Skip to main content

చిలక రథంలో సరదా షికారు-- ౮ (ఆఖరి భాగం)

           కుమారారామ క్షేత్రంలో శ్రీ భీమేశ్వర స్వామి వారి అభిషేకం చేసిన తరువాత, చక్రపాణి గారి ఇంటికి చేరారు వారందరూ. చక్రపాణి రైల్వేలో ‘లోకో పైలట్’గా పని చేస్తున్నాడు. అతను ఉండేది రెండు గదులు రైల్వే క్వార్టర్ ! ఒక గదిని కొత్త అల్లుడు గారికి కేటాయంచి, తక్కిన వారందరూ మరో గదిలో గుంపుగా విశ్రమించారు. శ్రీలత ఆ ఏర్పాటుకి వ్యతిరేకించినా వాళ్లెవరూ ఒప్పుకోలేదు ! ఫలితం లేక మరచెంబుతో నీళ్లు తీసుకొని, గదిలోకి అడుగు పెట్టింది ఆమె !

    మెత్తగా కౌగిలి లోనికి ఇమిడిన ఆమెని, పొదివి పట్టుకొంటూ, అడిగాడు సూర్యచరణ్. “ సిరీ ! మీ చక్రి బాబాయి ఇంట్లో అన్నీ ‘ ఫెంగ్ షూయి’ సామాన్లు, ఎక్కడ పెడితే అక్కడ కన్పిస్తున్నాయ్ ! ఎందుకలా ?” అని అడిగాడు.

    “ ఫెంగ్ షూయి సామాన్లా !?”

    “ అవును, ఇదిగీ చూడు,” అంటూ ఆ గదిలో ఉన్న పరికరాలు చూపించాడు. ‘నోట్లో నాణాన్ని పట్టుకొన్న మూడు కాళ్ల కప్ప, ఒకదాని మీద ఒకటి ఎక్కి కూర్చొన్న తాబేలు, లాఫింగ బుధ్ధా,’ ఇంకా కొన్ని పిరమిడ్లు కనిపించేయి.

    “ ఓహో ! అవా ! ఈ ఇంటికి వాస్తు దోషం ఉందని లలిత పిన్నికి అనుమానం ! అందుకే అవన్నీ ప్రతీ గదిలోనూ అమర్చింది.

    “ వాస్తు దోషాలా ! అంటే ఎలాంటి సమస్యలున్నాయి ఇంట్లో ?”

    “ చక్రి బాబాయి సంపాదనకి ఏ లోటూ లేదు. బాబాయి ఇంజను డ్రైవరు కాబట్టి, ఎప్పుడూ లైన్ల మీదే ఉంటాడు. ఎక్కువగా, ‘నైట్’డ్యూటీలు’ చేస్తూ ఉంటాడు. పగలంతా ఇంట్లో పడుకొనే ఉంటాడు. పండుగలు, పబ్బాలు లాంటి వాటికే సెలవులు ఉండవు. ఇక పిన్ని పగలంతా పడుకొనే బాబాయి గదికి గడియ పెట్టి, ఇరుగు పొరుగు ఇళ్లల్లో భజనలకి అనీ, పారాయణకనీ వెళ్తూ ఉంటుంది. పోతే ఒక్కడే కొడుకు , వాడు కాకినాడ లోని, ఒక ‘కోచింగ్ కాలేజీలో’ ఇంటర్ చదువు తున్నాడు.నెలకి ఒకసారి మాత్రమే వస్తాడు. ఇక సమస్యలు ఆరోగ్య పరమైనవి ! పిన్నికి కీళ్లవాతం, బాబాయికి అజీర్తి , పైల్సు ! ఇదంతా వాస్తుదోషం వల్లనేనని పిన్ని నమ్మకం !” అంది శ్రీలత.

    సూర్యచరణ్ ఇంకేమీ అడగక, సంభాషణ రూటుని శృంగారం మదకి మరలించాడు. “ పడక గదిలో ఈ తాబేలు బొమ్మ చూశావా ? ఇది దీర్ఘాయుర్దాయానికి, పరిమిత సంతానానికీ , సుఖ దాంపత్యానికీ చిహ్నం !”

    శ్రీలత ‘ఫెంగ్ షూయీ’ పరికరాల మీద సంభాషణని ఆసక్తితో వింది ! సూర్య్చరణ్ వంక ఆరాధనతో చూసింది.

                *****************************

    మర్నాడు తెల్లవారే స్టేషన్’కి బయలుదేరి వెళ్లాడు సూర్యచరణ్.

    “ అదేంటమ్మా ! అల్లుడుగారు అలా వెళ్లారు ? దేనికి వెళ్తున్నట్లు ?”అడిగాడు పినాక పాణి.

    “ ఆయనకి నిన్న రాత్రి ఒక మెసేజి వచ్చింది నాన్నగారూ ! రేపే ఆఫీసుకి వెళ్లాలట ! ఏదో ప్రోజెక్టు పని మొదలయిందట !”

    “ అయితే ఈ రోజు ‘అమరావతిలో’ ‘ అమరారామం’ యాత్ర లేనట్లేనా ?”

    “యాత్ర ముగించక పోతే ఎలా నాన్నగారూ ! మీరందరూ అతని కోసం ఎందుకు ఉండి పోవాలి ? నేనూ, ఆయనా ఈ రోజు రాత్రి బండికి హైదరాబాదుకి వెళ్లిపోతాం, మా పాత టికెట్లు కేన్సిల్ చేసి, క్రొత్త టికెట్లు కోసం అతను స్టేషన్’కి వెళ్లారు.” అంది శ్రీలత.

    “ అదేంటమ్మా ఇలా చేస్తున్నారు, యాత్ర మధ్యలో ఆపేస్తే ఎలా ?”

    “ నేనేం చేయగలను నాన్నగారూ ! ‘సూదిలో దారం బొంతకి అలంకారం’ అన్నట్లు, అతనితో నేను వెళ్లక తప్పదు కదా ? ఈ ఇల్లు నాకేమీ కొత్త కాదు గదా ! అతని కోసం ఇబ్బంది పడకండి ! మీరందరూ యాత్రకి బయలుదేరి వెళ్లండి. నేను అతనికి కమ్మగా వండి, మధ్యాహ్నం భోజనం పెడతాను, తాంబూలం కూడా ఇస్తాను. రాత్రి బండి లోకి ‘ పూరీ, కూరా’ చేసి పట్టుకొంటాణు. సామర్ల కోట నుండి వెళ్లిపోవాలని ముందుగా అనుకొన్నదే కదా ! కాకపోతే ఒక్క రోజు ముందు , అంతే !”

    శ్రీలత మాటలకి ఎవరూ జవాబివ్వ లేదు.

    చివరికి చక్రపాణి అన్నాడు, “నీకు ఈ ఇల్లు పరాయిది కాకపోయినా, అల్లుడు గారు లేకుంటే, యాత్ర సరదాగా ఉండదని అనిపిస్తోందమ్మా !” అన్నాడు.

    “ అతని ఆ ఏర్పాటు కూడా చేసే వెళ్లారు బాబాయి ! నిన్న రాత్రంతా కూర్చొని, ఏవేవో మాటలు,‘ టేపు రికార్డర్లో’  రికార్డు చేసారు. బస్సు ప్రయాణంలో ఆ టేపు వినమనీ, తనకి మారుగా ఆ ‘టేపే’ కబుర్లు చెప్తుందని, నా చేతికి ఇచ్చి వెళ్లారు. ఇదుగో ఉంచండి !” అంటూ ఒక టేపు రికార్డరు అతని చేతిలో పెట్టింది శ్రీలత.

                ******************************

    “ అత్తయ్యా, మామాయ్యలకీ : పిన్నీ, బాబాయిలకీ : అన్నాయ్యా వదినలకీ : సూర్యచరణ్  నమస్కారం ! ఈ రోజు అమరారామ యాత్రలో నేను మీతో లేక పోవడం , మీకు నిరుత్సాహం కలిగించి ఉంటుంది. కాని నేను  చెప్పాలని అనుకొన్న మాటలని , ముఖాముఖిగా చెప్పడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది ! అందుకే ఈ టేపుని రికార్డు  చేసుకొని ముందుగానే  పెట్టుకొన్నాను. ఈ రోజు కాకపోతే చివరి రోజన అయనా టేపు ద్వారానే కొన్న విషయాలు మీకు చెప్పాలని అనుకొంటున్నాను! ఇష్టముంటే వినండి, లేదా దీని స్టాప్ బటన్ నొక్కేయండి !

    “ చక్రపాణి మామయ్యగారికి రాత్రి డ్యూటీలు అధికం ! పగలు అతను రస్టు తీసుకోవలసందే ! అతనిని పడుకో బెట్టలనే ఉద్దశంతో, లలిత అత్తయ్యగారు గది తలుపులు గడియ పెట్టి, ఇంట్లో కూడ అందుబాటులో లేకుండా, కాలనీ లోకి, భజనలకనీ, పారాయణలకనీ వెళ్తూ ఉంటారు. మామయ్యగారికి సరిగా నిద్ర పట్టక పోయినా, మధ్యలో తెలివి వచ్చినా, మరో దారి లేక పడుకోవలసిందే ! రాత్రంతా మేలుకొని, గట్టి బల్ల అంటే, ఇంజన్లో డ్రైవింగు సీటుమీద కూర్చోవడం వల్ల, పగలు నిద్రలేమి వల్లనే, అతనికి అజీర్ణం, గేసు, ఇంకా పైల్సు లాంటి శారీరిక రుగ్మతలు వచ్చాయి. ఇక పగలంతా మఠం వేసుకొని భజనలు చేయడం వల్ల అత్తయ్యగరికి, కోళ్లనొప్పులు వచ్చాయి ! అంతే కాని వాస్తు దోషాల వల్ల కాదు ! ఒక వేళ అలా అనుకొన్నా, బంధించిన ఇంట్లో  ‘జీవశక్తి’ ప్రసారం జరగదు గనుకు,‘ ఫెంగ్ షూయి’ సామాన్లు ఆ దోష నివారణని చెయ్యలేవు.

    ఇవన్నీ తొలగి పోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది ! ఆ ఉపాయం మీకు ఎబ్బెట్టుగా అనిపించ వచ్చు. విషయం ఏమిటంటే పగలునే రాత్రిగా మలచుకోవాలి ! పగటి పూట శృంగారం తప్పనే అభిప్రాయాన్ని మనసునుండి తొలగించాలి ! ఒక గంట సేపు భర్యతో భర్త, భర్తతో భార్య ఏకాంతంగా శయనిస్తే, రక్తంలో, ‘ఎండ్రినాల్’ శాతం పెరిగి కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది ! శారీరిక రుగ్మతలు క్రమంగా దూరమవుతాయి !

    భజనలు, పారాయణలు రాత్రి పూట ఉండవు కదా, నాకెలా ఊసుపోతుంది , అని అత్తయ్యగారు అడగ వచ్చు. ప్రతీ రాత్రీ గంట సేపు నియమంగా, మంచి సాహిత్య గ్రంధాలు చదివితే, మనసుకి ఉల్లాసంగా ఉంటుంది ! ఊసుపోక పోవడమనేది సమస్యగా అనిపించదు !

    కాంతం అత్తయ్యగారు, సారంగ పాణి మామయ్యగారు విషయంలోకూడ ఇదే సూత్రం వర్తిస్తుంది. ! సారంగ పాణి మామయ్యగారు తరచు కేంపులకి వెళ్లడమే, అత్తయ్యగారి నోముల పిచ్చికి కారణం ! భర్తతో సరదాగా గడిపే ఒక గంట, అతని జీవితంలో ఇరవై నాలుగు గంటలు పెంచుతుందని తెలుసుకొంటే, ఇక సౌభాగ్య వ్రతాలు చేయవలసిన అవసరం ఏముంది ?!

    పద్మావతి పిన్ని , కుటుంబరావు బాబాయిల సమస్య కూడా అలాంటిదే ! ఆర్థిక అవసరాల కోసం మొదలుపెట్టిన ,‘ చిన్న పిల్లల క్రష్’  ఇప్పుడు వాళ్ల మెడకు చుట్టుకొంది ! తెల్లవారి నుంచి రాత్రి పది వరకు ఇంట్లో పిల్లల హడావుడితో, వారిద్దరి మధ్య  ఏకాంతం ఎక్కడుంది ? ఆలోచించి చూస్తే నేను చెప్పేది, వాళ్లకి అర్థం అవుతుంది ! కొత్త పిల్లల్ని చేర్చుకోకండి. క్రష్ సమయాన్ని కుదించండి, కాస్త సమయం సరదాగా గడపండి !!

    మాణిక్యాంబ పిన్నికి రాత్రుళ్లు కలలలో పాములు కనబడతాయట ! ‘కాలసర్ప దోషం’ అని పండితులు చెప్పారట ! ప్రతీ ఏటా,‘ శ్రీ కాలహస్తి;లోను, వారానికో సారి ద్రాక్షారామం లోని పూజలు చేయిస్తూనే ఉంటారని విన్నాను. కలల్లో ‘పాములు’ కనబడడం తృప్తిలేని దాంపత్య జీవితానికి కారణమని తెలుసుకోండి ! శృంగారాన్ని మరింత రసవంతంగా చెయ్యగల, అరటి పళ్లు, ఖర్జూరాలు, కుంకుమ పువ్వు, అగరు వత్తులు, మల్లెలు, కనకాంబరాలు లాంటి ఉత్ప్రేరకాలని వాడండి. ఇన్ని రోజులుగా చేస్తున్న పూజా ఫలం తప్పక కలుగుతుంది !!

    దేవునికి ఎంతో ప్రీతికరమయిన నైవేద్యం ,‘ త్రిమధురం’ ! అంటే, ‘ అరటి పండు, కొబ్బరి, బెల్లం’ ! మొదటి రెండింటి కథలూ మీరు విన్నారు. ఇక బెల్లం విషయం తెలుసుకోవడానికి ఏముంది ! బెల్లం చెరకు రసంతో చేస్తారు, ఆ చెరుకు గడే ‘మన్మథుని’  ధనస్సు అన్న సంగతి మీకు వేరే చెప్పాలా !!

    పూజకి ఎంతో పవిత్రంగా భావించే ‘ తులసి ఆకులు’ తెలియని దెవరికి ? ఆ తులసీ దళాలు ఆడవాళ్లు త్రుంచడానికి పనికి రారట ! దాన్లో రహస్యం ఏమిటో తెలుసా ?  తులసి విత్తనాలు బుగ్గలో పెట్టుకొని,నములుతూ రతి కార్యంలో పాల్గొంటే , అది ‘వయాగ్రాలాగ’ పనిచేస్తుంది !! అది మగవారికి మాత్రమే మందు కాబట్టి ఆడవాళ్లు ,దాని జోలికి పోకుండా అలా నిషేదాఙ్ఞ పెట్టారు !  

    ఇలా దేవాలయాలు, అక్కడ జరిగే ఏకాంత పవళింపు సేవలు , వాటి కుడ్యాల మీద శిల్పాలు, నివేదన చేసే ద్రవ్యాలు, అన్నీ ఈ విషయాలనే చెప్పక చెప్తున్నాయి ! వాటిన ఆధ్యాత్మిక రహస్యాలుగా కాకుండా, యతాతథంగా చూసి తెలుసుకోండి !!

    అయితే ఇక్కడ, మరొక్క విషయం గమనించండి ! మీరు వెళ్తున్న అమరారామ లింగం, రోజు రోజుకీ పెరిగి పోతూ ఉండడంతో , కట్టిన ఆలయం చాలదని భయపడి లింగం నడనెత్తిన ఒక ‘ ఇనపమేకు’ దిగగొట్టారట ! ఇప్పటికీ అక్కడ పగులు, రక్తం మరకలు కనపిస్తాయట ! అంటే ఏమిటి అర్థం !? ‘ దైవత్వం’ కూడా హద్దులు మీరి పెరుగుతే మంచిది కాదు అనేగా ! అలాగే శృంగారం కూడా, మితిమీరితే మంచిది కాదు. ధర్మబధ్ధమైన దాంపత్య జీవితం మాత్రమే సరసమైన శృంగారానికి ప్రతీక అవుతుంది ! ఆ విషయమే దూర్వాస మహర్షి తెలుసుకొని మనకి, ‘అరటి పండుని’ ప్రసాదించాడు ! నేను చెప్పాలని అనుకొన్నదీ ఇదే !\

    టేపు ఆగిపోయింది.

            *********************

    ``డ్రైవరు గారూ ! బస్సు ఆపండి !” అన్నాడు పినాక పాణి. బస్సు రోడ్డుకి ఒక వారగా ఆగింది.

    “ తమ్ముడూ ! సారంగా ! చక్రీ ! బావలూ అందరూ అల్లుడి గారి మాటలు విన్నారు కదా ! అలాంటప్పుడు మనం అమరావతికి ఎందుకు వెళ్తున్నట్లు ?”

    “ నిజమే అన్నయ్యా ! అల్లుడిగారిని దగ్గర ఉండి సాగనంపుదాం, ఏమంటారు ?”

    “ అల్లుడి గారిని ,మా ఇంట్లో ఒంటరిగా వదిలి రావడం నాకు మొదటినుంచీ గిల్టీగా ఉంది. ”

    “అందరి అభిప్రాయమూ అదే అయితే , బండి రూటుమార్చమని డ్రైవరు గారికి చెప్దామా ?”’

    అందరూ సరేనని తల పంకించారు.

    “ బాబుగారూ ! ” ఈ సారి డ్రైవరు గొంతు వినబడింది. “ అల్లుడుగారు చెప్పిన కథలు నేనూ , నా హెల్పరూ ఇద్దరం కూడా విన్నాం. దారిలో ఏదైనా ‘గిఫ్టు’ కొని అతనికి సర్’ప్రైజ్’ ఇవ్వడం మంచిది” అన్నాడు డ్రైవరు.

                *******************************

    సామర్ల కోట స్టేషన్లో , బండి రావలసిన ఫ్లాట్’ఫారం’ మీదకి వెళ్లిన , శ్రీలత సూర్యచరణ్లు, అక్కడ తమ కోసం నిరీక్షిస్తూ నిల్చొన్న కుటుంబ సభ్యులతో పాటు, డ్రైవరునీ, హెల్పరునీ కూడా చూసి ఖంగు తిన్నారు.

    అల్లుడుగారూ ! మీ మాటల ప్రభావం వల్ల మేము, మధ్యనుండే మరలి వచ్చాం ! అంతే కాదు, మీ కోసం ఒక సర్’ప్రైజ్’ కూడ తెచ్చాం !” అంటూ ,అందరి తరఫున ఒక పేకెట్’ని  సూర్యచరణ్ చేతిలో పెట్టారుపినాక పాణిగారు.

    శ్రీలత ఆతృతని ఆపుకోలేక పేకెట్ విప్పింది.

    అది ఒక కళాఖండం ! కొయ్యతో చేసినది, ‘పెద్ద చిలక, దాని వెనక ఒక రథం. అది లాగుతున్నట్లుగా చెక్కబడింది. ఆ రథంలో , చెరకు విల్లు పట్టుకొన్న ,‘ మన్మథుడు’ , అతని భుజం మీద చేయ వేసి, నిల్చొన్న , ‘రతి’ బొమ్మలు మలచి ఉన్నాయి.

    బహుమతిని అందుకొన్న దంపతులకీ, ఇచ్చిన దంపతులకీ మధ్య ‘ఆహ్లాదం’ పొంగి పొరలింది !!

              
                **********************************
                    ప్రస్తుత మజిలో అయిపోయింది
                ********************************













Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద