Skip to main content

మొసలి కొలను మ్యూజియం(హాస్య రోమాంచ దైనందిన ధారావాహిక---28)



(నిన్నటి టపాలో జరిగిన కథ---- తేజా దగ్గరా టాన్స్’మిషన్ సిస్టంని , మురుగన చేత దొంగతనం చేయిస్త్తాడు ఇనస్పెక్టర్ గోపాల్రావు ,దానిని కొనేందుకు మరో దారి లేక ! తరువాత తేజా దగ్గర కంప్లైంటు తీసుకొంటాడు. ఆ తరువాత తిరుగు దారిలో వాళ్లు, ఇద్దరు దుండగులు కారులోంచి ఒక యువతి శరీరాన్ని బయట పడేయడం చూస్తారు. గోపాల్రావు ఆ యువతిని ఆస్పత్రికి చేరుస్తాడు. ఆ కారుని తరువాతి చౌకీలో ఆపి, అందు లోని దుండగులని అరెస్ట్ చేయమని చెప్తాడు. మురుగన్ ద్వారా ట్రాన్స్ మిషన్ సిస్టమ్ని ,వీరన్నకి పంపిస్తాడు--- ఇక చదవండి )


మొసలి కొలను మ్యూజియం---28


    “ ఆ అమ్మాయి  కారులో  వచ్చి, ఆ అమ్మాయినే  కొట్టి  బయటికి  విసిరేసారా  రాక్షసులు ! మీరు వాళ్లని లాకప్పు  లోనే  ఉంచండి.”


    “ అలాగే  సార్ ! గుడ్ నైట్ !”


    “ గుడ్ నైట్ !” అంటూ ఫోను ఆఫ్ చేసాడు  గోపాల్రావు.ఆ సంభాషణ వినిపించాలనే ఆలోచనతోనే, లౌడు స్పీకరు ఆన్ చేయడం వలన ప్రియంవద అంతా విని “ఎవరండీ ఆ అమ్మాయి ?” అని  అడిగింది.


    “ తెలియదు, ఆమె ఇంకా అపస్మారక  స్థితిలోనే ఉంది. డ్రగ్సు ఇచ్చి ఉంటారు ! ఆ పైన అత్యాచారం   కూడా చేసి ఉంటారు. తెలివి  వస్తేనే గాని  పూర్తి వివరాలు తెలియవు”.


    “ తులజ  ఆ అమ్మాయేనని  ఎలా  చెప్పగలరు ?”


    “ ఊహించాను , అంతే ! సుందరం, చిదంబరంల  దగ్గర  కారు ఉండే  అవకాశం లేదు., కనుక ఆ అమ్మాయే అయి ఉంటుందని  అనుకొన్నాను. ”


    “ అయితే  ఆమె  పూర్తి  పేరు ‘తులజా  భవాని ’ అయి ఉంటుందా ?’


    “ నూటికి నూరు శాతం అవుతుంది, ఇంతకీ  ఈమెయిల్  దేని గురించి ?”


    “ చదవండి, ఇందులో  కూడా, తులజా  భవాని పేరు ఉంది.” అంది  ప్రియంవద  నవ్వుతూ.


    “ అలాగా ! చాలా  విచిత్రంగా  ఉందే ! “ అంటూ  ఆ ఈమెయిల్  చూసాడు  గోపాల్రావు..


    ‘ ప్రేమ, క్షమ, సిగ్గు, సహనం  స్త్రీకి ప్రత్యేక లక్షణాలయితే అవి ‘తులజా భవానిలో’ పుష్కలంగా  ఉన్నాయి. శౌర్యము, ధైర్యము, సాహసము , ఓర్పు లాంటి లక్షణాలు  ఉభయుల లోనూ  ఉంటాయి. అయితే  అవి ‘అతనిలో’ నిండి  ఉన్నాయని ఆమె  అభిప్రాయం ! అతను అంటే, ‘ ఇంద్ర నీల్,’ ‘ చరిత్ర విద్యార్థి’ ! తులజ పదో క్లాసు వరకు  ఇంద్ర నీల్  కి  సహాద్యాయని. పదో  క్లాసు, ఫస్టులో  ఉత్తీర్ణురాలైన వెనక, తులజ  జీవితంలో  కారు మేఘాలు క్రమ్ముకున్నాయి. దానికి ముఖ్యమయిన  కారణం  ఆమె  రూపం ! తులజ సౌందర్యానికి ప్రతీక , అందానికి నిర్వచనం, ఆ రూపమే  ఆమెకి  శతృవయింది. ఫలితంగా ఆమె  అఙ్ఞాత వ్యక్తుల ద్వారా అపహరింప బడింది.


    ఇంద్ర నీల్  ఆమెకోసం చాలా ప్రయత్నాలు చేసాడు , చివరికి ఆమెని వెతికేందుకే , పోలీసు ఇనస్పెక్టరుగా ‘ తన మనస్సాక్షికి వ్యతిరేకంగా,’ ఉద్యోగంలో  చేరాడు. చివరికి  ఆమె, ‘ అపహరణ కర్తలను’ అరెస్టు చేయించ గలిగాడు. ఆమెను కూడా  కలుసుకో గలిగాడు. కాని వ్రతం పూర్తి చేసినా ఫలితం దక్కనట్లు అప్పటికే  అంతా ముగిసి పోయింది.


    ‘ తులసి’ మొక్కలాంటి  తులజ, ‘ గంజాయి’ మొక్కగా  మారిపోయింది. తన పరిస్థితులు పరిసరాలు మారి పోయాయనీ, సభ్య సమాజ  ద్వారాలు తన కోసం మూసుకొని పోయాయని, తనని  మరచి పొమ్మని  చెప్పి, ఇంద్ర నీల్ తో  రావడానికి  ఆమె నిరాకరించింది.


    అపహరణ కర్తలకి  ఏడేళ్ల శిక్ష పడింది. మొదటి మలుపు లోనే చీలి పోయిన తులజా ఇంద్ర నీల్ ల జీవన ప్రవాహం ఆ ఏడేళ్లలో దూరమయి, సుదూర తీరాలకి  చేరుకొంది 


    తులజ తన పరిథిలో కుంచించుకు పోకుండా ,ఎదురీది  దన కనక  వస్తు వాహనాలను సమ   కూర్చుకొంది. బాగా  డబ్బున్న  సరసులకి వల విసిరి, చిన్న చిన్న  గేలాలకి తగల కుండా తనని తాను కాపాడుకొంటూ, తీరిక  సమయాలలో  సోషల్ వర్కరుగా తన పరిచయాన్ని స్థాపించుకొంది.


    ఇంద్ర నీల్ ఆమెను ఎన్నో సార్లు కలిసాడు. తానింకా వివాహం  చేసుకోలేదనీ, తన  జీవితంలో గృహిణిగా ప్రవేశించమని అర్థించాడు. అతని  పవిత్రమైన  ప్రేమని  పొందే  అర్హత  తనకి  లేదని  చెప్పి, ఆమె అతని  అభ్యర్థనని  ఆమోదించ లేక పోయింది.


    ఇంద్రనీల్ తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఒక రోజు ఆమె దగ్గరకి వచ్చి, ఉద్యోగాన్ని వదిలేసానని  చెప్పాడు. “ ఎందుకు ?” అని అడిగితే  ఆమెని వెతికేందుకే ఆ ఉద్యోగాన్ని చేపట్టానని ,ఆ ఉద్యోగ నిర్వహణలో కలగిన అనుభవాలకి,  కృంగి  పోయానని, అందుకే  రాజీనామా చేసానని  చెప్పాడు. తన రాజీనామాని  మొదట్లో  అదికారులు  ఆమోదించ లేదని,తనకి, ‘పెన్షను ’ కూడా  అవసరం లేదని వ్రాసి ఇచ్చాక,  ఆమోద  ముద్ర  వేసారని  తెలియ  జేసాడు. ఇప్పడు తను సామాన్యుడనీ, తనకి  ఎంతో ఇష్టమయిన  చరిత్రలో  పి.హెచ్.డి చేస్తానని, ఏ సంపాదనా  లేని  తనను ‘స్పాన్సర్ ’ చేసి ఆదుకోమని అన్నాడు.


    తులజ  ఆశ్చర్య  పోయింది, ఆనందించింది  కూడ. , “ నేను  నిన్ను స్పాన్సరు చెయ్యాలా ! అలాగే  చేస్తాను, ” అంది.


     “ నా రీసెర్చి అయ్యాక నన్నువివాహం చేసుకొని ,నా సంసార జీవితాన్నికూడా స్పాన్సరు  చెయ్యి”.


    “ అది  అడగకు ! ”

    “ అలాగయితే  నువ్వు  నాకు సహాయం చెయ్యకు.”

    “ ఎందుకింత  పంతం నీకు ?”


    “ ఎందుకింత  మొండితనం నీకు , తోడుండమని  అడిగితే, తోక  కోస్తావెందుకు ?

    “ అయితే  నువ్వు  కోతివా ?”


    “ అవును, అందుకే ‘‘ కోతి  కొమ్మచ్చి  ఆడుతున్నాను. ”


    “ నన్ను కోరుకొంటున్నావా ?”


    “ లేదు, ఆరాధిస్తున్నాను.”


    “ నేను తిరస్కరిస్తే ?”.


    “తిరస్కరించే  అధికారం నీకు  ఉన్నా, నా ‘ అభిలాషని’ మార్చుకోమని  చెప్పే  హక్కు లేదు.”


    “ అంటే  ఎప్పటికీ  అల్లా  చేస్తూనే  ఉంటావా ?


    “ ఈ  జన్మలోనే  కాదు, జన్మ  జన్మలకూ  చేస్తూనే  ఉంటాను.”


    తులజ  ఇంక  బింకంగా  ఉండలేక  పోయింది. విసురుగా  వచ్చి  అతనిని  అల్లుకు  పోయింది. తన  హృదయాంతరాల  లోని,  ప్రేమ  యొక్క  మాధుర్యాన్నంతా  ‘అధరాల  లోకి’  తెచ్చుకొని , అతనికి సుదీర్ఘ  చుంబనం  ఇచ్చి,తన సమ్మతిని తెలియజేసింది. వేడి నిట్టూర్పులతో  అతని  ఎదపై, సెగలు రేపి యుగయుగాల  విరహాగ్నిని  అనుభవానికి  తెచ్చింది. బిగి కౌగిలిలో  ఇన్నేళ్ల  దూరాన్ని, దగ్గర  చేసింది.  ఎన్నో హేమంత  రాత్రుల నుండి  మంచులా  పేర్చుకొని  అణచుకొన్న తన అనురాగాన్ని, కనుదోయి నుండి జాలువారిన కన్నీటితో కరిగించేసుకొంది. వేయేల ! ఆమె అతని  మేని  రంగులో రంగరించి ‘ ఇంద్రనీల’ అయింది. ! అతని  చిరకాల  అనురాగార్ణవ  శీతల  బడబాగ్నిని తనలో నిక్షిప్తం చేసుకొని  పులకించి పోయింది.


    ఆ తరువాత ఇంద్ర నీల్  చదువుకోడానికి  వెళ్లిపోయాడు., రీసెర్చి ప్రోజెక్టు  కోసం ,‘ మొసలి కొలను’  పురావశేషాలను  ఎంచుకొన్నాడు. ‘ అనితల్లి’ శాసనాల  లోని రహస్యాలను  వెలిదీయాలని అనుకొన్నాడు. అంతలోనే  మొసలి  కొలను మ్యూజియంలోని  బొమ్మల  దొంగతనం  జరిగింది ! మ్యూజియం  మూతపడింది.  దానితో  ఇంద్ర నీల్  పనికి అవాంతరం  కలిగి  ఎక్కడికో  వె:ళ్లి  పోయాడు.

    మొసలి  కొలనులో  , ఇంద్ర నీల్  ఉన్నాడని  తెలిసిన  తులజ  అతనిని  కలిసేందుకు, దొంగతనం  జరిగిన రెందు రోజులకి , అంటే  ఇంద్ర నీల్  వెళ్లిపోయిన  మర్నాడే  అక్కడకి చేరుకొంది. కాని విచిత్రంగా  ఆమె  కూడా  అదృశ్యమయింది !


    అంత  వరకే  వ్రాసి  ఉందా  మెయిల్లో !


    మురుగన్  బాడీ  ఫేక్టరీకి  వెళ్లి, బ్రాకెట్  ఆడే వాడి లాగ  నేరుగా ధర్మారావు దుకాణానికి  వెళ్లాడు. బ్రాకెట్  క్లోజు  నెంబరుని  ఊహించి, పందెం  కట్టేసి  చీటీ  తీసుకొన్నాడు. ఆ  తరువాత వీరన్నను  కలుసు కొని  వైర్ లెస్  కిట్ ని  ఇచ్చాడు. అప్పటికే  వీరన్న  దగ్గర  వాట్సన్  దొర  పంపించిన  కిట్  ఉంది. ఆ రెండింటి  మద్య  తేడాని  చెప్పి, పొరపాటు  చేయకుండా, వాటి  వాటి  స్థలాలలో మాత్ర్రమే  వాటిని  ఇన్ స్టాల్  చెయ్యమన్నాడు.


    వీరన్న  ఎలాంటి  పొరపాటు  చేయనని, సాంకేతిక  విషయాలలో తనకి  అనుభవం  ఉందనీ  చెప్పి, త్వరగా  సైటు నుంచి  వెళ్లి  పోమన్నాడు. మురుగన్  సరేనని  ఎవరికీ  అనుమానం  రాకుండా  ఆ  ఫేక్టరీ  లోంచి  బయట  పడ్డాడు.


    మర్నాడు  ఉదయం, ఆస్పత్రి  అధికారులు,‘ తులజకు’ తెలివి వచ్చిందని, గోపాల్రావుకి  పోను చేసి  చెప్పారు.. గోపాల్రావు  ఆమె  దగ్గరకు  వెళ్లి  స్టేటుమెంటు  తీసుకొన్నాడు.


    ‘ ఇంద్ర నీల్ ని  వెతికేందుకు  వచ్చిన  తనకు , వాట్సన్  కనిపించాడనీ, అది వరకే  అతనితో  పరిచయం  ఉన్న  కారణంగా , అతను  రమ్మని  ప్రాధేయపడితే , అతని  ఇంటికి  వెళ్లానని,  అక్కడికి  వెళ్లిన  తరువాత  తనను, ‘సుందరం, చిదంబరంలు’ నిర్భందించారని అన్ని  రోజులుగా  తన  మీద  అత్యాచారం  చేసి,  ఒక  ఖైదీలాగ ఉంచారని, క్రితం రోజు  రాత్రి  తనకి  మత్తు  మందు  ఇచ్చి, తన  కారు లోనే  ఎక్కించారని, ఆ తరువాత  ఏమి  జరిగిందో  తెలియదని  చెప్పిందామె.


    గోపాల్రావు ఆమె స్టేటుమెంటు తీసుకొని ,ఆమెకి రక్షణగా ఒక కానిస్టేబుల్ని ఉంచి వెళ్లాడు.


    ఆ తరువాత  ‘గణప వరం’ వెళ్లి, అక్కడి  పోలీసు ఇనస్పెక్టరుకి  తాను  తెచ్చిన స్టేటుమెంటును చూపించాడు. దానిని తీసుకొన్న ఆ ఇనస్పెక్టరు, గోపాల్రావు  కలిసి, సుందరం, చిదంబరంలను కరకుగా  ప్రశ్నించారు.మొదట్లో కాదు,కాదు అన్నవాళ్లు, తమ మీద ఉన్న సాక్ష్యాలని చూపించాక, నిజం  చెప్పారు.


    మ్యూజియం లోని బొమ్మలని దొంగలించన ముసుగుదొంగలు తామేనని, ఎంకన్నదానయ్యలు  పన్నిన  కుట్ర వల్ల, విగ్రహాలని  అసలుకు  బదులు  నకిలీవి  మార్చేయాలన్న స్కీము  దెబ్బతిన్నాక  ఆ దొర  ఆదేశం  వల్ల, మ్యూజియం  లోని  బొమ్మలని  ఎత్తుకు  పోయామనీ, ఆ ప్రయత్నంలో  ఎంకన్నని  గాయ  పరిచామనీ, చెప్పారు.


    ఆ తరువాత  వాట్సన్  దొర  తమని, తన  ఇంట్లోనే  దాచేసి, తమకి  మందు,మాంసాహారం  పెట్టే  వాడనీ , మగువ  కూడా  కావాలని , పెళ్లాల  దగ్గరకు  పోతామని  గోల  పెడితే, ఒక  రోజు  తన  ఇంటికి  వచ్చిన ,‘ తులజను’ చూపించి, ‘ ఎంజాయ్ ’ చేసుకోమన్నాడనీ , అందుకే  ఆమెను  ఖైదీలాగ  బంధించి, రోజూ  అత్యాచారం  చేసామనీ  చెప్పారు.


    ముందు  రోజు  తేజా  అనే  పెద్దమనిషి , వాట్సన్ దొర  ఇంటికి  వచ్చి, తమని  చూసాడనీ,  దాంతో  ఆ  దొర  రిస్కు  తీసుకోవడం  ఇష్టం  లేక, అడిగినంత  డబ్బు ఇచ్చి,అమ్మాయినీ, కారునీ  తీసుకొని  పొమ్మన్నాడనీ, చెప్పారు. ఆ కారు ఆ అమ్మాయిదే  నని, తమకి  తెలియదని  చెప్పారు. దూరంగా  మరొక  చోటికి పోయి, హాయిగా బ్రతికేయమనీ, ఇక్కడున్నఆడాళ్లకి  నెలనెలా  జీతాలు  ఇస్తాననీ, ఒక  సంవత్సరం  గడిపి, తిరిగి  వచ్చి, హాయిగా ఉండొచ్చనీ చెప్పాడనీ అన్నారు. ఆ అమ్మాయికి  మత్తు  మందు  ఇచ్చి, కారులో  ఎక్కించామని  దారిలో  ఆమెని  కూడా  తీసుకొని వెళ్తే  చిక్కుల్లో  పడతామని  అనుకొని, రోడ్డు  అవతల  పారేసామని  చెప్పారు.


(తరువాత భాగం రేపటి టపాలో)

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద