ప్రేమ అంటే ...
మధుర భావన, తీయని అనుభూతి, ఉల్లాసాన్ని కలిగించే స్పందన, ఉత్సాహాన్ని రేకెత్తించే ఆకర్షణ, ఇవన్నీ అందరూ అంగీకరించిన విషయాలే!
ప్రేమ అంటే----
గ్రుడ్డిది, మూగది, చెవిటిది, అంటే ఏ ఇంద్రియానుభూతికీ లొంగనిది, అతీంద్రియ శక్తులకి కూడా అందు బాటులో లేని విచిత్రమైన ‘మాయాజాలం’ అని కూడా అనవచ్చు!
శ్రీ లలిత వివాహ బంధానికి కట్టుబడి, మర్యాదని అతిక్రమించకుండా, స్వచ్చమైన ప్రేమతో చరణ్’ని ప్రేమించింది. అయినా వంచనకి గురి అయింది!
కందళి ప్రేమ- అజ్ఞానం వల్ల, హేమలత ప్రేమ- అమాయకత్వం వల్ల, విలాసిని- ప్రేమ ఈర్ష్య వల్ల, సనక మేనకల ప్రేమ- స్వార్థం వల్ల విఫలమయ్యాయి.
అయినా ఈ ప్రేమ మాయాజాలంలో చిక్కిన వాళ్ళు, బయట పడలేక చిక్కుల పాలు అవుతూనే ఉన్నారు! అజ్ఞానం, అమాయకత్వం, ఈర్ష్య, స్వార్థం, ఇలాంటి వన్నీ బలహీనతలు, ఇవన్నీ ఈ మాయా జాలపు ఆకర్షణకి అనుగుణంగా ‘ఆ యా మాయావులకి’ ఎప్పటికీ సహాయం చేస్తూ, వంచనకి గురి చేస్తూనే ఉంటాయి!! శ్రీ లలిత అలాంటి మాయావి యొక్క వంచనని గుర్తించి, దాని నుండి బయట పడేందుకు మనసు దిటవు చేసుకొంది. తన అపూర్వ ప్రేమ ఫలమైన గర్భాన్ని అపురూపంగా చూసుకొని రాజీ పడింది.
అంతే కాదు, మంజీరని కూడా ఆ మాయాజాలం నుండి తప్పించే ప్రయత్నం చేయసాగింది. దానికి ఆమె ప్రత్యామ్నా యంగా ‘సాగర్ బావని’ ఎంచుకొంది. అయితే సాగర్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి!
“బావా! మీ భావన నాకు తెలుస్తూనే ఉంది, కాని నేను నా కోసం ఆలోచించడం లేదు. మంజీర కోసం, నీ చేతిని అడుగుతున్నాను. ఏమంటావు ?”
“ముందుగా నువ్వు మంజీర అభిప్రాయం తీసుకోవడం మంచిదేమో లలితా!”
“తప్పక తెలుసుకొంటాను, ఆమె నిన్ను తిరస్కరించదనే నా ఉద్దేశం!” అంది శ్రీ లలిత. అంతలో మంజేర అక్కడకి వచ్చింది.
“చెల్లీ! నేను నిన్న కస్టడీలో ఉన్న ‘సూర్య చరణ్’ని’ చూసాను...”
“అదేమిటక్కా! సూర్య చరణ్ అంటావేమిటి?”
“అలాగే అనాలి చెల్లీ! నీకు తెలియదు, మనం అలాగే డిఫెన్సు కేసు ప్రొసీడ్ అవ్వాలి!”
“డిఫెన్సు కేసా? అంటే అతని అరెస్ట్’ని నువ్వు వ్యతిరేకిస్తున్నావా?”
“అవును, అతని అరెస్ట్ మిస్టేకన్ ఐడెంటిటీ వలన జరిగింది, అది అన్యాయం!”
“మిస్టేకన్ ఐడెంటిటీ అంటే ఏమిటక్కా?”
“వైభవ్ చరణ్ అనే అనుమానంతో సూర్య చరణ్ అనే అమాయకుణ్ణి అరెస్ట్ చేసారు పోలీసులు...”
శ్రీ లలితకి ఆమె భావం తెలిసి పోయింది. “నిన్న అతనిని కలిసానని అన్నావు, అతనే నీకు ఈ ఉపాయం చెప్పారా?” అని అడిగింది.
“అవును చెల్లీ! తనే సూర్య చరణ్ అని, నువ్వే అతని భార్యవని, నేను కేవలం అతని మాజీ ప్రియురాలినని చెప్పారు.అంతే కాదు, నువ్వు అతని శిశువుకి తల్లి కాబోతున్నావని కూడా చెప్పారు! అలా వాదించి తనని బయటికి తెచ్చేందుకు, మిస్టేకన్ ఐడెంటిటీని ప్రూఫ్ చేయడానికి మంచి లాయరు సహాయం తీసుకోమని అన్నారు! అతనిని చూడడానికి నువ్వు రాక పోవడం చాలా భాదాకరంగా ఉందని వాపోయారు చెల్లీ! నాకు కూడా ఆ విషయం ఇబ్బందిగానే ఉంది! అతను చెప్పినట్లే నేను లాయరు మల్లికార్జున రావు గారి కోసం వెళ్లాను, నా పేరు పరిచయం చెప్పుకొనే సరికి , అతను నాకు సహాయం చేయడానికి ఒప్పుకొన్నారు!”
“లాయరు మల్లికార్జున రావు గారు ఒప్పుకొన్నారా?” అని అడిగాడు సాగర్!
“అతను మీకు తెలుసా బావా?” అడిగింది శ్రీ లలిత.
“తెలుసు, అతనే హై కోర్టు సీనియర్ లాయరు, అంతే కాదు మా బాస్ కూడా అతనే!” ఆనాడు సాగర్.
“అలాగా సాగర్ గారూ! అంటే మీరు కూడా మా డిఫెన్సు టీంలో ఉన్నారన్న మాట!”
మంజీర ఉత్సాహాన్ని చూసిన శ్రీ లలిత, ఆశ్చర్య పోయింది! ‘ఇంత జరిగినా ఇంకా ఆమె చరణ్’నే నమ్ము తోంది, అంతే కాకుండా, తనని మాజీ ప్రియురాలు అని బేక్ సీటులో పెట్టి అవమానం పాలు చేసినా ఆమె అతని సహాయం కోసం లాయరు దగ్గరకి వెళ్లింది! భార్య అంటే అలాగే ఉండాలి కాబోలు! తను చరణ్’ని, అమాయకంగా నమ్మటం లేదు కాబట్టి! మంచి భార్య కాలేక పోయింది? ఇలాంటి అమాయక పిల్లనా తను సాగర్’ కోసం ప్రపోజ్ చేసింది! నన్ను క్షమించు బావా!’ అనుకొని సాగర్ వంక చూసింది.
సాగర్ ఆమె భావాన్ని అర్థం చేసుకొని చిరునవ్వు నవ్వాడు. మంజీర ఎలా వచ్చిందో అలాగే సుడిగాలి లాగ వెళ్లి పోయింది.
“బావా! ఇప్పుడు చరణ్ నా పేరుని, నా పెళ్లినీ, నా గర్భస్థ శిశువునీ కూడా ఉపయోగించుకోవడానికి చూస్తున్నాడు! కోర్టులో కేసు అంటే చాలా సమయం పడుతుంది కాబోలు! అంత వరకు చరణ్’ నుండి నన్ను నేను ఎలా కాపాడు కోవాలి?” అని అడిగింది, శ్రీ లలిత.
“వెరీ! సింపుల్! చరణ్ పైన నార్కోటిక్ స్క్వాడ్ కేసు’ని సాకుగా తీసుకొని, నువ్వు విడాకులకి అపీల్’ చెయ్య డమే! మా లాయరు గారు మంజీర కేసుని ఎలాగూ టేకప్ చేసారు కాబట్టి, నీ విడాకులకి ఒప్పుకోరు. దాంతో అతని నుండి, విడి పోవడానికి నాకు సంతృప్తికరమైన కారణం దొరుకుతుంది! ..”
“అంటే అతని నుండి విడిపోవడానికి నువ్వు కారణాలు వెతుకుతున్నావా?”
“అలాంటిదేమీ లేదు! నీ విడాకుల కేసుని వాదించడానికి అతని సహకారం ఉండదు కాబట్టి, నేనే స్వయంగా పూనుకోవాల్సి ఉంటుంది! అందుకు విడిపోక తప్పదు.”
“బావా! నీ మొదటి కేసుని నువ్వు ఫీజు లేకుండా వాదిస్తావా?”
“ఫీజు ధన రూపంగా ఉండ నవసరం లేదు, వాదించే కేసులో చిత్త శుద్ది, ఆత్మ తృప్తి ఉంటే చాలు!”
“వాదించే కేసులో చిత్త శుద్ది అనేది నీ వ్యక్తిగత విషయం! కాని ఆత్మ తృప్తి ఎలా లభిస్తుంది?”
“నా లలిత కేసు గెలవడం నాకు ఆత్మ తృప్తి ఏల కలిగించదు!”
“ఏమన్నావు బావా! నా లలిత అనా...”
“ఏం నువ్వు నా మరదలవి కావా?”
“కాను.”
“నా మరదలవి కాను, అని ఎలా అనగలవు? అది నీ నిర్ణయం కాదు, దేవుని నిర్ణయం!”
“దేవుని నిర్ణయమే, ఒప్పుకొంటాను! అయినా సరే, నాలలిత అనే దానికి ఒప్పుకోను?”
“నా మరదలివే అయినప్పుడు నాలలితవి కావా?”
“కాను, ముమ్మాటికీ కాను, నీ మరదల్ని అయితే నాలలిత అనే పదాన్ని నువ్వు వాడలేవు?”
“మరి, ఎప్పుడు వాడగలను?”
“నేను నీ దానను అయి...” అంటూ నాలిక కరచుకొంది శ్రీ లలిత.
సాగర్ ఆమె ముఖం కేసి చూసాడు, అది జేవురు రంగులో ఎరుపెక్కి ఉంది! ఆమె భావాన్ని, అంగీకారాన్ని మాటల ద్వారా తెలియ జేసింది! ఇక తన వంతు కార్యాచరణ మిగిలి ఉంది! అనుకొన్నాడు. అలా అని అనుకొన్న తరువాత అక్కడ నుండి చల్లగా జారుకొన్నాడు!
****************************
హైకోర్టు సీనియర్ లాయరు మల్లికార్జునరావు, నార్కోటిక్ స్క్వాడ్ కేసుని, ఆ కేసు విషయంలో పోలీసుల పోరపాట్లనీ ఎండగట్టి దానిని ఒక మాయా జాలం లాగ చేసి, ప్రాసిక్యూషన్ వాదనని తూర్పార పట్టించడానికి తనకి కావసినంత సమయాన్నీ, అందుకు బదులుగా మంజీర ద్వారా ఆమె పైతృక సంపదనీ, చాలా సంపాదించాడు. పోలీసులకి నిందితుని ఐడెంటిటీ నిరూపించడం కష్టమయింది!
పట్టుబడిన వ్యక్తి పేరు, ‘సూర్య చరణ్’ అని, అతను వైభవ్ చరణ్’కి కవల సోదరుడని, నిందితుడైన వైభవ చరణ్ పోలీసుల పర్యవేక్షణ లోనే జరిగిన జైలు మార్చే కార్యక్రమంలో మరణించాడని, ఆ విషయంపోలీసు రికార్డుల లేనే రిజిష్టరు అయి ఉందని వాదించాడు!
తన క్లయింటు, ముద్దాయి అయిన సూర్య చరణ్’ దోషమంతా, అతని తమ్ముణ్ని రూపంలో పోలి ఉండడమే అని, అతను చని పోయాడని భావించబడుతున్న విమాన ప్రమాదంలో, మరణించినది కేవలం తల్లితండ్రులే అని, సూర్య చరణ్ పేరు కేవలం ప్రయాణీకుల జాబితాలో ఉందని, ఆ రోజు అతను ప్రయాణమే చేయ లేదని వాదించాడు. టికెట్టు కొని, రన్వే దాకా వచ్చి, తలి తండ్రులని విమానం ఎక్కించిన సూర్య చరణ్’ నేరుగా ఇంటికి వెళ్లలేదని, బెంగళూరులోని ఒక సినిమా హాలుకి వెళ్ళాడని, ఆ సినిమా చూసి బయటికి రాగానే, విమానం కూలి పోయిన విషయం తెలిసి, అక్కడికక్కడే తెలివి తప్పి పడి పోయాడని, అతనిని ఒక ఆయు ర్వేద వైద్యుడు రక్షించి తన ఇంటికి తీసుకొని వెళ్లి, మూలికా వైద్యం చేసి అతనిని రక్షించాడని తెలిపాడు.
ఆ తరువాత సూర్య చరణ్’, జయ నగరంలో ఉద్యోగం సంపాదించుకొని, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడని వాదించాడు. తనకి చికిత్స చేసినందుకుగాను అతను ఆ ఆయుర్వేద వైద్యునికి పెద్ద మొత్తంలో చందాలు ఇచ్చాడని వాటి రశీదులు చూపించాడు.
ఆ రశీదులు సూర్య చరణ్ తల్లి తండ్రుల చికిత్సకి అయిన ఖర్చులని ప్రాసిక్యూటర్ చేసిన వాదన ఋజువులు లేక వీగి పోయింది!
ఆ తరువాత సూర్య చరణ్ శ్రీ లలితని పెళ్లి చేసుకోవడం వారి సుఖ దాంపత్యం గురించి ఎన్నెన్నో ఋజువులు చూపించ గలిగారు డిఫెన్సు వారు!
ఇంకొక విడాకుల కోర్టులో శ్రీ లలిత పిటిషన్’ని కూడా అవే కారణాల వల్ల కొట్టేయాలని, ఎందుకంటే ఆమె భర్త జీవించే ఉన్నాడని ,లాయరు మల్లికార్జున రావు అపీల్ పంపాడు!
శ్రీ లలిత లాయరు సాగర్ ఆ అపీలుని ఖాతరు చేయ వద్దని, ఎందుకంటే శ్రీ లలిత విడాకులు కోరింది, తన భర్తతో వైవాహిక బంధం, కొన సాగించ లేని పరిస్థితీలో వేసిందని వాదించాడు. ఆమె మాన ప్రాణాలకి విలువ నిచ్చే స్త్రీ అని, చరణ్ పోలీసు డిటెన్షనులో ఉండడం వలన, ఆమె ప్రతిష్టకి భంగం కలిగిందని వాదించాడు. ఆమె పైన జరిగిన కిడ్నాప్, అత్యాచార ప్రయత్నం, తరువాత కేశవ్ గుప్త అడిగిన సహాయం కోసం చరణ్ నాటకం ఆడేందుకు అంగీకరించడం, వంటి చర్యలే ఆమెకి అతని పైన అసహ్యాన్నికలిగించాయని చెప్పాడు.
తన వాదనని సమర్థించు కొనేందుకు, చరణ్ వ్రాసిన ఉత్తరాలు, తనతో రాజీ పడమని చేసిన బెదరింపులు, అన్నిటి కన్నా ఆమె పైన ఫారం హౌసులో, హలోజన్ లైట్ల వెలుగులో చేసిన హింస, తమ ఇంట్లో పెట్టిన గుప్త కెమేరాలు, వాటి గురించి ప్రూఫ్ చేసి, విడాకులు వివాహ బంధానికి కావాలని, వ్యక్తికి కాదని తన పాయిం టుని క్లియర్ చేసాడు. శ్రీ లలిత సూర్య చరణ్ ఆస్తి పాస్తులని గాని, నష్ట పరిహారం గాని అడగడం లేదని, తనకీ, తన గర్భస్థ శిశువుకీ, ఒక రాక్షస ప్రవృత్తి గల మనిషి నుంచి విముక్తి కోరుతున్నదని చెప్పాడు!
ఒక వేళ ఆమె భర్త కేసు నుండి బయట పడినా, ఆమె కోల్పోయిన గౌరవం తిరిగి పొంద జాలదని కూడా వాదించాడు! చివరికి శ్రీ లలితకి విడాకులు, షరతుల పైన మంజూరు అయ్యాయి! అవేమిటంటే ఆమెకి, ఆమె బిడ్డకి, చరణ్ ఆస్తి పాస్తులలో భాగం ఉండదని, ఇక భవిష్యత్తులో అలాంటి క్లెయిమ్స్ చెయ్యకూడ దని, చేసినా చెల్లవని అనేవే అవి! శ్రీ లలిత ఆ షరతులకి సంతోషంగా ఒప్పుకొంది!!
ఆ తరువాత మరో ఆరు నెలలకి , సాగర్’తో శ్రీ లలితకి వివాహం, మేరేజి కోర్టు సమక్షంలో జరిగింది. సాగర్ ప్రత్యేకంగా తన తల్లితో మాట్లాడి ఆమెని మనస్ఫూర్తిగా ఆ వివాహానికి ఒప్పించాడు. శ్రీ లలితని కాదంటే తన కొడుకు సన్యాసులలో కలసి పోతాడేమో అన్న అనుమానంతోనే ఆమె అంగీకరించినా, మోస పోయిన మేనకోడలుని ఆదుకొనేందుకు తనకి అవకాశం దొరికిందని, కూడా ఆమె గర్వ పడింది. తక్కిన కుటుంబ మంతా ఆమె గొప్పదనాన్ని ఎంతగానో కొనియాడారు. అంతే కాదు ఆ పెళ్ళికి సంతోషించారు.
భావ సారూప్యత, జ్ఞానము, వివేకము గల ఆ జంట తమ తమ స్పందనలనీ, ప్రేమానుభూతులని, తమకి మాత్రమే ప్రత్యేకంగా మలచుకొని ‘అమర ప్రేమికులగా నిలిచి పోతారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!
హైకోర్టు కేసు ఇంకా ముగింపుకి రాలేదు! కేసు కొట్టేస్తారన్న నమ్మకంతో మంజీర ఎదురు తెన్నులుచూస్తూనే ఉంది. చరణ్ విడుదల అయ్యాడా, లేదా అన్నది ప్రధానం కాదు! ఎందుకంటే అలాంటి ధన బలం, అంగ బలం, మందు బలం, మాటల చాతుర్యం గల వారు ఎంతో మంది మన మధ్య తిరుగుతూనే ఉన్నారు. అందమైన అమ్మాయిలు ప్రలోభాలకి లోను కాకుండా,బలహీనతలని అధిగమింప చేసుకొని , వివేకాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింప జేసుకొని మనుగడ చేయ గలిగితే చాలు. ‘ప్రేమ, మాయాజాలం’ కాకుండా మధుర స్మృతి లాగ నిలిచి పోతుంది!!
మన కథ శ్రీ విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య నాడు, సరదా షికారుతో మొదలయింది. మళ్లీ జ్యేష్ట అమావాస్య దాటి ఆర్ద్రా ప్రవేశం నాటికీ, చిత్రంగా, శ్రీ లలిత ఒక మగ శిశువుకి జన్మని ఇచ్చింది! ఆ వంశంలో మూడు తరాల క్రిందట ఒక మహాపురుషుడు ఆర్ద్రా ప్రవేశ సమయంలో శివైక్యం పొందినట్లు చెప్పుకొన్నాం కదా! మళ్లీ అదే సమయానికి ఈ శిశువు ప్రవేశం జరిగింది. కుటుంబం లోని వారందరూ ఆ సంఘటనని రక రకాలుగా విశ్లేషించి చెప్పుకొని ఆనందించారు! లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు, హితోపదేశాలని చేసిన ఆ మహానుభావుని గుర్తుగా ఆ బాలునికి, ‘హితైషి’ అని నామకరణం చేసారు.
శ్రీ లలిత ప్రేమ వాహిని సాగర సంగమంతో పరిపూర్ణత్వం సంతరించుకొని, ‘హితైషి ప్రవేశంతో’ ‘ప్రేమ, మాయాజాలం’ ఆగి పోయింది!!
********************* **************** ********************

Comments
Post a Comment