Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా!..18 (చిలక రథంలో సరదా షికారు...పార్టు 2 )

శ్రీ లలిత దానిని చూసి బెదరింది. “ఏం చేస్తున్నారు మీరు?” అని అడిగింది, కాతర నయనాలతో!

“ఏం చేస్తానా, చూడు తొందరేముంది!” అంటూ ఆమె జబ్బ పట్టుకొని మంచం పైన బోర్లా పడుకోబెట్టాడు. ఆమె జాకెట్టుని సికెల్’తో చీల్చి, విప్పేసాడు. శ్రీ లలిత నగ్నమైన వీపు కళ్లు చెదరగొట్టే ఆ వెలుగులో కూడా మెరుపు మెరసి నట్లు కనిపించినా, లైట్ల వేడికి చురక్కు మని కాలింది! “ నువ్వు బట్టలు వేసుకొన్నా, వేసుకోక పోయినా, కూర్చొన్నా, నిల్చోన్నా, పడుకొన్నా  ఈ వేడి నీ  శరీరాన్ని కాలుస్తుంది. నువ్వు బాట్ రూములో కాలం గడపాలని ఆలోచించకు, ఎందుకంటే దానిని లాక్ చేసి, వెళ్తాను.

నీ  ఒంట్లో నీరంతా ఆవిరి అయిపోయే వరకు, అలా కాలుస్తూనే ఉంటుంది, సరేనా? నాతో పెట్టుకొన్నందుకు నీకు ఇదే శిక్ష! అంత వరకు బై!” అంటూ బాత్ రూముని, లాక్ చేసాడు, ఆతరువాత బయట గడియ పెట్టేసాడు! వెళ్ళే ముందు ఆమె మొబైలు తీసుకొనే వెళ్ళాడు!

శ్రీ లలిత ఆలోచించింది, ఈ గదిలో ఎక్కడున్నా తను వేడికి గురికాక తప్పదు! మంచం క్రిందన పడుకొంటే అన్న ఉపాయం తట్టి వెంటనే అమలు చేసింది!

రాత్రి  నాలుగు గంటలకి  తలుపు కొట్టిన చప్పుడు విని, పినాక పాణి నిద్ర లేచాడు. ఎవరో బయట నుండి  కేక పెడుతున్నారు, “ సాగర్ బాబూ! సాగర్ బాబూ! అర్జెంటుగా తలుపు తీయండి” అంటూ.

‘ఇంత రాత్రి పూట సాగర్ని పిలిచే వారెవ్వరు? కోర్టు కచేరీ పనేమో!’ అనుకొంటూనే పినాక పాణి తలుపు తీసాడు.

ఇద్దరు వ్యక్తులు అతనిని తోసుకొంటూ ఇంట్లోకి ప్రవేశించారు. “సాగర్ ఎక్కడ?”అని అడుగుతూ.

“మీరెవరు? సాగర్తో ఏం పని?” అడిగాడు పినాక పాణి వాళ్ళని అడ్డుకొంటూ. వాళ్ళు అతనిని ఒక్క త్రోపు త్రోసి, లోపల గది లోకి వెళ్లారు. ఆశ్చర్యం! ఇల్లంతా వెతికినా సాగర్ కనిపించ లేదు!
 
“సాగర్ ఎక్కడకి పారిపోయాడ్రా? ముసలాడా!”

“ఏమో నాకేం తెలుసు, రాత్రి గదిలోనే పడుకొన్నాడు, అయినా మీరు ఇంత దురుసుగా మాట్లాడుతున్నా రు  ఎందుకని?  సాగర్  నాకు చెల్లెలు  కొడుకు, ఈ రాత్రి పూట వాడితో మీకేమి పని?”

“మా బాస్  పనులకి అడ్డు తగులుతున్నాడు, అందుకని అడ్డు తొలగించమని బాస్ ఆర్డర్ వేసాడు.”

“ఎవరు మీ బాస్?”

“ఇంకా ఎవరో తెలియ లేదా, ముసలోడా! మీ అల్లుడు చరణ్ గారే మా బాస్!” అంటూనే వాళ్లు  సుడిగాలి లాగ, ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు!”

పినాక పాణి, మీనాక్షమ్మలు ఆ మాటలు విని నిరుత్తరులు అయి మ్రాన్పడి పోయారు! వారికి అర్థం కానివి రెండు విషయాలు, ‘ఒకటి, సాగర్ ఇంట్లో నుండి ఎప్పుడు వెళ్ళాడు? రెండవది, తాము అనుకొన్నదానికన్నా చరణ్’కి నెట్ వరకు ఎక్కువగా ఉండడం!’

“హే, భగవాన్! మా పిల్లల్ని కాపాడు!” అంటూ ప్రార్థన చేసింది మీనాక్షమ్మ.

సాగర్,  శ్రీ లలిత చెప్పినది విన్న తరువాత ఆమెని  ఇంకా కొన్ని ప్రశ్నలు వేయాలని అనుకొన్నాడు, కాని అప్పటికే ఆమె దగ్గరకి చరణ్ రావడం, ఆమెని బెదరించడం జరిగింది. ఫోను ఆన్లో ఉన్నందు వల్ల చరణ్ మాటలు సాగర్’కి బాగానే వినిపించాయి! వెంటనే వెళ్లి శ్రీ లలితని రక్షించాలి, చరణ్ రహస్య స్థావర విషయం నార్కోటిక్ స్క్వాడ్’కి తెలియ జేయాలి! అనుకొని, ఏ విధమైన జాప్యం చేయకుండా,గప్’చుప్’గా ఇల్లు వదలి వెళ్లి పోయాడు.

ఇల్లు బయటి నుండి కూడా లాక్ అయే సదుపాయం ఉండడం వల్ల, పినాక పాణి, మీనాక్షమ్మ లకి ఆ విషయం తెలియదు.        

సాగర్ నేరుగా డిటెక్టివ్ వనమాలి దగ్గరకి వెళ్ళాడు, ఫోనులో విషయం తెలియ జేయడం వల్ల వనమాలి ఆ రాత్రి వేళనే అతనిని రాబట్టుకొన్నాడు. విషయం లోని గంభీరతని అర్థం చేసుకొని, వనమాలి తనకి బాగా పరిచయం ఉన్న కారణంగా నార్కోటిక్ స్క్వాడ్ స్పెషల్ డి.ఐ.జి శ్రీమాన్ పార్థసారధి గారికి అప్పటికి అప్పుడే సమాచారం చేర వేసాడు.


పార్థసారధి గారు వాళ్ళని వెంటనే పోలీసు హెడ్ క్వార్టర్’కి రమ్మని పిలవడంతో వాళ్ళు అక్కడకి చేరుకొన్నారు. అక్కడ సంబంధిత అధికారులు అందరూ ఆలోచించి పథకాన్ని సిద్ధం చేసుకొన్నారు. పోలీసు స్క్వాడ్ చరణ్ స్థావరం మీద దండెత్తడానికి, వనమాలి, సాగర్లు, శ్రీ లలితని కాపాడేందుకు వెళ్ళడానికి నిశ్చయించుకొని ఎవరికీ వారు కొన్నిటీములుగా విడిపోయి, వేటకి బయలు దేరినట్లు బయలు దేరారు.
 
శ్రీ లలితకి మంచం క్రింద కూడా ఎక్కువగా రక్షణ దొరక లేదు. అయినా ధైర్యం తెచ్చుకొని, సాగర్తో మాట్లాడ డానికి తన ప్రతిభా శక్తితో ప్రయత్నం చేసింది.

వనమాలి కారు డ్రైవు చేస్తూ ఉండగా, సాగర్ ఫ్రంటు సీట్లో  కూర్చొని తన ప్రతిభా శక్తికి పదును పెట్టి శ్రీలలిత పొజిషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయ సాగాడు. అప్పుడు అతనికి అందింది ఆమె పంపిన సందేశం!

‘బావా!బాగున్నావా?’ అని.

‘బాగున్నాను, నీ పొజిషన్ ఏమిటి?’

‘వేపుడు ముక్కలాగా వేగి పోతున్నాను, త్వరగా రా!’

‘దారిలోనే ఉన్నాను, వేదనా శక్తి ద్వారా వేడిని నియంత్రణలో ఉంచు.’

‘వేదన గురించి ఆలోచించనే లేదు! ఇప్పుడే చేస్తాను.’

‘గుడ్! త్వరగానే వస్తాను’

శ్రీ లలిత తన చర్మము యొక్క వేదనా శక్తిని ప్రేరేపించి వేడి గదిలో కాక, ఎ.సి. గదిలో ఉన్నట్లు మస్తిష్కాన్ని ట్యూన్ చేసింది. అలా పది నిముషాలు గడచే సరికి, ఆమెకి నిజంగానే చల్లని గదిలో ఉన్నట్లు అనిపించింది. వెంటనే కళ్ళకి ఉండే, ‘అదర్శ’ శక్తిని  ప్రేరేపించి తాను వెన్నెల్లో ఉన్నట్లు భావించి, ఆ మార్పుని కూడా సాధించింది!

అప్పటికి తెల్లవారి అయిదు గంటలయింది. ఉషోదయ కాంతులు నేలంతా పరచుకొన్నాయి. జయ నగరం శివార్ల లోని  విశాలమైన పొలాల మధ్యన ఉన్న, ఆ మూడు అంతస్తుల బిల్డింగు పైన , నార్కోటిక్ స్క్వాడ్ చీఫ్ అయిన పార్థ సారధి కమాండ్ మీద, పోలీసు ఫోర్సు దాడి జరిగింది. ప్రథమంగా నాలుగు దిక్కులనుండి, వెహికల్సు ద్వారా ఒకేసారి ఆ భవనం పైన ‘ఎటాక్’ జరపాలని నిర్దేశించాడు అతను.

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద