(నిన్నటి టపాలో జరిగినకథ --- కానిస్టేబిల్ టూ నాట్ త్రీ దానయ్యని బంధించి తీసుకొని వస్తాడు. మురుగన్ ఇచ్చిన నోట్లని టూ నాట్ త్రీ తో ఆ నోట్లు ఏ బేంక్ నుంచి డ్రా అయ్యాయో , ఎవరి అకౌంట్ నుంచి డెబిట్ అయ్యాయో తెలుసుకోమంటాడు. దానయ్యని అరెస్టు చేసి తీసుకొని వెళ్తాడు.పరిశోధన సాగాలంటే మ్యూజియంకి వెళ్ళి , క్లూలు వెతకాలని నిశ్చయించుకొని, మురుగన్తో పాఅటు అక్కడకి బయలుదేరుతాడు. ఇక చదవండి )
మొసలి కొలను మ్యూజియం---21
పోలీసు జీపుని మ్యూజియం బయట ఆపి, అక్కడున్న బైకుని చూసి, మురుగన్ని అడిగాడు ఇనస్పెక్టర్ ,“ మురుగన్ ! ఆ బైకు ఎవరిదో గుర్తు పట్టగలవా ?” అని. మురుగన్ దానిని చూసి, “ అది మా కంపెనీ సీనియర్ ఇంజనీయర్ వాట్సన్ దొరది సార్ ! అన్నాడు.
కరీం ఖాన్, ఇనస్పెక్టర్ ని చూసి, “ ఠానేదార్ సాహెబ్ ! సలాం ఆలేకుం,” అన్నాడు.
“ ఆలేకుం సలాం ఖాన్ సాహెబ్ !ఏంటి, మ్యూజియంకి అప్పుడే విజిటర్సుని పంపించేస్తున్నారా?”
“ నహీ ఠానేదార్ సాహెబ్ ! ఎవర్నీ పంపించడం లేదు, మీరు బేన్ చేస్ నాక హెందుకు పంపిస్తాను,” అన్నాడు.
“ అలాంటప్పుడు వాట్సన్ దొర లోపలికి ఎలా వెళ్లాడు ?”
“ నాదీ హేముందీ సాబ్ ! డైరక్టరు గారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు.”
“ ఇలా విజిటర్స్ లోపలికి వెళ్లడం వల్ల, ఎవిడన్స్ నష్టమయే అవకాశం ఉంది. నేను మీతో మాట్లాడడానికి, మరో సారి మ్యూజియంని చెక్ చేయడానికి వచ్చాను. ఇలా ఎవరినైనా లోపలికి పంపించ వలసి వస్తే నాకు కూడా చెప్పండి. ” అంటూ మ్యూజియం లోపలికి వెళ్లాడు ఇన్స్పెక్టర్, అతని వెనకనే మురుగన్ కూడ వెళ్లాడు.
వాట్సన్ లోపల ఒక ఎగ్జిబిట్ దగ్గరకి నిలబడి దానినే చూస్తూ ఉండడం గమనించి అక్కడికి వెళ్లి “ గుడ్ మార్నింగ్ మిస్టర్, వాట్సన్ ! ఏమిటి అంత పరీక్షగా చూస్తున్నారు ?” అని అడిగాడు ఇనస్పెక్టర్.
వాట్సన్ ఇనస్పెక్టర్ని చూసి, గాభరాపడినా, ఏ మాత్రం బయట పడకుండా అన్నాడు.“ఆఫీసర్ ! ఈ శాసనాన్ని చూడ్ డన్ డి . ఇద్ ది కాపర్ తో చెయ్ యబట్టి, ఆ దొంగ దీన్ ని వదిలేసాడ్ డు. ఈజ్ ఇట్ రైట్ ?”
“ మిస్టర్ వాట్సన్ ! మీరు అన్నది నిజం కావచ్చు. ముందు ఈ విషయం చెప్పండి. ఈ మ్యూజియంలో మీకేం పని ?”
“ వాట్ ఆర్ యూ టాకింగ్ ఆఫీసర్ ! ఈ మ్యూజియం ఎవ్ వరి వల్ ల ఇన్ స్టాల్ అయ్ యంద్ ది ? నా వల్ లన్ నే కద్ దా ? నేన్ నే ముంద్ దు వినాయక ఐడొల్ కన్ నిపెట్ నాన్ !”
“ మిస్టర్ వాట్సన్! అవన్నీమాకు తెలిసినవే ! మ్యూజియం వాచ్ మెన్ ఎంకన్న చని పోవడంతో ఇప్పుడిది మర్డర్ కేసు అయింది. మా ఇన్ వెస్టిగేషన్ అయే వరకు ఇక్కడకి ఎవరూ రాకూడదు. ”
“ అయాం సారీ ఆఫిసర్ ! ఇక్ కడ్ డ ఆర్టికల్స్ అన్ నీ మేమ్ మే బయటిక్ కి తీసామ్ ! ఏమ్ మి మిగిలాయ్ యో చూడ్ డడానికి వచ్ చాను. మీ ఇన్ వెస్టిగేషన్ చేసుకోండ్ డి. నేన్ ను వెల్ తాన్ ” అంటూ వాట్సన్ వెళ్లిపోయాడు.
ఇనస్పెక్టర్ మురుగన్తో కలిసి, మ్యూజియంని పరిశీలించ సాగాడు. ‘దానయ్య చెప్పిన దానినిబట్టి, ఎంకన్నని పోడిచిన వ్యక్తులు మ్యూజియం లోపలే గాయ పరిచారు. అది నిజమయితే అక్కడ రక్తం మరకలు పడి ఉండాలి.’ అన్న అనుమానంతో నేలని పరిశీలించాడు. అక్కడ ఒక ‘రబ్బరు మేట్’ కొత్తగా మార్చినట్లు కనిపించింది.“మురుగన్ ! ఈ ‘రబ్బరు మేట్’ కొత్తగా మార్చినట్లు కనిపిస్తోంది కదా ? ఎందుకంటే ప్రక్క నున్న మేట్ కి , దీనికీ కలర్ తేడా కనిపిస్తోంది కదా ?” అని అడిగాడు.
“ దీన్ని ఇప్పుడే మార్చి ఉంటారు సార్ ! చూడండి స్టిక్కర్ కూడా ఉంది. దాని మీద ఈ రోజు డేటు కూడా వేసి ఉంది,” అన్నాడు మురుగన్. ఇనస్పెక్టర్ అది చూసి, “ దీన్ని మార్చారు అంటే , ఇక్కడే ఎంకన్న రక్తం పడి ఉండవచ్చు.పాత మేట్ ఏం చేసి ఉంటారు ?”
“ పారేసి ఉంటారు సార్ ! ” అంటూ కిటికీ వేపు చూపిస్తాడు. మురుగన్ . ఇనస్పెక్టర్ కిటికీ తలుపులు ఓరగా తెరచి ఉండడం చూసి, ఆ కిటికీ దగ్గరకి వెళ్లి, దాన్ని తెరచి బయటికి చూస్తాడు. బయట గడ్డి మీద ‘ పాత రబ్బరు మేట్’ పడి ఉంది ! తమ ఊహ నిజమయినందుకు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకొంటారు.
“ మురుగన్ ! నేను బయట కరీం ఖాన్ ని, మాటలలో పెడతాను. నువ్వు మెల్లగా మ్యూజియం వెనక ప్రక్కకి వెళ్లి, ఆ రబ్బరు మేట్ ని తీసి జీపులో పెట్టేయ్ !” అన్నాడు గోపాల్రావు.
“ అలాగే సార్ ! ఆ దొర, అదే పనిగా ఆ శాసనాన్ని చూస్తున్నాడు, మనం రావడం వల్ల వెళ్లి పోయాడు,” అన్నాడు మురుగన్.
“ నిజమే ! ఆ శాసనంలో ఏదో విశేషం ఉంది. పద,మనం చూద్దాం !” అంటూ అక్కడకి వెళ్లి చూస్తారు.అది ‘తామ్రశాసనం !’ అర్థం కాని తెలుగు లిపిలో వ్రాసి ఉంది. ఇనస్పెక్టర్ గోపాల్రావుకి ఏమీ అర్థం కాలేదు. కాని శాసనం చివర ‘ అనితల్లి వ్రాయించినది ’ అన్న వాక్యం చదువ గలిగాడు. అనితల్లి అన్న పేరు చూడడం వల్ల అతనికి, తను ఈ మెయిల్లో చదివిన కథ గుర్తుకి వచ్చింది. ఆ శాసనంలో అనితల్లి తాను చేయించిన కంచు బొమ్మల రహస్యం ఏమైనా వ్రాయించిందేమో ! ఇనస్పెక్టర్ మొదటి సారిగా వాట్సన్ మీద అనుమానం వచ్చింది. అతను మౌనంగా మ్యూజియం బయటికి వస్తాడు. బయట కౌంటర్ దగ్గర కూర్చొన్న కరీం ఖాన్ ని చూసి, చిరునవ్వు నవ్వి అక్కడకి వెళ్తాడు .‘ ఖాన్ సాహెబ్ ! మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను.కేసు సాల్వ్ చేయడానికి మీ సహకారం చాలా అవసరం !” అన్నాడు.
“ హడగండి ఠానేదార్ సాహెబ్ ! హంతా నిజమే చెప్తాను.”
“ ఖురాను మీద ప్రమాణం చేసా సాయబూ ?” అని ప్రశ్నిస్తాడు మురుగన్ .
“ ఏయ్, మురుగప్పా ! నీదీ నోరు మూస్కో ! సర్కీ నాకీ మధ్యా అడ్డు రాకు. ” కోపంతో అన్నాడు కరీం ఖాన్.
“ మురుగన్ నువ్వు వెళ్లి జీపులో కూర్చో! ఖాన్ సాయిబుని అనవసరంగా ఇరిటేట్ చెయ్యకు ”
“ అలాగే సార్ !” అంటూ వెళ్లి పోయాడు మురుగన్. అతన్ని అలా కసిరేసి పంపించేయడం కరీంకి సంతోషం కలిగించింది. అతను వెళ్లిన వైపే చూస్తూన్న కరీంని , “ ఖాన్ సాహెబ్ ! ఇప్పుడు అడగమంటారా ?” అన్న ఇనస్పెక్టర్ మాటలకి ఉలిక్కిపడ్డి చూశాడు.
“ హడగండి సార్ ! హింతకీ ఆ హంతకుడు పట్టుబడ్డాడా సార్ ?”
(తరువాత భాగం రేపటి భాగంలో)
saar, aa old links ki kooda numbers maarcaandi. yedi okato yedi rendodo order follow avaleka potunnaamu.
ReplyDeleteఅలాగేనండి. తప్పక మారుస్తాను. శ్రీధర్,ఎ
Deleteఅలాగేనండి. తప్పక మారుస్తాను. శ్రీధర్,ఎ
Delete