Skip to main content

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--10)



(నిన్నటి టపాలో జరిగిన కథ==== మొసలు కొలను త్రవ్వకాలలో లిగ్నైటు, బాల్’క్లేలే కాక ఒక వినాయక విగ్రహం కూడా దొరుకుతుంది. ఆ సంగతి మురుగన్తో ,ఆచారి చెప్పుతూ ఉండగా దానయ్య విని, ఆ విగ్రహాన్ని తానే కొంటానని అంటాడు. దానికి ఆచారి మండిపడి ఆ బొమ్మ సామాన్యమైనది కాదని, ‘ప్రోలయ వేమారెడ్డి ’ కాలం నాటిదని అంటాడు. దానిని కొనడం నీ లాంటి వాళ్ల కాదని అంటాడు=== ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం--10

    ఆచారి ,మురుగన్తో  “ నువ్వు  ఊరుకో అప్పా ! గొడవ చెయ్యకు, --”  అని వారిస్తూ ఉండగా, దానయ్య కల్పించుకొంటాడు, ఆచారి గారూ ! పోనీ పారిటీని సూపిస్తాను, కమీషనిప్పించండి” అంటాడు..

    “ నువ్వేం చూపిస్తావు పార్టీని ! దీన్ని కొన గలిగిన  వాళ్లు, మన దేశస్థులు కారు.తెలుసా ? దీని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. అంటాడు  ఆచారి.

    ఆచారి ఆ మాటలు అంటూ ఉండగానే, దానయ్య భావుకత్వంతో , టేబుల్ దగ్గరకు వెళ్లి, ఆ బొమ్మని ముగ్ఢుడై చూస్తూ నిలబడి, భావుకత్వంతో అంటాడు.   “ అయన్నీ  మీరే  సూసుకోండి  అయితే,  నా వాటా  నాకు ఇచ్చేయండి. మా  తరానికి  తొమ్మిది తరాల ముందు మడిసి, ‘ ప్రోలయ్య వోరి’ కొలువులో శిరస్తా దారుగా పని చేసేవోడండి. ఇలాంటి  బొమ్మలిక్కడ దొరుకుతాయని  నాకేనాటి నుండో  అనుమానవే నండి.  ” అంటూ బొమ్మని చేతిలోకి తీసుకొని, మైమరిచి, చూస్తూ ఉండి పోతాడు.

    ఆచారి , మురుగన్ని, సైగ చేసి, దగ్గరకి పిలుస్తాడు.

    “ మురుగప్పా ! నువ్వన్నట్లు, ఈ దానయ్య  కొయ్యలాంటి వాడే !  మేకుని మన లోనే దిగ గొట్టేలా గున్నాడు. ”

    మురుగన్ ఆచారి దగ్గరగా వచ్చి, “ అయితే  ఇప్పుడేం చెయ్యాలంటావప్పా ?” అని అడుగుతాడు.

    ఆచారి,“ నువ్వు చెప్పిందే, మురుగప్పా ! కొయ్యలో మనమే మేకుని  దిగ గొట్టేయాలి !” అంటూ, సెంత్రీ  పోస్టు లోని, ఒక లాఠీని  తీసి, మురుగన్ చేతికి ఇస్తాడు

    ఆచారి. మరొకటి తాను తీసుకొని, సైగ చెస్తాడు, ఇద్దరూ లాఠీలు పట్టుకొని, మెల్లమెల్లగా అడుగులు వేస్తూ, దానయ్య వెనక  వైపునుండి, అతనిని సమీపిస్తారు.

    దానయ్య  బొమ్మని పట్టుకొని, పచార్లు చేస్తూ, ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. “ పంచ లోహం బొమ్మ లాగుందండీ ఆచారి బాబూ ! మడిసి లోని ఆశలాగ తెగ మెరిసి పోతున్నదండి. ఆశ పోతు ఊహలాగ, గొప్ప సొగసుగున్నాదండి, కసాయోది గుండేలాగ  సాన గట్టిగున్నా దండి. దీన్ని అమ్మి సొమ్ము చేసుకోకండి ఆచారి బాబూ ! గవర్నమెంటోడీ కి ఇచ్చెయండి. ఆల్లు ఆ బొమ్మలు బయటికి  తీసి జనాలకి సూపించాలండి. అయి సెప్పే కమ్మని కథలు మనోల్లకి ఇంకా తెలియాలండి. ఆచారి బాబూ ! అదేనండి, నేనడిగిన .వాటా !” అంటూ, బొమ్మని టేబులు  మీద  పెట్టి  వెనకకి తిరుగుతాడు. ఆచారి మురుగన్నులు ఇద్దరూ, అతని తలపై  ప్రహారం  చెయ్య బోతారు, లాఠీలు రెండూ ఒకదాని మీద  ఒకటి  పడి, ఠకాలుమని చప్పుడు  అవుతాయి. దానయ్య, ‘ అమ్మా’ అంటూ క్రింద  పడతాడు. మురుగన్ లాఠీ క్రింద పడేసి, దగ్గరకి వెళ్లి శ్వాస చూస్తాడు. దానయ్య శ్వాస  నిలిచి పోయినట్లు గమనించి, గాభరాతో  , ఆచారితో  చెప్పాడు.

    “ ఆచారి బాబూ ! వీడు చచ్చి పోయాడండి.”

    “ పీడా పోయంది, చరిత్ర చెప్పడానికి వచ్చాడు , తొత్తు కొడుకు !”

    “ ఇప్పుడేం చేయాలి ?”

    `` వాడి చరిత్రని  సమాథి చెయ్యాలి,” అంటూ లాఠీని టేంటులోకి  విసిరేసాడు  ఆచారి.

    “ గొయ్యి తీసి పాతి పెడితే,  రేపు మనవాళ్లే  త్రవ్వి, బయటికి తీస్తారు.”

    “ నువ్వు  చెప్పినదీ  నిజమే ! కాల్చేద్దాం--- కాని  ఇప్పుడొద్దు.ట్రక్ వచ్చే వేళయింది ముందీ శవాన్ని ఖాళీ బస్తాలో  కుక్కి సీలు చేసేద్దాం.” అంటూ శవం దగ్గరకి వెళ్లాడు. మురుగన్ , ఆచారి కలిసి దానయ్య శవాన్ని, టెంటులోకి, తీసుకొని వెళ్లి, ఒక ఖాళీ బస్తాలో తోసి, సీలు చేసేస్తారు.

    అదే సమయంలో బైకు మీద సీనియర్ ఇంజనీయరు వాట్సన్ దొర సర్వే కేంపు దగ్గరకి వచ్చి, ఎవరూ లేక  పోవడం చూసి, “ మై గాడ్ ! కేంప్ ఈజ్ వేకెంట్ ! ఎనీ థింగ్ రాంగ్ ! ”అంటూ, జేబులోంచి  సిగరెట్టు  పెట్టె, లైటరు తీసి, సిగరెట్టు వెలిగిస్తూ, ఆ లైటు వెలుగులో ‘వినాయక విగ్రహాన్ని చూస్తాడు. “సో దిస్ ఐడల్ ఈజ్ హియర్ !” అంటూ కుర్చీలో కూర్చొని, ఆ బొమ్మని ఇటూ అటూ తిప్పి చూస్తూ  ఉండగా, ఖాళీ బస్తాలో , దానయ్య శవాన్ని సీలు చేసి, టెంటు బయటికి వచ్చిన  ఆచారి, మురుగన్లు, అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్న వాట్సన్ దొరనీ, అతని చేతిలో ఉన్న వినాయకుని బొమ్మనీ చూసి, స్థాణువులై నిలబడి పోతారు. వాట్సన్ కూడ వాళ్లని చూసి, మురుగన్ని ప్రశ్నించాడు.

    “ ఓ ! మురుగన్ ! ఎక్ క్కడికి  ఎల్ నావ్ ? వాట్ ఎబౌట్ యూ  ఆచారీ ! మీర్ రు ఇక్ కడ్ డకి ఎలా  వచినార్ ?”

    “ ట్రక్కు వచ్చే వేళయిందని దగ్గరుండి లోడింగు చేయించ డానికి  వచ్చాను సార్ ! మీరీ రాత్రి పూట  శ్రమ తీసుకొని, ఇంత దూరం ఎందుకు వచ్చారు సార్ ! ఆ పని చేయడానికి మేము లేమా ?”

    “ అవును సార్ ! లిగ్నైటు బస్తాలు ట్రక్కు ఎక్కడానికి మా కాళ్లూ, చేతులూ లేవా సార్ ! మీవి కూడా ఎందుకు సార్ ?” అన్నాడు మురుగన్.

    “ మురుగన్ ! ఆన్సర్ ది పాయింట్ !  నువ్ వు వర్ సగా మూడు విజిల్స్ ఎంద్ కు వెయ్ లేదు ?”

    “ నా చేతికి వాచీ లేదు సార్ ! వాచీ  ఎడ్వాన్సుకని, కాగితం పెట్టాను సార్ !”

    “ ఐసీ ! అపీల్ నా దగరకు రాలేదు. మిస్టర్ ఆచారీ ! ఏజ్ సూన్ ఏజ్ పాజిబుల్ మురుగన్ అపీలు నాక్ కు ఫార్వర్డ్  చెయ్ యన్ డి, వాచ్  ఈజ్ ఎసెన్షెయల్  ఫర్ హిం !”

    “ యస్ సార్ ! అలాగే పంపిస్తాను .”

    “ బైదిబై !మీర్ రు ఇక్ కడ్ డే ఉన్నర్ కద్ దా ! ఎందుక్ కు రిమైండ్ చేయ్ యలేద్ దు ?”

    “ నేను కూడ ఇప్పుడే వచ్చాను సార్ ! లోడింగు చేయించడానికి . బస్తాలు సరిగా ఉన్నాయో లేదో చూడడానికి మురుగన్ ని తీసుకొని లోపలికి ఇలా వెళ్లాను, మీరు అలా వచ్చారు.”

    “ ఐసీ ! బస్ తాల్ లు ఎన్ని ఉన్ నాయి ?”

    “ యాభై ఒకటి ఉన్నాయి సార్ ! ”

    “ వాట్ !  ఫిఫ్టీ  బేగ్సు  ఉండాల్ లి కద్ దా ?”

    “ వాడి ముఖం వాడికి లెక్కలు తెలియవు సార్ ! ఏభయి బస్తాలే ఉన్నాయి .”

    “ ఓహ్ ! మురుగన్ ! పూర్ ఇన్ మేథమేటిక్స్ !”

     దొర మాటలు మురుగన్కి కోపం తెప్పించాయి. ,వెంటనే ఆవేశంతో , అన్నాడు, “ సార్ ! లేద్సార్ ! యాభై ఒకటే ఉన్నాయి, కావాలంటే చూడండి సార్ !’ అని.

    ఆచారి మురుగన్ కి మాత్రమే  వినిపించేలాగ,   “ మురుగప్పా, కొంప ముంచావురా ”, అంటూ మురుగన్ కాలు తొక్కుతాడు. మురుగన్ అర్థం చేసుకొని, అలర్ట్ అవుతాడు. “ లేదు సార్ ! సారీ సార్ ! యాభయి బస్తాలే ఉన్నాయి. సార్ ! నేను మేథమేటిక్సు లోనే కాడు సార్ ,జీతంలో కూడా పూరే సార్ !”

    వాట్సన్ దొర సానుభూతితో  మురుగన్ వంక చూసి, అతని భుజం తట్టి, “ వర్క్ హార్డ్ మై బాయ్ ! దేవ్ వుడ్ డు మోర్  అండ్ మోర్ ఇస్ స్తాడ్ డు,” అని అన్నాడు.

    “ ఇచ్చేవాడే సార్ ! ”  అని దొర చేతిలోని వినాయక విగ్రహం వైపు చూపిస్తూ, “ కాని మీ చేతిలో పడి పోయాడు సార్ !  ఆఫీసరు చేతిలో పడ్డాక ఆ దేవుడు కూడా ఏమీ చేయలేడు సార్ !” అన్నాడు.

    “ యూ మీన్ దిస్ ఐడొల్ ! ఇత్ ఈజ్ వండర్ ఫుల్ ! ఆచారీ , ఈ బొమ్ మ  నాక్ కు మున్ దుగ్ గా ఎందుకు చూపించ్ చ లేద్ దు ?”

    “ సార్ ! అది అది, --” ఆచారి నీళ్లు నములుతాడు.

    “ లిగ్నైట్ డ్రిల్లింగులో దొర్ కింది, అవ్ నా ?”

    “ యస్ సార్ ! మీరు అప్పుడు బిజీగా ఉండడం చూసి, తరువాత చూపిద్దామని  జాగ్రత్త చేసాను. ”

    “ మీరు దచ్ చడ్ డం నేన్ ను చూసాన్ ను. కాన్ ని కేర్ చెయ్య లేద్ దు. డిన్నర్ టైములో , ఒన్ దానయ్య  వచ్చి, ఈ ఐడొల్ కి, హిస్టారికల్  ఇంపార్టెన్స్  ఉన్ దని, కింగ్  ప్రోలయ  వేమా కాల్ లంది కావచ్ చునని, చెప్ పాడ్ డు. అత్ని ఆర్గుమెంట్  ఈజ్ క్వైట్  కన్విన్సింగ్ ! అందుకన్ ని, రాత్ తైరన్ తా, హిస్టరీ బుక్సు రిఫర్ చేసి, ఆన్ ! ఈ ప్రాన్ తమ్  తర్టీన్ హండ్రెడ్  ఎ .డి లో, కింగ్ ‘ప్రోలయ నాయక ’  కింగు డమ్ లో ఉన్డేద్ ది ఇక్ కడ్ ద బొమ్మాలు చేసే ఆర్టిస్టులు  ఉన్ డే వార్ రు”.

    ఆచారి స్వరం దీనమవగా, ఆఖరి ప్రయత్నంగా, దొరని బ్రతిమాలుతాడు. “ నేను మీ పర్మిషన్తో ఈ విగ్రహాన్ని తీసుకు వెళ్లి, పూజిద్దామని అనుకొన్నాను సార్ ! అందుకని నాకు ఇచ్చేయండి సార్ !” అని.

    “ నొనోనో ! ఇది ఆర్కియలాజికల్ డిపార్టుమెంటు కి ఇచ్ చేయాలి. ఉయ్ మస్ట్ నాట్ కీప్ ఇట్ !”

    ఇంతలో ట్రక్ హారన్ వినిపిస్తుంది. ట్రక్ సర్వే కేంపు గేటు దగ్గరకి వచ్చి నిలబడుతుంది. నలుగురు కూలీలు, ట్రక్ లోంచి దిగి కేంపు లోనికి వస్తారు. దొరకి, ఆచారికి నమస్కారాలు చేస్తారు.

(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...