Skip to main content
మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక--25)

(నిన్నటి టపాలో జరిగిన కథ ---- బాడీ ఫేక్టరీ గురించి పినాక పాణి పంపిన ఈ-మెయిల్ చదివిన గోపాల్రావు, తన ఇంట్లో పని చేసే, ఆ ఫేక్టరీ వర్కర్ భార్య , ‘గంగ’ గురించి వాకబు చేస్తాడు. అతని భార్య ప్రియంవద గంగ ఆ రోజు నుండే పని మానేసిందనీ, ఆమెకి మ్యూజియంలో పని దొరికిందనీ, చెప్తుంది. అయినా గంగను రప్పించి మాట్లాడే ఏర్పాటు చేస్తానంటుంది.గోపాల్రావు గంగతో పాటు ఆమె భర్త వీరన్ననీ పిలిపించమనీ, అతనికి మరొక మంచి చోట ఉద్యోగం ఇప్పించ గలననీ, అంటాడు. ఈ -మెయిల్’లో సూచుంచున ప్రకారం , ఆ బాడీ ఫేక్టరీ లోనే , మ్యూజియం నుండి దొంగలించిన బొమ్మలు ఉండ వచ్చనీ, వీరన్న సాక్ష్యం చాలా ప్రాముఖ్యమయినదనీ అంటాడు.--- ఇక చదవండి)
మొసలి కొలను మ్యూజియం--- 25


 ఇనస్పెక్టర్  ఇంట్లో  అయిదుగురి  సమావేశం  ఏర్పాటయంది. గోపాల్రావు , ప్రియంవద, వీరన్న , గంగలతో పాటు ‘మురుగన్’ కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు. వీరన్నతో భవిష్యత్తులో జరగబోయే  సమావేశాలకి, సంప్రదింపులకీ, మురుగన్ సహకారం ఉంటే బాగుంటందని, తనంత తానుగా వెళ్లి  పిలుస్తే,  సత్యం ధర్మాలకి  సందేహం  కలుగ  వచ్చనీ  భావించిన  గోపాల్రావు, మురుగన్ ని పిలిపించాడు.

ప్రియంవద పింగాణీ కప్పలతో ఇచ్చిన టీ రుచి చూసిన  వీరన్న గంగలు మురిసి  పోయారు.

ఒక  పోలీసు ఇనస్పెక్టరు ఇంట్లో తమలాంటి దరిద్రులకి  అలాంటి  స్వాగతం లభిస్తుందని వాళ్లు అనుకోలేదు.ఆ  పైన  గోపాల్రావు  చెప్పిన ఉద్యోగం గురించి విన్నాక ,ఆ దంపతుల ఆనందానికి మేర లేక  పోయింది.వీరన్నవెంటనే గోపాల్రావుకి రెండు చేతులూ ఎత్తి దండం పెట్టి, తనవల్ల కాగల పని తప్పక చేస్తా నని ,ఆ విషయంలో ‘సత్యాన్నిగాని, దర్మాన్నిగాని ఎదిరించ వలసి వచ్చినా లెక్క చెయ్యనని  అన్నాడు.అప్పుడు గోపాల్రావు అడిగాడు, “వీరన్నా! వాట్సన్ దొర ,మీ సత్యనారాయణ దగ్గరకి ఎందుకు  వచ్చాడు ?” అని.

“ ఆ దొరా బాబూ! తెలుసు బాబూ! సత్యం బాబుకి స్పెషల్ వర్కుఆర్డరు ఇవ్వడానికి వచ్చాడు”

“స్పెషల్  వర్కు ఆర్డరు  అంటే ఏమిటి ?”

“ మామూలుగా  తయారు చేసే  బాక్సులు , బాడీలకు  బదులు , పార్టీలు  అడిగిన  కొలతల  ప్రకారం  ,తయారు చేసే  ఆర్డరుని  స్పెషల్  వర్కు ఆర్డరు  అంటారు.”

“ అలాగా , ఆ దొర  మిమ్మల్ని, ఏం చెయ్యమన్నాడు ?”

“ ఒక రిఫ్రిజ్రేటర్  బాడీని  తయారు  చేయమన్నాడు. మామూలుగా  తయారు  చేసే  విధంగా  కాక స్పెషల్ గా  తయారు చేయమని  కొలతలు  ఇచ్చాడు.”

“ ఆ స్పెషల్  వర్కు ఆర్డరు  గురించి  నీకేమైనా  తెలుసా ?”

“ ఎందుకు  తెలియదు  బాబూ ! అక్కడకి  వచ్చే  ఆర్డర్లన్నీ ముందుగా  నాకే  చూపిస్తారు  సత్యం బాబు. నేను  డిజైను  చెయ్యనిదే  పని అవదు  బాబూ” అన్నాడు  వీరన్న  గర్వంగా.

“ నాకా  విషయం తెలుసు వీరన్నా ! అందుకే  నిన్నుపిలిచాను, ఆ దొర అడిగిన రిఫ్రిజ్రేటర్ బాడీలో ప్రత్యేకత  ఏమిటి ?”

“ చాలా  ఉంది  బాబూ ! అది  బయటినుంచి  చూడడానికి  గోద్రెజు కంపెనీ రిఫ్రిజ్రేటర్  బాడీ లాగ  ఉండాలి  బాడీయే  కాక, దాని పైంటింగు, ఫర్నిషింగు, ఫినిషింగు ,అన్నీ మేమే  చేయాలి.—”

“ వీరన్నా నేను  అడిగినది  ఆ ఆర్డరులో  స్పెషాలిటీ  ఏమిటీ  అని ?”

“ అదే  చెప్తున్నాను  బాబూ ! ఆ బాడీలో కంప్రెషరు గాని, రిఫ్రిజ్రెరెంట్  పైపింగు  గాని, సాధారణంగా  ఉండే  కూలింగు  కంట్రోల్సు  గాని  ,డీప్  ఫ్రీజు  గాని  ఏమీ  ఉండ కూడదు.”

వీరన్న  మాటలలో  వింత  ద్వనించింది  గోపాల్రావుకి. వెంటనే  అడిగాడు, “ నువ్వన్నట్లు  స్పెషల్  ఆర్దరే  వీరన్నా ! మరయితే  ఏ ఏ ఎటాచ్ మెంట్లు  ఉండాలి ?”

“ బేటరీ  ఉండాలి  బాబూ ! కారు  బేటరీలాంటిది ! కరెంటు  కనెక్షన్  ఇచ్చేది  ఆ బేటరీ  ఛార్జింగు  కోసమే! ఆ తరువాత ఎనిమిది  లాకర్లు  ఉండాలి, అది  కూడా  వాళ్లిచ్చిన  కొలతల  ప్రకారం, ప్రతీ  లాకరుకీ  నెంబరింగ్ కీ సిస్టం  ఉండాలి.  ఆ లాకర్లు  రిఫ్రిజరేటరు  లోపలి  భాగంలో ఉండాలి. అవి బయటికి  కనిపించ కుండా మామూలుగా  రిఫ్రిజరేటరులో  ఉండే  ప్లాస్టిక్  బేస్కట్లు, ట్రేలు, కప్ బోర్డులు  ఉండాలి. డోరు వెనుక  సీసాలు  అవీ  పెట్టుకొనే  అరలు, ఎగ్  కంటైనర్లు  ఉండాలి. ”

“ చాలా  ఇంటరెస్టింగుగా  ఉంది. వీరన్నా ! అంటే  బయటినుండి  చూసే వారికి, తలుపు తెరవగానే  కనిపించే  అరలతో సహా  అది  రిఫ్రిజరేటరు  లాగే  కనిపించాలి. వాటి  వెనక  ఎనిమిది  అరలుండాలి అనగానే  అర్థమయింది, అదెందుకో  ! మరి  బేటరీ  దేనికి ?”

“ బేటరీ  ట్రాన్సిమిషన్  సిస్టంకి  సప్లయి  ఇవ్వడానికి. ”

“ట్రాన్సిమిషన్  సిస్టమా !?”అరిచినంత  పని చేసాడు  గోపాల్రావు. ,“అంటే ఆ బాడీ ఎక్కడున్నదీ , సిస్టం  ద్వారా  పంపిన  యజమానికి  తెలుస్తూ  ఉంటుండన్న  మాట !”

“ అవును  బాబూ ! ట్రాన్సుమీటరు  సిగ్నల్సు  ద్వారా, ఆ  సిస్టం  రియాక్టు  అయి, అదెక్క డున్నదో  తెలుస్తుంది.”

“ వీరన్నా  నువ్వు  చెప్పిన  వివరాలు  విన్నాక, ఆ  బాడీలో  చాల  విలువైన  వస్తువులు రహస్యంగా  దాచి,  ఎక్కడికో  పంపాలని  అనుకొంటున్నట్లు  తెలుస్తోంది.”

“ అవును  బాబూ ! ఆ వస్తువులేంటో  నాకు  తెలియదు ! ఆ దొర  వాటిని రహస్యంగా  తెచ్చి, సత్యం బాబు దగ్గర దాచాడని నా అనుమానం ! ఎందుకంటే  ఎప్పుడూ  గొళ్లెం మాత్రమే వేసుండే సత్యం  బాబు  అండర్  గ్రౌండు  భోషాణానికి , ఇప్పుడు  క్రొత్త  తాళం  వేసి  ఉన్నాది.”

“ వీరన్నా ! చాల  ముఖ్యమయిన  సమాచారం  అందించావు. నువ్వు  చెప్పిన  దానిని బట్టి  చూస్తే , ఆ మ్యూజియం లోని బొమ్మలు , ఈ  బాడీలో  పెట్టి, విదేశాలకి  పంపించే  ఏర్పాట్లు  జరుగు తున్నాయని  అర్థమయింది. నువ్వు  మా  ఇంటికి  వచ్చినట్లు  మీ  సత్యం  బాబుకి  తెలుసా ?”

“ లేదు  బాబూ ! ప్రతీ  గురువారం, నేను , గంగ  ఊర్లోని  సాయిబాబా  గుడికి  వెళ్లడం  అలవాటు. ఇప్పుడు  కూడా  అక్కడనుంచే  వచ్చాము. ”

“ సరే  అయితే, వెళ్లేటప్పుడు  కూడా  బాబాగారి  గుడికి వెళ్లి, అక్కడి నుండి  నీ  ఇంటికి వెళ్లు. అలాగే  వాళ్లకి  ఏమాత్రం  అనుమానం  రాకుండా,  నువ్వు  నాకొక  సహాయం  చేయాలి.”

“ చెప్పండి  బాబూ  ఏం చేయాలో ?”

“ నేను  నీ కొక  ట్రాన్సిమిషన్  సిస్టం ఇస్తాను. దానిని  అదే  బాడీలో  రహస్యంగా  దాచి, ఆ బేటరీకే  కనెక్షన్  ఇవ్వు. ఆ సిస్టంనీ  , బేటరీ  కనెక్షన్లనీ  వాళ్లకి  ఎలాంటి  అనుమానం  రాకుండా  ఏదో  ఒక  లాకర్లో  అమర్చు. చెప్పు, చెయ్యగలవా ?”

(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద