Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా!---8 (చిలక రథంలో సరదా షికారు -- పార్టు 2)


అవి కాకతీయ సామ్రాజ్యం అస్తమించిన రోజులు. క్రీ :శ: 1325 నుండి 1335ల మధ్య కాలం! దక్షిణాపథం(దక్ లన్), దక్షిణ దేశం (తమిళ), డిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగాలుగా ఉండేవి. వీటిని ‘దేవగిరి, తిలింగ్(తెలంగాణా), కంపిలి, ద్వార సముద్రం, మాబర్ (మధుర) అనే అయిదు రాష్ట్రాలుగా విభజించి పరిపాలించారని చరిత్ర కారులు చెప్తారు.  

ఆ రోజులలో అరాజక పరిస్థితి ద్రవిడ దేశంలో ఏర్పడింది! ధనవంతులు ధన నిమిత్తం పిడింపబడే వారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకి రక్షణ ఉండేది కాదు. సుల్తాను ఎంతో దూరంలో ఉండడం వల్ల అతని ప్రతిని ధులు స్వార్థంతో తమ తమ బొక్కసాలు నింపుకోవడం కోసం ఎన్నెన్నో దుష్క్రుత్యాలు చేసేవారు!      
   
ఇలా అరాజక స్థితికి లోనైన దక్షిణ భరత దేశానికి విముక్తి కలిగించడానికి,’కాకతి ప్రతాప రుద్రుని సేనానులైన తెలుగు నాయకులు ఆంధ్ర దేశం లోను, కర్ణాటకి పాలకుడైన, 3వ బళ్ళాలుడు విముక్తి ఉద్యమాలని నడిపారు. ఆంద్ర దేశం లోని ముక్తి సేనకి ప్రోలయ నాయకుడు నడుం బిగించాడు. అతనికికొంత మంది కమ్మ నాయకులు, రెడ్డి నాయకులు బాసటగా నిలిచారు. వారిలో మన కథానాయకుడు ధనంజయుడు ఒకడు.

ధనంజయ నాయకుడు శిల్పము, నాట్యము, చిత్ర లేఖనము లాంటి లలిత కళలలో ప్రావిణ్యం కలవాడు. అతను అశ్వరోహణము, గజా రోహణము, ఖడ్గ చలనము, మల్ల యుద్ధము వంటి సమర కళలను కూడా అభ్యసించాడు.

ధనికులు దోపిడీలకు గురి అవుతున్న ఆ రోజులలో , తమ సంపదని దాచుకొనే మార్గం తెలియక కొట్టు మిట్టాడుతున్న సమయంలో, కంచు బొమ్మలు తయారు చేసి, ఎన్నికైన వాటిలో రహస్యమైన అరలు ఏర్పాటు చేసి, గూఢ సంకేతంలో అవి తెరచుకొనే వీలు కల్పించి, ఆ అరలలో రత్నాలు, మణులు, వజ్రాలు దాచి, దోపిడీ బారినుండి తప్పించుకోగల ఉపాయం కనిపెట్టి, దానిని అమలు చేసాడు అతను. దోపిడీ దారులు బంగారం, వెండి, కాసులు మాత్రమే దోచుకొని పోయేవారు. కాని కంచు బొమ్మలని పట్టించు కొనే వారు కారు. ధనంజయుని యుక్తి ఫలించి, అతనికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.    

అలా ధనంజయుని సహాయం పొందిన వారిలో ఒక స్త్రీ మూర్తి కూడా ఉంది! ఆమె పేరు ‘అనితల్లి’. ఆమె అపురూప సౌందర్యవతి. చంద్ర బింబం వంటి ముఖము, కలువల కొలనుల లాంటి కళ్లు, ధనస్సుల లాంటి కనుబొమలు, సంపెంగ మొగ్గ లాంటి నాసిక, శ్రీకారాల లాంటి చెవులు, లక్క పిడత లాంటి నోరు, ఎర్రని బింబాధరాలు, తెల్లని ముత్యాల వంటి పలువరస, నవ్వితే చిల్లులు పడే బూరి బుగ్గలు, శంఖం లాంటి  మెడ, ఉన్నతమైన కుచ కుంభాలు, సింహ మధ్యమం లాంటి నడుము, రంభా స్తంభాల లాంటి తొడలు, గుహలాంటి లోతైన నాభి, అరటి దవ్వల వంటి చేతులు కలిగి, సర్వజన నయన మాదకమైన రూపము కలిగి, సౌందర్య ప్రదర్శన శాల వలె ఉండేది.

అనితల్లి దేవదాసి! బాల్యం లోనే ఆమె ముఖ కవలికలని గుర్తించి, ఆమె గొప్ప సౌందర్య నిధి కాగలదని అంచనా వేసిన, ‘రసిక జనాగ్రేసరుడయిన’ ఆ ఊరి మునసబు, పేదవారైన ఆమె తల్లి తండ్రులని ఒప్పించి, ఎనిమిదేళ్ల బాలికగా ఉన్నప్పుడే ఆమెని, ప్రౌఢత్వం నుండి, వార్థక్యం లోకి జారుకొంటున్న ఆ ఊరి దేవా లయ జోగినికి (దేవదాసి) ఆమెని తెచ్చి అప్పగించాడు. జోగిని తనకి తెలిసిన ఆట, పాట అని తల్లికి నేర్పి, ఆ పైన సాంప్రదాయ సిద్ధమైన నాట్యం నేర్పేందుకు గురువుల దగ్గరకి పంపింది. ఆమె జోగిని కానున్న దన్న విషయం తెలిసిన గురువులు, పిల్ల జమీందారులు, గ్రామ పెద్దలు ఆమెపై మోజుతో ‘కన్నెరికం’ చేయించేందుకు పోటీలు పడ్డారు! ముందుగా ‘గజ్జే పూజ’ చేసి, దేవాలయ ప్రాంగణంలో తన నృత్య విన్యాసా లు ప్రదర్శించి, భక్తిని రక్తిని కలబోసి నర్తించి, ప్రప్రధమంగా గురువుకే తన కన్నెరికాన్ని సమర్పించింది ఆమె. ఆ పైన తక్కిన వారు ఆమెను ఎగరేసుకొని పోయి అందలాలు ఎక్కించారు.

రసికులు ‘ఇనప గజ్జెల తల్లి’ కౌగిట చేరిన కారణంగా అనితల్లి సంపాదన నిల్చి పోయింది. కూడబెట్టిన సంపదని కంచు బొమ్మలలో దాచేందుకు, ధనంజయుని దగ్గరకు వచ్చింది అనితల్లి. అతన్ని చూసిన ఆమె, ఆమెని చూసిన అతను ఒకరి కోసమే ఒకరు అన్నంత తాదాత్మ్యం చెంది, గాఢ పరిష్వంగంలో ఏకమై, ఆత్మానుభూతిని పొందారు.

‘అందని దూరంలో ఉండేదే అందం! అందలాలు ఎక్కించే వాడు రసికుడు!’ అన్న భావన నుండి దూరమై, ‘నచ్చిన నాయకునికి నివేదన చేసేదే అందము! దరి చేరిన నాయికను ప్రణయ, పరిష్వంగంలో ముంచెత్తి, కామ క్రీడలలో ఓలలాడించే వాడే రసికుడు!’ అన్న వాస్తవం తెలుసుకొంది అనితల్లి.

అందానికి నిర్వచనమే అనితల్లి, ఆమె కడకంటి చూపులే మన్మథ శరాలు, నడుము వంపులే నాట్య విన్యా సాలు, బింబాధర చుంబనమే అమృత రసాస్వాదనము, గాఢమైన కౌగిలే స్వర్గమని తలచాడు ధనంజయ నాయకుడు. ఆమె చెప్పిన వాటిని ఎంతో తత్పరతతో నెరవేర్చాడు. రక రకాల కంచు బొమ్మలు, కళా కృతులు చేసాడు. అనితల్లి అతని సాంగత్యంలో సంపాదన మరచి, సంసారిక విషయాల పట్ల ఆసక్తి చూపిం చింది. ‘ఈత, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, సాము గరిడీలు నేర్చుకొంది. అయితే ఆ ప్రేమిక మిథునం యొక్క ఆనందం ఎంతో కాలం నిలవ లేదు!

అనితల్లి సౌందర్య ప్రశంస, సముద్ర దొంగ అయిన ‘నరసింహ సంబువ రాయల’ చెవిన పడింది. ఆమెను ప్రత్యక్షంగా చూసేందుకు,‘తుంగ భద్ర నదిలో’ తన పడవను తెచ్చిన సంబువ రాయలకి, ఆ నదీమ తల్లి ప్రవాహంలో ఈత కొడుతున్న అనితల్లి కనబడింది. జల క్రీడలాడుతూ, తడిసిన మేనితో,అప్సరసలని ధిక్కరించే అంద చందాలతో కనబడి అతనికి మత్తు ఎక్కించింది. సంబువ రాయలు, మదన తాపానికి తట్టుకోలేక పోయాడు!

సంబువ రాయలు వార్థక్యపు ఒడ్డున నిలిచిన మనిషి, అతని వయసు 65 ఏళ్లు! 6 గురు భార్యలు ఉన్నాసంతానం పొంద లేని నిర్భాగ్యుడు!సంతాన లేమి అన్న విషయాన్ని ప్రక్కన పెడితే, సంపాదనలో అతను చక్రవర్తి తుల్యుడు. కరుణ, జాలి లాంటి పదాల అర్థం తెలియని క్రురాతి క్రూరుడైన గజ దొంగ! అతని నాయకత్వంలో సుశిక్షుతులైన 500 మంది దొంగలు, శస్త్రాస్త్రాలు ధరించి, నిరంతరం అతని కనుసన్నల నుండి వెలువడే ఆదేశాలను అమలు పరిచేందుకు సంసిద్ధులై ఉండేవారు!

అనితల్లికి స్త్రీ సహజమైన రూప, హయ, వినయ, క్షమల లాంటి సరళమైన సౌమ్య గుణాలే కాక, ధావన, అశ్వారోహణ, ఖడ్గ చాలన లాంటి పౌరుష గుణాలు కూడా ఉండడం అతనికి ఎంతగానో నచ్చింది సంతానాన్ని  పొందితే, అది ‘అనితల్లి,’ దగ్గరే  పొందాలని, ఆమె  మాత్రమే  తన  లోటుని  నింపగల  సామర్థ్యం  గల  వనిత అని, సంబువ  రాయలు  అభిప్రాయ  పడ్డాడు.

అంతే! అతని కనుసన్నలలో మెలిగే అనుచరులకి,ఆదేశాలు అందాయి.మోసంతో, కపటంతో, దొంగల  లాగే, ఆమెని,  ఆమె  ప్రియునితో  సహా, అపహరించమని ఆఙ్ఞని ఇచ్చాడు. ప్రియుడెందుకు, అని అడిగిన  తమ్మునితో, ప్రియుడు  బయట  ఉంటే,  ఆమెని విడిపింఛే  ప్రయత్నం  చేస్తాడనీ,  ఆమెతో  పాటు తన  దగ్గరే  ఉంటే, అతని  ఉనికి  కోసమైనా,  తన  మాట  వింటుందనీ, అంతే  కాక, ఆ  ప్రియుని  ద్వారా, సంపద  రక్షించుకొనే  పనులు  చేయించుకో  వచ్చనీ, వాడిని బానిసలా వాడుకో వచ్చనీ  చెప్పాడు.

సంబువ  రాయిని  పథకం పారింది. ఒక వెన్నెల  రాత్రి,  మేడ  మీద  ప్రణయ  లీలలలో  మునిగి  తేలి, గాఢమైన  నిద్రాదేవి  పరిష్వంగంలో, పూర్తిగా, మునిగి  పోయిన ఆ  ప్రేమిక  మిథునాన్ని, త్రాళ్లతో  కట్టి, బంధించి, పడవ  లోకి  ఎక్కించారు  ఆ  సముద్రపు  దొంగలు. అలా  వారిద్దరినీ  బంధించి  తెచ్చి, తమ  నాయకుని  దగ్గర  ఈనాములు  పొందారా  ముష్కరులు !

అనితల్లికి, సంబువ  రాయలు  లాంటి, అరవై  అయిదేళ్ల  రసికులు   క్రొత్త  కాదు. కాని  జీవితంలో  తొలిసారి  ప్రేమలోని  మాధుర్యాన్ని, చవి  చూసిన  ఆమె  యీ  అపహరణని  భరించ  లేక  పోయింది  ధనంజయుని  తాను  ప్రేమించాననీ, తామిద్దరూ  వివాహితులనీ, తన  గర్భంలో  అతని  ప్రేమ  ఫలం  పెరుగుతోందనీ,  చెప్పి, తన  సంపద  నంతా  తీసుకొని, తనని  ప్రియునితో  పాటు,.వదిలి  వేయమనీ  చెప్పి, కన్నీరు  మున్నీరుగా  విలపించింది.
సంబువ  రాయుని  గుండె  ‘రాయి  కాదు, రాయి  అయితే  కరిగి  ఉండేదే!’ కంచు  కంటె  కఠిన మైనది.

అనితల్లి  దీనాలాపాలకి,అతనికి  నవ్వు వచ్చింది. “ఏమన్నావు? నిన్నువదిలెయ్యాలా! అది కూడా  ప్రియినితో పాటు! దానికి  బదులుగా నీ సంపాదన అంతా  ఇచ్చేస్తావా ?! ఈ సంబువ రాయినికి  దానమి చ్చినది  తీసుకోవడం  తెలియదు,  అడగడం  అంత కన్నా తెలియదు. నీ  సంపదను  నువ్విచ్చేదేమిటి ? నేను  అదెప్పుడో  దోచుకొన్నాను, ఇక  నీ  దగ్గర  మిగిలింది  నీ  రూప  సంపద మాత్రమే ! అది కూడా దోచుకోగలను, కాని అది నువ్విస్తేనే  బాగుంటుంది ! అందుకు  నీ  గర్భం లోని  ప్రేమ  ఫలం అడ్డని  చెప్తు న్నావు ఆ ఫలాన్ని తీసేస్తే, నీ  ప్రియుని  ఙ్ఞాపకాలు, పోతాయి. ముందుగా  ఆ పనిని,  చేయనియ్యి.” అంటూ  తన  భార్యలకి  ఏర్పాట్లు చేయమని ఆఙ్ఞనిచ్చాడు.

ఫలితం ! అనితల్లి, తన గర్భస్థ పిండాన్ని పోగొట్టుకొని, అయిదారు వారాల  లోనే,  తిరిగి  తన  జవ సత్వాలను  పుంజుకొంది. మొదటిసారిగా  పురుషుని  క్రౌర్యాన్ని  చవి  చూసిన,  అనితల్లికి  ప్రతిఘటన  చేసి  ఫలితం  లేదనీ,  సమయం కోసం ఎదురు చూడడమే మంచిదని, అర్థం చేసుకొంది. సంబువ   రాయునికి  లొంగి  పోయింది.

సంబువ  రాయుడు, ధనంజయునికి  సంకెలలు  తగిలించాడు. పడవ నడిపే కళాసుల మధ్య, కూర్చో బెట్టి, కొరడాలతో  కొట్టించాడు. పడవని వాళ్లతో పాటు తెడ్లు వేసి నడిపిస్తూ ఉండమని ఆదేశాలు జారీ  చేసాడు. ధనంజయునికి, తన  పరిస్థితి, అనితల్లి పరిస్థితి  అర్థమయింది. సరియైన సమయం వచ్చే వరకు  ఆత్మ  సమర్పణ  తప్పదని  నిశ్చయించుకొని,  కళాసులతో పాటు తెడ్డు వేసాడు. వారందరితోనూ కలిసి పోయి, పని తప్ప మరేమీ ఎరుగని వారికి, కథలు, చాటువులు, చెప్పాడు. పాటలు పాడి ప్రశంసలు  పొందాడు.  క్రమంగా  వారికి నాయకుడు  అయ్యాడు !

 అలా  ఆరు  నెలలు  గడిచింది.

ఆ ఆరు  నెలలలో  అనితల్లిని ,  ఒక్క రాత్రి  కూడ  వదలక  అనుభవించినా, సంబువ  రాయుడు ఆమెను తల్లిని చెయ్యలేక పోయాడు, సంతానాన్ని ఇస్తుందనుకొన్న ,‘అనితల్లి’కూడా నిరాశ పరిచే సరికి, సంబువ  రాయునికి  మొదటిసారిగా  విషాదం కలిగింది. ‘నాకు వారసుడెలా కలుగుతాడు, అందుకేమి చేయాలి ?’

దొంగల గురువైన,‘వల్లభుని’ దగ్గరకు వెళ్లాడు సంబువ రాయుడు, అనితల్లిని కూడా తీసుకొని!వల్లభుడు  అతని సమస్యనంతా విన్నాడు.“అనితల్లి గర్భవిఛ్ఛిత్తి చేసి, భ్రూణ హత్యని చేసావ్! సంతానాన్ని కనలేక  పోవడం నీ స్త్రీల  తప్పు కాదని, నీ  కెందుకు అర్థం కాదు! లోపం నీలోనే ఉంది! నీ వయసు కూడా ఉడిగి  పోతోంది, అందుకని ఎవరినైనా తెచ్చి, పెంచుకో! అనితల్లినే గాని బిడ్డని  కన నిచ్చిఉంటే, ఆ బిడ్డ నిన్ను ‘నాన్నా’ అనే  పిలిచేవాడు కదా! ఆ అవకాశాన్ని చేజేతులా పాడు  చేసుకొన్నావు !” అని మందలించాడు.

 “గురు దేవా! ఇంకా ఏదైనా మార్గం చూపించండి.”

“ఒకే ఒక మార్గం ఉంది! నీ రాణులలో, ఈ అనితల్లి  మాత్రమే గర్భధారణ చేసే వయసులో ఉంది. ముందు గానే  గర్భం  ధరించింది  కాబట్టి, ఆ  విషయంలో ఎలాంటి  అనుమానం లేదు, ఆమెకు గర్భాదానం చేసే  సామర్థ్యం నీలో లేదు! కేవలం భోగ్య వస్తువుగా అనుభవించే మగతనమే నీకు ఉంది! నీవు ఒక పని చెయ్యి.  న్యాయాన్యాయ విచక్షణ, ఉచితానుచిత  విచక్షణలని ప్రక్కకి నెట్టి,  సంతాన  భాగ్యాన్ని పొందడం కోసం, దోపిడీ చెయ్యి, అది నీకు అలవాటు  కదా ?!”

“మీ మాటలు  నాకు  అర్థం  కాలేదు గురువర్యా , ఎక్కడ  దోపిడీ  చెయ్యాలి ?!”

“దోపిడీ  చెయ్యాల్సింది  సంపదని  కాదు, సంతానోత్పత్తి  చేయగల  పురుష బీజాన్ని! దానిని తెచ్చి, అనితల్లి  గర్భంలో దాచాలి ! అప్పుడే నీ సంతానేచ్చ తీరుతుంది. ”

“అదెలా  సాధ్యం  గురుదేవా ?”

“అది  కూడా వివరంగా చెప్పాలా? అనితల్లికి ఇంకొక పురుషునితో గర్భాదానం చేయించు.  నీవు ఎలా పవిత్రుడివి కావో, అలాగే, ‘అది’ కూడా పతివ్రత కాదు! అందుకని సందేహించ వద్దు. అది వినా మరో మార్గం లేదు” అని కుండ బద్దలు కొట్టినట్లు నిష్ఠూరమైన నిజాన్నిచెప్పాడు వల్లభుడు.

“నా  తమ్మునితో చేయించ మంటారా ?”

“వాడితో  చేయిస్తే  అది తల్లి  కాగలదన్న,నమ్మకం ఏమిటి ? వాడికీ  ఉన్నారు ఇద్దరు రాణులు! కాని సంతానం ఎక్కడ ? ఇంతకీ  నీది, నీ  తమ్మునిదీ జన్మ రహస్యాల వైనం నీకు తెలుసా ?” అని  అడిగాడు వల్లభ  గురువు..

“గురుదేవా! శాంతించండి , నా కోటలో గాని ,నా పడవలో గాని,‘దీనిని’తల్లిని చేయగల యోగ్యుడైన  పురుషుడు ఎవరున్నారు ? మీకు అంతా తెలుసు, అందరూ  తెలుసు, మీరే  సెలవియ్యండి ”

“నేనేం చెప్పగలను ? ఉత్తమ సంతానం  కోసం, ఒక  పురుషోత్తముణ్నిఎంచి తీసుకు రావలసిన భాద్యత  నీది! అందుకే  దోపీడీ చేయమన్నాను !”

వారిద్దరి సంభాషణ అనితల్లి  వింటూనే  ఉంది. ఆమెకి  ఆ  సంభాషణ  వినోదంగానే ఉంది !చివరికి గురు దేవుడన్న ‘పురుషోత్తముడన్న  వ్యాఖ్య’ విన్న తరువాత, ఆమెకి  ధనంజయుడు గుర్తుకి  వచ్చాడు.  తరువాత  సంబువ  రాయుడి  ప్రశ్న,  “గురుదేవా ! శాంతించండి, నా  కోటలో గాని , నా  పడవలో  గాని, ‘దీనిని’ తల్లిని  చేయగల పురుషుడు, యోగ్యుడైన  పురుషుడు ఎవరున్నారు ? మీకు  అంతా తెలుసు, అందరూ తెలుసు, మీరే  సెలవియ్యండి ” అన్న అభ్యర్థన  గుర్తుకి  వచ్చింది. వెంటనే వచ్చిన  అవకాశం వదులుకో  కూడదని అనుకొంది. సిగ్గు విడిచి నోరు  విప్పింది,“గురు దేవా! ఈ సమస్యకి  నా దగ్గర  ఒక  ప్రస్తావన  ఉంది, మీరు అనుమతి  నిస్తే -” అంటూ  ఆగింది.

“చెప్పు అనితల్లీ సందేహించకు” అన్నాడు వల్లభుడు.
“మా పడవ లోనే  మీరన్న యోగ్యతలు గల పురుషుడు ఉన్నాడు.”

అనితల్లి  మాటలు, సంబువ రాయునికి  ఆశ్చర్యం  కలిగించింది. ‘ఎంత నిర్భయంగా మాట్లాడుతోంది!  తన తక్కిన రాణులకు ,ఈమెకీ  ఎంతో తేడా ఉంది! ఇంతటి  ఉత్తమ లక్షణాలు గల నాయికకి  పుట్టే  సంతానం తప్పక రాజు  కాగలడు!!’ అనుకొన్నాడు. ప్రకాశంగా, “ఎవడు వాడు ? నా  పడవ  లోనే ఉంటూ, నాకు  తెలియని  వ్యక్తిత్వం గల ఆ పురుషుడు ఎవ్వడు ?” అని అడిగాడు.

“ధనంజయుడు” నిర్భయంగా  చెప్పింది, అనితల్లి.
“ఆ బానిసా ?”

ఈ సారి  వల్లభ  గురుడు  కల్పించు  కొన్నాడు. “ఆమె  చెప్పిన మాట నిజమే! అతనిని బానిసని  చేసింది నువ్వు! పుట్టుక తోనే  అతను  బానిస కాడు. ‘శిల్పం, చిత్రలేఖనం, నాట్యం, గుర్రపు  స్వారీ, ఈత, కత్తి  యుధ్ధం’ అన్నీతెలిసిన వాడు, నాయక వంశంలో పుట్టిన నాయకుడు! వాడు ఒక్కడే నీకు అందుబాటులో ఉన్నపురుషుడు!”

“గురుదేవా! మీరు  సలహాని ఇచ్చాక, ఆచరించ కుండా ఎలాగుండ గలను ? మీరు అన్నట్లు అదేమీ  పతివ్రత  కాదు  గదా, అలాగే  చేస్తాను,” అన్నాడు  సంబువ  రాయుడు.

వల్లభుడు పంచాంగం చూసి శోభన ముహూర్తం  పెట్టాడు.“విను సంబువ రాయా! ఈ ముహూర్తానికి  నీ  పడవ లోనే సంధానం  చేయించు. మూడు  పగళ్లు, మూడు రాత్రులు వారిద్దరినీ ఏకాంతంలో ఉంచు. నువ్వు పడవ బయట, కోటలో ఉండు. నువ్వు దగ్గరగా ఉంటే వారిద్దరూ భయ పడతారు, సంకోచిస్తారు. ఆ  కార్యానికి కావలసిన సంతోషం, స్వచ్చంధ వాతావరణం లభించదు అర్థమయిందా? బీజారోపణకి ఆమాత్రం  సమయం వాతావరణం కావాలి.”

“అర్థమయింది  గురుదేవా!” అంటూ అక్కడి నుంచి బయలు దేరాడు  సంబువ రాయుడు.

అనుకోని విధంగా వచ్చిన అవకాశం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ  ప్రేమికులకి !!

ఆ రాత్రి వారు నిద్ర పోలేదు, అలాగని ‘రతికేళిలో’ ములిగి సమయాన్ని వ్యర్థం చేయలేదు. ఒకరి ఒడిలో మరొకరు ఒదిగి, ఆ బంధన నుండి, విముక్తి  మార్గం వెతికారు. దాని గురించి  రాత్రంతా  చర్చించుకొని, ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, పడుకొని నిద్ర  పోయారు.

మరునాటి సాయంత్రం  ఆ పడవలో నృత్య  ప్రదర్శన జరిగింది. అనితల్లి మనోహరంగా అలంకరణ  చేసుకొంది. అలా చేసుకొని అద్భుతంగా నృత్యం చేసింది.  ధనంజయుడు దానికి తగ్గట్లు ‘గాన  కచేరీ’చేసాడు. ప్రేక్షకులు అయిన   దొంగలందరూ, మస్తుగా  సారాయి  త్రాగారు. మత్తుతో, నాట్యాన్ని తిలకించారు. గమ్మత్తైన గానాన్ని విన్నారు, అంతకన్న గమ్మత్తైన నిద్ర మత్తు లోనికి  జారుకొన్నారు. సారాయిలో   కలిపిన మత్తు మందు వారందరి  పైన  ప్రభావాన్ని చూపింది.

ఆ  వాతావరణంలో  అక్కడున్న దృశ్యం మారి పోయింది. దొంగలు కళాసులై , కళాసులు బంధ విముక్తులై, ధనంజయ సేనగా మారారు. పడవ లంగరు తెంపుకొని  జల ప్రవాహం లోకి  పోయింది. ప్రేమ పావురాలు ఎగిరిపోయి, బంధ విముక్తు లయిన సేనతో సహా, ‘రాజకీయ సమాఖ్య ’ నాయకుడైన ,ప్రోలయనాయకుని   శరణు జొచ్చారు!!

ప్రోలయ నాయకుడు, తన  సేనతో  పాటు, ధనంజయుని సేనని కూడా కలుపుకొని, అదే  పడవలో  కోట,(అదే సంబువ రాయుని కోట ముట్టడికి) బయలు దేరాడు. పడవ లోని  దొంగలని కారాగారంలో  కట్టడి చేసే వెళ్లారు.

ఎదురు చూడని ఆకస్మిక దాడికి. సంబువ  రాయుడు అవాక్కయి పోయాడు! అయినా వీరోచితంగా  పోరాడి, చివరికి ధనంజయుని కరవాలానికి బలి పశువు అయ్యాడు.

ప్రోలయ  నాయకునికి  ఆ  కోటలో అపార ధన సంపద లభ్యమయింది! ఆంధ్ర దేశ విమోచనోద్యమం సంబువ రాయుని దుర్గ పతనం తోనే మొదలయిందని చెప్పవచ్చు. ఆ కోట పట్టడంతో ప్రోలయ నాయకుని మీద విశ్వాసం పెరిగిన, ఏరువని పాలిస్తూండిన తెలుగు చోడ  భక్తిరాజు వారితో కలసాడు.

ఆ తరువాత  గొదావరీ  తీరం  లోని ‘ రేకపల్లి’ కేంద్రంగా  ప్రోలయ  నాయకుడు,  విముక్తి  ఉద్యమాన్ని  నడిపాడు. అతడు వేంగీ విషయ వాసి అయిన  ప్రోచియ నాయకుని పుత్రుడు.  విముక్తి  ఉద్యమం  చాలా పటిష్టంగా జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా తీరాంధ్ర  దేశం, కాకతీయ సామ్రాజ్య  అస్తమయం తరువాత, మూడు నాలుగు ఏండ్ల లోనే అంటే, క్రీ: శ : 1326  నాటికే  విముక్తి పొందినట్లు తెలుస్తోంది.  అయితే ఆ ఉద్యమం పూర్తికాక ముందే  ప్రోలయ నాయకుడు చనిపోవడంతో  క్రీస్తు శకం  1330లో , అతని  పినతండ్రి  కుమారు డైన  కాపయ నాయకుడు ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

కాపయ నాయకుడు తెలంగాణాను విముక్తి చేసాడు. ఓరుగల్లు  పాలకుడైన ,‘నాయబ్ వజీర్ మలిక్  మక్బూల్ ’ యుధ్ధంలో ఓడి పారిపోయాడు. దాంతో ఆంధ్ర దేశానికి తిరిగి ‘ఓరుగల్లు’ రాజధాని  అయింది. పూర్వం కాకతీయులు పాలించిన రాజ్యంలో చాల భాగం కాపయ నాయకుని అధికారం లోకి వచ్చింది. అయితే  ఈ ఉద్యమ చరిత్రలో చిన్న అపశృతి కూడా దొర్లక పోలేదు!

అదే  స్వతంత్రమైన ‘కంపిలి’ రాజ్యాన్ని  ‘ఢిల్లీ  సుల్తాను’ తన వశం చేసుకొన్నాడు. ఓరుగల్లులో  ప్రతాప రుద్రునితో చేసిన యుద్ధంలో  ఓడిపోయి, పారి పోయిన  ‘హరి హర  బుక్కరాయల’ వంటి  వారికి ఆశ్రయ  మివ్వడమే, కంపిలి పాలకుడు,‘కంపిలి  దేవుని’ పొరపాటు! కంపిలి రాజ్యం శిధిలాల నుంచే, దక్షిణ భారత దేశంలో, మహోన్నతమైన హిందూ సామ్రాజ్యం అదే ‘విజయనగర  సామ్రాజ్యం’  హరిహర  బుక్కరాయల ఆధ్వర్యంలో  ఏర్పడింది.

అంత వరకు కథ చెప్పి సూర్య చరణ్ ఆశక్తితో శ్రీ లలిత ముఖం వంక చూసాడు. కథ ఆమెకి నచ్చిందో లేదో తెలుసుకోవాలని!

శ్రీ లలిత కథా శ్రవణంలో పూర్తిగా మునిగి పోయింది! చరణ్ బ్రేక్ తీసుకోవడం కూడా గుర్తించ లేక పోయింది. గుర్తించాక “ఆ తరువాత ఏమయింది?” అని అడిగింది.

“ఇంకా ఏం చెప్పాలి, చరిత్ర అంతా చెప్పాలా?”
“నేను అడిగేది దక్షిణ దేశ చరిత్రని గురించి కాదు, అనితల్లి, ధనంజయుల చరిత్ర గురించి.”

“ఏముంది, వారిద్దరూ ఏకమయి దాంపత్య బంధంలో బంధితులయి, హాయిగా జీవితం గడిపారు. వారిద్దరి పుత్రుడు గొప్ప సాహస వీరుడై, హరి హర, బుక్క రాయల సేనాపతి కాగలిగాడు.”

“చాలా గొప్ప చారిత్రిక కథ చెప్పారండీ! ఈ కథ విన్నాక నాకు మీతో ఒక ప్రత్యేకమైన విన్నపం చేసుకోవాలని అనిపిస్తున్నాదండీ!”

“విన్నపాలు తరువాత, ముందు నా బహుమతి నాకు దక్కాలి, అందుకు సిద్ధమో కాదో చెప్పు.”
“అయ్యో, నేను చెప్పేదీ అదేనండీ! మీ బహుమతిని మీకు ఇవ్వకుండా ఎలా ఉండ గలను, ఈ శ్రీలలిత మాట అంటే మాటే! ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి!”

“సరే! ఒక్క మాటలో చెప్పు, సమయం వృధా చెయ్యకుండా!”
“నాకు గర్భం ధరించాలనే కోరిక కలిగిందండీ!”
చరణ్ ఆశ్చర్యంతో శ్రీ లలిత వంక చూసాడు, “ఏమంటున్నావు లల్లీ! గర్భధారణ నా చేతిలో ఉందా?”
“మన ఇద్దరి సంకల్ప బలం కలస్తే , కలగక ఏం చేస్తుందండీ!”
“సంకల్ప బలాలు కలియాలా! కాస్త వివరంగా చెప్పు.”

“అనితల్లి ధనంజయుల కథ విన్నాక, నాకు కూడా సంతానాన్నికనాలని దృఢమైన కోరిక కలిగింది.ఈరాత్రి  మనం కూడా ఈ నౌక లాంటి మంచం మీద, మనకి సంతానం కలగాలనే కోరికతో, సంకల్పంతో సమయాన్ని సద్వినియోగం చేసుకొందాం! నేను అదే మనసుతో, మీకు బహుమతిగా నన్ను నేను ఆత్మార్పణ చేసు కొంటాను. మీరు నన్ను తల్లిని చేయాలనే ఆలోచనతో  చేర దీయండి.”

“అంటే ఈ కలయిక చారిత్రాత్మికమయినది కావాలని అంటావు, అంతేనా?”
“అవునండీ! మీరు ఇచ్చిన చనువు తోనే సిగ్గు విడిచి, అడుగుతున్నాను, ”
“సిగ్గు విడిచానన్నావు ఒప్పుకొన్నాను, మరి చీర విడువలేదేమి!!”

“పొండి! ‘లలనామణి తనంత తానుగా వలువలు విడనాడుతుందేమిటి!’ ఆ సిగ్గుమాలిన పనిని వరించి వచ్చిన పురుషుడే చెయ్యాలి!”      

సూర్య చరణ్ ఆ చమత్కారానికి నవ్వుకొన్నాడు కాని బయట పడలేదు! “చూడు లల్లీ! సమర్పణకి సిద్ధ పడినది నువ్వు, సమర్పణలో షరతులు ఉండకూడదు! అందు వల్ల సిగ్గుమాలిన పనులన్నీ నువ్వే చెయ్యాలి.”

“అలాగే మహానుభావా! మాట ఇచ్చాక ఎలా తప్పగలను?” అంటూ తన చేతులని వీపు వెనక పోనిచ్చి, జాకెట్టు జిప్పుని తొలగించింది. తరువాత ఆ చేతులని నడుము వెనకకి చేర్చింది.“నా మనోభవుడా!విజయాన్ని సాధించిన మీకు నా బహుమతిని ఇస్తున్నాను. నా కటి బంధం సడలించాను, నాభిని కరచి  పట్టుకొన్న చీర కుచ్చెళ్లు  కూడా బయట పడ్డాయి. ‘బ్రా-- పెటీ కోటులు ’నేను ధరించనే లేదు! మీ కుడిచేతి చూపుడు వ్రేలికి చిన్న పని కల్పించండి. అవి మరుగున పెట్టిన అందాలు బయట పడతాయి!” అంది.

సూర్య చరణ్ ఆమె మాటలకి ముచ్చట పడ్డాడు, కాని తృప్తి పడలేదు! " వలువల మాట సరే! చెవులకున్న జుంకాలు తక్కిన అలంకారాల మాట ఏమిటి?" అని అడిగాడు.

శ్రీ లలిత విస్తు పోయింది! " ఏం నా చెవులకి జుంకాలు బాగు లేవా?"
"నీ చెవులు 'జిలేబీ చుట్టల్లాగ ఉంటాయి! రసాస్వాదనకి వాటికి అలంకరించిన జుంకాలు అడ్డుపడవా మరి?!"
శ్రీ లలిత ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ జుంకాలని, ముక్కేరనీ, నల్ల పూసలు తప్ప తక్కిన కంఠ హారాల్నీ తొలగించింది. అలా వాటిని తీస్తూనే, చరణ్;కి మరో మాట అనే అవకాశం ఇవ్వకుండా జాకెట్టుని చేతుల మీదనుంచి తనకు తానే విప్పేసింది. ఆ పైన నిటారుగా నిలబడి చీరని జార విడిచింది! ఆ పైన తన సంకల్పం చెప్పుకొంది.“ప్రాణ నాధా! నేను మీ సంతానానికి తల్లి కావాలనే కోరికతో నా సిగ్గంతా వదులుకొని, త్రికరణ శుద్ధితో మీ చెంతకి చేరాను. నాలాగే సంకల్పం చెప్పుకొని, ఇక పండగ చేసుకోండి” అంది శ్రీ లలిత.

సూర్య చరణ్’ ఆమె మాటల లోని ధృఢమైన  భావాన్ని గ్రహించి, “దేవుడా! నా ప్రాణ ప్రియ లల్లి కోరిక తీర్చేందుకు నేను సంకల్పం చేసుకొంటున్నాను! ఈ జవ్వని  సుక్షేత్రంలో, నా దోష రహితమైన బీజాన్ని అనుసంధానం చేసి, ఆమెని అంకురితురాలినిగా చేయి!" అంటూ ఆమెని తన సందిట బంధించాడు.

ఆ విధంగా మూడు రాత్రులు నిర్విఘ్నంగా ఆ ప్రేమిక మిథునానికి కానుకలా గడచాయి. ఆ మూడు రాత్రులూ  శ్రీ లలిత, సూర్య చరణ్ అభిలాషకి అనుగుణంగా తనులతని అలంకరించుకొని, తన సంకల్ప సాధన కోసం ఉద్యమించి, తనను తానుగా  అతనికి సమర్పించుకొంది! సూర్య చరణ్  ఆ అందాల బొమ్మ యవ్వన మాధురిని,‘గండు తుమ్మెద, లేలేత కెన్దమ్ముల (ఎర్ర తామరలు) జుంటి తేనెని జుర్రుకొన్నట్లు’, తన చూపులతో, తన అధరాలతో, తన చేష్టలతో,తన నాలుకతో,తన చేతులతో, తన సర్వంగాలతోనూ  జుర్రుకొన్నాడు. శ్రీలలిత అతని స్వేచ్చని అనురాగంతో ఆమోదించి ఆనందించింది!!  
*************************

Comments


  1. అయ్య బాబోయ్ :) కథని ఎక్కడి నించి ఎక్కడి కి లాక్కుని వెళ్లి పోయేరండీ :)

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ