Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా! 14 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )


శ్రీ లలిత  భర్త దగ్గరకి వెళ్ళాలని నిర్ణయించు కొన్నట్లు, సాగర్  అత్తయ్య మామయ్యలతో చెప్పాడు.అతని నుండి పిలుపు కోసం ఎదురు చూస్తోందని, ఈ లోగా దుఖాన్ని మరచి పోయేందుకు తన దగ్గర కొన్ని వ్యక్తిత్వ వికాస పాఠాల ట్రైనింగు తీసుకొంటుందని కూడా చెప్పాడు.

పినాక పాణి, మీనాక్ష్మమ్మలకి కూతుర్ని ఒంటరిగా వదలి ‘అరటి పాడుకి’ వెళ్ళడానికి మనస్కరించ లేదు. సాగర్ ఆమెకి ధైర్యాన్ని ఇచ్చేందుకు పూనుకోవడం వాళ్లకి సంతోషాన్ని కలిగించింది. కూతురు భర్త దగ్గరకి వెళ్లి పోతుంది, రాజీ పడి బ్రతుకు గడుపుతుందన్న విషయం భాధాకరమైనా, ఆమె తనంత తానుగా ఆ నిర్ణయం తీసుకోవడం మంచికే అని భావించారు. పోలీసు కంప్లయంటులు, కోర్టుకి అపీల్లు చేయడం దండగ అని చేయడం మానేసారు. ఇది వరకు కేశవ్ గుప్త మీద చేసిన పోలీసు కంప్లయంటు వెనక్కి తీసుకొన్నారు.

మీనాక్షమ్మ వంటింటి పని అంతా, తన భుజాల మీదనే వేసుకొంది. కూతురికి సాగర్ దగ్గర ట్రైనింగు అయేందుకు పూర్తిగా సహకరించింది. అదేమి ట్రైనింగు, ఇప్పుడు ఎందుకు అని వాళ్ళు అడగ లేదు.

‘ఆమె వివాహం చేసే ముందు, వరుని ఆను పానులు వివరంగా తెలుసుకోకుండా, తొందర పడి ముడి పెట్టేసామన్న, ‘అపరాధ భావన’ వాళ్లకి మరే ప్రశ్నలూ వేసే సాహసాన్ని ఇవ్వలేక పోయింది! ఆమె భవిష్యత్తు గురించిన ఆలోచన ఆమె స్వయంగా తీసుకొంటున్నప్పుడు మనం ఎందుకు ఆపాలి!’ అనుకొన్నారు వాళ్లు.

ఆ విధంగా 15 రోజులు గడచి పోయింది!

ఈ 15 రోజులలో శ్రీ లలిత చాలా కష్ట పడింది. పద్మాసనం వేసుకొని, దీక్షతో, ఏకాగ్రతతో మంత్రాలు చదివింది. మెదడులో ‘భావ శూన్యతని’ సాధించి తన ‘అవచేతన మస్తిష్కాన్ని’ జాగరూకం చేసింది! ఇంచు మించుగా సమాధి స్థితిని చేరుకో  గలిగింది. ఫలితంగా జ్ఞానేంద్రియాల పరిమితులని హెచ్చించి, వింత అనుభూతులని స్వంతం చేసుకొంది!

కంటికి కనిపించని వస్తువుల స్వరూప స్వభాబాలని తర్కించి తెలుసు కోవడమే ‘ప్రతిభ’.

వాటి శబ్ద తరంగాలని విన గలగడం ‘శ్రవణ’.

అలాంటి వస్తువుల స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకో గలగడం “వేదన’.

అదృశ్య వస్తువులని చూడ గలగడం ‘అదర్శ’.

వాటి రుచి గురించి  తెలుసుకోవడం  ‘ఆస్వాద’.

పొతే‘వాత’ శక్తి  అలాంటి వాటి వాసనలని పోల్చడం.

వీటిని సాధించిన నాడు, ‘టేలిపతీ’ వశమవుతుంది!

ఇవన్నీ క్రమంగా ‘మెదడు, చెవులు, చర్మము, కళ్లు, నాలిక, నాసిక’ లాంటి ఇంద్రియలకి పరిమితులని పెంచి, వాటికి  ఈ  శక్తులని  లోబడేలా చేస్తుంది!

తను సాధించిన  శక్తులని పరీక్ష చేసేందుకు సాగర పెట్టిన పరీక్షలకు తట్టుకొని, నిలబడి ఉత్తీర్ణతని సాధించింది శ్రీ లలిత.

ఈ విద్యల సాధనలో ఆమె తన కష్టాన్నంతా మరచి పోయింది. ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, పెంచుకొని ఆమె మెదడు పరిపక్వతని పొందింది.

నిజమైన ఆనందం, ‘గుప్తేం ద్రియాల రతి క్రియలో’ లేదని, అది కేవలం ‘శ్రుంగార రసానుభూతిని’ మాత్రమే ఇస్తుందని, అదే రకమైన అనందం, మెదడులో భావ శూన్యతని సాధించి, ‘ఆత్మానందం’  పొందడం ద్వారా అనుభవించ వచ్చని, ఆ  పద్ధతి ఉత్తమోత్తమమని ఆమె తెలుసుకొంది.

సాగర్’తో పరిచయం వల్ల తన జీవితంలో రెండవ అధ్యాయం మొదలయిందని సంతోషించింది.      

ఆ రోజు శ్రీ లలిత పేరు మీద మరొక ‘కొరియర్’ వచ్చింది. అందులో కూడా ఒక కవరుత్తరం ఉంది. శ్రీ లలిత దానిని విప్పి చదువుకొంది.

డియర్ లల్లీ!

ఈ 15 రోజులు నా మనుష్యులు నిన్ను  క్లోజుగా అబ్జర్వు చేసారు. నువ్వు పోలీసుల దగ్గరకి, కోర్టులకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి, ఏవేవో ‘యోగాసనాలు’ నేర్చుకొంటున్నావని తెలిసింది. దీని ద్వారా నాకు అర్థమయిందేమిటంటే  నీకు నా మొదటి ఆప్షన్ నచ్చిందని!

నన్ను కలుసుకోవాలంటే వచ్చే మంగళ వారం నాడు, సాయంత్రం 4 గంటలకి, మ్యూజియం’ గేటు దగ్గర నిలబడి ఉండు. నువ్వు నీ కట్టు బట్టలు తప్ప ఇంకేమీ తేనవసరం లేదు. నీ పర్సనల్ సామాన్లు, ఐ.డి. కార్డులు, బేంకు చెక్కు బుక్కులు, వగైరా తెచ్చుకొంటే చాలు!

నీ వెనకాతల నీ లాయరు చుట్టం వచ్చినా, ఇంకెవరైనా పోలీసులు ఏజెంట్లు కనిపించినా, నేను  నీ దగ్గరికి రాకుండా తిరిగి వెళ్లి పోతాను. బుద్ధిగా, ఒంటరిగా నన్ను కలిసేందుకు, నాతొ సహ జీవనం గడిపేందుకు తయారయి వస్తే, నిన్నుఅందలం ఎక్కిస్తాను. మనమిద్దరం, సారీ! మనం ముగ్గురం హాయిగా, ఆనందంగా కాలం గడప వచ్చు!

నీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నీ చరణ్ !

అంతే ఉంది ఆ ఉత్తరంలో! దానిని కూడా సాగర్’కి  చూపించింది శ్రీ లలిత. అతను దానిని చదువుతూ ఉండగానే, “సాగర్  బావా! ఒక విషయం చెప్పనా?” అని అడిగింది.

“ఏమిటది లలితా?”

“నేను యోగాసనాలు నేర్చుకొంటున్నానని చరణ్’కి ఎలా తెలిసింది? ఈ గదిలో గాని ఈ ఇంట్లో గాని గుప్త కెమేరాలు ఉన్నాయా?”

“అలాంటివి ఉన్నాయని నీ అనుమానమా?”

“అవును, ఎందుకంటే, నా భర్తతో గడపిన మధుర క్షణాల గురించి, ఇది వరకు నా కిడ్నాపర్లు నాతోఎంతో అసహ్యంగా చర్చించారు! అప్పుడే నాకు అనుమానం వచ్చింది. కాని ఆ తరువాత కేశవ్ గుప్త నన్ను కాపాడి ఇంటికి తీసుకొని వెళ్లి మర్యాదలు చేసి, మొబైలు ఫోను ఇవ్వడంతో అంతా మరచిపోయాను! ఈ ఇంటిలో ఏవో విచిత్రాలు ఉన్నాయి అని తోస్తోంది.” అంది శ్రీ లలిత.

“చూసావా నీ  ‘ప్రతిభ’(మెదడు యొక్క శక్తి) పని చేస్తోంది! ఇప్పుడు నీ ‘అదర్శకి’ (కళ్ళ యొక్క అదృశ్య దర్శన శక్తి) పదును పెట్టు! కెమేరాలు ఉంటే అవి తప్పకుండా కనిపిస్తాయి” అన్నాడు సాగర్.

శ్రీ లలిత వెంటనే పద్మాసనం వేసుకొని కూర్చొంది. తన అదర్శ శక్తిని ఆహ్వానించి, దానితో ఆ గదిలోనే ఉన్న కెమేరాలని గుర్తించింది. వాటిని చేసైగతో సాగర్’కి చూపించింది. సాగర్ వెంటనే ఆయా కేమేరాలని నిష్క్రియం చేసాడు!

శ్రీ లలితకి కన్నీరు ధార కట్టింది! “ చూసావా బావా! చరణ్ ఎంతకీ తెగించాడో! నా సంసార జీవితాన్ని బట్ట బయలు తీసాడు!!

అతను నా యవ్వన  మధురిమలని దోసిళ్ళతో జుర్రుకొన్నాడు!! నేను మంద మతిని!! అతనినే  నా స్వామిగా, సర్వస్వంగా భావించి, స్త్రీత్వానికి కొలబద్ద అయిన నా సర్వాంగసుందరమైన శరీరాన్ని, ఏదీ దాచుకోకుండా సమర్పించు కొన్నాను! పృధ్వి లోని ఏ భార్యా , భర్తకి చూపించడానికి వెనుకాడే, అందాల లోతులు అతనికి చూపించి కనువిందు చేసాను!! దుర్మార్గుడు ! వాటిని ఫోటోలు తీసాడు!! ఎందరు వాటిని ఎన్ని రకాలుగా చూసారో ఏమో!”అంటూ వాపోయింది.

సాగర్ పరిస్థితి యొక్క తీవ్రతని గుర్తించి, మౌనం వహించాడు. ఏమని  ఓదారుస్తాడు గనుక! ఇది స్త్రీ యొక్క మాన మర్యాదలకి సంబంధించిన విషయం! పురుషుని నయవంచనకి లోనయిన వనిత స్వాభిమానానికి చెందిన విషయం! మగని కుటిల నీతికి బలి అయిన మగువ యొక్క ఆత్మగ్లానిని ప్రేరేపించిన విషయం!

మౌనంగానే తన సంవేదనని ప్రతిభా తరంగాల ద్వారా ఆమెకి అందించాడు. ఆమె దానిని అందుకొని వాస్తవానికి వచ్చి, కళ్లు తుడుచుకొంది.

“శ్రీ లలితా ! మంగళ వారం ఇంకా 6 రోజులు ఉంది. ఈ లోగా నీ సాధనని మరింత పరిష్టంగా చేసుకో వచ్చు! చివరి సారిగా చెప్పు, నువ్వు వెళ్ళడానికే నిశ్చయించుకొన్నావా?” అడిగాడు సాగర్.

“అవును బావా! ఈ ఇంట్లోనే దాగి ఉన్న ‘మూడో కన్నుని’ గుర్తించాక, నాకు చరణ్’తో పోరాడాలనే  ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన వలసి వస్తుందో తెలియదు! అయినా వెళ్ళడానికే తయారుగా ఉన్నాను.” అంది శ్రీ లలిత.

మంగళ వారం రానే వచ్చింది. శ్రీ లలిత తల్లి తండ్రులకి, సాగర్’కి ‘గుడ్ బై’ చెప్పి, ఒక టాక్సీలో మ్యూజి యంకి వెళ్లింది. అప్పటికి సాయంత్రం పావు తక్కువ నాలుగు అయింది. మ్యూజియం గేటు దగ్గర దిగి, అక్కడే నిలబడి, దిక్కులు చూడ సాగింది.

నల్లని బురఖాలో ఉన్న ఒక స్త్రీ అక్కడకి వచ్చి, “శ్రీ లలిత అంటే మీరేనా?”అని అడిగింది.

“అవును నేనే శ్రీ లలితను.”జవాబు ఇచ్చింది.

“ఇదుగో ఇది చూడండి.” అంటూ ఒక చిన్న విజిటింగు కార్డు తీసి చూపించింది ఆమె! ఆ కార్డు  మీద, ‘నల్లని ఫోర్డుకారు, నెంబరు 2648 అని వ్రాసి ఉంది’.

“నల్ల రంగు ఫోర్డు కారు ఎడమ వైపు బౌండరీ చివరి వరకు వెళ్తే వస్తుంది. నెంబరు చూసి దాని మీద ఎక్కండి.” అంది ఆ బురఖా యువతి.

‘సరే’నంటూ ఎడమ వైపు గల కార్ల  వరుసలలో నల్లని ఫోర్డ్ కారు గురించి వెతక సాగింది శ్రీ లలిత. చివరగా పార్క్ చేసి ఉంది ఒక కారు. శ్రీ లలిత ఆ కారు డోరు తీసింది.

“వెల్కం టు  హోమ్ లల్లీ!” అంటూ చరణ్ డ్రైవెర్ సీటులో కూర్చొని కనిపించాడు. అతను ఎప్పటి లాగే నవ్వుతూ ఉన్నాడు. ఒకప్పుడు అయితే ఆ నవ్వు కోసం శ్రీ లలిత పడి చచ్చేది ! మారిన నేపథ్యపు విలు వల వలన, ఇప్పటి చరణ్ నవ్వులో ఆత్మీయత లోపించినట్లు అనిపించింది శ్రీ లలితకి. ఆమె హుందాగా డ్రైవెర్ సీటు ప్రక్కనే కూర్చొని, “థాంక్స్ చరణ్!” అంటూ విష్ చేసింది.    

“లల్లీ! నీ రాక నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మాటలతో చెప్పలేను. భార్యా భర్తల బంధం చాల గొప్పది లల్లీ! వాళ్లు ఒకరి సుఖ దుఖాలు మరొకరు పంచుకోవాలి, అంతేగాని లాయర్లతో సంప్రదించి సంసార జీవితాన్ని పాడు చేసుకో కూడదు! నువ్వు ముందు చెప్పుడు మాటలు విన్నా, నా ఉత్తరం చూసాక నా దారి లోకి వచ్చావు, అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నీకు ఎలా ఉంది లల్లీ?”

“మీరు అన్న మాటలు అక్షర సత్యాలు చరణ్! భార్యా భర్తల సంబంధం విలువైనదే! కాదనను, కాని భర్త తీసుకొనే నిర్ణయాలు ముందుగానే భార్యతో చర్చించి తీసుకొని ఉంటే అపోహలకి తావు ఉండదు,లాయర్లు పోలీసుల అవసరమూ ఉండదు! మోసంతో పనులు సాధించుకోవాలని అనుకొంటేనే తేడా వస్తుంది!”

“ఓహ్! కమాన్ లల్లీ! సారీ టు ది ఇన్ కన్వీనియన్స్! ఇంత వరకు, నువ్వు నవ్వుల పువ్వులు పూయించనే  లేదు!! మై గాడ్, నవ్వుని నీ చుట్టాల దగ్గరే వదిలేసి వచ్చావా?”

“పూయిస్తే ఏం చేసి ఉండేవాడివి, ఫోటోలు తీసేవాడివా?” నర్మ గర్భంగా అడిగింది శ్రీ లలిత.

చరణ్’కి ఆమె మాటలు విస్మయాన్నికలిగించాయి.‘ఫోటోలు అంటున్దేమిటి! కొంపలో కెమేరాల గురించి తెలిసి పోయిందా ఏమిటి ఖర్మ! అయినా ఈ అరటి పాడు పల్లెటూరి అమ్మాయికి అంత సీను కూడానా?’అని అనుకొన్నాడు. ప్రకాశంగా “వై నాట్ లల్లీ !  ఫోటోలు తీసి దాచుకో తగ్గ నవ్వులే నీవి!” అని అన్నాడు.

శ్రీ లలితకి అతని ఆలోచన తెలిసి పోయింది, ‘అరటి పాడు అమ్మాయి తెలివి తేటలు నువ్వు ఎక్కడ చూసావు చరణ్!’ అని అనుకొంది. ‘అతని మాటలకి,  పాత శ్రీ లలిత అయితే పడిపోయి ఉండేది’’అని కూడా అనుకొంది. అయినా సంతోషాన్ని నటిస్తూ అంది, “ థాంక్స్ చరణ్! మావారు మారి పోలేదు! అందుకు సంతోషమే! కాని...”

“మాట మధ్యలో ఆపేసావేమి లల్లీ! నేను నీ హబ్బీని! నాతో నువ్వు ఏ రహస్యాలైనా షేర్’ చేసుకోవచ్చు!”

“షేర్ చేసుకో వలసిన సంతోషమే చరణ్! ఇక మీద నాతో మీ  ప్రవర్తన నియమావళిలో మార్పులు రావాలి! కేవలం ‘చిలిపి చేష్టలు , కౌగిలింతలు, ముద్దులు’ ఇవి మాత్రమే అనుమతింప బడతాయి! ‘సే నో టుసెక్స్’అర్థమయిందా?”  

“వాట్, ఈజ్ ఇట్ ట్రూ ! సెక్స్  ప్రోహిబిటేడ్’డా? అన్యాయం లల్లీ! నేను అంత నేరం ఏం చేసాను?”

“నేరమే చేసారు, నన్ను తల్లిని చేసి...” అంటూ సిగ్గు పడింది శ్రీ లలిత.

“నిజమా! ఆ హవేలీలో మనం గడపిన మూడు రాత్రులు ఫలవంత మయ్యాయి అన్నమాట!”

“అవును, నేను ఆ సంకల్పంతోనే మీ చెంత చేరాను కదా, అది నిజమయింది! ఈ విషయం ముందుగామీకు చెప్పడానికి మీరు అందుబాటులోఉంటే కదా? నాకు మెసేజ్ ఇచ్చి నన్ను పుట్టింటికి పంపించేసారు.”

“ఓ రియల్లీ! అయాం సారీ!” అన్నాడు చరణ్.

“సరి లెండి” జయ నగరం సరిహద్దులు దాటడం గమనించి అడిగింది శ్రీ లలిత. “మనం ఎక్కడకి వెళ్తున్నాం?” అని.

“ఊరి చివర ‘ఫారం హౌస్’కి వెళ్తున్నాం, మన క్రొత్త నివాసం అక్కడే! చాలా బాగుంటుంది, నీకు నచ్చుతుం
దనే అనుకొంటున్నాను. నన్ను తండ్రిని చేస్తున్నావు కదా, ఆ సంతోషాన్ని ఇక్కడే సిలబ్రేట్ చేసుకొందాం” అన్నాడు చరణ్.

“మంజీర కూడా ఉందా?”
“ఉంది, ఎక్కడకి పోతుంది? ఈ చరణ్’ని ఎవరు పోగొట్టుకోగలరు!తను కూడా సంతోష పడుతుంది.”
“ఆమెకి ఇంకా ఏమీ లేదా?”

“అప్పుడే ఏమవుతుంది, తనతో నేను కలసి నెల రోజులు కూడా కాలేదు కదా! ప్రస్తుతం గుడ్ న్యూస్ ఏమిటంటే ఆమె చాల వరకు కుదుట పడింది.”

“ఇప్పుడు నా రాక వల్ల, ఆమె అప్సెట్ కాదు కదా?”
“అవదు, ఆ విషయం గురించి ఆమెతోచర్చించాను. మీరిద్దరూ బాగా కల్సి పోగలరని భావిస్తాను.”
“నేను కూడా పాజిటివ్’గానే ఉంటాను.”
“దట్స్ గుడ్, లైక్ మై లల్లీ!”

కారు ఫారం హౌసు వద్దకి వచ్చి ఆగింది. ఇద్దరు కారు లోంచి దిగారు, “అక్కడే ,ఉండండి ఇప్పుడిప్పుడే లోపలికి  రావద్దు.” అంటూ మంజీర వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపింది. తరువాత లోపలి వెళ్లి ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకొన్న హారతి పళ్లెం పట్టుకొని వచ్చింది.

శ్రీ లలితకి ఈ రకమైన స్వాగతం నచ్చింది!
     
************************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ