Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా!..19౯చిలక రథంలో సరదా షికారు..పార్టు 2 )

నిందితుడు వైభవ్ చరణ్ భవనం లోపల ఆయుధాలతో సుసజ్జితుడయి ఉన్నాడు. అతని బలం ఎంతో తెలియదు! వాళ్ళు భవనంలో ఉండడం వల్ల సురక్షితంగా ఎటాక్  చేయ గలరు! అందుకే నలుగు దిక్కులా నుండి ఒకేసారి చేయమని ఆదేశించాడు అతను. తాము మైదానంలో చిన్న చిన్నవెహికల్సులో ఉండడం వల్ల బేంకర్లు లాంటి వేవీ అడ్డు లేక పోవడం వల్ల సురక్షితులయి లేరు! అందుకే నాలుగు వైపిల నుండి చేస్తే శత్రువు ఎంత బలగంతో ఉన్నాడో, ఎంత తయారుగా ఉన్నాడో తెలుస్తుంది. ఎటాక్’కి ముందు, లౌడ్ స్పీకరు ద్వారా హెచ్చరిక  చెయ్యడం తప్పని సరి!

లౌడ్ స్పీకర్లో  హెచ్చరిక జారీ అయింది. “మిస్టర్ వైభవ్ చరణ్! నువ్వు బ్రతికే ఉన్నావని, నీ అన్న అయిన సూర్య చరణ్  పేరుతో జీవితం గడుపుతున్నావని మాకు తెలిసి పోయింది. క్రొత్త జీవితం చాలా జాగ్రత్తగా గడిపినా, నీ పాత అలవాటు మాన లేక మళ్లీ, డ్రగ్సు వ్యాపారంలో తల దూర్చావని కూడా మాకు తెలిసి పోయింది. ఇక నీ ఆట కట్టు!

మర్యాదగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా మాకు లొంగి పో! అలా లొంగి పొతే నీకు పడే శిక్షలో  కొంత భాగం తక్కువ గడప వచ్చు. నువ్వు పోలీసు ఫోర్సుతో  యుద్ధం చెయ్యలేవు! మేము పది లెక్క పెట్టె లోగా, నువ్వు తెల్ల జెండా చూపిస్తే సరే సరి! లేదంటే ఘర్షణలో జరిగే నర సంహారా నికి మాభాధ్యత ఉండదు!” అలా మూడు సార్లు అనౌన్సుమెంటు అయ్యాక అంకెలు లెక్క పెట్టడం మొదలు పెట్టారు పోలీసులు!

ఆ అనౌన్సుమెంటు బంగళాలో ఉన్న మంజీరకి, శ్రీ లలితకీ కూడా వినిపించాయి. మంజీర గాభరా పడింది.

వెంటనే గది లోంచి బయటికి వచ్చి, శ్రీ లలిత ఉన్న గదికి ముందు నిలబడింది. ఆ గదికి తాళం వేసి ఉండడం ఆమెకి ఆశ్చర్యం కలిగించ లేదు! రాత్రి ఆమెతో చరణ్ చెప్పనే చెప్పాడు, ‘శ్రీ లలితకి పిచ్చి బాగా ముదిరిపోయింది  అందుకే తలుపుకు తాళం వేసి ఉంచానని’ !

మంజీర గది బయటి నుంచే శ్రీ లలితతో మాట్లాడింది. “చెల్లీ! నీకు ఏదో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చానని చరణ్ చెప్పాడు! ఇప్పుడెలా ఉన్నావు, బాగానే ఉన్నావా?”

“ఇప్పుడు బాగానే ఉంది అక్కా! నా గది తలుపు తాళం తియ్యి, చరణ్ మీద పోలీసులు ఎటాక్ చేస్తునట్లు అనౌన్సుమెంట్  వినిపించింది కదా!”

“వినిపించింది, కాని ఎందుకు చెల్లీ! అతనేం చేసాడు?”

“నీకు ముందుగానే చెప్పాను కదా అక్కయ్యా! అతను వేదేశాలకి వెళ్ళ లేదని, ఏడాది పాటు జైలు జీవితం తక్కిన సమయంలో నాతో సంసారం  చేసాడని!...”

“ఏమో!అంతా అయోమయంగా ఉంది! ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకావడం లేదు!”

“ముందుగా నా తలుపు తాళం తియ్యి అక్కా !”

“సరే! వస్తాను ఉండు, తాళం నా గదిలోనే ఉంచాడు చరణ్!” అంటూ మంజీర తన గదికి వెళ్లింది.
 
శ్రీ లలిత బ్రతుకు జీవుడా! అని నిట్టూర్పు వదలింది. తలుపులు తెరచి, మంజీర తనతో సహకరిస్తే ఆమెకి నిజం తెలియ జేసి, నమ్మించ  వచ్చు! ఆమెను కూడా తనతో తీసుకొని పోవచ్చు!” అనుకొంది.

బయట రైఫిల్ పేలుళ్లు వినిపిస్తున్నాయి! అంటే పోలీసులతో యుద్ధం జరుగుతోందన్న మాట! ఎందుకు జరుగుతోంది? అనుకొంది  మంజీర. ఆమెకిశ్రి లలిత చెప్పిన విషయాలు నిజమేనేమో అన్న అనుమానం తొలిసారిగా కలిగింది. గదిలో ఉన్న తాళాలు తీసుకొని వచ్చి, శ్రీ లలిత గది  తలుపులు తీసింది.

గది బయట పడిన శ్రీ లలిత ఉస్సురని నిట్టూర్చింది. మంజీర తలుపు తీసిన వెంటనే,జిగేలుమనే మెరుపు, దాని వెను వెంటనే వచ్చిన వేడి గాలిని చూసి నివ్వెరపోయింది.“చెల్లీ! ఎలా ఉన్నావు ఈ గదిలో? ” అని అడిగింది.

“అదే అక్కా! అతను నాకు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్! ఈ వెలుగు, వేడి భరించమని రాత్రంతా ఇక్కడే పడి  చావమని నన్ను లోపల పెట్టి, తాళం వేసారు! నీ దయ వల్ల కాస్త ముందుగా బయట పడ్డాను.”

“ఈ  లైట్లు ఆరవా చెల్లీ?”

“ఆరవు, ఆరేటట్లయితే నేను ఆర్పేసే ఉండేదాన్ని!”

“అయ్యో అలాగా! షాక్ ట్రీట్మెంట్ అంటే ఇంత  దారుణంగా ఉంటుందని  అనుకోలేదు! ఇదే నాకయితే వేడికి చర్మం కాలిపోయి ఉండేది!”
     
బయట ‘రైఫిల్ షూట్ అవుట్’ అవుతూనే ఉంది. పోలీసు జీపులు బిల్డింగు వైపు క్రమ క్రమంగా దూసుకొని పోతున్నాయి. శ్రీ లలిత మంజీర వైపు చూసి అంది. “అక్కా! మరి కాసేపటికి ఈ యుద్ధం పరిసమాప్తి కానుంది. ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్లేందుకు మా బావ సాగర్, అతని డిటెక్టివ్ ఫ్రెండ్ వనమాలి వస్తు న్నారు. నువ్వు కూడా నాతో వచ్చేయి అక్కా! ఎందుకంటే పోలీసులు అతనిని పట్టుకొన్న తరువాత ఈ ఇంటిని సీలు చేస్తారు, మీరు ఇక్కడ ఉండడం జరగదు!” అంది.

బయట  మహా సంగ్రామం పూర్తి అయినట్లు ఉంది! పోలీసులు ఇంట్లో ప్రవేశించారు. పోలీసు  జీపులో, ‘వైభవ్ చరణ్ చేతి, అరదండాలు’ దాని ఫ్రేముకి తగిలించ బడి ఉన్నాయి. లోపల ఉన్న ఇద్దరు స్త్రీలని చూసి పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఇంతలో ఒక కారు అక్కడకి నేరుగా వచ్చి ఆగింది. దానిలో నుండి సాగర్ దిగాడు, శీ లలితని చూసి,“ఎలాగున్నావు లలితా! సేఫ్’గా బయట పడ్డావుకదా?”అని అడిగాడు.  

“ప్రసుతం సేఫ్’గానే ఉన్నాను, ఇదుగో ఈవిడే మాక్క మంజీర. తను కూడా మనతో పాటే వస్తుంది” అంది.

మంజీర ఇంకేమీ అభ్యంతరం చెప్ప లేదు. ఆమెకి పరిస్థితి పూర్తిగా అర్థమయింది. శ్రీ లలితతో వెళ్ళడానికే నిశ్చయించుకొని కారులో ఎక్కింది. పోలీసులు ఆ ఇల్లు లాక్  చేసి, సీలు చేసి, ఒక కానిస్టేబుల్ని కాపలా పెట్టి తమ తమ జీపులలో బయలు దేరారు. ఆ ఎన్కౌంటర్’లో కేశవ్ గుప్త చని పోయాడు.  

వైభవ్ చరణ్ తన స్త్రీలలో ఎవరూ తన వంక జాలితో నైనా చూడక పోవడంతో మనసు గాయపడి ముఖం చాటు చేసుకొన్నాడు.

*********************

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

రక్కసి కందని రాచిలుక

‘సంపూర్ణ,’ అందాల చిలక లాంటి కన్నెపిల్ల.. పరిపూర్ణ సౌందర్యవతి. ఆమె విశాలమైన నీలి కళ్లు కలువల కొలనులాగ ఉంటాయి. ఆమె ముక్కు ఎక్కుపెట్టిన బాణంలాగ, నూటముఫ్ఫైయి అయిదు (90+45) డిగ్రీల అధిక కోణంలో నిటారుగా సంపెంగ రంగులో ఉండి, చిన్న కమ్మీని తగిలించుకొని, ఆ ముఖాని కంతటికీ తానే రాణినని విర్రవీగుతూ ఉంటుంది. ఆమె పెదవులు బొటన వ్రేలుతో మూయగలిగినంత చిన్నవి, వాటి రంగు పగడాలని తల దన్నేవే కాక గుండ్రని ముఖానికి, చూపులు తిప్పుకొనేటంతటి ఆకర్షణని తెచ్చి పెడుతూ ఉంటాయి.ముఖానికి రెండు వైపులా రెండు శ్రీకారాలు రాసినట్లుండే చెవులు, వాటి దిగువ వ్రేలాడే బుట్ట జుంకాలకే శోభనిస్తున్నట్లు ఉంటాయి. ఇక ఆమె పరువం, ఆమె యవ్వనం సరే, సరే ! పేరుకి తగినట్లే ఉంటాయి. అలాంటి అమ్మాయిని స్వంతం చేసుకోవాలని ఎవరికుండదు ! ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ తండ్రి దగ్గరకి వచ్చాడా యువకుడు ! సంపూర్ణ తండ్రి ఒక రాక్షసి అధీనంలో ఉన్నాడు. ఆ రక్కసి అతనిని అతనికి తెలియకుండానే అడుగు లేని అగాధం లోకి రోజురోజుకీ అతనిని నెట్టుకుంటూ పోతోంది ! దాంతో అతను తనలోని

సత్య సాయి బాబా నన్ను కాపాడిన వైనం.

నేను ‘క్షీరగంగ’ బ్లాగర్’గా మీ అందరికీ తెలుసు. నా అన్నయ్య , వదినలు ‘భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ గారి పరమ భక్తులు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మివారం భజనలు జరుగుతూ ఉంటాయి. ఆ భజనల్లో ఎన్నో చమత్కారాలు , ‘విభూతి పడడం, తేనె కారడం’ లాంటివి జరుగుతూ ఉండేవి. వాళ్ల ఇల్లు, ‘విజయ నగరంలోని అయ్యన్న పేటలో ఉండేది. ఆ ఇల్లుని బాబా నిలయంగా అందరూ పేర్కొనే వారు. ఆ ఇంటికి వెళ్లిన నేను నాభార్య ఒకరోజు భజనలో పాల్గొన్నాం. ఆ తరువాత సహజంగానే మేము కూడ సత్యసాయి బాబా అనుగ్రహం కోసం అతని నామజపం మొదలు పెట్టాం. నాకు శ్రీ సత్య సాయి అనుగ్రహం కలిగిన అనుభవం చాల విచిత్రమైనది. నేను చాల సన్నిహితులైన వారితోనే దానిని పంచుకొన్నాను. ఈ రోజు శ్రీ సత్యసాయి అవతార సమాప్తి గురించి విన్న తరువాత నా బ్లాగు మిత్రులతో ఆ అనుభవాన్ని పంచుకోవాలని అనిపించింది. పది సంవత్సారాల క్రిందటి మాట ! నేను ‘ ఎస్.ఇ.సి.ఆర్. రైల్వే బిలాస్’పూర్’లో , సెక్షన్ ఇంజనీయరుగా పని చేస్తున్న రోజులవి. ‘ హౌరా,కుర్లా ఎక్స్’ప్రెస్ రాత్రి మూడు గంటలకి బిలాస్’పూరు ఫ్లాట్’ఫారం చేరుకొంది. అది చేరుకోవడానికి రెండు గంటల ముందే, నాకు కంట్రోల్ ద్వారా వర్తమానం అందింది. ఆ ట్రైను ఇంజనులో ఒ