Skip to main content

మొసలి కొలను మ్యూజియం (హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక----19)



(నిన్నటి టపాలో జరిగిన కథ ---- అమరజీవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంకన్నని చూడడానికి దానయ్య వస్తాడు. అక్కడ కానిస్టేబిల్ టూ నాట్ త్రీ కాపలా ఉండడం చూసి, పిత్రు లోకం నుంచి వచ్చిన ఆత్మలా నటించి తూ నాట్ త్రీని మాటల్లో పెట్టి ,ఎంకన్న పరిస్థి తెలుసుకొంటాడు. కానిస్టేబిల్’కి తనమీద అనుమానం కలిగేసరికి పారిపోతాడు. టూ నాట్ త్రీ అతని చొక్కా  కాలర్ని గొడుగు హుక్’తో పట్టుకొంటాడు. దానయ్య చొక్కా విప్పుకొని పారిపోతాడు. ఇనస్పెక్టర్ జరిగినది తెలుసుకొని దానయ్యని పట్టుకోవడానికి ఆదేశాలు ఇస్తాడు. ఈ లోగా ఎంకన్న చనిపోయిన వార్త తెలుస్తుంది. అదే సమయానికి ‘ముకబీర్ మురుగన్’ వచ్చి ఇనస్పెక్టర్’కి నమస్కారం చేస్తాడు. --- ఇక చదవండి )

మొసలి కొలను మ్యూజియం ---19

“ ఎవరు  నువ్వు, నాతో  ఏం  పని ?”

“ నేను  ట్రెజర్స్ & అండ్  మైన్స్  రీసెర్చి  ఇనస్టిట్యూట్  సెంత్రీనండి, మీతో పని ఉండి వచ్చాను. స్టేషనుకి  వెళ్తే  మీరు  ఇక్కడ  ఉన్నట్లు  చెప్పారండి.”మురుగన్ మాటలకి చిరాకుపడ్డాడు గోపాల్రావు. “నాతో  ఏం  పని ? చెప్పేదేదో  త్వరగా  చెప్పు.”

“ చిత్తం సారూ ! ” అని తన చేతిలో ఉన్న సంచీలోంచి, ఒక ఆడియో కేసెట్ని తీసి, ,” ఇదుగోనండి, ఈ  కేసెట్ ని మీకు  ఇవ్వడానికే  వచ్చానండి.” అన్నాడు  మురుగన్.
ఇనస్పెక్టర్  ఆ కేసెట్ని  తీసుకోకుండానే  అడిగాడు,” ఏమిటది, ఎవరు  పంపించారు ?” అని.

“ నిన్న  ఏప్రిల్  పదమూడున  మొసలి  కొలను  మ్యూజియంలో  దొంగలు దూరారు  కదండి.”

“ అవును  అయితే ?”

“ ఆ దొంగతనం  అవటానికి  కొన్ని  క్షణాల  ముందు,  దాని  మున్షీ  కరీం ఖాన్  సాయిబు.  మా  కంపెనీ  గుమాస్తా  ఆచారి  బాబు  మాట్లాడుకొన్న  మాటలండీ  ఇవి, దీంట్లో  మా
  ఎంకన్న  రికార్డు  చేసాడండి.  వాళ్లు  మాట్లాడిన  మాటలని.”

“ ఇనస్పెక్టర్  ఆ  కేసెట్ని తీసుకొని, “ ఎంకన్న నీ కెలా తెలుసు, ?” అని  ఆడిగాడు.

“ మా ఊరి  వాడేనండి.”

“ దానయ్య.”

“ వాడు  కూడా  నండి. నాకు  కూడా  మామ  వరసేనండి !”

“ ఆ దానయ్య  ఇప్పుడెక్కడున్నాడు ?”

“ వాడెక్కడ  ఉంటాడో  వాడికే  తెలియదండి,  ఇప్పుడు  ఆస్పత్రిలో  ఉన్నాడనుకోండి,  మరో  క్షణానికి  స్టేషను  దగ్గర  ఉంటాడండి,  ఇంకో  క్షణానికి  ఊరు  దాటి  వెళ్తాడండి..”

“ ఇంకో  గడియకి  బొక్కలోకి  వెళ్తాడు.”

“ అదేంటి  సారూ ! బొక్కలోనా ! బొక్కలోనికి  వెళ్లడానికి  వాడు  ఎలకేంటండి ?”

“ ఎలక  కాదు, పాము  విష  సర్పం !”

“ అయ్య బాబోయ్!పామే !”నలుప్రక్కలా భయంగా  చూసి,“ఎక్కడండీ ?” అన్నాడు  మురుగన్.

“ పాము  అంటే  నిజంగా  పాము  కాదు,  ఆ దానయ్య  ఒక్  విష  సర్పం  లాంటివాడు. మీ  మొసలి  కొలనులో  మనిషి  రూపంలో  తిరుగుతున్న విష  సర్పం ! సొంత  చేతులతో  కూతురు  తాళిబొట్టు  త్రెంచి,  మ్యూజియంలోని  బొమ్మలెత్తుకు  పోయిన  హంతకుడు.” ఆవేశంతో  ఇనస్పెక్టరు  అన్న  మాటలకి,  మురుగన్  గాభరా  పడుతూ, “ మా  ఎంకన్న  పాము  కరిచి  పోయాడా   సారూ ?” అని  అడుగుతాడు.

“ అవును  పాము  కరిచే  పోయాడు, ఆ పాము  ఇంకెవరో  కాదు, పిల్లనిచ్చిన  మామ !”

“ నిజమే సారూ ! ఎంకన్నపాము కరిచే చనిపోయాడు,వాడిని కరిచిన పాము మా దానయ్య  కాదు  బాబూ ! ఆ  పాములు  మా  మొసలి  కొలనులో మనిషి  రూపంలో  తిరిగుతున్నాయి  బాబూ ! ఇదుగో  బాబూ,  ఈ  ఫొటో  చూడండి,” అని  సంచీలోంచి, చెయ్యిపెట్టి,  ఒక  ఫొటో  బయటికి  తీస్తాడు.  దానిని  ఇనస్పెక్టరుకి  చూపిస్తూ, “  ఇదుగో  సారూ !  ఈ  క్రిందనున్న  వాడు  దానయ్యండి,  నిచ్చెన  పట్టుకొని  దానయ్యని  భూమి  కేసి  అదుముతున్న వాడు  ఆచారండి ! మెడ దగ్గర  కూర్చొని, చేతులతో  ఆ దానయ్య  పీక  పట్టుకొన్న  వాడు  కరీం ఖాన్  అండి.  ఈ ఫొటో  కూడ  మా  ఎంకన్నే  తీసాడండి. ” అన్నాడు  మురుగన్.

“ మురుగన్ ! నివ్వు  ఇది  వరకు  పోలీసు  ముకబీరువని  నాకు  తెలుసు. నిజం  చెప్పు,  ఈ  ఫొటో  ఎంకన్న  ఎప్పుడు  తీసాడు,  అది  నీ  చేతికెలా  వచ్చింది ?  ఇందులో  ఉన్న  సీను  ఏదో  డ్రామా  సీనులాగుంది.  ఎక్కడ, ఎలా  జరిగింది, ఉన్నదున్నట్లు  టూకీగా  చెప్పు.”

“ చిత్తం , చెప్తానండి.  ఫొటోలో  ఉన్న  ఆచారి,  నిన్న  మ్యూజియంలోని  ఆంజనేయ స్వామి  విగ్రహానికి  నకలు  బొమ్మ  పట్టుకు  వచ్చి,, దానిని  లోపల  పెట్టి  అసలు  బొమ్మని  తెచ్చి  ఇమ్మని  కరీం  ఖాన్ని  అడిగాడండి.  దాని  కోసం  డబ్బులు కూడా  ఇచ్చాడండి.  వాళ్ల  మాటల్ని  ఎంకన్న  ఈ  కేసెట్టు లోకి  ఎక్కించాడండి.ఆ  మాటలు  మీరు  వింటే  అన్నీ  వివరంగా  తెల్సి  పోతాయండి. కావాలంటే  ఆ  ఫొటోలు  తీసిన  కెమేరా  కూడా  తెచ్చి  ఇస్తానండి. కెమేరాలో  ఫొటో  తీసిన  టైము, తేదీ  రికార్డు  అయి  ఉంటాయి  కదండి.”

“ సరే, ఈ  ఎవిడెన్సుని  నేను  తరువాత  వింటాను, ఆ డీల్  అయ్యాక,  ఏం  జరిగిందో  చెప్పు.”

“ రికార్డింగు  అయ్యాక  ఎంకన్న, దానయ్య కలిసి, కత్తులతో వాళ్లని  బెదరించి,  ఆ దొంగతనం  ఆపాలనే  అనుకొన్నారండి.”

“ ఊ ! ఇట్  ఈజ్  క్వైట్  ఇంటరెస్టింగ్ ! నువ్వు  ఇచ్చిన  సాక్ష్యాలు  నిజమే  అయిన  పక్షంలో, ఆచారి,కరీం ఖాన్ల  స్టేటుమెంటు  అబధ్ధమని  తెలుస్తోంది. వాళ్లని  కస్టడీ  లోకి  తీసుకొంటే, నిజం  తెలుస్తుంది.”

“ వద్దు  బాబయ్యా ! అలా  చేయకండి.”

“ ఏం ఎందుకని ?”

“ అలా  చేస్తే  అసలు  దొంగలు  పారిపోతారటండి,  అలాగని  మా  దానయ్య  మామ  అనే వాడండి. వీళ్లని  బొక్కలో  తోయించాలంటే,  మీతో  చెప్పి, ఎప్పుడో  చేయించేవాడండి.”

“ నిజమే , ఇదంతా  చూస్తుంటే  ఆ  దానయ్య  ఎవరో  సి.ఐ.డి లాగ  ఉన్నాడు !”

“ కాదండి  సారూ,  వాడు  సి.ఐ.డి  కాదండి.”

“ నువ్వెలా  చెప్పగలవు ?”

“ అదేమిటండి, వాడు ఎంకన్నకి స్వయాన  పిల్ల  నిచ్చిన  మామండి ! నాకు  కూడా  మామ  వరసేనండి. సి.ఐ.డి  అయితే  నాకు  తెలియదేంటండి ?”

“ నువ్వనేదీ  పాయింటే. ” అని  ఇనస్పెక్టరు, మురుగన్కి  చొక్కా  చూపిస్తూ, “ ఈ  చొక్కా  ఎవరిదో  చెప్పగలవా ?” అని  అడిగాడు.

“ మురుగన్  దానిని  చూసి, “ ఇది  దానయ్యదే  నండి, వాడికి ఉన్నవి రెండే  చొక్కాలండి, అందులో ఇది ఒకటండి,’’ అన్నాడు.

“ ఈ చొక్కా  జేబులో, కరెన్సీ  నోట్లు  దొరకాయి. ” అని  వాటిని  మురుగన్కి  చూపిస్తూ,. “ ఇవి దానయ్యకి  ఎలా  వచ్చాయి ?’’ అని  అడిగాడు. గోపాల్రావు.
మురుగన్  వాటిని  పరీక్షగా  చూసి, “ సారూ ! ఈ  నోట్లని   మా  ఆచారి  బాబు  తెచ్చి, కరీం  ఖాన్కి  ఇచ్చాడండి,” అంటూ నవ్వి,” లంచమండి ! ఆ సాయంత్రం  తన  మీదకు  కేసు  రాకుండా  చూడమని  దానయ్య  కిచ్చాడండి. ”, అని  మళ్లీ  నవ్వి, “ అది  కూడా  లంచమేనండి, “ ఇలాంటివి ఇంకా  ఉండాలండి, తక్కినవి   మ్యూజియం  గేటు  దగ్గర, ఎంకన్న  పడున్నచోట  దొరకలేదేమిటండి ?”

(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని ...