Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా! --7 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )


సూర్య చరణ్ ముందుగా తేరుకొని లేచి వెళ్లి తలుపు తీసాడు. ఎదురుగా కేశవ్ గుప్త నిలబడి ఉన్నాడు, “మే ఐ కమిన్” అంటూ.
“లోపలికి రండి అన్నయ్య గారూ! ఏమిటిలాగ దయ చేసారు?” అని పలకరించింది శ్రీ లలిత.

కేశవ్ గుప్త లోపలికి  వచ్చి సోఫా పైన కూర్చొన్నాడు. “ అమ్మా, చెల్లెమ్మా! నువ్వే నన్ను కాపాడాలి! మంజీర మన స్థితి మళ్ళీ పాడయింది. ఒక సైక్రియాటిస్టుగా నేను మీ ఇరువురినీ ఒక ఫేవర్ అడగడానికి వచ్చాను. నాకు సహాయం చెయ్యండి” అన్నాడు.

“ఆయ్యో! ఏమయింది అన్నయ్య గారూ! మంజీర మునుపటి లాగ లేదా?”

“లేదు చెల్లెమ్మా! మునుపటి లాగ 'సైలెంట్'గా' లేదు, 'వైలెంట్' అయిపొయింది. దానిని మీరిరువురే కాపాడ గలరమ్మా!”

“మేము ఏమి  చెయ్యగలమో, ఏం చెయ్యాలో చెప్పండి కేశవ్ గుప్తాగారూ!” అని అడిగాడు  చరణ్.

“మిస్టర్ చరణ్! మీ రూపం వైభవ్’తో కలుస్తోంది, ఆ విషయం మీకు ఇది వరకే తెలుసు! మీరు వైభవ్’లాగే నటించి మంజీర జీవితాన్ని సరి దిద్దండి. ఆమెకి వైభవ్ ఈ లోకంలో లేడన్న విషయం తెలియదు.ఆమె మనసు ఒక సారి స్వస్థత చెందితే, నెమ్మదిగా దానిని ఆమెకి తెలియజేయ వచ్చు! అప్పుడు ఆమె కుదుటబడి విధి విధానాన్ని అంగికరించి జీవితాన్ని రాజీ మార్గంలో గడుప గలుగుతుంది.”

“ఏమిటి, నేను ఆమె భర్తలాగ నటించాలా? కేశవ్ గుప్త గారూ! అదెలాగ సంభవం కాగలదు! నా భార్య దానికి ఒప్పుకొంటుందనే అనుకొంటున్నారా? ఒక వేళ ఆమె అంగీకరించినా ఇది జీవితాలతో ముడి పడిన విషయం కాబట్టి! నేను ఆ పని చెయ్యలేను, నన్ను క్షమించండి.”

“బాబూ! ఒక అభాగ్యురాలి అన్నయ్యగా నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను. నేను చెప్పిన విధానం గతంలో ఎన్నో సార్లు అనుసరింప బడి, సత్ఫలితాలని ఇచ్చింది. ఒక సారి ప్రయత్నం చేసి చూస్తే  తప్పే ముంది! అంతలాగ ఈ వ్యవహారం మీకు రిస్క్ అనిపిస్తే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడే తప్పుకో వచ్చు, దానికి నేను ఏమీ బాధ పడను, దాని జీవితం అంతేనని సరి పెట్టుకొంటాను. నిజానికి నేను ఆ పరిస్థితినే ఆమోదించాను, కాని వైభవ్’కి మీకు రూపంలో ఉన్న సామ్యత నాకు ధైర్యాన్ని ఇచ్చినట్లు అయింది. మీరు నెమ్మదిగా ఆలోచించుకొని నాకు తెలియ జేయండి.” అంటూ కేశవ్ గుప్త లేచాడు, వెళ్లి పోవడానికి.

సూర్య చరణ్ ఏమీ మాట్లాడ లేదు. శ్రీ లలితకి ఇంకా విషయం జీర్ణం కాలేదు!

కేశవ్ గుప్త వెళ్తూ, వెళ్తూ ఆమెతో అన్నాడు, “ చెల్లెమ్మా! నీ అక్కకి పునర్జీవితం ఇయ్యి తల్లీ!” అంటూ వేగంగా అడుగులు వేస్తూ నిష్క్రమించాడు.

అతను వెళ్ళాక కాసేపు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. శ్రీ లలిత లేచి వంటింట్లోకి వెళ్ళింది, పనులు చేసు కోవడానికి. చరణ్ పడక కుర్చీలో వాలి ఆలోచనలో పడ్డాడు. మొత్తం మీద ఆ దంపతుల ముందు ఒకగంభీర మైన సమస్య వచ్చి పడింది. వారి జీవితాలలో కల్లోలం సృష్టించడానికే నేమో మరి!

శ్రీ లలిత వంట చేస్తూనే ఆలోచనలో పడింది. ‘సలహాలు అడగడానికి ఎవరున్నారు, అయినా ఏమి  సలహాలు ఇస్తారు! కేశవ్ గుప్త ఒక అభాగ్యురాలి అన్నయ్యే కాదు, సూర్య చరణ్' మేనేజరుగా పని చేసే కంపెనీకి యజమాని కూడా! తిరస్కారం నేరుగా అతని ఉద్యోగం మీద పడే అవకాశాలు ఉన్నాయి! కేశవ్ గుప్తా గారు మంచి మనిషి మాత్రమే కాదు తన శీలాన్ని కాపాడిన పెద్ద మనిషి కూడా! పదిహేను వేల రూపా యల మొబైలు ఫోనుని తనకి గిఫ్టుగా ఇచ్చాడు. తను అతనికి ఋణ పడి పోయింది! డబ్బు విషయంలోనే కాక, శీల రక్షణ విషయంలో కూడా! అతని కోరికని ఒప్పుకొంటే ఏమవుతుంది? రిస్కు ఉందని అనుమానం వస్తే తప్పుకో వచ్చని అతనే అన్నారు కదా! సూర్య చరణ్ తన వాడు, తనకి ఆ నమ్మకం ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఉంటుంది. ఒకసారి చరణ్'తో మాట్లాడాలి అనుకొంది. ఆ నిర్ణయం తీసుకొన్నాక  ప్రశాంతంగా పనులు ముగించుకో గలిగింది.

“ఏమండీ! ఏమి  ఆలోచించారు గుప్తా గారి వేడికోలు గురించి?” భోజనం వడ్డిస్తూ అడిగింది శ్రీ లలిత.

“ఇందులో ఆలోచించడానికి ఏముంది, డైరక్టుగా తిరస్కరించడమే! కాక పొతే అతని సిబ్బంది లోని వ్యక్తిని కాబట్టి ఇంకో ప్రత్యామ్నాయం చూసుకోవాలి, అంతే!” అన్నాడు చరణ్.

“అది కాదండీ! నన్ను అతను ఎలా కాపాడారో మీకు తెలుసు కదా!”

“అదే లల్లీ, నేను ఆలోచించే విషయం! ఉపకారానికి బదులెలా తీర్చుకోవడమనేది జటిలమైన  సమస్య అయిపో
యింది, అంత మాత్రాన అతను అడిగిన దానికి ఒప్పుకోవడమేనా? నువ్వే చెప్పు, ఇది ఆత్మని చంపుకోవడం కాదా?”

“నిజమేనండీ! అది ఆత్మహత్యా సదృశమైనదే!  కాదనను, కాని అతను మనకి చేసినది తక్కువేమీ కాదు. నా మాన ప్రాణాలు ఏనాడో గాలిలో కలసిపోయి ఉండేవి, అతనే గాని ఆ క్షణాన రాకపోతే! అంతే కాదు, నన్ను చెల్లెమ్మా అని నోరార పిలిచి తన సమస్యని నాతో చెప్పుకొని సహాయం చెయ్యమని అడిగాడు. దానిని నెరవేర్చడం భర్తగా మీ బాధ్యత కాదంటారా? డైరక్టుగా అతని ప్రతిపాదనని తిరస్క రించ వద్దు. ముందు అతని ప్లాన్ ఏమిటో ముందు తెలుసుకొందాం. నటించడమనేది ఏ స్థాయి వరకు చెయ్యాలో కనుక్కొందాం. మీరు ఒంటరిగా అక్కడకు వెళ్ళ వద్దు, నేను కూడా మీ వెంటనే ఉంటాను. నటించ వలసిన సీన్లలో మనకి ఏవైనా అభ్యంతరకరమైనవి ఉంటే వాటిని సెన్సార్ చేద్దాం. ఎంత వరకు సహాయం చెయ్యాల నేది మన ఇష్టం మీద ఉంటుందని స్పష్టం చేద్దాం.కేవలం మానవతా దృష్టితో మాత్రమే మనం అతని సమస్యని సాధ్యమైనంత వరకు నేరవేరుద్దాం, ఏమంటారు మీరు?”


“లల్లీ! నీ ఆలోచన సమంజసం గానే ఉంది, నువ్వు నా ప్రక్కన ఉండి నటనలో భాగం పంచుకొంటానంటే నాకు ఎలాటి గిల్టీ ఫీలింగు ఉండదు. దీనిని ఒక గేమ్ లాగ  తీసుకొని పని చేద్దాం” అన్నాడు చరణ్.

శ్రీ లలిత తన పట్ల తన భర్తకి ఉన్న గౌరవానికి, ఆప్యాయతకి సంతోషించింది, ‘ఇలాంటి భర్త లభించడం ఎన్నెన్ని జన్మల నోముల ఫలమో కదా’ అని భావించింది.

విధి చేతివ్రాత ఎంత విక్రుతమైనదో పాపం ఆమెకి ఇంకా అనుభవం లోకి రాలేదు!!  
***********************************
 శ్రీ లలితా సూర్య చరణ్’లు తమ తమ సూట్’కేసులలో కేవలం బట్టలు, మందులు, పర్సనల్’ కార్డులు,  కాస్మెటిక్స్, అలాంటివే అత్యవసరమైన సామాన్లు మాత్రం సర్దుకొని వైభవ్ విల్లాకి బయలు దేరారు. తమ జీవితాలని పణం పెట్టి, మంజీర జీవితాన్నిచక్క దిద్దేందుకు! తమ షరతులన్నీ కేశవ్’గుప్త గారికి లిఖితపూర్వకంగా సమర్పించారు.

కేశవ్ గుప్త వారిని సాదరంగా ఆహ్వానించాడు, వారు విల్లాలో  అడుగు పెట్టిన క్షణమే సూర్య చరణ్ చేతికి అయిదు లక్షల రూపాయల చెక్కు అందించి, మీ ఇరువురిలో ఇష్టం వచ్చిన పేరు దాని మీద వ్రాసుకోమని అన్నాడు.సూర్య చరణ్  దాని పైన శ్రీ లలిత పేరు వ్రాసి, దానిని బ్యాంకులో జమ చెయ్యమని అతని చేతికే ఇచ్చాడు. అది చూసిన శ్రీ లలిత గర్వంతో తల ఎగుర వేసింది. సూర్య చరణ్’కి అధికారికంగా ఆరు నెలల ‘పైడ్ లీవు’ మంజూరు అయింది. సూర్య చరణ్’కి బదులు, కంపెనీ మేనేజరు స్థానంలో, డిప్యూటీ మేనేజరు చార్జి తీసుకొన్నాడు.

మంజీర, ‘తన ప్రైవేటు డిస్పెన్సరీలో ట్రీట్మెంట్’ తీసుకొంటోందని, ముందుగా తన ప్లానుని ఆ ఇద్దరూ అప్రూవ్ చేసి సెటిల్ అయ్యాక, ఆమెని విల్లాకి తెస్తానని చెప్పాడు కేశవ్ గుప్త. అంత వరకు ఆ విల్లాలో వారిద్దరూ స్వేచ్చగా విహరించ వచ్చని, తను  తన ఆస్పత్రి లోనే మంజీరతో పాటు నివసిస్తున్నానని ఆమె ఇంటికి వచ్చాకే వస్తానని అన్నాడు. ఇంటి పనులు చేయడానికి, గార్డెన్ పనులు చెయ్యడానికి,పని వారు యథావిధిగా వస్తారని, వారిని శ్రీ లలితనే మేనేజ్ చేసుకోమని చెప్పాడు. వంట కోసం రంగమ్మ కూడా ఉంటుందని కూడా చెప్పాడు. ఇవన్నిఅప్పగింతల తంతు లాగే జరిగాయి.

విల్లాలో మొదటి రోజు .....
ఉభయులూ ఇల్లంతా కలయ జూసారు, నాలుగు బెడ్ రూములు ఉన్నాయి. వాటిలో మాస్టర్ బెడ్ రూము లోపల ‘జకూజీ బాత్ టబ్’ ఉంది. పెద్ద హాలు, దానికి అనుబంధంగా వంట గది, ఆ ప్రక్కనే విశాలమైన డైనింగ్ టేబుల్ ఉన్నాయి. రూములన్నిటికీ కామన్ వరండా ఉంది. పెరట్లో శ్రద్ధగా పెంచి పోషించబడిన చక్కటి గార్డెన్ ఆ విల్లాకే శోభని చేకూర్చే లాగ ఉంది. ఆ గార్డెన్లో వారిద్దరూ దొంగాట ఆడుకొన్నారు.

అంతలో రంగమ్మ అక్కడికే కాఫీ పట్ట్టుకొని వచ్చింది. గార్డెన్లో ఒక రౌండ్ టేబుల్, నాలుగు కుర్చీలు, దాని పైన, పెద్ద ‘ఫాన్సీ అమ్బరిల్లా’ అమర్చ బడి ఉన్నాయి. కాఫీ అక్కడే కూర్చొని త్రాగారు.

రంగమ్మ వంట ఏం చెయ్యాలని అడిగింది. కూరగాయలు ఏమేమీ ఉన్నాయని అడిగితే, చాలా ఉన్నాయి అని, మీరు చెప్పిన తరువాత ఏమైనా అవసరమైతే తెప్పిస్తానని అంది. వెజ్, నాన్ వెజ్ ఏదైనా చేస్తానని చెప్పింది. వాళ్ళిద్దరూ ఛాయస్ రంగమ్మకే వదిలేసారు, ఆవిడ ఇష్ట పడి బాగా రుచిగా చేయ గలిగే వంట ఏదైనా ఒక వెజ్, మరొక నాన్ వెజ్ చెయ్యమని, ప్లైన్ రైస్, పప్పు, ఆవకాయ, పెరుగు, సలాడ్, వాటితో పాటు తయారు చెయ్యమని చెప్పారు. రంగమ్మ సరేనని కాఫీ కప్పులు తీసుకొని పోయి, సింకులో పడేసి, వంట ప్రయత్నంలో పడింది.

ఇక వారిద్దరికీ కావలసినంత తీరుబడి! కాసేపు కేరమ్స్ ఆడుకొన్నారు, మేగజైన్లు తిరగేసారు. చెరొక బాత్ రూములో వేడినీటి షవర్ బాత్ చేసారు. ఆ పైన రంగమ్మ చేసిన వంటకాలని ఇష్టంగా కబుర్లు చెప్పుకొంటూ, కామెంట్స్ చేసుకొంటూ తిన్నారు. ఆ తరువాత భోజనానంతర విశ్రాంతి కోసం మాస్టర్ బెడ్ రూములో దూరి అక్కడ సౌకర్యాలని గమనించారు. రాత్రికి అక్కడే పడుకోవాలని నిర్ణయించు కొన్న తరువాత, ఇద్దరూ దానికి బోల్టు వేసి, తక్కిన వాటిలో చెరొక రూములో చేరి పడుకొన్నారు. పగలు బాగా విశ్రమిస్తే  రాత్రంతా  హాయిగా సరదా తీర్చుకోవచ్చని ప్లాన్ చేసుకొన్నారు. వారిలో ఎవరికీ, ఎలాంటి ఆందోళనలూ లేవు, శృంగార జీవనాన్ని యదేచ్చగా,అర్థవంతంగా సరస మధురంగా మలచుకొన్న జంట వారు, అందుకే హాయిగా నిద్ర పోగలిగారు!

అదేమీ చిత్రమో ఇద్దరు ఒకేసారి నిద్ర లేచి తమ తమ రూముల్లోంచి బయటికి వచ్చారు. రంగమ్మ టీ. స్నాక్స్ పట్టుకొని వచ్చింది. లౌంజ్’లో కూర్చొని టీ సిప్ చేస్తూ మాట్లాడుకొన్నారు. శ్రీ లలితకి ఎంతో సంతోషంగా అనిపించింది, భర్త తనతో పాటు రోజంతా గడపడం! అలాంటి వేకేషను, అకేషను తన ఇంట్లోకూడా ఎప్పుడూ రాలేదని తల పోసింది.

సాయంత్రం గార్డెన్లో వాకింగ్ చేసారు, చెట్ల నీడలో దోబూచులు ఆడారు. తరువాత తొందరగానే డిన్నరు చేసి, తమ సరదా తీర్చుకోవడానికి మాస్టర్ బెడ్ రూములో ఎంటర్ అయ్యారు.ఆ బెడ్ రూములో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పెద్ద నౌక లాంటి మంచం, దానిపైన మెత్తని స్ప్రింగ్' మేట్రస్సు , దాని చుట్టూ నీలి  రంగు దోమతెర, బెడ్ పైన రక రకాల ఆకృతులలో మెత్తని కుషన్లు అమర్చి ఉన్నాయి. మంచానికి పైకప్పు మీద ఫాల్స్ సీలింగు అమర్చి, ఆ సీలింగులో దాగొని రంగు రంగుల కాంతులు ప్రసరించే లైట్లు, వాటిని ఒక థీమ్ ప్రకారం వెలిగించేందుకు రిమోటు ఉన్నాయి. 40 అంగుళాల ఎల్.ఇ.డి. టివి ఉంది. దాని రిమోట్, సైలంటుగా పనిచేసే ఏ.సి. రిమోటు కూడా ప్రక్క దగ్గరే ఉన్న కప్ బోర్డు మీద ఉన్నాయి. అలాంటి కప్ బోర్డులు చెరొక వైపు ఉన్నాయి. ఇక మ్యూజిక్ సిస్టం ద్వారా కావలసిన సంగీతాన్ని వినేందుకు అనువుగా ఎన్నెన్నో మ్యూజిక్ డిస్కులు ఉన్నాయి.

ఆ సౌకర్యాలన్నీ అనుభవించేందుకు మాత్రమే  ఆ ఇంట్లో ఎవరూ లేరు! యజమానులైన అన్నా చెల్లెళ్లు, ఇద్దరికీ జీవిత భాగస్వాములు లౌకిక జగత్తుని వదలి వెళ్లి పోయారు!!

ఈ రాత్రి  ‘రతీ మన్మథుల లాంటి శ్రీ లలితా సూర్య చరణ్’ల జంట’ ఆ బెడ్ రూములోకి ప్రవేశించారు!

“ఏదైనా కమ్మని కథ చెప్పండి, ఇది వరకు చెప్పిన వాటికి తీసిపోనిది, వాటి కంటె భిన్నమైనది, కెవ్వు కేక లాంటి కథ చెప్పండి” అని అడిగింది శ్రీ లలిత. “కథ నాకు నచ్చాలే గాని నా సర్వస్వం మీకు అర్పణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను” అని వయ్యారాలు పోయింది.

సూర్య చరణ్ ఆలోచనలో పడ్డాడు. ‘కథ నచ్చితే ఆమె సర్వస్వం తనది అవుతుంది, నచ్చక పోయినా అవుతుంది, కాని దానిని ఒకింత బలిమితో సాధించాలి! బలిమితో పొందేది వేరు, ఇష్టంతో సమర్పించ బడినది వేరు,ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది! ఎంత పెద్ద వ్యత్యాసమంటే మొదటి అనుభవంలో అది ఒకరికే సంతోషాన్ని ఇస్తంది, మరొకరి మనసుని గాయ పరుస్తుంది. రెండవ అనుభవంలో ఇద్దరికీ సంతోషం, మనోల్లాసం కలుగుతాయి. ఆ సుఖ సంతోషాలు ఒకే క్షణంలో కలిగితే దానినే, ‘ప్రేమ నుండి లభించే  సుఖానుభూతుల పరాకాష్టగా ’ చెప్పుకోవచ్చు. ఈ రాత్రి దానిని పొందాలంటే మంచి కథ చెప్పాలి’ అనుకొన్నాడు. “లల్లీ! ఒక చారిత్రిక చెప్తాను విను, ఈ కథ నీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కాని ఇంత వరకు చెప్పినవాటికి విభిన్నంగా మాత్రం ఉంటుంది. నీకు నచ్చితే నా బహుమతిని అడగ నవసరం లేదనుకో! కాని నచ్చక పోయినా కష్టపడి చెప్పినందుకు ఏదో రకంగా మూల్యం చెల్లించాలి, సరేనా?”

“నాకు సమ్మతమే, సూర్య చరణ్ గారూ! ఆదిలోనే ముందరి కాళ్లకి బంధాలు వేయకండి, ముందు కథ మొదలు పెట్టండి, మీరు అడిగే మూల్యం దానికి తగినట్లే ఉంటుంది” అంది శ్రీ లలిత.
************************



Comments

  1. అహో ! ఆంధ్ర భోజా ! అయ్యల శ్రీధరా !

    సూపర్

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీకు ఐయిదుపది సేతలు!మీ సాహిత్యాభిమానానికి డింగిడీలు! కథా శ్రవణాశక్తికి నెనర్లు!

      Delete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద