Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా! --17 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )

“కథ బాగానే ఉంది, కాని నీ  పోలిక ఏమీ బాగులేదు అంతేకాదు, నీ మాటలు నమ్మ శక్యం కావడం లేదు” అంది మంజీర.

“అయితే అతనినే ఈ రోజు నిలదీసి అడుగు” అంది శ్రీ లలిత.

“సరే! ఈ రోజే అడుగుతాను, నీ మాటలు నిజమవునో కాదో, అవి నీ భ్రమలే అయితే, నువ్వు ఇంకాకుదుట పడనట్లే!”అంది మంజీర.

ఆ రోజు రాత్రి శ్రీ లలిత ఒంటరిగానే తన గదిలో పడుకొంది. ‘తను ప్రెగ్నెన్సీ నెపంతో చరణ్’ని దూరంగా ఉంచడం వల్ల తన కంటె, చరణ్’కే  ఎక్కువ లాభం కలిగిందని తెలుసుకొంది ఆమె. ఇప్పుడు అతను ఆ అందాల బొమ్మతో ఆడుకొంటున్నాడు. ఆమె అడిగిన దానికి, నవ్వేసి, ‘లల్లీ అలాగే మాట్లాడుతుంది, అది పిచ్చిది’, అని డిక్లేరు చేసేసి, ఆమెని కౌగిట్లోకి తీసుకొని మత్తులో పడేసి ఉంటాడు! లవ్లీ అతని చిలిపి చేష్టలలో, కౌగిలింతలలో, ముద్దు మురిపాలలో మునిగి మైమరిచి పోయి ఉంటుంది! అయినా తనేమిటి ఇలా ఆలోచిస్తోంది! లవ్లీ పట్ల అసూయ పడుతోందా? చ! తను వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి!’అని భావించి శ్రీ లలిత తెప్పరిల్లింది. తెల్లవారి ఝాము మూడున్నరకి లేచేందుకు అలారం పెట్టుకొని, నిద్రకి ఉపక్రమించింది. సాగర్’తో ఆమె ఒప్పందం చేసుకొంది, ప్రతీ రాత్రి బ్రాహ్మీ కాలానికి అతనితో కంటాక్టు చేస్తానని! దానికే తయారీ చేసుకొని నిశ్చింతగా పడుకొంది.        

శ్రీ లలిత మెంటల్  అలారం ఆమెను మొబైలు లోని అలారం కన్నా ముందుగానే లేపింది.తన బెడ్ మీదనే పద్మాసనం వేసి కూర్చొని, ‘మస్తిష్క శక్తి’  ప్రతిభ ద్వారా సాగర్’కి సంకేం పంపింది. అలా చేసిన కొన్ని సెకండ్ల లోనే, ఆమె మొబైలు అదిరింది(సైలెంటు మోడ్’లో ఉంది) శ్రీ లలిత దానిని చేతుల లోకి తీసుకొని ‘కాల్ ఆన్ చేసింది, సాగర్ లైన్లో ఉన్నాడు.

“లలితా! విశేషాలు ఏమిటో సూటిగా చెప్పు.”

“బావా! ఫారం హౌసు ఫోటోలు చూసావు కదా! ఈ హౌసుకి కొంత దూరంలో పొలాల మధ్యనే ఒక మూడు అంతస్తుల భవనం ఉంది. ఆ భవన నిర్మాణం కేవలం ‘స్ట్రక్చరల్ బిల్డప్’ దగ్గరే ఆగిపోయింది! దాని చుట్టూ పొదలు, గడ్డి, తీగలు అలముకొని దెయ్యాల కొంపని తలపిస్తోంది! నేను బైనాక్యులర్సుతో దానిని దూరం నుండి చూసాను. ఆ భవనంలో ఏదో ‘ఇల్లీగల్ ఆక్టివిటీస్’ జరుగుతున్నాయి! వీటిలో చరణ్ పాత్ర కూడా ఉంది, ఎందుకంటే అతను అక్కడ కనబడ్డాడు!”

శ్రీ లలిత అలా  చెప్తూ ఉండగానే ఆమె రూము లాక్ బయటి నుండి, బోల్టు వేసి ఉండక పోవడం వల్ల,  సులు వుగా తెరచుకొంది. ఆమె ఆశ్చర్యంతో అటు వైపు చూసింది, ‘చరణ్ ఆ సమయంలో తెలిసి ఉంటాడని గాని, ఇలా తన రూములో చొరబడతాడని గాని’, ఆమె ఊహించ లేదు! ఆమె మొబైలు ఆన్ లోనే ఉంది, అది ఆమె చేతుల లోంచి జారిపోయి, క్రిందన కార్పెట్ పైన పడి పోయింది. ఆమె ముఖం ఊహించని విపత్తు, ప్రాప్తించ  వచ్చుననే ఆలోచనతో చెమటలు పట్టి, గంభీరమై పోయింది! ‘బావతో  మాటలు పూర్తి అవనే లేదు! ఇలా అసమయంలో ఇతను వచ్చాడు, ఏం జరగనుంది?’ అనుకొంది.      

చరణ్ ఆమె వంక కోపంతో చూసాడు, అతని పిడికెల్లు బిగుసుకొన్నాయి, “ఏమే! ఎవరితో మాట్లాడు తున్నావే? నీ లాయరు చుట్టంతోనే కదా! వాడు, వాడి చట్టం నన్నేమీ చెయ్యలేవే! ఏమనుకోన్నావో! నా పవర్ ఏమిటో ఇప్పుడే చూపిస్తాను ఉండు..”అంటూ తన దగ్గర ఉన్న 'రేడియో టాకీతో’ (రేడియో టాకీలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంధాన మరియు సంవాదాన్ని నెరవేర్చే వాకీ టాకీ లాంటి సాధనాలు) వెంటనే మాట్లాడాడు. “రంగా! వెరీ  అర్జెంట్ & ఇంపార్టెంట్, ఒక వ్యక్తిని ఇప్పటికిప్పుడే ఖతం చెయ్యాలి! ఓవర్!” అన్నాడు.

“అడ్రెస్సు చెప్పండి బాస్! ఓవర్!”

“చెప్పడానికి ఏముంది, మనిల్లే! అక్కడ లల్లీ పేరెంట్సు ఉన్నారు, ఆ ముసలి వాళ్లని ఏమీ చెయ్యకు, అవసరమయితే బెదరించు. లోపల ‘సాగర్’ అని ఒక లాయరు ఉన్నాడు, వాడిని బయటికి తీసుకొని వచ్చి వేసేయండి, ఓవర్!”

“యస్ బాస్, ఓవర్!”

రేడియో టాకీలో సంభాషణ పూర్తి అయింది.

చరణ్ శ్రీ లలిత వంక సూటిగా చూసాడు, “ఏమే! నువ్వు నాతో కాపురం చేయడానికి వచ్చావా, లేక నన్నుపోలీసులకి పట్టించడానికి వచ్చావే ? బైనాక్యులర్స్ పట్టుకొని, పొలాల వెంట పడి పరిశోధనలు చేస్తున్నా వు ! నాకు తెలియదనే అనుకొన్నావా? ... మాట్లడవేమే?”

“ఏం మాట్లాడమంటారు,కెమేరాలు పెట్టి ఉంచారుగా!నా ప్రతీ కదలికా మీకు తెలుస్తూనేఉంటుంది ఇక్కడే కాదు, మన ఇంట్లో కూడా వాటిని అమర్చారు కదా, కట్టుకొన్నఇల్లాలి ఫోటోలు తీసి,వాటిని ఏం చెయ్యాలని అనుకొన్నారు? అమ్మాలనా, లేక నలుగురికీ చూపించి ఆనందించాలనా ?  అలా చేస్తే ఏ ఆడది మీతో కాపురం చేస్తుంది?”

“ఓహో! ఆ విషయం కూడా తెలుసుకొన్నావన్న మాట! సరే! ఇంకా దాపరికం దేనికి? ఆడదానివి, అందమైన దానివి, జపాను రబ్బరు బొమ్మ లాంటి శరీరాకృతి కలదానివి, రఫ్’గా సెక్స్ చేసినా తట్టుకో గల దానివి అనే నిన్ను చూసి, ఇష్టపడి కట్టుకొన్నాను. లవ్లీది సున్నితమైన శరీరం, ముట్టుకొంటే కంది పోయే రకం! అందుకే నిన్ను సెకెండ్ ఆప్షన్’గా ఎంచుకొన్నాను. అన్ని సుఖాలు, సౌకర్యాలు సమకూర్చా ను. ఒక ప్రక్క నా లవ్లీ విరహంతో, వేదనతో మతి చెడి, పిచ్చిది అయినా సరే, నియమంగా నీ తోనే  సంసారం చేసాను. నా లాంటి ‘దక్షిణ నాయకుడికి’ ఇద్దరు పెళ్ళాలు ఏమిటే, నలుగురు ఉన్నా చాలదు!

 ఆ విషయం తెలుసు కోకుండా నీకు ఏదో అన్యాయం జరిగినట్లు, బాధ పడిపోయి నా మీదనే ప్రతీకారం తీర్చుకో వాలని వస్తావా? ఆడ పిల్లవి, నీకు ఇవేం బుద్ధులే? ఎవడో ‘బావని’ చూడగానే  నా మీద వెగటు పుట్టిందా?” అంటూ అక్కడ ఉన్న ‘కప్ బోర్డు’ నుండి, ఒక ‘స్టీలు సికెల్’(కొడవలి లాంటి ఒక ఆయుధం) తీసాడు.

శ్రీ లలిత కిమ్మని అనలేదు, కార్పెట్ మీద పడిన  తన మొబైలు కేసి చూసింది. అది ఆన్ లోనే ఉంది! ‘సాగర్  ఇతని మాటలు వినే ఉంటాడు! వెంటనే పారిపోయి ప్రాణాలు రక్షించు కొంటాడా? లేక తెల్లవారాక చూసుకొం దామని జాప్యం చేస్తాడా?’ అని ఆలోచించింది. ‘బావా! పారిపో!’ అని మస్తిష్కం నుండి తరంగాలు పంపింది.

చరణ్ సికెల్ తీసి దానిని ఆమెకి చూపించాడు. ఆ తరువాత గదిలో  గోడ మీద ఉన్న ఒక  లైటు స్విచ్ వేసాడు గదంతా నాలుగు ప్రక్కల నుంచి ‘హోలోజన్ లైట్లు’ వెలిగాయి. “ఒసే లల్లీ! చూసావా, ఈ లైట్లని! ఇవి ఇలాగే రాత్రింబగళ్ళు వెలుగుతూనే ఉంటాయి. కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో పాటు వేడిని కూడా వెద జల్లుతాయి. భరించలేని వెలుగు వేడిములలో ఇక రోజంతా గడుపు , ఎందుకంటే రూము తలుపులు మూసేసి ఉంటాయి. నా పట్ల చేసిన ద్రోహానికి చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్తాను” అంటూ స్టీలు సికెల్ని ఆమె దగ్గరగా తెచ్చాడు.

శ్రీ లలిత దానిని చూసి బెదరింది. “ఏం చేస్తున్నారు మీరు?” అని అడిగింది, కాతర నయనాలతో!

“ఏం చేస్తానా, చూడు తొందరేముంది!” అంటూ ఆమె జబ్బ పట్టుకొని మంచం పైన బోర్లా పడుకోబెట్టాడు. ఆమె జాకెట్టుని సికెల్’తో చీల్చి, విప్పేసాడు. శ్రీ లలిత నగ్నమైన వీపు కళ్లు చెదరగొట్టే ఆ వెలుగులో కూడా మెరుపు మెరసి నట్లు కనిపించినా, లైట్ల వేడికి చురక్కు మని కాలింది! “ నువ్వు బట్టలు వేసుకొన్నా, వేసుకోక పోయినా, కూర్చొన్నా, నిల్చోన్నా, పడుకొన్నా  ఈ వేడి నీ  శరీరాన్ని కాలుస్తుంది. నువ్వు బాతురూములో కాలం గడపాలని ఆలోచించకు, ఎందుకంటే దానిని లాక్ చేసి, వెళ్తాను. నీ  ఒంట్లో నీరంతా ఆవిరి అయిపోయే వరకు, అలా కాలుస్తూనే ఉంటుంది, సరేనా? నాతో పెట్టుకొన్నందుకు నీకు ఇదే శిక్ష! అంత వరకు బై!” అంటూ బాత్ రూముని, లాక్ చేసాడు, ఆతరువాత బయట గడియ పెట్టేసాడు! వెళ్ళే ముందు ఆమె మొబైలు తీసుకొనే వెళ్ళాడు!

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ