Skip to main content

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---24)



(నిన్నటి టపాలో జరిగిన కథ--- సత్యనారాయణ, ధర్మారావు, న్యాయధనీ మెహరోత్రా అనే ముగ్గురు, ఒక ఫోర్’వ్హీలర్ బాడీ ఫేక్టరీని పెడతారు. అక్కడ నాలుగు చక్రాల బాడీలే కాక, ఆర్డర్లని బట్టి ఏ బాడీలైనా తయారవుతాయి. అందులో పనిచేసే కార్మికుల పరిస్థితి చాల దయనీయంగా ఉంటుంది. వారిని, బ్రాకెట్ ఆటలకీ, త్రాగుడు వ్యసనానికీ బానిసలని చేసి, తమ పబ్బం గడుపుకొంటూ ఉంటారు యజమానులు --- ఇక చదవండి)

మొసలి కొలను మ్యూజియం --- 24

ఇక సత్యనారాయణ విషయం, అతడు ఆ బాడీ షాపుకి మేనేజరు. వర్క్ ఆర్డర్లు తీసుకోవడం, దాన్ని  పనివాళ్లకి  అప్పజెప్పి, మెటీరియల్  తెప్పించి, ఒప్పుకొన్న  దానికన్న  ముందుగానే  సప్లయి చేయడం  అతని స్పెషాలిటీ !   అవసరమయితే  ఓవర్  టైము  అదీ  కాకపోతే  నైటు  షిఫ్టు  చేయించి  పని  పూర్తి  చేయించగల చాకచక్యం అతని సొంతం !
ధర్మారావు  అస్త్రాల వల్ల  నిరుపేదలుగా, వ్యసన పరులుగా  వ్యర్థులుగా  మారిన  కూలీ  జనాలని  సత్యనారాయణ, ఓవర్  టైం  అనే  చిన్న  బిస్కెట్టు  ముక్క  తినిపించి, వారిని కట్టు బానిసలుగా  తయారు  చేసి, వారి శ్రమ శక్తిని  దాదాపు  ఉచితంగా దోచుకొనే వాడు.

ఈ  విధంగా  న్యాయం, ధర్మం, సత్యం  మూకుమ్మడిగా, దోపిడీ  వ్యవస్థని  పటిష్టం చేస్తున్నాయి. ఆ  బాడీ  షాపులో ! న్యాయం  దూరంగా  ఉండి,  కళ్లు  మూసుకొని  తనకేమీ  పట్టనట్లు,  ధర్మం  బయటికి  నీతులు  చెప్తూ, గమ్మత్తుగా మత్తులో  ముంచి, అవినీతిని  వ్యసనాలనీ  అస్త్రాలుగా  వాడుతూ, సత్యం  వారి  అవసరాన్నీ, పేదరికాన్నీ  అశక్తతనీ  ఆధారంగా  తీసుకొని వారిని  చీకటి  లోకి  తోసేస్తోంది.

ఆ బాడీ షాపులో  వీరన్న  ఒకడే  మినుకు  మినుకుమనే ఆశా దీపం !  అతని  భార్య  గంగ  ‘ మీ’ ఇంట్లోనే  పని మనిషిగా  పని చేస్తోంది ! మొసలి కొలను మ్యూజియంలో, మీరు  వాట్సన్ ను  అనుమా నాస్పద  పరిస్థితిలో  చూసారు.  కనుక , ఈ  ఈమెయిల్ని  మీకు పంపించే  చొరవ  తీసుకొంటున్నాను.  వాట్సన్ దొర  ఈ మధ్యనే, సత్యనారాయణని  కలిసేందుకు  బాడీ  షాపుకి  వెళ్లాడు.  ఏదో  గూడు  పుఠానీ  జరుగుతోందని  అనుమానం.

తనకి  వచ్చిన  ఈమెయల్ని  చదువుకొన్న ఇనస్పెక్టర్  గోపాల్రావు , చివరగా  వ్రాసిన   విషయం  చూసి, బిగ్గరగా  అరిచి  భార్యని  పిలిచాడు. “ఎందుకండి, అలా  కేక  పెట్టారు ?” అడిగింది  ఆమె.

“ మన  పనిమనిషి  గంగ  ఇంట్లో  ఉందా ?”

“ లేదండి, ఇప్పుడు  దాని  ఊసు  ఎందుకు ?”

“ సరే ! సాయంత్రం  వస్తుందా ?”

“ అది  నిన్ననే  పని  మానేసిందండి,  మ్యూజియంలో  పని  దొరికిందట ! ఉదయం  నుంచి  సాయంత్రం  దాకా  అక్కడే  పని  చేస్తుండట !”

“ అలాగా ! అయితే  సరే !”

“ ఇంతకీ  అదెందుకు గుర్తుకి వచ్చింది  మీకు ? పని చేసినన్నాళ్లు  దాని పేరైనా అడగ లేదు ?”

“ ఒక  కేసు  విషయంలో ఎంక్వైరీ  చేయడానికి .”

“ ఏ కేసుండీ !   మ్యూజియం  కేసేనా ? లేక  నాతో  చెప్పకూడనిదా ?”

“ మ్యూజియం  కేసే ! దొంగలింప బడిన బొమ్మలు,ఎక్కడికి  తీసుకెళ్లారో, ఎక్కడ దాచారో అంతు  చిక్కడం  లేదు. ఈ ఊరికి రోడ్డు తప్ప మరోదారి లేదు. దొంగలించిన  కొన్ని  క్షణాల లోనే  ఆ రోడ్డు సీల్  చేసాం. కాబట్టి  అది ఈ ఊర్లోనే ఎక్కడో ఉందని  అనుమానంగా ఉంది”.

“ గంగ దగ్గర ఏదైనా సమాచారం  దొరికతుందనుకొంటున్నారా?’ మన ఇంటికి  పిలిపించాలా?”

“ పిలిపించు, దానిని  ఒక్కదాన్నేకాదు, ఆమె భర్త వీరన్నని కూడా తీసుకొని రమ్మని  చెప్పు.  వీరన్న  మంఛి  వెల్డింగు  పనివాడట ! ఇక్కడ  చేసేదానికన్నా మంచి  ఉద్యోగం  ఉందని, వచ్చి  కలవ మన్నాననీ  చెప్పు, వెంటనే  వస్తారు.’’

“ పాపం  ఆశ  పెట్టడం  మంచిది  కాదండి.”

“ ఆశ  పెట్టడం  కాదు, నిజంగానే  చెబుతున్నాను.  ఇవాళ  వచ్చిన ‘ ఈ మెయిల్’ ఇదుగో చూడు,  వీరన్న  పని  చేస్తున్న  బాడీ  ఫేక్టరీలో  కూలీలు  ఎలాంటి దీన   స్థితిలో  ఉన్నారో తెలుస్తుంది.’ అన్నాడు  గోపాల్రావు. 

ఆమె  ఆ  ఈ మెయిల్ని చదివింది. ఒక పేజీ  చదవగానే ఆశక్తితో పూర్తిగా చదివేసింది. ఆ తర్వాత, “ ఎవరు  పంపించారు  దీనిని,” అని  ప్రశ్నించింది.

“ ఎవరో  ‘ పినాక పాణి ’ అనే  హిస్టరీ  స్కాలరు  పంపించాడు. ఇది  వరకు  కూడా  ఒక  మెయిల్  పంపాడు.  ఆ మ్యూజియంలోని  బొమ్మల  పురాతన  చరిత్ర ! దానిని  చూసాకనే  తెలిసింది, ఆ  బొమ్మలు  ఎంత  విలువైనవో !!”

“ అలాగా  దానిని  కూడా  ఓపెన్  చేసి  చదవనా ?”

“ చదువు, ఈ లోగా నేను  ఫ్రెష్  అయి వస్తాను,” అంటూ గోపాల్రావు బాత్ రూములోకి  వెళ్లాడు. 

ఆమె  పినాక పాణి పంపిన పాత  మెయిల్ తెరచి చదివింది. మ్యూజియంలోని బొమ్మల రహస్యం  అర్థమయింది.  ఇన్నాళ్లకు  ఆ  పినాక  పాణి  దానిని  వెలికి  తీసాడు. ఇప్పుడు  పంపిన  మెయిల్  లోని  ‘ బాడీ  ఫేక్టరీలో’ కూడ  ఏదో  చిదంబర  రహస్యం  ఉండే  ఉంటుందని  ఆమెకు  అనిపించింది.

ఇంతలో  గోపాల్రావు, ఫ్రెష్  అయి  డ్రెస్  చెసుకొని  వచ్చాడు.,“ చూసావా ?” అంటూ.

“ చూసానండి, ఎంతో ఆసక్తి కరంగా, కథ  వ్రాసినట్లు వ్రాసాడతను. విమోచనోద్యమానికి ముందు  ప్రజల  పరిస్థితి ,ఇప్పుడు ఆ బాడీ  షాపులోని కూలీల పరిస్థితి  ఇంచు  మించు  ఒకలాగే  ఉంది. కదండి !  అయినా  దోపిడీ  వ్యవస్థ  పేర్లు  మార్చుకొని, కొత్త  క్రొత్త   రంగులు  పులుముకొని  దోపిడీ  చేయడమే  ధ్యేయంగా  ఎందుకు  మెలగుతాయి. తమ  పాలనలో  లేక  తమ  చేతి  క్రింద  పని  చేసే  వారి  మీద  కాస్త  ఉదారంగా  ఎందుకు  ప్రవర్తించరు ?” అంది  ఆవేశంతో.

ఆమె  పేరు  ప్రియంవద.  బి.ఎస్.సి  మేథ్స్  చేసింది. మూడేళ్ల  క్రిందట , గోపాల్రావుని  వివాహం  చేసుకొంది. కాలక్షేపం  కోసమని  చుట్టుపట్ల  పిల్లలని  ప్రోగు  చేసుకొని  లెక్కల  పాఠాలు  చెప్పుతోంది. తన  దగ్గర  పని చేసే  గంగ  అంటే  ఆమెకి  ఎంతో  అభిమానం ! చామన  ఛాయతో  చూడ  ముచ్చటగా  ఉండే. గంగ. ఎనిమిదవ  క్లాసు వరకు  చదివింది. ఆమెకి  ఎన్నెన్నో కుతూహలం కలిగించే విషయాలు  చెప్తూ  ఉండేది  ప్రియంవద..గంగ వాటిని  చెవులు  రిక్కించి  మరీ  వినేది, కాని  తన  సంసార విషయాలు  ఏమీ  చెప్పలేదు. ఇప్పుడా  కథంతా  చదివాక , ఏదో  కూపీ లాగడం  కోసం, ఆశ చూపించడం  కూడా  ఒక  రకంగా  దోపిడీవే  అని అనిపించింది  ఆమెకి. “ వీరన్నకి  ఆశ  చూపించడం  మంచి  పని  కాదండి.”

“ లేదు  సిన్సియర్  గానే  మాట్లాడుతున్నాను  వీరన్న  దగ్గర  నైపుణ్యం  ఉంది. ఇక్కడ  కన్న  మంచి  ఉద్యోగం, అతనికి  నేను  ఇప్పించ  గలననే  నా  నమ్మకం ! ఎందుకంటే నా స్నేహితుడు  ఒకాయనకి , స్టక్చరల్ & కన్ ష్ట్రక్షన్  ఇంజనీరింగు  వర్కుషాపు  ఉంది. ”

“ ఎవరి  గురించి  అంటున్నారు  మీరు, రమేష్  చంద్రగారేనా ?”

“ అవును, రమేష్  దగ్గరే  పెట్టాలను కొంటున్నాను.”

“ అయితే  మంచిదే ! రమేష్  చంద్రగారు  చాలా  మంచి మనిషి. అతని  దగ్గర వీరన్నకి,గంగకీ  పూర్తి  రక్షణ  దొరుకుతుంది.”
   
“ మరయితే  కబుర్లతో కాలక్షేపం  దేనికి ? వాళ్లని పిలిపించు, ఇంతకీ ఎలా కబురు పెడతావ్ ?”

“ మన కొత్త  పనమ్మాయి ద్వారా, ఈ  అమ్మాయిని కూడా  గంగే  పనిలోకి  పెట్టింది.”

“ అలాగా ! సరే ! నువ్వు  వాళ్లని  పిలిపించాక  నాకు  ఫోను చెయ్యి. నేను  ఠాణాకి  వెళ్లి వస్తాను.” అంటూ  బయలు దేరాడు  గోపాల్రావు.

(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద