Skip to main content

మొసలి కొలను మ్యూజియం (హాస్యరోమాంచ దైనందిన ధారావాహిక---9)



    (నిన్నటి టపాలో జరిగిన కథ====ట్రెజర్స్ అండ్ మైన్స్ కంపెనీ గుమాస్తా ఆచారికీ, వాచ్’మెన్ మురుగన్’కీ జరిగిన వాగ్వాదంలో అనేక రహస్యాలు తెలుస్తాయి. ఆ నేలలో లిగ్నైటుతో పాటు బాల్’క్లే కూడా దొరుకుతుందని వాటి నిష్పత్తి తెలుసుకోవడానికీ లేబరేటరీలో పరీక్ష చేయించడానికి మర్నాడు లారీలో త్రవ్విన ఖనిజాన్ని పంపిస్తారనీ చెప్తాడు ఆచారి. ఇంతలో దారిన పోయే ఒక దానయ్య అక్కడకి ,చుట్టకి నిప్పు కోసం వచ్చి వాళ్ల మాటలు విని, జీడి తోటలు లీజు ఇవ్వమని అడుగుతాడు.=== ఇక చదవండి)


మొసలి కొలను మ్యూజియం---9

    “ దొడ్డికెళ్లడానికి వచ్చినోణ్ని, సెంబు కాక, డబ్బులట్టుకొస్తానేంటి. అయి ఇంటి కాడున్నాయ్ ! ” అంటూ  జవాబిచ్చాడు దానయ్య.

    “ మా జీడిపప్పు కూడ , ఇంకా విత్తుల లోనే ఉంది,” అన్నాడు, మురుగన్ , ఆచారి మధ్యలో కలుగ జేసుకొని, “ ఇదుగో దానయ్యా ! ఎందుకు వచ్చావో ఆ పని చేసుకొని పోక , ఈ తిరకాసు బేరాలు ఎందుకురా  ?” అంటూ మందలించాడు.

    “ మీరు సెయ్యనిస్తే కదండి , తిరకాసో, సరికాసో తెలిసేది,” 

    “ సెయ్యనిస్తే , ఇక్కడే కూర్చొని  చేసేస్తావేమిటి, బయటికి  నడు, వెర్రిముఖమా !” కసురు కొన్నాడు ఆచారి.

    “ సరేనండి , సుట్టకి నిప్పియ్యండి ఎల్లిపోయాను,” అన్నాడు దానయ్య.

    “ అద్గదీ ! ఇప్పుడు తెల్సింది నీ మడత పేచీ ! దొడ్డికని బయలు దేరి, ఇక్కడ లాంతరు చూసి, ఆరి పోయిన  చుట్ట  వెలిగించు కోవడానికి వచ్చావన్న మాట ! వచ్చిన వాడివి బయట నక్కి, మా మాటలు విన్నావు , అంతేనా ?” అని అడిగాడు మురుగన్.

    దానయ్య , మురుగన్ చేతిలోని లాంతరు అందుకొని, దాని లీవరు పైకెత్తి, ఆ మంటలో చుట్ట వెలిగించుకొన్నాడు. “మీ మాటలు  నిజమే నండి, నిప్పు కోసమని వచ్చినోణ్ని, మీ మాటలు  విని , ఇక్కడేసే జీడితోట లీజు తీసుకొందామని అనుకొన్నానండి,” అన్నాడు.

    “ అయితే నువ్వు కంట్రాక్టరువి అన్న మాట !” అడిగాడు ఆచారి.

    “ అవునండి, తోట లీజుకి ఇప్పింఛండి.”

    “ సరే , ఓం ప్రథమంగా , వచ్చావ్ ! ఎందుకు కాదనాలి , కాని—”

    “ కాన్ల  మాట వద్దండి, అణాల మాట ఆడండి.”

    “ అణాలు  కూడా దేనికి, ఏకంగా, వరహాల మాటకే వస్తాను, నీ విషయం మాకు  ఙ్ఞాపకం ఉండాలంటే ---’

    “ కమీసను ఎంతవుద్దండి ?”

    “ అది వచ్చిన కొటేషన్ల బట్టి ఉంటుంది, ఇప్పటికి ఇప్పుడు చెప్పడం కష్టం, ముందస్తుగా ---”

    దానయ్య , చుట్ట పొగ గుప్పున వదిలి, “ దొడ్డికెళ్లి వస్తానండి” అంటూ వెళ్లి పోతాడు. దానయ్య వెళ్లిన వైపు చూస్తూ, ఆచారి  “ మురుగప్పా ! ” అని పిలుస్తాడు. మురుగన్ ,“ ఏమప్పా ? ” అంటూ  అడుగుతాడు. “ ఈ దానయ్య ఎలాంటి వాడంటావ్ ?” అని ప్రశ్నిస్తాడు.

    “ కొయ్యలాంటి వాడండీ !” అన్నాడు మురుగన్.

    “ అంటే ?” ఆచారి ప్రశ్న.

    “ కొయ్యలో మేకు దిగుతుందా లేదా ?”

    “ సులువుగా మెత్త మెత్తగా దిగుతుంది, ”

    “ అదే కొయ్య మేకుని దిగ గొట్ట గలదు కదా ?”

    “ కొట్ట గలదు.”

    “ ఈ దానయ్య కూడ  అలాంటి వాడే ! అంటే ఆ కొయ్య లాంటి వాడు, వాడు విరుగుతాడు కాని, వంగడు.ముందుగా  విరచక పోతే మన మీదే మేకు కొడతాడు.”

    “ అంటే జీడి తోట లీజు వాడికి ఇయ్యకుండా , మరొక  పార్టీని చూసుకోవాలంటావు.”

    “ అద్గదీ, ఇప్పుడూ తెలిసింది నీ మడత పేచీ !”

    “ ఏమిట్రా మళ్లీ మొదలు పెట్టావు.”

    “ నువ్వు జీడి తోట లీజు ఇయ్యడానికి పార్టీల కోసం, ఈ రాతిరి కొలువు కొచ్చావు, అవునా ?”

    “ కాదురా, జిడ్డు ముఖమా ! ‘ఆలూ లేదు, చూలూ లేదు,, కొడుకు పేరు కోటి లింగం ’ అన్నట్లు, ఇంకా లిగ్నైటు దొరుకుతుందో లేదో, తెలియదు, అది కాస్త దొరికి, దానిని, త్రవ్వి, తీయందే  పార్టీలు ఎలా వస్తారు ?”

    “ మరయితే ఆచారి బాబూ ! ఎందుకు వచ్చావో చెప్పావే కాదు ?”

    “ ఆ లిగ్నైటు బస్తాలో ఒక వస్తువు ఉండి పోయిందిరా,  ఏ బస్తాలో ఉందీ తెలియదు !”

    “ అంటే ప్రతీ బస్తా విప్పి, వెతికి మళ్లీ సీలు వెయ్యాలంటావు ?”

    “ అవున్రా, అన్నీ విప్పనక్కర లేదు, అది  దొరికే వరకు విప్పితే  చాలు,అందుకే వచ్చాను” అన్నాడు  ఆచారి.

    “ ఏమిటో ఆ వస్తువు?”

    “ వినాయకుడి విగ్రహంరా ! లిగ్నైటు త్రవ్వకాలలో దొరికింది. ముందు నా కంటే పడింది. అప్పుడే తీసి , పట్టుకు పోవాలని అనుకొన్నాను, కాని, ప్రక్కనే ‘ దొర’  ఉండడంతో  బస్తాలో  పడేసాను.”

    “ దొర చూస్తే ఏమవుతుంది ?”

    “ ఏమవుతుంది, మట్టి పాలు అవుతుంది .”

    “ ఓసోస్ ! నువ్వు చేసిన పని మాత్రం ఏమిటంట , మట్టి పాలే కదా ?”

    “ అప్పుడు  చేసినా , ఇప్పుడు వెతుక్కొంటూ వచ్చావా, లేదా ?”

    “ ఎందుకప్పా ?”

    “ ఇంకెందుకు, తీసి  శుధ్ధి చేసి, పూజించడానికి.”

    “ శుధ్ధ వైష్ణవోడి వయి ఉండి,వినాయకుడి బొమ్మకి పూజ చేస్తావా,అది నన్నునమ్మ మంటావా?’’

    “ వైష్ణవులు వినాయక పూజ చెయ్యరేంటి ?”

    `` ఎందుకు చేస్తారేంటి? వినాయకుడు  శివుడి కొడుకు గదా !”

     “ ఆ బొమ్మలో ఏదో విశేషం ఉంది, అందుకే అప్పుడు దానిని దాచి, ఇప్పుడు తీయడానికి వచ్చావు, దానికీ మురుగప్ప పానకంలో  పుడక  లాగ ఉన్నాడు, అవునా ?”

    “ అయితే నీకు వివరంగా చెప్పక తప్పదంటావు !”

    “ బొమ్మ కావాలంటే తప్పదు.”

    “ ముందా బొమ్మ తీద్దాం పద, తరువాత చెప్తాను.”

    “ సరే పద !” అంటూ మురుగన్ టేంటు లోపలికి దారి తీసాడు. ఆచారి వెనకనే వెళ్తాడు. టెంటులో ఏభై  లిగ్నైటు  బస్తాలు ఉన్నాయి. ఆచారి మురుగన్ ప్రతీ బస్తాని తడిమి, చూసి, అనుమానం  ఉన్న ప్రతీ బస్తాను బయటికి లాగి, దాని సీలు విప్పి, బొమ్మ కోసం వెతికి,  తిరిగి సీలు వేసి, ఇంకో ప్రక్కన పెడుతూ ఉంటారు.

    అదే సమయంలో దూరం నుండి, ‘ వినాయక స్తుతి’ వినిపిస్తుంది.

    “ శుక్రాంబర ధరం, విష్ణుం, శశి వర్ణం , చతుర్భుజం !
    ప్రసన్న వదనం ధ్యాయేత్ , సర్వ విఘ్నోప శాంతయే !!

    అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం !
    అనేక దంత భక్తానాం, ఏక దంత ముపాస్మహే !!

    విఘ్న పర్వత వజ్రాయ, పార్వతీ ప్రియ సూనవే !
    నమో గణనాధాయ, బుధ్ధి సిధ్ధి ప్రదాయినే !!

    సుముఖశ్చే, కదంతశ్చ, కపిలో గజ కర్ణికః !
    లంబోదరశ్చ వికటో, విఘ్నరాజో వినాయకః !!

    ధూమకేతు ర్గణాధ్యక్ష, ఫాల చంద్రో గజాననః !!
    వక్ర తుండ శూర్పకర్ణో, హేరంబ స్కంధ పూర్వజః !!


    చివరకి వినాయక విగ్రహం ఉన్న బస్తా, ఆచారి చేతికి చిక్కుతుంది. అంత వరకు వాళ్లు పనిలో పడి  పట్టించుకో లేదు గాని, బొమ్మ దొరికాక, ఆ శ్లోకాలని  వింటారు.

 “ మురుగప్పా !  ఈ శ్లోకాలు ఎక్కడినుంచి  వినిపిస్తున్నాయంటావ్ ?” అని అడుగుతాడు ఆచారి.

    “ రేడియో నుంచి కాబోలు,” అంటూ జవాబిస్తాడు మురుగన్.

    “ ఇక్కడ  రేడియో ఎక్కడి నుంచి వస్తుందిరా ?” అంటూ వినాయక విగ్రహం తెచ్చి, టెంటు బయట  స్టూలు మీద పెడతాడు ఆచారి.

    “ ఎవరో దారిన పోయే దానయ్య ,  ట్రాన్సిస్టర్  వాయించుకొంటూ పోతున్నాడు కాబోలు !”

    మురుగన్ మాట ముగియక మునుపే,  దానయ్య  అక్కడకి వస్తాడు. ‘ ఎవరో దానయ్య కాదండి, అది ఈ దానయ్య  పనేనండి. నా కాడ దొడ్డి సెంబు తప్ప ట్రాన్సస్టర్ లేదండి. నానే పాడానండి ఆ పాటలని, బాగున్నాయండి ?”

    “ ఓరి నీ కడుపుడక ! నువ్వక్కడ దాపురించావురా నాకు ! మళ్లీ ఎందుకు వచ్చావ్ ?”

    “ దానయ్య చెవి సందు లోంచి, ఆరి పోయిన చుట్ట తీసి, “ దీనమ్మ ! ఈ పుగాకే లంకలోదో గాని, మాటి మాటీకీ  ఆరి పోతోందండీ ,” అన్నాడు.

    “ వెలిగించుకోవడానికి వచ్చావా ?” ఆచారి ప్రశ్న.

    “ అవునండి.”

    “ అదుగో లాంతరు, వెలిగించుకొని  నీ దారిన నువ్వు పో !”

    “ దానయ్య  ఆచారి చెప్పినట్లే , లాంతరు పైకెత్తి, దాని మంటలో చుట్ట వెలిగించుకొంటూ, అన్నాడు  “ నాకు మరో దారి లేదండి, మీ దారినే రానీయండి, ” అని.

    “ ఏంట్రోరప్పా ! గొప్ప తిరకాసుగా మాట్లాడుతున్నావు, రాదారి తప్పించి , గోదారిలో తోసేయ గలను జాగ్రత్త !”


    “ దేవుడి బొమ్మతో గోదారి కేనా సిధ్ధమే నండి, పున్నెం వస్తాది కదండి.”

    “ నిజమే ! బోలెడు పుణ్యం వస్తుంది. శుభ్రంగా స్నానం చేసి, రేపు మా ఇంటికి రా ! వినాయక ప్రతిష్ట  చూద్దువు  గాని..”

    “ ఇంకా రేపేమిటండీ, తెల్లారి పోనాది కదండీ, మీతో పాటే వచ్చేస్తానండి.”

    “ నీ అసాధ్యం కూలా ! నన్ను వదిలి పెట్టవన్న మాట !”

    “ మరేనండి, ఇనాయకు లోరి, ఇసేసికం మీరు మురుగప్పకి, సెప్తే  నాను కూడ వినుకొంటానండి”

    “ విని ఏం చేస్తావు ?”

    “ ఇనుకొని, ఇన్నపం సేసుకొంటానండి.”

    “ ఏమిటో ఆ విన్నపం ! జీడి తోట లీజు మాటేనా ? సరే ! కమీషను లేకుండా , నీకు కంట్రాక్టు ఇప్పించేస్తాను, ఇంక  దయచెయ్యి.”

    “ అబ్బే ! అది కాదండి, జీడి పప్పు మీద  ఇంటర్ రెస్టు పోయిందండి. ”

    “ ఇంటర్ రెస్టు పోయిందా, మరి ఫైనల్ రెస్టు దేనిమీదుందో?”

    “ ఇనాయకులోరి బొమ్మ మీద నండి. అమ్మితే కొనుక్కుంటానండి.”

    “ ఎంతిస్తావేంటీ ?”

    “ పాతిక  రూపాయలు  సాలవేంటండి ?”

    “పాతిక రూపాయల కోసం ఇన్ని పడిగాపులు పడుతున్నానని, అనుకొన్నావా, నీ ముఖం ఈడ్చా ! నిన్ను నిలబెట్టి, తెగనమ్మినా, దాని విలువ రాదు తెలుసా ?”
 
 “ బొమ్మ బంగారందేంటండి ?”

    “ బంగారంది కాదు, దాని బాబులాంటిది, ‘ ప్రోలయ నాయకుల కాలం నాటి  బొమ్మ అది ! దానికి నువ్వూ, నేనూ  విలువ కట్టలేం, ” అన్న ఆచారి మాటలు విని, మురుగన్ నిర్ఘాంత పోతాడు . “ అద్గదీ , సంగతి ! ఇప్పుడు విడి పోయింది, నీ మడత పేచీ, ‘  ప్రోలయ వేముని ’  కాలం నాటి  బొమ్మన్న మాట అది ! అమ్మ బాబోయ్ !” అన్నాడు.

(తరువాత భాగం రేపటి టపాలో )

Comments

  1. కొంచం తికమక పడుతున్నాం. ఇంగ్లీషు అంకెలు వాడగలరు.

    ReplyDelete
    Replies
    1. అలాగేనండి, తప్పక వాడతాను.---శ్రీధర్.ఎ

      Delete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.   ...

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ...

శ్రీ రంగ నీతులు. (మరచిపోయిన జానపద కళ)

 శ్రీ రంగ నీతులు. (శ్యామలా ఆర్ట్స్’ వారి ప్రస్తుతి!  “శ్రీరంగ నీతులు ‘ అనే ‘జానపద కళా ప్రదర్శన’  అని వ్రాసి ఉంటుంది) (వాద్య బృందం, స్టేజి పైనే కూర్చొని ఉంటారు. రాజా-రాం అనే యువకుడు చెంచు యువకుని వేషంలో కనిపిస్తాడు. వాద్య బృందం లోని  వారి సహకారంతో రాజా రాం పాట అందుకొంటాడు) రాజా రాం : ఒహోయ్ ! చెంచులూ ! చెంచు పెద్ద చెప్పే శ్రీ రంగ నీతులు వినడానికి ఎంత మంది వచ్చారో చూసార్రా? అందరూ : చూసాము ,చూసాము నాయకా ! [[నందానా]] రాజా రాం : అదేమర్రా? మర్యాదలు మర్సిపోయారా? అందరూ : ఏం సేయమంటావు నాయకా! [[నందానా]] రాజా రాం : పదం అందు కొండి చెంచులూ! అందరూ : ----[[అవునవును ]] రాజా రాం:  కార్య నిర్వాహక సభ్యులకి నెనర్లు! అందరూ: ----[[అవునవును, నెనర్లు ]] రాజారాం :  పెద్దవారికి ఐదు పది సేతలు! (రెండు చేతులూ జోడిస్తాడు) అందరూ : ----[[అవునవును, చేతులు జోడిస్తారు ]] రాజారాం : సమ వయస్కు లయిన స్త్రీ పురుషులందరికీ వెన్నెల! అందరూ : ---[[అవునవును, వెన్నెల--]] రాజారాం :   ఔత్సహకులయిన యువతీ యువకులకి డింగిడీలు! అందరూ : ----[[అవునవును,...