడినవే, ఖజురహో  దేవాలయాలు.

    మాతంగేశ్వర, ఖండరీయ మహాదేవ, విశ్వనాధ, లక్ష్మణ, జగదంబ, వారాహ, చిత్రగుప్త, మందిరాలు  వాటిలో కొన్ని,కొన్నిసంధార శైలిలోను,మరికొన్నినిరంధార శైలిలోను నిర్మింపబడ్డాయి.

    శృంగారానికి కొత్త నిర్వచనాన్ని, అర్థాన్నీ, పరమార్థాన్నీ, పవిత్రతనీ చాటి చెప్పుతూ, విశ్వమానవాళిని ఆకర్షిస్తూ నేటికీ నిలిచి ఉన్నాయి.

    శృంగార శశాంక కేళికి, అపురూప అద్భుత ప్రణయానికి సాక్ష్యం చెప్పిన ఖర్జూర వృక్షాలు , వాటి ఫలాలు, నేటికీ సేవించిన వారికి,స్ఫూర్తినిస్తూ ,సేద తీర్చుతూ, ప్రేమకి నూతన భాష్యాలని చెప్తూ అలరిస్తూనే ఉన్నాయి.

    కదళీ ఫలం ప్రేమకానుక అయితే ---

    ఖర్జూర ఫలం ప్రేమ కావ్యం ! శిలలపై చెక్కిన సజీవ వాత్స్యాయన సూత్రాలకి ప్రత్యక్ష కథనం !!

                *********************

    ఆంధ్ర దేశంలో అయిదు శైవ క్షేత్రాలు, పంచారామాలుగా  ప్రసిధ్ధిని పొందాయి.

    సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించి నప్పుడు ఆ రాక్షసుని గొంతులోని , శివలింగం అయిదు ముక్కలై, అయిదు ప్రదేశాలలో పడిందని, అవే పంచారామాలని పేరు పొందాయి.

    వాటిలో క్షీరారామము, సోమారామము, గురించి తెలుసుకొన్నాం ! దక్ష ప్రజాపతి చేత స్థాపించబడి, ఆ దక్ష ప్రజాపతి ఎన్నెన్నో యాగాలు ఛేసొ పునీతమొనర్చిన ప్రదేశమే దక్షారామం ! కాలక్రమాన ద్రాక్షారామం అయింది ! ఇక్కడ స్వామి భీమేశ్వరునిగా ప్రసిధ్ధి చెంది దర్శన మిస్తాడు.

    నిగ్రహానుగ్రహ సమర్థుడైన సహజ కవి, వేముల వాడ భీమకవి ఆ ద్రాక్షారామ భీమేశ్వరుని పుత్రునిగా ప్రఖ్యాతి పొందాడు.

    ఆ సాయంత్రం భీమేశ్వర లింగానికి అభిషేకం చేయించిన పినాక పాణి బృందం , అతని రెండవ బావ మరిది అయిన ,‘భీమారావు’ గారి ఇంట్లో బస చేసారు.భీమవరంలో లాగే రాత్రి భోజనాలు ముగిసాక, జంటలు జంటలుగా విడిపోయారు ! మొత్తం ఏడు జోడీళు వాళ్లు ! పాలకొల్లు దగ్గర అరటి పాడు వాస్తవ్యులైన పినాక పాణీ మీనాక్షమ్మలు, భీమవరం లోని సారంగ పాణీ కాంతమ్మలు, సామర్ల కోట నివాసస్థులు చక్రపాణి లలితలు, అన్నదమ్ములు, తోటికోడళ్లు ! విశాఖపట్నం లోనే పద్మావతీ కుటుంబ రావులు, ద్రాక్షారామం లోని మాణిక్యాంబా, భీమారావులు అతని చెల్లెళ్లు, బావమరదుల వరస ! ఇక విశాఖ లోని సిధ్ధార్థ, శాంతిసేనలు, హైదరాబాదు లోని  సూర్యచరణ్- శ్రీలతలు అల్లుళ్లు కూతుర్లు ! ఉన ఒకే ఒక పిలవాడు శ్రీకర్ , శాంతిసేన కొడుకు.

    భీమారావు గారి పడక గది పందిరి మంచాలు, సూర్యచరణ్ శ్రీలత దంపతులకి కేటాయించ బడింది. ఆ గదికి ప్రక్కనున్న మరో గదిలో సిధ్ధార్థ, శాంతిసేన, శ్రీకర్లు సర్దుకొన్నారు.

    ద్రాక్షారామం లోని మామయ్య గారింట్లో, సరదా తీర్చుకోమన్న శ్రీలతకి, ఆ విషయం గుర్తు చేసాడు సూర్యచరణ్ ! మాట తప్పితే ,భీమేశ్వర స్వామిపై, ఒట్టే అని కూడా బెదరించి, ఆమెతో పబ్బం గడుపుకోవాలని, పందిరి మంచంపై అలవోకగా పడుకొని ఎదురు చూపులు చూడ సాగాడు!

    శ్రీలతకి పాపం తన తనులతని అలంకరించక తప్పలేదు ! ఆ పనిని ఆమె ఇష్టం తోనే చేసినా, భర్త బెదరింపుని నెపం చేసుకొని, నిస్సంకోచంగా అత్తయ్యని అడిగి,‘ కాసులపేరు , వడ్డాణం, పాపిటబిళ్ల’ తీసుకొంది !

    ఖజురహో కథానాయిక హేమావతి లాగ, నీలిరంగు చీర కట్టింది. పలాశ పుష్ప వర్ణమైన కంచుకాన్నితొడిగింది. అత్తయ్య ఇచ్చిన ఆభరణాలు కాక తన దగ్గరున్న వ్రేలాడే జుంకాలు, పాదాల మువ్వల పట్టీలు, ధరించింది. గిల్టువే అయనా ఆలయం దగ్గర కొన్న, చేతి వ్రేళ్ల నుండి ముంజేయి వరకు అలంకరించే అయిదు ఉంగరాలు, కంకణం కలగలసిన పతకాలని పెట్టుకొంది.అలా నఖ శిఖ పర్యంతం ముస్తాబు చేసుకొని, మొగుని మురిపెం తీర్చేందుకు ఆ గదిలో అడుగు పెట్టింది ! సూర్యచరణ్ ఆమె సింగారానికి ముచ్చట పడ్డాడు, “ అబ్బ ! ఖజురహో కథా నాయిక లాగ, సాక్షాత్కరించావన్న మాట !” అన్నాడు.

    శ్రీలత మారు మాట్లాడక , అతని అరచేతిలో, రెండు ఖర్జూర పళ్లు పెట్టింది.

    సూర్యచరణ్ , ‘ సంగతికి ఇష్ట సఖి ఇంగితాన్ని’ కనిపెట్టాడు.ఆ తరువాత ఆ మంచం శృంగార శశాంకమే అయింది !

            ************************

    ప్రక్క గదిలో కూడ అదే దృశ్యం !

    కొడుకు శ్రీకర్ని ఎడంగా మరొక మంచం మీద పరుండబెట్టి, మెడనుండి కాళ్లవరకు పీపాలాగ ఉండే నైటీని వేసుకొని కనిపించింది శాంతిసేన !

    సిధ్ధార్థ నిరుత్సాహ పడ్డాడు. “ అదేమిటి శాంతీ ! మీ చెల్లి అలంకరణలో , సగమైనా చేసుకొంటావని అనుకొన్నాను” అంటూ ఖర్జూరం పేకెట్టు తీసాడు.

    “ ఏం చేయమంటారు ? నాకు ఉన్న నగలేవో ముక్కు చెవులకే ఉన్నాయి ! ఏవో అరా కొరా ఉన్నా వాటిని, తీర్థయాత్రలకి వెళ్తున్నమని చెప్పి, ‘ అరటిపాడు’ లోనే వదిలిపెట్టాను” అంది.

    “ నగల సంగతి సరే ! ఆ నైటీ విషయమేమిటి ?” అంటూ, కళ్లు నులుముకొని నమ్మలేనట్లు ఆమె వంకచూసాడు సిధ్ధార్థ. అందుకు కారణం ఆమె నైటీని జార విడిచింది ! నఖ శిఖ పర్యంతం కజురహో కథానాయికలా అలంకరణ చేసుకొన్న దర్శనం ఇచ్చింది !

    సిధ్ధార్థ ఉప్పొంగిపోతూ ఆమెని కౌగిలి లోనికి తీసుకొన్నాడు.

            *******************

    వసారా చివర తెర మరుగులో పినాకపాణి, మీనాక్షమ్మ చేతిలో రెండు ఖార్జూరాలు పెట్టాడు. “ నోట్లో వేసుకో, నడుం నొప్పి పోతుంది ! ” అంటూ.

    “ మీ చెయ్యి తగలనిదే నా నడుమునొప్పి ఏనాడైనా మందగించిందా ? కొత్తగా వచ్చిన ఈ ఖర్జూరాలు ఏం చేస్తాయేమిటి ?” అంది కొంటెగా మీనాక్షమ్మ.

    “ ఖర్జూరాలు ఏం చేస్తాయో, ఎలాంటి సత్తువనిస్తాయో తెలుసుకొందామా మరి !” అంటూ ఆమె నడుం మీద చెయ్యి వేసాడు పినాకపాణి.

            *********************

    మేడమీద మొదటి గదిలో , చక్రపాణి సరదా తీర్చేందుకు లలిత సన్నధ్ధురాలు అయింది.

    రెండవ గదిలో, కుటుంబరావు, పద్మావతిని అక్కు న చేర్చుకొన్నాడు..

    మూడవ గదిలో, సారంగ పాణి , కాంతమ్మతో దాంపత్య నోము నోచుకొనేందుకు , ఖర్జూర పళ్ల వాయనంతో , సరస శృంగార పూజ మొదలు పెట్టాడు.

    ఇకపోతే ఇంటి యజమాని అయిన భీమారావు, మాణిక్యాంబతో డాబా మీదకి  ఎక్కి, చల్లని ప్రశాంతమైన ప్రకృతిలో మమేకం అయ్యారు !

            *********************

    బస్సు మర్నాడు నాలుగవ మజిలీ అయిన సామర్ల కోటకి బయలు దేరింది.

    సామర్ల కోటకి కిలోమీటరు దూరంలోనే ఉంది , ‘కుమారారామ భీమేశ్వరాలయం’.ఈ లింగాన్ని కుమార స్వామి ప్రతిష్టించాడు. ఇది విశేషాలకెల్లా విశేషమైన లింగం ! అరవై అడుగుల ఎత్తు ఉంది ! అభిషేకం చేసే భక్తులు రెండో అంతస్తుకి ఎక్కక తప్పదు.

    ద్రాక్షారామం లోని భీమేశ్వర దేవాలయాన్నీ, కుమారారామం లోని భీమేశ్వర దేవాలయాన్నీ , చాళిక్య రాజు భీముడే కట్టించాడు ! రెండింటి నిర్మాణ శైలి ఒక్కలాగే ఉంటుంది !

    బస్సులో సరదా సంభాషణ మొదలయింది.

    “అల్లుడుగారూ ! మీరు చెప్పిన ఖర్జూరాల కథ అద్భుతంగా ఉంది ! మన యాత్రలో ఈ మజిలీని కూడ రసవత్తరంగా చేయండి”అన్నాడు పినాక పాణి.

    “మరిదిగారూ ! అరటి పళ్లు,ఖర్జూరాల కథలు బాగున్నాయి ! ఇక కొబ్బరి కాయలు గురించి కూడా ఏమైనా చెప్పగలరా?”చిక్కుప్రశ్న వేసింది శాంతి.

    “కొబ్బరి కాయకి కథేముంటుంది శాంతీ ! అనవసరంగా మా తమ్ముడి గారిని ఇరుకున పెడుతున్నావు”కవ్వించాడు సిధ్ధార్థ.

    సూర్యచరణ్;కి  శ్రోతల కోరిక పైన కథ చెప్పే అవసరం కలిగింది. అయినా అతను ఖంగు తినలేదు. “కొబ్బరి కాయకి సంస్కృతం పేరు చెప్పండి”అన్నాడు.

    “ నారికేళం !” అని జవాబిచ్చాడు చక్రపాణి.

    “ నారికేళం అనే పేరు దానికి ఎలా వచ్చిందొ తెలుసా ?”

    “ ఎలా వచ్చింది ?” నాలుగయిదు స్వరాలు ఒకేసారి అడిగాయి.

    “ నారీకేళి నుండి ఫలించిన ఫలం కాబట్టి !” అని, అందరూ విస్తుపోయి చూస్తూ ఉండగా కథ విప్పాడు సూర్యచరణ్.

    ***************************************
   

Comments

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ