Skip to main content

ప్రేమ, వంచనకి చిరునామా!---9 (చిలక రథంలో సరదా షికారు--పార్టు 2 )


మరునాడు హవేలీకి కేశవ్ గుప్త ఒంటరి గానే వచ్చాడు, హాలులో కూర్చొని రంగమ్మని పిలిచి, కాఫీ తెమ్మని చెప్పాడు.

రంగమ్మ ద్వారా, అతను వచ్చిన విషయం తెలిసి, శ్రీ లలిత సూర్య చరణ్’లు ఇద్దరూ హాలు లోకి వచ్చి, అతన్ని, ”గుడ్ మార్నింగ్ సర్!” అని విష్ చేసారు.

కేశవ్ గుప్త వాళ్లని చూసి,’గుడ్ మార్నిగ్! బోత్ అఫ్ యూ! అలా కూర్చోండి, నేను మీకు ‘మంజీర రికవరీ’గురించి ఆలోచించిన ప్లాన్ చెప్తాను” అన్నాడు.

“ఆమెకి ఎలా ఉంది అన్నయ్య గారూ?”అడిగింది శ్రీ లలిత.
“స్టేబుల్’గా ఉంది ఏ మాత్రం ఎక్కువ తక్కువలు లేవు, అయితే వైలన్స్ లేనందుకు సంతోషించాలి”
“ఆమె రికవరీ గురించి ఏ ప్లాను ఆలోచించారు?” సూర్య చరణ్ అడిగాడు.

“చెప్తాను వినండి, చెల్లెమ్మా! నువ్వు కూడా వినవమ్మా! మీరు ఇద్దరూ నాతో  టి .వి స్టూడియోకి రావాలి. అక్కడ రికార్డింగు కార్య క్రమంలో పాల్గోవాలి.”

“రికార్డింగు కార్యక్రమమా?!”

“అవును, చిత్రమేమిటంటే సూర్య చరణ్ గారి ‘వాయిస్’ కూడా వైభవ్ వాయస్’తో కలుస్తోంది! అందు వల్ల సూర్య చరణ్ గారు తాన గొంతుతో, మేము తయారు చేసిన స్క్రిప్టుని చదవాలి. దానిని రికార్డు చేయడం జరుగుతుంది.”

“ఆ రికార్డుని మంజీరకి వినిపిస్తారా అన్నయ్య గారూ?”
“అవునమ్మా! దానిని విన్న వెంటనే మంజీరలో ‘పాజిటివ్ రెస్పాన్స్’ వస్తుందని ఆశిస్తున్నాను.”
“ఎప్పుడూ బయలుదేరాలి సర్?” అడిగాడు చరణ్.
“ఇప్పుడే ! టిఫిన్, కాఫీ అక్కడే చెయ్య వచ్చు, రండి వెళ్దాం!” అని లేచాడు కేశవ్ గుప్త.

కేశవ్ గుప్త  కారు ఒక ప్రైవేటు టి .వి.స్టూడియో ముందు ఆగింది. శ్రీ లలిత ఆ స్టూడియో పేరు ‘కె .జి .వి. మ్యూజిక్ & మిరకేల్స్’ అని చదివి, కె.జి.వి .అంటే ‘కేశవ్ గుప్త, వైభవ్’ అని పోల్చుకొంది. కేశవ్ గుప్త కారు పార్క్ చేసి వచ్చాక , ముగ్గురూ స్టూడియో లోపలికి వెళ్లారు. అక్కడ వారిని సాదరంగా ఆహ్వానించడం జరిగింది. లోపలకి తీసుకొని వెళ్లి కూర్చోబెట్టారు స్టూడియో టెక్నీషియన్లు. కాఫీ, టిఫిన్లు ముందుగానే తెప్పించి ఉంచారు.

ముగ్గురూ మౌనంగా టిఫిన్ తిన్నాక , కాఫీ త్రాగుతూ ఉండగా, ఒక వ్యక్తి  వచ్చి, తనని తాను  పరిచయం చేసుకొన్నాడు. “ గుడ్ మార్నింగ్ ఎవ్వరీ బడీ! నా పేరు ‘అనురాగ్’ నేను మ్యూజిక్ అసిస్టెంట్’ని కం రైటర్ని’ సూర్య చరణ్ గారూ! ఇదుగో మీ స్క్రిప్టు! దీనిని మీరు రికార్డింగు రూము లోపలి వెళ్లి చదవాలి. రికార్దిన్గుకి అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి. మీరు ‘రెడీ’ అవగానే తెలియ జేయండి”అంటూ నీటుగా, 18 వ నెంబరు ఫాంటులో, డబుల్ స్పేసులో టైపు చెయ్య బడిన స్క్రిప్టుని చరణ్ చేతికి ఇచ్చాడు.

సూర్య చరణ్ ఆ స్క్రిప్టుని అలవోకగా తిరగేసాడు, తరువాత మొదటిపేజీ చదవ సాగాడు, శ్రీ లలిత స్క్రిప్టు పైన ఆశక్తిని కన బరిచింది.

“చెల్లెమ్మా! మనం ఆడిషన్ హాలులో కూర్చొని రిలాక్స్ అవుదాం! సూర్య చరణ్  గారు చదువుతూ ఉండగా, దానిని మనం అక్కడ కూర్చొని చక్కగా వినవచ్చు. ముందు అతనికి ప్రిపరేషన్ సమయం ఇవ్వండి, రండి” అంటూ లోపలున్న మరో గదికి తీసుకొని వెళ్ళాడు.

శ్రీ లలిత అక్కడ ఒక టేబుల్ మీద కొన్ని మేగజైన్లు, పుస్తకాలు చూసింది. అదే రీడింగు కం రైటింగు వరకు టేబిల్ అని తెలుస్తూనే ఉంది. ఒక కంప్యూటర్ కూడా దాని పైన ఉంది.

శ్రీ లలిత ఆ టేబుల్’కి ఎదురుగా ఉన్న ఒక రివాల్వింగు కుర్చీలో కూర్చొని, ముందుగా  మేగజైన్లు తిరగే సింది. అవన్నీ హవేలీలో చదివిన పత్రికలే! వాటిని అలాగే వదిలి బుక్సు మీద దృష్టి సారించింది. వాటిలో ఒక ఇంగ్లీషు పుస్తకం ‘ఖజురహో’ అనే టైటిల్’తో ఉన్నది చూసి, ఆశక్తితో దానిని చేతుల్లోకి తీసుకుంది. పుస్తకం నిండా ఫోటోలు, వ్యాఖ్యలు వాటి పరిచయ వాక్యాలు ఉన్నాయి! ఆ పుస్తకం చూడగానే ఆమెకి ‘హేమావతి’కథ, ‘ఖర్జూరం శృంగారానికి సరైన నిర్వచనం’ అన్న చరణ్ వ్యాఖ్య గుర్తుకి వచ్చాయి.

అంతే ! ఆమె చంద్ర బింబం లాంటి మోము ప్రకాశవంతమయింది. కలువల లాంటి కళ్లు విచ్చుకొన్నాయి. అర్థ చంద్రుని లాంటి ఫాల భాగం కుంచించుకొంది. ధనస్సుల వంటి కనుబొమలు పైకి ఎగబ్రాకాయి. గులాబీ రంగు అధరాల పైన అర నవ్వులు విరిశాయి. ‘రతి భంగిమలని’ ఎంతో కళాత్మకంగా మలచి తీర్చి దిద్దిన శిల్పాల ఫోటోలు చూస్తూ, ఆమె మధురానుభూతులకి లోనయ్యింది. ముఖ్యంగా విల్లాలోగడపిన మూడు రాత్రులు, చరణ్ చేష్టలు, వాటికి తన ప్రతిక్రియలు జ్ఞాపకానికి వచ్చి, ఆమెని ఏవేవో కాల్పనిక లోకాలకి తీసుకెళ్ళాయి.

తనని తాను ‘హేమావతిగా’ ఊహించు కొంది. చరణ్’ని చంద్ర దేవునిగా తలచింది. వెంటనే పువ్వులతో సుసజ్జితమైన గూటి పడవ, అందులో తానూ, చరణ్ , అందు లోని కమనీయ అనుభవాలు ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరించాయి. శ్రీ లలిత అలా ఊహలలో ఉయ్యాలలు ఊగుతూ ఉండగా, సూర్య చరణ్ గొంతుక వినబడి ఆమె వాస్తవానికి వచ్చింది.

సూర్య చరణ్ రికార్డింగు రూములో నిలబడి అక్కడ అమర్చిన మైకులో స్క్రిప్టుని చదవ సాగాడు!

‘మంజీరా! నా లవ్లీ!’

ఎలా ఉన్నావు? మన ఇద్దరి జీవితాలలో ఒక తుఫాను చెలరేగింది లవ్లీ! దాని తాకిడికి మనం దూరం అయి  3 ఏళ్లు  దాటింది కదూ!! 3 ఏళ్లు కాదు ..కాదు.. మూడు యుగాలు గడచినట్లుంది!!!

ఈ తుఫానుకి  నేను ‘విలన్’ అని పేరు పెట్టేదా! నా లవ్లీ!! ‘విలన్’ చాల చాలా కిరాతకుడు, ప్రేమ అనురా గాలని దారుణంగా హింసించి హతమార్చే రాక్షసుడు! వాడు నన్ను ‘మోటార్ ఏక్సిడెంటుకి’ గురి చేసి, 3 యుగాల పాటు నీ దరికి చేరకుండా ‘కోమాలో’ పడేసాడు!

నా లవ్లీ! కోమా నుండి బయట పడగానే నాకు, నువ్వే గుర్తుకి వచ్చావు!

‘నీ  చక్కదనాల కోల ముఖం, ఒక సంవత్సరం వయసుగల లేడి పిల్లలా  పెద్ద పెద్ద ,తళ తళా మెరిసే నీ కళ్లు, 135 డిగ్రీల అధిక కోణంలో నిటారుగా, సూదిగా ఉండే నీ ముక్కు,  నీ దొండ పళ్ళ లాంటి ప్లంపీ జ్యూసీ  పెదవులు, నీ కొనదేలిన చిబుకం, నీ పొడవు మెడ, ఎన్నెన్ని ఆభరణాలనైనా మోయ గల వెడల్పైన  నీ భుజ స్కంధాలు, నీ గుండ్రని భుజాలు, చూడగానే ఆకట్టుకొని ఆ చూపులని క్రిందకి జారనివ్వని నీ  ఉన్నతములు అయిన కుఛ ద్వయం, అన్నిటికీ మించి మేలిమి బంగారం లాంటి నీ శరీర కాంతి, ఓహో లవ్ల్లీ! నిన్ను మాటి మాటికీ గుర్తుకి తెచ్చే నీ ‘స్టన్నింగ్ ఎపియరెన్సు’ 3 ఏళ్ల పాటు కోమాలోఉండి మర్చి పోయాను గాని, తలచు కోకుండా మూడు నిముషాలైనా ఉండ గలనా?!

లవ్లీ!నా పాస్ పోర్టు, వీసా, నా మోబైలు, నా ఐ .డి. అన్నీ ఏక్సిడెంటులో పోయాయి! కొమాలోంచి బయటికి రాగానే నువ్వే జ్ఞాపకానికి వచ్చావు, అందుకే ఆస్పత్రి అధికారులతో మాట్లాడి, ఈ ‘ఆడియో రికార్డింగు’ చేయించాను. ఇండియన్ ఎంబసీకి అథారిటీ లెటర్ కోసం అపీలు చేసాను. మరో వారం రోజులలో తిరిగి వచ్చి నీ దగ్గర వాలుతాను! అంత వరకు మంకు ఈ విరహం తప్పదు లవ్లీ!

నీ వైభవ్!

ఆ తరువాత టేపు ఆగిపోయింది. శ్రీ లలిత చరణ్ ఆడిషన్’ని శ్రద్ధగా వింది.

‘ఆ స్క్రిప్టు ఎవరో అనురాగ్ వ్రాసినట్లు లేదు! చరణ్ స్వయంగా ఆలోచంచి మాట్లాడినట్లు ఉంది. స్త్రీ సౌంద ర్యాన్ని చరణ్ ఎన్నో సార్లు వర్ణించాడు. ‘కదళి, హేమావతి, విలాసిని, అనితల్లి’ లాంటి కథా నాయికల వర్ణ నలు అతను చూసినట్లే వర్ణించాడు! రియల్ లైఫ్ నాయికయిన తన అందాలని సైతం లెక్కలేనన్నిసార్లు పొగిడాడు.వాటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి చూస్తే, మంజీర సౌందర్య ప్రశంస అతను చేసినట్లే ఉంది!’

‘మంజీరది  కోలముఖం, నాజూకు స్ట్రక్చర్, పెద్ద కళ్లు, ఆమె శరీర కాంతిని మినహాయిస్తీ  ఆమె కన్నా, తానే  అందంగా ఉంటుంది! ఈ రాత్రికి ఆ విషయం, అతని చేతనే కన్ఫర్మ్ చేసుకోవాలి!!’

అలా అనుకొన్న వెంటనే, శ్రీ లలిత తన ఆలోచనకి సిగ్గు పడింది !’ ఏమిటిది, ఎవరో వ్రాసిన స్క్రిప్టుని తన భర్త చదివాడు, అంత మాత్రానికే తను ఉడుక్కోవడం సబబేనా! ఉడుకుమోతు తనం, అలుక స్త్రీ సహజ మైన లక్షణాలే కదా! దానికి గిల్టీ ఫీల్ అవడం దేనికి!! స్క్రిప్టు మాట ఎలా ఉన్నా, మంజీర కన్నా తనే అందమైనది అన్ననిజాన్ని చరణ్ చేత ఒప్పించే వరకు తనకి శాంతి ఉండదు! అంతే కాదు, ఆ స్క్రిప్టుని వ్రాసినది అనురాగ్ అవునో కాదో తప్పక తెలుసుకోవాలి!’రికార్డింగు అయి పోయిన వెంటనే చరణ్, శ్రీ లలిత దగ్గరకి వచ్చి చేరాడు. కేశవ్ గుప్త అతనికి ధన్య వాదాలు తెలియ జేశాడు. “ మిస్టర్ సూర్య చరణ్! మీ మాటలు వింటూ ఉంటె వైభవ్ మాట్లాడినట్లే ఉంది! మంజీరలో  ఇది విన్న తరువాత తప్పక పాజిటివ్ రెస్పాన్సు వస్తుంది. అది చూసాక మళ్లీ రికార్డింగు అవసరం ఉంటుందీ లేనిదీ తెలుస్తుంది! ఇక మీరు హవేలీకి పోవచ్చు డ్రైవరు  మిమ్మల్ని దిగబెడతాడు. నేను ఇక్కడి నుండే ఆస్పత్రికి వెళ్తాను” అని వెళ్లి పోయాడు.

కారులో కుర్చొన్నాక చరణ్ అడిగాడు, “లల్లీ! నా పెర్ఫార్మెన్సు ఎలా ఉంది?”అని.

“మీరు లల్లీ అని అనకండి, నాకు లవ్లీ అన్నట్లే వినబడుతోంది!”
“ నువ్వు కూడా లవ్లీయే కదా?”

“కాదు, మీకు ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇతరులు వాళ్ల ప్రియురాల్లని పిలిచే పిలుపులు నాకు ఆమోదం కావు”

“నిజం కావచ్చు లల్లీ! కాని అది నేను పిలిచే పిలుపే కదా?”
“అవును, కాని ఈ లవ్లీ మీ నోటి నుండి వచ్చాక నాకు, ఆ పిలుపు పరాయిది అయింది.”

చరణ్’కి శ్రీ లలిత ఈర్ష్యా భావం అర్థమయింది. ఆమెని ఇంకా ఉడికించాలని అన్నాడు, “లల్లీ! అని  పిలవ డం నా జన్మ హక్కు! నా నుండి లల్లీ విడి పోయినా పోవచ్చు కాని...” అని ఇంకా ఏదో అనబోతూ ఉండగానే శ్రీ లలిత అతని నోరు మూసింది. “అలాగే ఇష్టం వచ్చినట్లు పిలుచుకోండి, లల్లీ! లేక లవ్లీ! ఎలా పిలిచినా పలుకుతాను, కాని ఈ విడి పోవడం అనే పదాన్ని మాత్రం విత్ డ్రా చేసుకోండి” అంది.

“అలాగే లల్లీ! ఇంకెప్పుడూ అనను. నిన్ను హార్ట్ చేసి ఉంటే మన్నించు” ఆ మాటలు అంటూనే, ఆమె
చేతిని తన చేతిలోకి తీసుకొంటూ, మెత్తగా అదిమాడు.

ఆ మాట , ఆ స్పర్శ  శ్రీ లలితలో విశ్వాసాన్ని పెంచింది. ‘చరణ్ నా వాడు! అతని మీద లేని పోని అనుమా నాలతో నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకొంటు న్నాను’ అనుకొంది.

కారు హవేలీ చేరుకొంది, వాళ్ళని దించిన డ్రైవరు, వెనక్కి  వెళ్తూ  అన్నాడు,” అయ్యగారూ! కారుకావలసి వస్తే ఫోను చేయండి. మిమ్మల్ని అడిగి ఏదైనా పిక్నిక్ స్పాటుకి తీసుకెళ్ళమని అన్నారు పెద్దయ్యగారు”అని అన్నాడు.

“అలాగే! ముందుగా మేము డిసైడు చేసుకొని చెప్తానులే!” అన్నాడు చరణ్.

హాలులో కుర్చొన్నాక, ‘టీ’ తెచ్చి పెట్టింది రంగమ్మ,  దానిని త్రాగుతూ ఇద్దరు డిస్కషన్’లో పడ్డారు. ఎక్కడకి వెళ్ళడం అనే విషయం మీద! అనేక వాదోపవాదాల తరువాత, శ్రీ లలిత ప్రస్తావన మంజూరు అయింది. అదేమిటంటే, ‘ఇంటికి వెళ్లి, దాని బాగోగులు చూసుకోవడమనేది!’ చరణ్ డ్రైవర్’కి ఫోను చేసాడు, అతను మరొక గంటలో వస్తానని బదులిచ్చాడు.

ఆ లోగా శ్రీ లలిత సూటుకేసు సర్దింది, “అదెందుకు?” అన్న చరణ్ ప్రశ్నకి, “ఈ బట్టలు వాషింగ్ మిషన్లో పడేసి, మారు జతలు తెచ్చుకొందామండీ! ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు కదా?” అని బదులిచ్చింది. ఆ మాటలకి స్పందించిన  సూర్య చరణ్  తమ తమ సూటుకేసులు సర్దడంలో, ఆమెకి,  ‘శ్రమ దానం’ చేసాడు.

ఇంటికి వెళ్ళాక , శ్రీ లలిత ఎన్నాళ్లో అయి పోయినట్లుగా ఇల్లంతా కలయ తిరిగింది. సూర్య చరణ్’ని ఒక చోట కూర్చో పెట్టి ‘శ్రమ దానం’ అవసరం లేదని చెప్పి, తనే ఇల్లంతా ఊడ్చి, కడిగి, అలికి, శుభ్రం  చేసింది. వాషింగు మిషన్లో బట్టలు పడేసి, వంటింట్లోకి వెళ్ళింది. చరణ్’కి ఇష్టమైన ఏదైనా వంటకంతో అక్కడే లంచ్ ఏర్పాట్లు చేయడానికి ! ఆమె ఆ పనిలో ఉండగానే, ద్వారం దగ్గర ‘పోస్ట్’ అనే కేక వినబడింది. చరణ్  పొస్టు మేన్ దగ్గరకి వెళ్ళాడు. శ్రీ లలిత వంటింటి నుండే కేక వేసింది, “ఎక్కడనుంచి వచ్చిందండీ? ఉత్తరమేనా?”

చరణ్ మౌనం ఆమెని కలవర పెట్టింది, “ ఏమయిందండీ? ఎందుకు మాట్లాడకుండా కూర్చొన్నారు?” అని అంటూ , అక్కడకి వచ్చింది. చరణ్ ఆమె చేతికి ఒక, ‘ఫేక్స్ మెసేజ్’ ఇచ్చాడు.

శ్రీ లలిత ఆ మెసేజ్’ని చదివింది, ఆమె కళ్ళు బైర్లు క్రమ్మాయి, “ఏమిటండీ, ఇది! ఉన్నట్లుండి అమ్మకి ఏమయింది? 3 రోజుల క్రితమే కదా, ఫోనులో మాట్లాడింది” అంటూ కళ్లు తుడుచుకొంది, ఆవి ఈసారి వర్షించ సాగాయి.

“ఉండు, నేను మాట్లాడుతాను” అంటూ సూర్య చరణ్ తన మొబైలు ఫోను తీసుకొని వరండా లోకి వెళ్ళాడు, అక్కడయితే ‘నెట్ వర్క్’  బాగుంటుందని. శ్రీ లలిత అక్కడే సోఫాలో కూలబడింది. చరణ్  కాసేపటి తరువాత వచ్చి అన్నాడు, “లల్లీ!  ఫోను కలవడం లేదు, అందుకే క్యాబ్ బుక్ చేసాను. బస్సు స్టాండ్’కి వెళ్లి వెంటనే బస్సు పట్టుకో!” అన్నాడు.

“అదేమిటండీ! మీరు రావడం లేదా?”

“నేను బస్సు స్టాండ్ వరకు వచ్చి నిన్ను బస్సు ఎక్కిస్తాను, నీతో పాటు రాలేను కదా! పరిస్థితి తెలిసికూడా అలా అడుగుతావేమిటి?”

“నిజమేనండి! నేను మంజీర ఎసైన్ మెంటు గురించి మరచి పోయాను. ఇంటికి రాగానే ఒప్పుకొన్న పని అయిపోయినట్లే అని అనిపించింది!”

“ఆ పని చేసేందుకు నా అవసరం మాత్రమే ఉంది, నువ్వు కొన్నాళ్ళు అక్కడే ఉంది నిదానంగా, అత్తయ్య గారికి బాగా ఆరోగ్యం కుదుట పడ్డాక రా! నా గురించి టెన్షన్ పడకు” అన్నాడు. అలా  అంటూనే శ్రీ లలిత సూటుకేసు సర్దాడు.

క్యాబ్ వచ్చింది. ఇద్దరూ ఆదరా బాదరాగా ఎక్కారు, బస్సు స్టాండ్’కి వెళ్ళే సరికి అక్కడ శ్రీ లలిత కోసమే అన్నట్లు బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. ఆమె హడావుడిగా బస్సు ఎక్కింది. సూర్య చరణ్ ఆమెకి క్రింద నుండే వీడ్కోలు చెప్పాడు. ఆమె కన్నీరు నిండిన కళ్లతోనే అతనికి టాటా చెప్పింది.

బస్సు కదిలింది. చరణ్ ఆమెకి ‘బై బై’ చెప్తూ చేయి ఊపుతూనే ఉన్నాడు! అతను కనుమరుగు అయ్యాక, శ్రీ లలిత అమ్మకి ఫోను చేయాలని తన పర్సులో ఫోను కోసం వెతికింది, ఆశ్చర్యం ! ఫోను కనబడ లేదు! ఆమెకి బాగా జ్ఞాపకం, దానిని ఇంటి నుండి బయలు దేరేటప్పుడు పర్సులోనే పెట్టింది! మరి ఏమయింది? చరణ్ కూడా సామాన్లు సర్దాడు కదా, అతను తీసి ఉంటారా? ఏమో ఆమెకి ఏమీ అంతు  పట్ట లేదు!

Comments

Popular posts from this blog

చిలక రథంలో సరదా షికారు—( పెద్దలకు, పెళ్లైన వారికి మాత్రమే)

     ( ఈ బ్లాగులోనే టపా కొట్టిన కొన్ని సరస శృంగార కథల సమాహారం )     స్వస్తి శ్రీ చాంద్రమాన విరోధి నామ సంవత్సర జ్యేష్ట అమావాస్య , మృగశిరా నక్షత్ర యుత , సోమవార పర్వదినం, రోమన్ కేలండర్ ప్రకారం ఆ రోజు తేదీ 22.06.2009.     రాత్రి రెండు ఝాములు దాటి , ఒంటి గంట అయింది !     రుద్రాభిషేకం జరుగుతోంది.!     అది క్షీరారామ క్షేత్రంగా ప్రసిధ్ధికి ఎక్కిన ‘శ్రీరామ లింగేశ్వర స్వామి వారి ఆలయం. శివుడు తన త్రిశూలపు మొనని, నేలపై ఆనించగా, అక్కడ నుండి, ‘క్షీర ధార’ పైకి ఉబికి,‘ పాలకొలను’ ఏర్పడిందట ! ఆ కొలను గట్టున శ్రీమహా విష్ణువు పూర్ణావతారమైన, శ్రీరామ చంద్ర మూర్తి , సీతమ్మ వారితో కలసి, తమ స్వహస్తాలతో , ‘శ్రీ రామ లింగేశ్వర’ప్రతిష్ట చేసారట !     ఆ విధంగా శివ-  కేశవుల పవిత్ర స్పర్శతో పునీతమయిన క్షేత్ర రాజం అది !     ‘పినాక పాణి’ , అతని కుటుంబ సభ్యులు, శ్రీ రామ లింగేశ్వర స్వామి వారి, అభిషేక కార్యక్రమం ముగించుకొని, మూడవ గంట కల్లా, తనతో పాటు తెచ్చుకొన్న ‘మినీ బస్సులో’ తిరుగు ముఖం పట్టారు.     పినాక పాణి బహు కుటుంబీకుడు ! అతనికి ఆరుగురు చెల్లెళ్లు, ముగ్గురు తమ్ముళ్లు ఉన్నారు ! అమ్మయిలు మువ్వురికీ , అతనికీ, పెళ్లిల

నీల గ్రహ నిదానము 3

నీల గ్రహ నిదానము 3 (రెండవ దృశ్యము.) ( దక్ష వాటిక ) ( దక్షుడు ఒంటరిగా ఒక శిలా ఫలకం మీద కూర్చొని ఉంటాడు.) దక్షుఢు --- “ ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! ” (అని జపిస్తూ ఉంటాడు ) ( తెర లోంచి కూడా “ ఓం నమో నారాయణాయ “ అని వినిపిస్తుంది.) ( దక్షుడా ప్రతి ధ్వని విని, నామ జపాన్ని ఆపి చూస్తాడు ) ( ప్రవేశం--- నారదుడు, నారాయణ మంత్రం పఠిస్తూ ) నారదుడు --- దక్ష ప్రజాపతీ ! బ్రహ్మ మానస పుత్రుడైన ఈ నారదుడు, ఉపబ్రహ్మవు, పితృ తుల్యులైన మీకు నమస్కరిస్తున్నాడు. దక్షుడు --- దీర్ఘాయురస్తు ! నారదా ! ఎచటి నుండి నీ రాక ? నారదుఢు ---- బాబాయి ! నా రాక మాటకేం గాని, మీ పోకడలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ఇలా ఒంటరిగా ఆరు బయట కూర్చొని, నారాయణ స్మరణ చేయాల్సిన అవసరం మీ కేమొచ్చింది ? దక్షుడు --- సంసార జంజాటం లేని బ్రహ్మచారివి. సంతానం తెచ్చి పెట్టే సమస్యలు నీ కేమి అర్థమవుతాయి. నారదుడు --- మీ సంతానం నాకు సోదర తుల్యులు కారా బాబాయి ! అయినా నారాయణ స్మరణతో సమస్యా పరిష్కార

వేణీ సంహారము

వేణీ సంహారము (1ఈ కథానిక ఆంధ్రభూమి శనివారం తేది 11.2.2011 దిన పత్రికలో ప్రచురించ బడింది) నా భార్య ‘నీలవేణి’ చాలా అందమైనది. ముఖ్యంగా పేరుకి తగ్గట్లుండే ఆమె కబరీ భరం ! వర్తులాకారంలో ఎత్తుగా నిర్మించిన రెండు ఇసుక తిన్నెల లాంటి జఘనాల మధ్య, సన్నని పాయ లాంటి చీలికని స్పృశిస్తూ పొడవుగా ఒత్తుగా , జడలా బిగించినప్పుడు ‘త్రాచుపాములాగ’ విచ్చుకొన్నప్పుడు నెమలి వింజామరలా కనిపించే ఆ నీలవేణి సౌందర్యం బాపూ బొమ్మకే ఉంటుంది ! ఆమె చంద్రవదనాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూసి ఉంటే,తప్పకుండా ఆమెకి ‘అమ్మవారి ’ పాత్రలు దక్కి ఉండేవి ! వెడల్పైన ఫాలభాగం మీద బాలారుణ సూర్య బింబం లాగ కనిపించే కుంకుమ బొట్టు, దాని క్రింద ధనస్సుల లాంటి కనుబొమలు, ఆ క్రింద మీనాల లాంటి కళ్లు. ఆ కళ్ల మధ్య నుండి ఎత్తుగా, ఠీవిగా నిటారుగా ఉండే ముక్కు, దానిక్రింద రుచులూరించే అధరాలు, పచ్చని బంతి పూవు లాంటి మేని ఛాయ, పొడవుకి తగ్గ శరీర సౌష్టవం, కలిగిన ఆమె, చూపరులకు చెయ్యెత్తి నమస్కరించాలనిపించే దేవీ కళలు ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆమె నా భార్య కావడం నేను చేసుకొన్న అద