Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా!--5 (చిలక రథంలో సరదా షికారు --పార్టు 2 )




ఇద్దరు కారు దిగి మహల్ లోపలికి అడుగు పెట్టారు. మహల్ యొక్క లౌంజు అద్భుతంగా అలంకరించబడి ఉంది! విజిటర్లు కూర్చునేందుకు, మూడు రకాల సోఫా సెట్లు వేర్వేరు రకాల థీమ్  ప్రకారం అమర్చబడి ఉన్నాయి.నేలంతా కాశ్మీరు తివాచీలతో కప్పు బడి ఉంది. రెండు వైపులా నుండి ఎర్రని తివాచీలు పరచి ఉన్న విశాలమైన మెట్లు, ఆ మెట్లు కలసే చోట గోడలకి పెద్ద పెద్ద వాల్’హేన్గింగ్సు వ్రేలాడుతూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది నవాబుల హవేలీ లాగ ఉంది!!

“రండి శ్రీ లలిత గారూ! వచ్చి ఇల సోఫా మీద  కూర్చోండి. మీ కోసం మంచి స్పెషల్ కాఫీ తెప్పిస్తాను అంటూ “రంగమ్మా!” అని కేక వేసాడు కేశవ గుప్త.

రంగమ్మ వంటింటి నుండి హడావిడిగా వచ్చి,”ఏమిటి బాబుగారూ?” అని అడిగింది.

“రంగమ్మా! ఈవిడ శ్రీ లలితమ్మ గారు! మంజీర లాగే నాకు చెల్లెలు లాంటిది, ఈమె కోసం మంచి స్పెషల్ కాఫీ, కొన్ని స్నేక్సు పట్టుకొని రా, నా కోసం టీ!”
“ అలాగే బాబుగారూ!” అని, రంగమ్మ శ్రీ లలిత వైపు చూసి “నమస్కారం అమ్మగారూ! మీకు ఏమీ కావలసినా నన్ను అడగండి, నేను చేసి పెడతాను, వారం పది రోజులు ఉంటారా అమ్మగారూ?”

“అబ్బే! లేదు రంగమ్మా, ఆవిడది ఈ ఊరే! మన ఇల్లు చూడడానికని వచ్చేరు, మంజీర ఏం చేస్తోంది, టీ త్రాగిందా?”

“లేదు బాబుగారూ! మంజీరమ్మ గారు, ఉదయం నుంచి తమ గదిలో అలాగే బొమ్మ లాగ కూర్చొన్నారు. తింటానని గాని, త్రాగుతానని గాని అనరు! అప్పటికీ చాల సార్లు అడిగాను బాబూ గారూ, నా మాట వినిపించుకోవడమే లేదు!”

“సరే, రంగమ్మా! నువ్వు వెళ్లి కాఫీ పట్టుకొని రా!”

రంగమ్మ కిచెన్ లోకి వెళ్లి, మరో పది నిమిషాలలో కాఫీ, స్నేక్సు, టీ ఒక ‘బంగారు రంగుతో చూడగానేఆకట్టు కొనే పనితనం గల గాజు ట్రేలో, బోన్ చైనా కప్పులలో’ పట్టుకొని వచ్చింది, కాఫీ శ్రీలలితకి ఇచ్చింది. శ్రీలలిత ఆ ట్రే ఇంకా కప్పుల చక్కదనాన్ని చూసి దాని ధర అంచనా వేసింది, ‘అయిదు వేల రూపాయలకి తక్కువ ఉండదు’ అని దానిని మనసు లోనే మెచ్చుకొంది. ఆమె స్నేక్సు ముట్టుకో లేదు, కాఫీ మాత్రం తీసుకొని నెమ్మదిగా ‘సిప్’ చేసింది. కాఫీ రుచి నిజంగానే అదిరింది! వెంటనే నాలుగయిదు గ్రుక్కలు త్రాగింది, ఆ ‘ఎనర్జీ డ్రింకు’గొంతుక లోంచి కంఠ నాళాల ద్వారా గుండెల్లోకి దిగి గుండెలో అంత వరకు రాజ్యమేలుతున్న గుబులు మీద ఎటాక్ చేసి తరిమికొట్టినట్లు అనిపించింది! అంతవరకుతాను పడిన వ్యథ ఒక్కసారిగా నెమ్మదించింది. ఆ తరువాత మంచి కాఫీ ఇచ్చావని రంగమ్మని మెచ్చుకొంది.

“ఇంకో కప్పు కాఫీ తెచ్చేదా అమ్మగారూ?” రంగమ్మ శ్రీ లలిత పొగడడంతో హుషారెక్కి అడిగింది.

“చాలు రంగమ్మా! ‘గంగి గోవు పాలు గంటెడైనను చాలు’ అన్నట్లు ‘చక్కటి కాఫీ చుక్కడైనా చాలు’ అనే చందాన కాఫీ తయారు చేసావు! ఎక్కువ ఒద్దు”అంది శ్రీ లలిత.

“శ్రీ లలిత గారూ! మీ ఆయనకీ ఫోను చేసి విషయం చెప్పి ఇక్కడకే  రమ్మనండి, అతను కూడా మా ఇంటిని చూసినట్లు ఉంటుంది.”

“నా మోబైలుని, పర్సుని, ఆ దుండగులు తీసేసుకొన్నారండి!”
“అయ్యో, అలాగా! మోబైలుకేం భాగ్యం, ఇప్పుడే తెప్పిస్తాను.”
“అబ్బే! మీకు ఎందుకండీ శ్రమ?”

“ఇందులో శ్రమేముంది, మాకు మొబైలు షాపు కూడా ఉంది, ఒక మోబైలుని మీకు ఇవ్వడానికి నాకు ఏమీ ఖర్చు పెట్టనక్కర లేదు లెండి.”

“సరే, అలాగే కానివ్వండి అన్నయ్య గారూ!” అంది శ్రీ లలిత తన సమ్మతిని తెలియజేస్తూ. అంత  పెద్ద బిజినెస్  మేగ్నేట్, ధనికుడు, పెద్ద మనిషి అయిన కేశవ్ గుప్త గారు, ఒక వస్తువు ఇస్తానని అంటుంటే కాదని తిరస్కరించడం సభ్యత కాదని తోచింది ఆమెకి .

“మీరు మీ శ్రీ వారితో లేండ్ లైను ఫోనులో మాట్లాడండి” అని ఫోను చూపించాడు కేశవ్ గుప్త. తన మొబైలు ఫోనులో షాపుకి ఫోను చేసి, రండు మూడు రకాల మొబైల్ ఫోనులు, మైక్రో సిమ్ములు తెమ్మని చెప్పాడు.

శ్రీ లలిత లేండ్ లైను ఫోను నుంచి సూర్య చరణ్’కి విషయమంతా వివరంగా చెప్పింది. సూర్య చరణ్ అంతా విని ఆదుర్దా పడ్డాడు. వెంటనే కేశవ్ గుప్తా గారి ఇంటికి వచ్చి అతనికి స్వయంగా కృతఙ్ఞతలు చెప్పుకొంటా నని, మరో అర గంటలో వస్తానని అన్నాడు. శ్రీ లలిత ఆ విషయం గుప్తాగారికి చెప్పింది “అన్నయ్య గారూ! మా శ్రీ వారు మరో అర గంటలో ఇక్కడికే వస్తానని అన్నారు” అని.

“అలాగా ! నన్ను అన్నయ్యా అని పిలుస్తే చాలమ్మా! గారూ అని మర్యాద చేసి పిలువనక్కర లేదు”
“అలాంటప్పుడు  నన్ను కూడా, ‘గారూ’ అని మర్యాద చెయ్యకండి అన్నయ్యా!” అంది శ్రీ లలిత.

“అదా, నీ పాయింటు! అలాగే శ్రీ లలితా!” అన్నాడు కేశవ్ గుప్త. ఆ మాటలకి ఇద్దరు నవ్వుకొన్నారు. ఆ నవ్వుతో వాతావరణం తేలిక అయింది.

“శ్రీ లలితా! ఇలా రా తల్లీ! మంజీరని చూద్దువు గాని “ అంటూ ఆమె గది లోపలికి దారి తీసాడు కేశవ్.

మంజీర ఒంటరిగా చీకట్లోనే కూర్చొని ఉంది, మూర్తీభవించిన శోక దేవతలాగ కనిపిస్తోంది. ఆమెని చూపిస్తూ అన్నాడు కేశవ్ “చూసావా శ్రీ లలితా! ఇదంతా వైభవ్ గురించిన చింతే! మంజీర విరహం భరించ లేక పోతోంది! మేమెవ్వరం ఆమె దుఃఖం తీర్చలేక పోతున్నాం. మీ శ్రీ వారు సూర్య చరణ్ గారు పూనుకొంటే  ఆ పని నెరవేర్చగలరేమో!” అన్నాడు  సాభిప్రాయంగా.

“మా ఆయన చేయగలరా, అదెలా?” అని అడిగింది శ్రీ లలిత.

“ఆయన స్వయంగా వస్తానన్నారు కదా, అప్పుడే చెప్తాను నా ప్లాను ఏం చేస్తే అవుతుందో! ముందుగా నీ విషయం చెప్పమ్మా! నీకేమీ అభ్యంతరం లేదు కదా?”

“అయ్యో, అన్నయ్యా! ఇందులో ఇబ్బంది పడాల్సిన విషయం ఏముంది? మా ఆయన ఒప్పుకొంటే నా సహకారం కూడా ఉంటుంది”

ఇంతలో ఇద్దరు వ్యక్తులు చేతిలో చిన్న చిన్న బాక్సులతో లోపలికి వచ్చారు. వస్తూనే వాళ్లు కేశవ్ గుప్తా గారికి వినయంగా నమస్కరించి, “సర్! మీరు ఆర్డర్ చేసిన విధంగా మొబైలు ఫోనులు, మేడం గారి సిమ్ముని ఆ దుండగులు రోడ్డు మీద పారేశారు! దానిని, ఇంకా మరికొన్ని మైక్రో సిమ్ములు కూడా  తెచ్చాము” అన్నారు.

“అదుగో! మా చెల్లెమ్మ  శ్రీ లలిత గారికి చూపించండి, ఆమెకి నచ్చిన ఫోనులో, సిమ్ము వేయించి తక్షణం ఏక్టివేట్ చేయండి, ట్రీట్ దిస్ అర్జంట్!” అన్నాడు అతను అధికార స్వరంతో.

“ఎస్ సర్!” అంటూ వాళ్లిద్దరూ అతనికి సెల్యూట్ చేసి, శ్రీ లలిత దగ్గరకి వచ్చారు, చేతిలోని బాక్సులు తెరచి వాటి లోని మొబైలు ఫోనులు బయటికి తీస్తూ.

శ్రీ లలిత వారిని కూర్చోమని చెప్పింది, రోడ్డు మీద దొరికిన సిమ్ముని చూసి అది తనదే అని తేల్చి చెప్పింది. వాళ్లు ఆమెకి, ‘థాంక్స్’ చెప్పి , ఆమె ప్రక్కనే సోఫాలో కూర్చొని తాము తెచ్చిన మొబైలు ఫోన్లు చూపించారు.  శ్రీ లలిత వాటిని ఒక్కొక్కొటిగా చూసింది. అవన్నీ ‘మల్టిపుల్ ఫీచర్స్ ఉండి, ఇంటర్నెట్ ఏక్సస్ గల, బిగ్ స్క్రీన్ మొబైల్’లే!’ ఏదీ  పదిహేను  వేల రూపాయలకి తక్కువ ఉండదు! శ్రీ లలితకి వాటిని ఎంచడం ఇబ్బంది గానే అనిపించింది, అయినా క్రొత్తగా ఏర్పడిన, అన్నా చెల్లెళ్ళ బంధం వల్లను, కేశవ్ గుప్తాగారి మహిమాన్వితమైన హోదా వల్లను, వాటిలో పల్చగా, తేలికగా క్యూట్’గా ఉన్న ఒక పరికరాన్ని ఎంచుకొంది. చిత్రమేమిటంటే అదే అన్నిటి కంటె ఖరీదైనది!    

“గుడ్ ఛాయస్ చెల్లెమ్మా!” అంటూ వారితో “ఈ మోబైలునే కన్ఫర్మ్ చేయండి. సిమ్ము అమర్చి ఏక్టివేట్ చేయండి” అంటూ ఆర్డర్ చేసారతను.

వాళ్లు అలాగేనని ఒక సిమ్ముని ఆ మొబైల్’లో అమర్చి వెళ్ళిపోయారు. వాళ్లు అలా వెళ్లగానే, సూర్యచరణ్ అక్కడకి వచ్చి వాలాడు. కేశవ్ గుప్త గారికి నమస్కరించి, “ సర్! ఈ రోజు మీరు చేసిన సహాయం వెల కట్ట లేనిది! నేను, లల్లి మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం” అన్నాడు.

“మరీ అంతలా పొగడి, మొహమాట పెట్టకండి సూర్య చరణ్ గారూ! ఇందులో ఎవరు ఎవరికీ ఋణ పడాల్సిన అవసరం లేదు! మీకు తోచిన సహాయం చేస్తే చాలు” అన్నాడు.

“తప్పకుండా అలాగే చేస్తాను, ఆదేశించండి” అన్నాడు సూర్య చరణ్.

అదే సమయానికి అక్కడకి, ప్రక్కనే ఆ హాలుని ఆనుకొని మంజీర గదిలోంచి కొన్ని కాగితాలుగాలికి ఎగురు కొంటూ వచ్చి పడ్డాయి. వాటిని చూసిన వెంటనే కేశవ్ గుప్తా లేచి అవన్నీ ప్రోగు చేసి,వాటిని సూర్య చరణ్’కి చూపిస్తూ అన్నాడు. “ ఇవన్నీ మంజీర అక్షర రూపంలో వ్రాసుకొన్న విరహ వేదనలు!” అంటూ వాటిని అతని చేతికి ఇచ్చాడు.

“ సూర్య చరణ్ గారూ! వీటిని చదవండి, మీకు మంజీర వ్యథ అర్థమవుతుంది, ప్రస్తుతం నేను కోరేది ఇదే! ఆమె పరిస్థితి మీ ఇద్దరికీ ‘కరతలా మలక మవుతే’ నేను మీనుండి ఆశించేది ఏమిటో వివరించడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు.”

సూర్య చరణ్ వాటిని చదవడానికి ప్రయత్నం చేసాడు. కేశవ్ అతనిని వారించి “ఇప్పుడే చదవాల్సిన పనేమీ లేదు, వాటిని మీ ఇంటికి వెళ్ళాక తీరుబడిగా చదవండి” అన్నాడు.

“మంజీరని మేము చూడవచ్చా?”అడిగాడు సూర్య చరణ్.

“ష్యూర్! తప్పకుండా, రండి ఆమె గది లోపలికి వెళ్దాం” అంటూ కేశవ్ ముందు నుండి దారి తీసాడు. సూర్య చరణ్, శ్రీ లలితలు అతనిని వెన్నంటి, అక్కడకి వెళ్లారు. ఇది వరకు శ్రీ లలిత అక్కడకి వెళ్ళి నప్పుడు మంజీర ఎలాంటి ఆశక్తి చూపించ లేదు. ఆమెని చూసి కూడా నిర్లిప్తంగా ఉండి పోయింది.కాని సూర్య చరణ్ ప్రవేశించగానే ఎవరో చెప్పినట్లుగా ఆమె లేచి నిలబడి పరుగు పరుగున అతని దగ్గరకి వచ్చి, అతని రెండు  చేతులూ పట్టుకొంది. “వైభవ్! నా వైభవ్ వచ్చావా, నీ మంజీరని ఇంత కాలానికి కరుణించావా?”అని ఏడ్చే సింది.చరణ్ నిరుత్తరుడు అయ్యాడు,అతని మౌనాన్నిగమనించిన  మంజీర  అనుమానంతో చుట్టూ కలయజూసి, అతని వెనకనే ఉన్న శ్రీ లలితని చూసింది! వెంటనే “ఓహో! మీరు మీరు కాదా, సూర్య చరణ్ గారా! క్షమించండి శ్రీ లలిత గారూ! నేను మళ్లీ పొరబడ్డాను” అంది.

“ఫర్వాలేదు అక్కా!” అంది శ్రీ లలిత.

“ఏమన్నారు మీరు అక్కా అనా! నాకు చాల సంతోషం అయింది, మీరు నన్ను అర్థం చేసుకొన్నందుకు!” అంది మంజీర. అలా అంటూనే హాలు లోకి వచ్చి సోఫాలో కూర్చొని వాళ్లని కూడా కూర్చోమని చెప్పింది.

అందరూ అలా కూర్చొని కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకొన్నాక , శ్రీ లలితా సూర్య చరణ్’లు వారికి వీడ్కోలు చెప్పి బయలు దేరారు. కేశవ్ గుప్తా కారులో దిగబెడతానంటే, చరణ్ వద్దని వారించాడు

*************************

Comments

  1. కథ మరీ సస్పెన్స్ తో వెళుతుందండోయ్ :)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఆరవ భాగం కూడా చదవండి. శ్రుంగార రసానుభూతిని పండించే ప్రయత్నం చేసాను.

      Delete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద