Skip to main content

మొసలి కొలను మ్యూజియం ( హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---23)



(నిన్నటి టపాలో జరిగిన కథ--- ఇనస్పెక్టర్ గోపాల్రావు , కరీం ఖాన్’కీ వాట్సన్’కీ మధ్య సంబంధాలు ఉన్నాయని గ్రహిస్తాడు. మురుగన్’ని బయటకి మ్యూజిఅయం ఆవరణ లోకి పంపై కరీంని మాటలలో దింపుతాడు. మురుగన్ ఎంకన్న రక్తంతో తడిసిన రబ్బరు మేట్’ని బయట కనిపెట్టి, దానిని జీపులో పడేసి,  హారన్ కొడతాడు. ఆ హారన్’ సంకేతాన్ని అర్థం చేసుకొన్న గోపాల్రావు. తాను కూడా వచ్చి జీపులో కూర్చొంటాడు---ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం--23


‘సత్యనారాయణ ’, ‘ధర్మారావు ’, ‘ న్యాయధనీ మెహరోత్రా’ ఈ  ముగ్గురూ  కలిసి,ఒక ‘  ఫోర్  వ్హీలర్  బాడీ  ఫేక్టరీని ’ పెట్టారు. వారిద్దరిలో  న్యాయధనీ  మెహరోత్రా  గుజరాతీ , ఆ  ఫేక్టరీకి  ఫౌండర్  పార్టనర్ . ఆ  ఫేక్టరీలో  యాభైఅయిదు  శాతం  పెట్టుబడి  పెట్టినవాడు. ధర్మారావుకి ఇరవై అయిదు శాతం, సత్యనారాయణకి  ఇరవై  శాతం  వాటా  ఆ  ఫేక్టరీలో ఉన్నాయి.


పేరుకి  అది ,‘ఫోర్  వ్హీలర్  బాడీ  ఫేక్టరీ ’ అయినా  అక్కడ  అన్ని ‘ బాడీలు ’ తయారవుతాయి . అలమారాల  బాడీలు, రిఫ్రిజరేటర్ల బాడీలు , వాషింగు మిషిన్ల  బాడీలు , రకరకాల ట్రంకు పెట్టెల బాడీలు ఇంకా ఆర్డర్లని బట్టి అనేక టైలరు మేడ్ బాడీలు కూడా  అక్కడ  తయారవుతాయి


టౌను  చివర  మూడెకరాల  స్థలంలో , వాళ్ల  ఫోర్  వ్హీలర్ బాడీ ఫేక్టరీ  ఉంది. అది  ఓపెన్  ఫేక్టరీ . అక్కడో షెడ్డు ,ఇక్కడో షెడ్డు చొప్పున , అక్కడక్కడ  రేకు షెడ్డులు మాత్రమే ఉంటాయి ఆ  ఫేక్టరీలో ! అవి కేవలం  సామాన్లు, పనిముట్లు  దాచుకోవడం  కోసమే ! పని వాళ్లు  ఆకాశం  క్రిందనే  పని చేస్తారు. ఎండ వాన, చలి, గాలి, దుమ్ము, ధూళి  లాంటి  వాటికి  అతీతంగా  పని  చేస్తారు. అసలు  అలా  పని చేయలేని  వారికి  అక్కడ  పని దొరకదు.


ఫేక్టరీ  యజమానుల  పేర్లలో  సత్యం , ధర్మం , న్యాయం అనే  మూడు  సకారాత్మక  సుగుణాలు  ఉన్నా, ఆ  ఫేక్టరీ  నిర్వహణలో  మాత్రం అవి  మచ్చుకైనా  కానరావు.


అక్కడ  పని  చేసే  వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు , ఫిట్టర్లు, మిషినిస్టులు , కళాసీలు, కూలీలు, రేజాలు  అందరూ  అసంఘటిత  కార్మికులే ! సంఘటన  అంటే  ఏమిటో  కూడా  తెలియని  అమాయకులు. అందు వల్ల  ఆ  ఫేక్టరీలో  ‘పని, పని, పని’ తప్ప,‘మరో పని’  ఏదీ  జరగదు. చాల  తక్కువ  కూలీకి  వెట్టి  చాకిరీ  చేసే, బ్రతకలేక  బ్రతుకుతున్న కార్మికులు  వాళ్లు



వాళ్లందరూ  ఆ  ఫేక్టరీ  సైటులోనే  నివశిస్తూ  ఉంటారు. వాళ్లు  పనిచేసే  ఫేక్టరీకి  లేనట్లే,  వాళ్ల  ఇళ్లకి  కూడా  ‘బాడీలు’ ఉండవు ! తడకల తోను, మట్టి తోను, బొంతల తోను, ప్లాస్టిక్ సంచీల తోను, ఇంటి గోడలు  కట్టుకొని , ఏ చెత్త దొరికితే  ఆ  చెత్త  పైకప్పుగా  వేసుకొని , జంతువులలా, అక్కడ  నిరాసక్తంగా, నిర్లక్ష్యంగా , నిరంతర  యాతనతో  సమస్యలతో  జీవిస్తూ  ఉంటారు


వారిలో ‘వీరన్న’ ఒకడు. తన  భార్య ‘ గంగతో’ , మట్టిగోడల  పైన  టిన్నురేకు  కప్పు  వేసుకొని  నిర్మించుకొన్న ఇంట్లో ఉంటున్నాడు. ఏదైనా  ఎమ్.ఎన్.సి పేక్టరీలో పని చేస్తే  అతని నిపుణతకి, తక్కువలో  తక్కువ జీతం, ముఫ్ఫయి వేల రూపాయలు  దొరికి ఉండేది ! ఆ పేక్టరీలో అతను చెయ్యలేని  పని లేదు. అయినా అతని జీతం రోజు కూలీ  నూట యాభై రూపాయలు . పిల్లలు లేక  పోవడం వల్ల, అతనికి సరిపోయే జీతంలో  ‘ గంగ’ కోసం, చుక్కల చీర, ‘ బాల కృష్ణ’  సినిమా  కూడ  అప్పుడప్పుడు, కొని,  చూపించి,ఆమెను సంతోష  పెట్టేవాడు. తోటి  కార్మికుల జీవన  శైలి  చూసి , వీరన్న  గుండె  మండి  పోయేది..


ముగ్గురు  యజమానులలో , ‘ న్యాయధని ’ గుజరాతులోనే  ఉండేవాడు. పెట్టుబడి  పెట్టడం, లాభాలు  లెక్క పెట్టుకొని  బొక్కసాలు  నింపుకోవడం,  ఇవే  అతని పనులు. ఎప్పుడో  ఒకసారి  వచ్చి  పేక్టరీ  చూసి  వెళ్లడం తప్ప  అతను ఇంకేమీ  చేసేవాడు  కాదు.


ధర్మారావుకి  పేక్టరీలోనే  ఒక కిరాణా  దుకాణం  ఉంది. కిల్లీ  కొట్టుకు పెద్ద, కిరాణా  దుకాణానికి చిన్న  అనిపించే  దుకాణం  అది. అక్కడ  దొరకని  వస్తువు అంటూ  ఏదీ  లేదు. ముఖ్యంగా  అక్కడ  ఉండే కార్మికుల  నిత్యావసరాలు తీర్చగల  వస్తువులన్నీ, అక్కడ  దొరుకుతాయి. పేరుకి అది  ధర్మారావు  దుకాణమైనా  అక్కడ  లభించే  వస్తువుల ధరలు  ధర్మబధ్ధంగా  ఉండవు. కొనేవాళ్ల  అవసరాన్ని బట్టి  మారుతూ ఉంటాయి. ఒకే  వస్తువుని  వేరు వేరు  ధరలకి  అమ్మే  చాకచక్యం  అతనికి  ఉంది. కూలీలకి ఆ విషయం తెలుసు, అయినా  ఇంకొక  దుకాణానికి  వెళ్లి, సామాన్లు  కొనుక్కొనే  తాహతు  లేదు. కారణం  ధర్మారావు  దగ్గర  తీసుకొన్న  అప్పు. అతనిచ్చిన  అప్పు తీర్చందే, ఇంకొక దుకాణానికి  అతను  వెళ్ల  నివ్వడు. ధర్మారావు  దగ్గర  తీసుకొన్న  అప్పు  అంటే అది అగాధమే ! ఆ పద్దు పుస్తకంలో  ఎవరైనా  పేరెక్కించుకొంటే ఆ పేరుని  కొద్ది  కొద్దిగా  అగాధం  లోకి  నెట్టడం  అతనికి బాగా తెలుసు !


అలా  నెట్టడానికి  అతను  వాడే  ఆయుధాలు  రెండే  రెండు ! మొదటిది సారాయి, రెండవది  బ్రాకెట్  ఆట ! ఆ ఆట ఆడడానికి  కేవలం  పాతిక పైసల  పెట్టుబడి  చాలు ! అది చాల చిత్రమైన ఆట. ఒక నెంబరుతో  మొదలయి, మరో  నెంబరుతో  ముగిసే  ఆట ! అందుకే  దానిని  బ్రాకెట్  అంటారు. రాత్రి  తొమ్మిది  గంటలకి ,ముంబయి  నుండి, మూడు  నెంబర్లు  టెలిఫోను  ద్వారా  దేశమంతటా తెలియజేయ బడతాయి.. ఆ  మూడు  నెంబర్లని  కూడి,  ఒకట్ల  స్థానంలో  ఉన్న  నెంబరుని  బ్రాకెట్  ఓపెన్  నెంబరు  అంటారు. ఆ నెంబరుని  ముందుగానే  ఊహించి, దానిమీద  ‘పావాలా ’ పెట్టుబడి  పెట్టి  పందెం  కడితే    ‘రెండు రూపాయల పావలా వస్తుంది .,మళ్లీ రాత్రి. పన్నెండు గంటలకి, ముంబయి నుండి, మరో మూడు  నెంబర్లు  టెలిఫోను ద్వారా దేశమంతటా తెలియజేయ బడతాయి.ఆ మూడు నెంబర్లని కూడి, ఒకట్ల  స్థానంలో ఉన్న నెంబరుని  బ్రాకెట్  క్లోజు నెంబరు  అంటారు. రాబోయే  జోడీ  నెంబర్లని  ముందుగా  ఊహించి  బెట్  కడితే, పావలాకి  ఇరవై  రూపాయలు  వస్తాయి. మొత్తం  మీద  ఈ  బ్రేకట్టు  ఆటలో  ఓపెన్ తిన  నివ్వదు, క్లోజు  పడుకో  నివ్వదు. ఈ ఆట ఆ కాలనీ  లోని  ఆబాల  గోపాలాన్నీ  ఆకర్షించి  ధర్మారావు  చుట్టూ  తిరిగేలా  చేసాయి, అది చివరికి  వ్యసనంగా  తయారయింది.


ఇక  రెండవ  అస్త్రమైన సారాయి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ధర్మారావు  సారాయిని  బహుమతి  రూపంలో ఇచ్చి, దాన్నివ్యసన రూపంలో అలవాటు చేయించే వాడు.బ్రేకెట్లో జోడి నెంబరు  గెలిచిన  వారికి, ఒక  సీసా  సారాయి  ఫ్రీ  అని  స్కీము  పెట్టి,  ఒకసారి  అలవాటు  అయిన  వాడు  తిరిగి తిరిగి  తన దగ్గరకే  వచ్చేలా  చేసుకొన్నాడు. ఆ విధంగా ఆ కూలీల , ధనాన్ని  మానాన్ని, జవ సత్వాలనీ,  చివరకి  ప్రాణాలనీ  దోచుకొనే  వాడు .

(తరువాయి భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద